‘రాజకీయమా? నేనా? అబ్బే.. ఆ ఉద్దేశమే లేదు’ అన్నారు శ్రుతీహాసన్. ‘మీ నాన్నగారు పార్టీ స్థాపించారు కదా. మిమ్మల్ని కూడా రాజకీయాల్లో చూడొచ్చా’ అని శ్రుతీహాసన్‌ని అడిగితే ఆమె నుంచి ఈ సమాధానం వచ్చింది. దీని గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘రాజకీయాల గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. ఎటువంటి అవగాహన లేకుండా రాజకీయాల్లోకి వెళ్లడం అయినా, సినిమాకు దర్శకత్వం వహించడం అయినా పెద్ద పొరపాటు అవుతుంది. మనకు తెలియకుండానే ఎంతోమందికి హాని చేసినవాళ్లం అవుతాం.
మా నాన్నగారి పార్టీ ప్రచారానికి కూడా నేను వెళ్లను. ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆయన విజన్‌ను నేను నమ్ముతాను. ఆయనకు మంచి జరగాలని కచ్చితంగా కోరుకుంటాను’ అన్నారు. ఇదిలా ఉంటే.. కరోనా వల్ల జరిగిన నష్టాన్ని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించే దిశలో నటీనటులు పారితోషికం తగ్గించుకోవాలని ఇటీవల చిత్రపరిశ్రమకు సంబంధించిన కీలక శాఖలవారు పేర్కొన్నారు. ఆ విషయం గురించి శ్రుతీహాసన్‌ని అడిగితే – ‘నిజానికి సినిమా ఇండస్ట్రీలో పారితోషికం విషయంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు చెల్లించేది చాలా తక్కువ. ఇద్దరి పారితోషికాల్లో వ్యత్యాసం చాలా ఉంది. హీరో అందుకుంటున్న రెమ్యునరేషన్ హీరోయిన్‌కి రావాలంటే కచ్చితంగా మరో 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment