Political Satire
-
రాజకీయ సంక్రాంతి.. యథా లీడర్ తథా క్యాడర్
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కోని బొందల గడ్డ దిక్కు బోయిండు. రొండంత్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. ఆకలైతున్నా బేతాలునికి వొండుకోబుద్ది గాలేదు. నాబి కాడ సల్ల బడితె నవాబ్ కైన జవాబ్ జెప్పొచ్చు అనుకోని ఆన్లైన్ల చికెన్ బిర్యాని దెప్పిచ్చుకుండు. తిన్నంక కతల వయ్యి సద్వుకుంట గూసున్నడు. సరింగ నాత్రి ఒకటి గొట్టంగ, విక్రమార్కుడు హారన్ గొట్టిండు. బేతాలు డింట్ల కెల్లి ఇవుతలి కొచ్చిండు. మోటరెన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. ఎప్పటి లెక్కనే విక్రమార్కుడు మోటర్ నడ్పలేదు. ఎన్కకు దిర్గి సకినాలు, నూల ముద్దలు ఇచ్చిండు. ‘‘గియెందుకిస్తున్నవ్?’’ అని బేతాలుడు అడిగిండు. ‘‘సంక్రాతి పండ్గని.’’ ‘‘లీడర్లు బిర్యాని పొట్లాలు ఇచ్చిన తీర్గ ప్రేమతోని నువ్వు గివ్వి నాకిచ్చినందుకు శెనార్తిలు. ఏం పండ్గనో ఏమో! ఒక్క దినం ఏసంకు మూతి మీసం గొర్గిచ్చుకును డెందుకో! అన్ని పండ్గలేమొ గని సంక్రాతి పండ్గకు అందరు సంత ఊర్లకు బోవాలనుకుంటరు. మోకేకా ఫాయిదా ఉటాయించి బస్సు చార్జిలు డబల్, త్రిబల్ జేస్తరు. రేల్ గాడిలల్ల నిలబడెతంద్కు గూడ జాగ దొర్కదు. భారత్ జోడో అన్కుంట రాహుల్ గాంది పాద యాత్ర జేస్తున్నడు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, బీహార్ ముక్యమంత్రి నితీశ్ కుమారే గాకుంట యువగళం పేరు మీద లోకేశ్ గుడ్క పాదయాత్రలు జేస్తమంటున్నరు. గాల్ల తీర్గనే పాదయాత్ర జేస్కుంట పండ్గకు ఊర్లకు బోతె బాగుంటదని జెన మనుకుంటున్నరు. యథా లీడర్ తథా క్యాడర్.’’ ‘‘ముగ్గుల సంగతేంది?’’ ‘‘కిసాన్ సర్కార్ అన్కుంట బీఆర్ఎస్, రామరాజ్జెమన్కుంట బీజేపీ, ఇందిరమ్మ సర్కార్ అన్కుంట కాంగ్రెస్ జెనంను ముగ్గుల దించెతంద్కు ఒక్క తీర్గ కోషిస్ జెయ్యబట్టినయి.’’ ‘‘పతంగులెక్కిస్తున్నరా?’’ ‘‘ఫాంహౌస్‌ల సుతాయించిన మాంజతోని బీఆర్ఎస్ పతంగు లెక్కిస్తున్నది. ఈడీ, సీబీఐ మాంజతోని బీజేపీ పతంగులెక్కిస్తున్నది. సర్పంచుల మాంజ సుతాయించి కాంగ్రెస్ పతంగులెక్కి స్తున్నది. మేడినిండియా మాంజ అనుకుంటనే చైన మాంజతోని బీజేపీ పతంగులెక్కిస్తున్నదని అను కుంట ఆల్ పిరీ మాంజతోని ఆప్ పతంగులెక్కి స్తున్నది. సీపీఐ, సీపీఎం తోక పతంగులు ఎక్కిస్తున్నయి. బీఆర్ఎస్, బీజేపీ పతంగుల నడ్మనే పేంచి నడుస్తున్నది’’ అని బేతాలుడన్నడు. ‘‘రాజకీయ బోగి మంటలు గిన ఉన్నయా?’’ ‘‘ఎందుకు లెవ్వు. లీడర్లు దినాం జెనంల మంటలు బెడ్తున్నరు. గీ నెలల కమ్మంల బీఆర్ఎస్ లచ్చల మందిల మంట బెడ్తది. బీజేపీ గుడ్క గిదే నెలల లష్కర్ల లచ్చల మందితోని మంటలు షురువు జేస్తనని జెప్పింది. జన సేన, టీడీపీ గల్సి ఆంద్రల మాటల మంటలు బుట్టిస్తమంటున్నయి. అమెరికల డల్లాస్ల గుడ్క తెలుగోల్ల నడ్మ కులం, రాజకీయ మంటలు లేసినయి.’’ ‘‘రాజకీయ కోడి పందాల సంగతేంది?’’ ‘‘సంక్రాంతనంగనే కోడి పందాలే యాదికొ స్తయి. కోల్ల కాల్లకు చిన్న కత్తులు గట్టి దంగల కిడుస్తరు. గవ్వి ఒక్క తీర్గ ఫైటింగ్ జేస్తయి. గా కోల్ల మీద కోట్ల రూపాయలు బిట్టు గడ్తరు. గీ నడ్మ ఆన్లైన్ కోడి పందాలు షురువు జేసిండ్రు. గివ్వి యాడాదంత నడుస్తనే ఉంటాయి. లీడర్ల నడ్మ దినాం తిట్ల పందా లుంటయి. గీ రాజకీయ కోల్ల నాల్కలే కత్తులు. అసల్ కోడి పందాలల్ల రెండు కోల్లు ఉంటె ఒకటి సస్తది. రాజకీయ కోల్ల పందాలల్ల ఒక కోడి ఓడి పోతె ఇంకొక కోడి గెలుస్తది. గియ్యాల ఓడిన కోడి రేపు గెల్సినా గెలుస్తది. సంక్రాతి దినాలల్ల నోములు జేసేటి ఆడోల్లు వాడకట్టుల సకినాలు, నూల ముద్దలు బంచుతరు. కుర్సి నోములు జేసేటి లీడర్లు కొత్త కొత్త పద్కాలు బెట్టి జెనంకు రూపాయలు బంచుతరు. నిండ ముంచుతరు.’’ ‘‘వహవ్వా, ఏం చెప్పినవ్ బేతాలా!’’ ‘‘గది గంట్లుండ నియ్యి. ఉప్పరిపల్లి మూసీ నది ఒడ్డుకు మొసల్లు ఎందుకొచ్చినయి. గీ సవాల్‌కు జవాబ్ ఎర్కుండి గూడ జెప్పకుంటివా అంటె నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతా లుడన్నడు. ‘‘బేతాలా! సంక్రాతిని మకర సంక్రాంతంటరు. మకరము అంటె మొసలి. రాజకీయ మొసల్లు ఎట్లున్నయో అర్సుకునేతంద్కు పండ్గ నాడు అసలు మొసల్లు మూసీ నది ఒడ్డుకొచ్చినయి’’ అని విక్రమార్కుడు జెప్పిండు. చౌరస్తల రెడ్ సిగ్నల్ బడ్డది. మోటరాగింది. ఎన్క తలుపు దీస్కోని కిందికి దిగిన బేతాలుడు బొందలగడ్డ దిక్కు ఉర్కిండు. (క్లిక్ చేయండి: తమ్ముండ్లూ రాండ్రి! గాలిగొట్టి పోండ్రి!) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
పొలిటికల్ ఎంట్రీపై కంగనా కామెంట్స్.. ‘బీజేపీ టికెట్ ఇస్తే అక్కడ పోటీ చేస్తా’
కంగనా రనౌత్ ఈ పేరు వినగానే ప్రముఖ బాలీవుడ్ నటి అని గుర్తుకు వస్తుంది. ఇకపై కంగనా.. అటు సినిమా రంగంతో పాటుగా ఇటు పొలిటికల్‌గానూ తన మార్క్ చూపించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికి వరకు సినిమా రంగంలో పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన కంగనా.. పలు సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై కంగనా రనౌత్ ఎట్టకేలకు స్పందించారు. ప్రజలు కోరుకుంటే, బీజేపీ అవకాశం ఇస్తే తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తన మదిలోని మాటలను వ్యక్తపరిచారు. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న కంగనా శనివారం ఆజ్ తక్ పంచాయత్ కార్యాక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ.. హిమాచల్ ప్రజలు కోరుకుంటే, తనకు బీజేపీ టికెట్ ఇస్తే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇదే క్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కంగనా ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని మోదీ.. మహాపురుష్ అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, మోదీకి రాహుల్ గాంధీ ప్రత్యర్థి కావడం విచారకరం. అయినా, మోదీజీకి ప్రత్యర్థులు లేరని తనకు తెలుసని అన్నారు. అనంతరం.. ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఆప్ తప్పుడు వాగ్దానాలను హిమాచల్ ప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకుంటారు. హిమాచల్ ప్రజలు వారి సొంత సోలార్ పవర్ ఆధారంగా పంటలు పండిస్తున్నారు. ఆప్ పార్టీ ఇస్తున్న ఉచిత పథకాలు ఇక్కడ పనికిరావు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. Willing to fight 2024 Lok Sabha polls from Himachal's Mandi, says #KanganaRanaut. Full story: https://t.co/lcp7F8XC72 | #PanchayatAajTak pic.twitter.com/9F9VEFgSbR — IndiaToday (@IndiaToday) October 29, 2022 -
గ్లూమీ.. గ్లూమీ సార్లు మస్తుగున్నరు
ఇప్పుడు మనం ఓ గాడిద కథ చెప్పుకుందాం.. ప్రాచీన గ్రీసు దేశంలో డెమాస్తనీస్కు మహావక్తగా మంచి పేరుండేది. ఆయనోసారి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పన్నులు.. ఇలా చెప్తుంటే జనంలో కాస్త అలజడి, గందరగోళం కనిపించాయి. వాళ్ల అనాసక్తి గ్రహించిన డెమాస్తనీస్.. వెంటనే ప్రసంగం ఆపి మీకు ఒక కథ చెబుతాను వినండి అంటూ మొదలుపెట్టాడు. ‘‘ఇద్దరు వ్యక్తులు వేసవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒకడి దగ్గర గాడిద ఉంది. మరొకడికి దాని అవసరం ఉంది. దాన్ని అమ్ముతావా అని అడిగాడు. ఇద్దరూ మాట్లాడు కున్నారు. బేరం కుదిరింది. అమ్మకం అయిపోయింది.. వారు వాళ్ల ప్రయాణం కొనసాగిస్తున్నారు. అసలే వేసవి ఎండ ఎక్కువగా ఉండి.. ఓ దగ్గర ఆగారు. గాడిద నిలబడి ఉండగా దాని నీడలో అమ్మిన వ్యక్తి కూర్చున్నాడు. కొన్నా యనకు మండుకొచ్చింది. కొనుక్కున్న నేను ఎండలో ఉండాలి అమ్మినవాడు నీడలోకూర్చుంటాడా? అని ఆర్గ్యు చేశాడు. ‘నువ్వు లే నేను కూర్చుంటా’నని గదమాయించాడు. చదవండి: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అమ్మిన వ్యక్తి బాగా తెలివైన వాడు.. ‘నేను గాడిదను అమ్మాను గానీ నీడను కాదు.. నీడ నాదే..’ అంటూ తన లాజిక్ వదిలాడు.. ఇంకేం తగువు మొదలైంది. నలుగురూ చుట్టూ చేరారు. వాదులాట పెరిగింది. గాడిద–నీడ సమస్య పరిష్కరించడంలో అందరూ మునిగిపోయారు’’ అని చెప్పడం ఆపేశాడు డెమాస్తనీస్. వింటున్న జనంలో ఆసక్తి మొదలైంది. వాళ్లలో వాళ్లు గాడిద గొడవపై మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ పరిష్కారమేమైంది? ఏం తేల్చారు? అని డెమాస్తనీస్ను అడగడం మొదలుపెట్టారు. అసలు తమ బతుకు సంగతి చెబితే పట్టని జనం గాడిద గొడవ చర్చించడం చూసి డెమాస్తనీస్ నవ్వి ఊరుకున్నాడు. ఆ గాడిద గొడవ తేలేది కాదు కాబట్టి, మనమూ వదిలేద్దాం. జనాన్ని మనకు అనుకూలమైన చర్చ వైపు నెట్టడమే కదా.. మంచి వక్త నేర్పరితనం. చుట్టూ వరదలున్నా గ్లూమీ.. గ్లూమీ సమాచారంతోనైనా మనకు ఇష్టమైన దారిలోకి ‘మంద’ను మళ్లించడమే కదా.. అసలైన పొలిటీషియన్ టెక్నిక్.. చర్చ గాడిదల వైపు కావచ్చు.. విదేశీ కుట్రల వైపూ కావచ్చు.. జనం ‘కళ్ల నిండా కాళేశ్వరం’ చూసి కంగారు పడో, కడుపు మండో ‘విదేశీ కుట్ర’ అని ఒక మాట అనరా.. బరాబర్ అంటారు ఆయన.. ఇంకా ‘విదేశీ కుట్ర’ అన్నారాయన. ఈ విషయంలో సొంత ప్రభుత్వంపైన అనుమానాలున్నవారు కూడా ఉన్నారు. ఇట్లా రండి అలా సోషల్ మీడియాలో దూరుదాం.. సిడ్నీ.. స్వదేశీ కుట్ర కొద్దిరోజుల క్రితం.. సిడ్నీలో భారీ వర్షాలు పడ్డాయి. ఎంతగా అంటే ఎనిమిది నెలల వర్షం నాలుగు రోజుల్లో దంచేసింది. సహజంగానే పెను నష్టం వాటిల్లింది. ఇంకేం రకరకాల సిద్ధాంతాలు నిద్ర లేచాయి. ప్రభుత్వం చేపట్టిన ‘క్లౌడ్ సీడింగ్’ దానికి కారణమని ప్రచారమైంది. ఆ స్థాయిలో వర్షాలు తెచ్చే క్లౌడ్ సీడింగ్ భౌతికంగా, ఆర్థికంగా సాధ్యం కాదని గవర్నమెంట్ చెప్పినా.. అ వాయిస్ జనానికి చేరేలోపు.. లక్షల్లో వ్యూస్ నమోదయ్యాయి. రాడార్ చిత్రాలు, మేఘాలలో వింత ఆకారాల ఫొటోలు.. విమానం ఎగరడాలు.. ఇలా ఏవేవో ఆధారాలు చూపుతూ.. అది ప్రభుత్వం ప్రజలపై వేసిన ‘వెదర్ బాంబే..’ అనేయడం మొదలుపెట్టారు. ఇదంతా న్యూస్ చానళ్లలో, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. వాతావరణ నిపుణులు శాస్త్రీయ కారణాలు చెప్పినా ఎవరూ వినలేదు.. అంతా అధికార పక్షం చేసినదేంటూ ఢంకా బజాయించారు... దీనికన్నా మనం విన్న ‘విదేశీ కుట్రే’ నయం కదా.. థాయ్‌లాండ్.. వరద రాజకీయాలు 2011లో ఇక్కడ వచ్చిన వరదలు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ‘నష్టం’గా పేర్కొంటారు. జూలై నుంచి అక్టోబర్ వరకు వరదలు కొనసాగాయి. జనవరి 2012 వరకు కూడా అక్కడక్కడా కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఆ వరదల ప్రభావం ఎంతో. ఆ వరదలు బ్యాంకాక్‌ను కూడా చుట్టుముట్టాయి. 20వేల చదరపు కిలోమీటర్ల మేర పంట పొలాలు నీట మునిగాయి. 13.6 మిలియన్ల జనాభా ముంపు ప్రభావానికి లోనయింది. అనేక పరిశ్రమలు నీట మునిగాయి. లక్షన్నరకుపైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆర్థికంగా జరిగిన నష్టం 46.5 బిలియన్ డాలర్లు.. ఇంత విధ్వంసానికి కారణం ‘ప్రకృతి ప్రకోపం’ అన్న పాయింట్ పక్కకుపోయింది.. చర్చలన్నీ రాజకీయం చుట్టే తిరిగాయి. ఎందుకంటే అచ్చంగా ఎన్నికల ప్రచార సమయంలో వరదలు వచ్చాయి. ‘తాము ఎలాగూ ఓడిపోతామని తెలిసిన అధికార పక్షం డ్యాములను ఖాళీ చేయకుండా ఊరుకుందనీ.. తర్వాత వానలతో డ్యాములన్నీ నిండా మునిగి ఊర్లకు ఊర్లు నీటిలో కొట్టుకుపోయాయని విపక్షం వాదనకు దిగింది. ‘వరదల పెను నష్టంతో రానున్న ప్రభుత్వానికి ఊపిరి ఆడకుండా చేయాలని.. రాజకీయంగా తమను, ఆర్థికంగా ప్రజలను కుదేలు చేయాలనే కుట్రతోనే ఇదంతా జరిగిందని..’ ప్రతిపక్షం గగ్గోలు పెట్టింది. కొన్నేళ్ల పాటు ఆ దేశంలో ఈ చర్చ జరిగింది.. ‘‘అధికార పక్షానికి అంత తెలివి లేదు. వరదలను సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్లే ఈ దురవస్థ’’ అని అక్కడి వామపక్ష మేధావులు చెప్పినా ఎవరూ వినలేదు. విపక్షాలపై కుట్రతోనే తమ ప్రజలకు భారీ నష్టాన్ని కలిగించారని బలమైన వాదన జనంలోకి పోయింది. ..ఇదీ స్వదేశీ వరద రాజకీయమే. అవకాశం రావాలేగానీ.. వరదలు, విపత్తులు, మహమ్మారులు వేటినీ వదలడం లేదు. కుట్ర కోణాలు, రాజకీయాలు, సొంత అవసరాలు వాటిని అంటుకునే తిరుగుతున్నాయి. 2011లో జపాన్‌లో తారస్థాయిలో వచ్చిన భూకంపం ఏకంగా సునామీనే సృçష్టించింది. 30 అడుగుల ఎత్తుతో అలలు ఎగిసిపడి.. ఫుకుషిమా పవర్ ప్లాంట్‌లో ‘అణు’ ప్రమాదానికి దారి తీసింది. ఇదంతా ప్రకృతి విలయంగా ప్రపంచం భావిస్తుండగా.. ‘ఠాట్!.. అంతా తప్పు. దీనికి ఇజ్రాయెల్ చేసిన అణు విస్పోటనమే కారణమని.. ఇరాన్ కోసం çజపాన్ యురేనియం శుద్ధి చేయకుండా అడ్డుకునే పనే’నని జపాన్‌లో బాగా నమ్మిన వారున్నారు. 2004లో ఇండోనేసియాలో 9.1–9.3 తీవ్రతతో భూకంపం, సునామీ వచ్చినప్పుడు 14 దేశాల్లో 2,27,000 మందికిపైగా మరణించారు. ఇదంతా అమెరికా అధ్యక్షుడి పనేనని ప్రచారమైంది. తూర్పు ఆసియా ప్రాంత ఆర్థిక ప్రగతిని తగ్గించడానికి అమెరికా చేసిన పనేనని బలంగా నమ్మారు. అక్కడ కనిపించిన అమెరికా యుద్ధనౌకను ఆధారంగా చూపారు. గతంలో ఎప్పుడూ అక్కడ భూకంపాలు రాలేదని నిరూపించే ప్రయత్నం చేశారు.. ఇలాంటి సిద్ధాంతాలకు వందలకొద్దీ ఆధారాలు (?) గుప్పించడం కూడా సామాన్య జనానికి అది నిజమేనని అనిపించేలా చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి అమెరికా అణుబాంబు ఇప్పుడు పేలిందని కొందరు అనుమానాలు వ్యక్తీకరించారు. పాకిస్తాన్ టార్గెట్‌గా ఇండియా చేస్తున్న అణు పరీక్షలే దానికి కారణమని మనవైపూ అనుమానంగా చూసినవారూ ఉన్నారు. .. చివరికి భూమి భ్రమణాన్ని మార్చేందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని నమ్మి ప్రచారం హోరెత్తించిన వారూ ఉన్నారు. ఇలా అనుమానాలు, కుట్ర కోణాల సిద్ధాంతాలు, వాటికి తగిన ఆధారాలను పుంఖానుపుంఖాలుగా జనం నెత్తిన రుద్దేవారెవరూ నిపుణులో, శాస్త్రవేత్తలో కాదు.. గ్లూమీ, గ్లూమీగా విషయం తెలిసినవారే. అప్పటి అవసరాలు, పాలిటిక్స్ కోసం జనం ముందుకు తెచ్చినవారే. ఇది బాగుంది... శుక్రవారం మళ్లీ వర్షాలు మొదలు కావడంతో సోషల్ మీడియాలో కనిపించిన జోక్.. ఇది కూడా బాగుంది... ఈ మధ్య వరదలు, వ్యాఖ్యలు చూస్తుంటే గుర్తొస్తుందంటూ ఓ మిత్రుడు చెప్పిన కామెంట్.. ప్రముఖ అమెరికన్ రచయిత, కాలమిస్టు, వక్త, యాక్టివిస్టు జిమ్ హైటవర్.. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌పై వేసిన చురక ఇది.. ‘అజ్ఞానం బ్యారెళ్ల లెక్కన అమ్మే వీలుంటే.. జార్జి బుష్ బుర్ర డ్రిల్లింగ్ హక్కులు సంపూర్ణంగా నేనే కొనుక్కుంటా..’ .. ఆహా.. నిజమే ఇలాంటి మార్కెట్ ఉంటే బాగుండు.. సహజ వనరులున్న బుర్రలు మనకు అనేకం ఉన్నాయి కదా.. -సరికొండ చలపతి -
నిజమే! ఇప్పటికిప్పుడు అభివృద్ధి కార్యక్రమాలంటే ఇంతకు మించి ఇంకేం చేస్తాం!!
నిజమే! ఇప్పటికిప్పుడు అభివృద్ధి కార్యక్రమాలంటే ఇంతకు మించి ఇంకేం చేస్తాం!! -
Sakshi Cartoon: ఎన్ని ఎత్తులు వేసిన.. ఎంత వేడుకున్నా పొత్తులుండవ్..
ఎన్ని ఎత్తులు వేసిన.. ఎంత వేడుకున్నా పొత్తులుండవ్.. ప్రస్తుతానికి... -
సాక్షి కార్టూన్ 21-02-2022
అన్ని అవకాశాలు ఉపయోగించుకుంట్నునాం సార్ -
సాక్షి కార్టూన్ 17-02-2022
... మిమ్మల్ని ఉద్దేశించి కాదులే! -
పలుకుబడి
ఒక కాకి ఏ పనిమీదో అప్పుడే తాటిచెట్టు మీద వాలుతోంది. పని ఉండో లేకో ఒకాయన అదే తాటిచెట్టు దగ్గరికి అప్పుడే వస్తున్నాడు. ఆ కాకి కాలు తగిలి తాటిపండు సరిగ్గా ఆయన తలమీద రాలి పడిందట. కాకి కాలు తగిలితే తాటిపండు ఊడి పడుతుందా? ఇది మనకు పట్టింపు ఉన్న విషయం కాదు. కాకతాళీయం అనే మాటకు అర్థం ఆ కాకి, ఆ తాటిపండుతో ముడిపడిన వృత్తాంతమే మనకు కావాల్సినది. కొంత నాటకీయంగా ధ్వనించే ఈ కాకతాళీయం అనే మాటను ఎన్నోసార్లు వినివుంటారు. ఈ మాట చదువుతున్నప్పుడో, విన్నప్పుడో ఎప్పుడైనా తాటిపండు తల మీద రాలిపడుతున్న దృశ్యం మనసులో మెదిలిందా? దీనికంటే నాటకీయమైనవి ఈ చండ్రనిప్పులు. రాజకీయ విమర్శల్లో ఫలానా ఆయన చండ్రనిప్పులు చెరిగాడంటారు. నిప్పులు చెరగడంలోనే ఒక కవిత్వం ఉంది సరే, కానీ ఈ చండ్ర అనేది ఏమిటి? ఇది ఒక చెట్టు. అది కాలుతున్నప్పుడు రేగే శబ్దం జోరుగా చిటపటమంటూ ఉంటుంది. కానీ ఈ మాట విన్నప్పుడు ఎప్పుడైనా ఆ ఉగ్రరూపంతో ఉన్న చెట్టు కళ్లముందు కదలాడిందా? దాదాపుగా ఇలాంటి మాటే, అట్టుడకటం. ఇందులో పెద్ద గోప్యమైన అర్థం ఏమీలేదు. మామూలు అట్టు ఉడకటమే. కానీ అట్టు పెనం మీద ఉడుకుతున్న, పొంగుతున్న ఇమేజ్ ఈ మాటతో జోడీ కట్టిందా అన్నదే అనుమానం. లేకపోతే అంత ఉడికీ ఏం ప్రయోజనం! ఎటూ పెనం, పొయ్యి దగ్గరే ఉన్నాం కాబట్టి– ఈ ఆనవాలు సంగతేమిటో చూద్దాం. ఆనవాలు దొరక్కుండా చేయాలంటారు. ఆ పనిలో అది ఆయన ఆనవాలు అంటారు. అర్థం తెలుస్తోంది. కానీ ఇంతకీ ఏమిటివి? పాలల్లో ఒక్క నీటిబొట్టు కూడా లేకుండా చిక్కగా కాస్తే మిగిలేవి ఈ ఆనవాలుట! అదే వంటింట్లో ఉన్నప్పుడే కరతలామలకం ఏమిటో కూడా రుచి చూద్దాం. ఫలానా విషయం ఆయనకో, ఆవిడకో కరతలామలకం అంటారు. చేతిలో లేదా చేతి తలం మీద ఉన్న అమలకం. అనగా ఉసిరికాయ. అంటే అంత సులభంగా అందుకోగలిగేదీ, అందుబాటులో ఉన్నదీ అని. ఇంత సులభమైనది కూడా దాని అర్థంతో సహా బొమ్మ కడుతోందా అన్నది సందేహం. ఇలాంటి వ్యవహారాలకు అర్థం చెప్పుకోవడం నల్లేరు మీద నడక ఏమీ కాదు. దీన్నే ఇంకోలా చెప్పుకొంటే, నల్లేరు మీద నడక చాలా సుఖం, హాయి. ఎందువల్ల? అసలు ఈ నల్లేరు ఏమిటి? ఇసుకలో నడిచినప్పుడు కాలు దిగబడిపోతుంది. కానీ అదే ఇసుకలో అక్కడక్కడా విస్తరించి ఈ నల్లేరు గుబురు గనక ఉందంటే దానిమీద అడుగులేస్తూ ఎంచక్కా నడిచిపోవచ్చు. పల్లేరు గాయలు గుర్తొచ్చాయంటే సరేగానీ ఈ నల్లేరు ఎంతమందికి తెలుసు? అన్నట్టూ గుచ్చాయంటే గుర్తొచ్చేది, ఏకు మేకవడం. ఏకు అనేది నేతపనిలో భాగం. మెత్తగా, సౌకుమార్యంగా, సాధువుగా ఉండేది కాస్తా మేకులాగా దుర్మార్గంగా తయారైన సందర్భంలో దీన్ని వాడతాం. అన్నీ మనకు తెలుస్తాయా? ప్రయత్నిస్తాం, మళ్లీ ప్రయత్నిస్తాం, అయినా తెలియకపోతే వదిలేస్తాం. ఏదైనా పని జరగనప్పుడు కూడా అంతేగా. కాకపోతే వదిలేముందు ఒక మాట అనేసు కుంటాం, అందని మానిపండు అని. ఏమిటీ మానిపండు? దీని రుచి ఎలా ఉంటుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడా దొరకదు. ఎందుకంటే, ఎక్కలేనంత పొడవైన, అందలేనంత పొడవైన మాను అంటే చెట్టుకు కాస్తుంది కాబట్టి. దీనికి దగ్గరగా వినిపించే మరో వ్యవహారం, అందలం. అక్కన్న మాదన్న అందలం ఎక్కితే, సాటి సరప్ప చెరువు గట్టెక్కాడట. ఏదో ఒకటి ఎక్కాలిగా ఆయన కూడా. ఇంతకీ మాదన్నతో కలిసి అక్కన్న ఎక్కిందేమిటి? పల్లకీ. మరి పల్లకీ ఎక్కడమంటే ఆ రోజుల్లో తమాషా! అదొక హోదాకు చిహ్నం. ఎవరో సమాజంలో అందె వేసిన చేతులకే అలాంటి యోగాలు దక్కేవి. ఇంతకీ ఏమిటీ అందె? కడియం. బిరుదుటందె అని కూడా అంటారు. ఒక మనిషి విద్వత్తు గలవాడనీ, ప్రవీణుడనీ, నిష్ణాతుడనీ చేతికి తొడిగే సర్టిఫికెట్ ఈ ఆభరణం. ఇలాంటివి కూపస్థమండూకాలకు దొరకడం కష్టం. అదేలే, కూపము అనగా బావి, ఆ బావిలో ఉండే, ఆ బావినే ప్రపంచంగా భావించుకునే కప్పలకు ఇలాంటి గౌరవాలు దక్కవూ అని చెప్పడం! ఇకముందైనా ఇలాంటి మాటల్ని వాటి భావచిత్రాలతో గ్రహిద్దామని ఒడిగడదామా! అయ్యో, పాపానికి ఒడిగట్టినట్టుగా ధ్వనిస్తోందా? ఒడి అంటే ఒడి అనే. ఒడిగట్టడం అంటే ఒక పనికి పూను కోవడం అనే మంచి అర్థమే. కానీ కాలం చిత్రమైంది. ఎంత మంచి ఉద్దేశంతో మొదలైనవైనా కొన్ని మాటల్ని ఎందుకో ప్రతికూలంగా నిలబెడుతుంది. ఒక విధంగా దీని మంచి భావాన్ని తుంగలో తొక్కింది అనుకోవచ్చు. ఇంతకీ తుంగ అంటే మామూలు తుంగేగా? తుంగలో ఒక విషపూరిత తుంగ కూడా ఉంటుందట. ఆ తుంగలో గనక ఏదైనా ధాన్యాన్ని తొక్కితే ఇంక అది ఎప్పటికీ మొలకెత్తదట. అంటే ఒకదాన్ని సర్వనాశనం చేయడం తుంగలో తొక్కడం. ఇవన్నీ రాస్తూపోతే ఎప్పటికి ఒక కొలికికి వచ్చేను? అదేలే, ఒక కొసకు, చివరకు, ముగింపు నకు. కానీ చాలా మాటలు, భావాలు, వ్యక్తీకరణలు తెలియకుండానే తుంగలో అడుగంటు తున్నాయి. భాష అనేది మన జీవనాడి. ఉత్త పలుకుగా అది బోలు గింజే. కానీ పూర్ణరూపంతో సారాన్ని గ్రహిస్తే అది అమృతాహారమే; పాతకాలం పెళ్లిళ్లలో గాడిపొయ్యి మీద వండుకున్నంతటి విందుభోజనమే. ఓహో, మళ్లీ ఇదొకటి వివరించాలా! పశువులకు గడ్డి వేసే గాడి ఏమిటో, దానికీ గాడిపొయ్యికీ సంబంధం ఏమిటో... అసలు ఉందో లేదో తెలుసుకుంటేనే మన భాష ఒక గాడిన పడుతుంది. -
అంబానీ ఇంటి వద్ద కలకలం: ‘అతడిని శిక్షించండి’
ముంబై: పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు కొనసాగతుండగానే.. సదరు వాహనం డ్రైవర్ మరణించాడు. ఇలా కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీని దర్యాప్తును యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు అప్పగించింది. తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ విషయంపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఏకంగా ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజ్ని శిక్షించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఫడ్నవీస్ అసెంబ్లీలో చనిపోయిన స్కార్పియో డ్రైవర్ హిరెన్ మన్సుఖ్ భార్య ఇచ్చిన ఎఫ్ఐఆర్ని చదివారు. దీనిలో సదరు డ్రైవర్ మరణించడానికి ముందు జరగిన సంఘటనలు వరుసగా ఉన్నాయి. అనంతరం ఫడ్నవీస్ "అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజ్ని శిక్షించాలి. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి మీరు అతనికి అవకాశం ఇస్తున్నారు. అతను (వాజ్) ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి అతడిని రక్షిస్తున్నారు. అసలు అతడిని ఎలా ఫోర్స్‌లోకి తీసుకున్నారు.. తొలుత అతడిని సస్పెండ్ చేయండి’’ అంటూ ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. అంబానీ ఇంటి ముందు కలకలం రేపిన స్కార్పియో డ్రైవర్ హిరెన్ మన్సుఖ్ (45) మృతదేహాన్ని గత శుక్రవారం ముంబై సమీపంలోని ఒక కాలువ దగ్గర గుర్తించినట్లు థానే పోలీసు అధికారి తెలిపారు. గురువారం రాత్రి నుంచి అతను తప్పిపోయాడని మన్సుఖ్ కుటుంబం తెలిపింది. దాంతో ఈ కేసును మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు బదిలీ చేశారు. చనిపోవడానికి ముందు మన్సుఖ్ తనను పోలీసు అధికారులు, జర్నలిస్టులు వేధిస్తున్నారని ఆరోపించారని ఫడ్నవీస్ తెలిపారు. ఇక ఫడ్నవీస్ వ్యాఖ్యలను మహారాష్ట్ర హోంమంత్రి దేశ్ ముఖ్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మన్సుఖ్ భార్య చేసిన ప్రకటన ఇప్పుడు మీడియాలో ప్రతిచోటా ఉంది. ప్రస్తుతం ఈ కేసును ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి ప్రతిపక్షం దగ్గర మరిన్ని రుజువులు, ఆధారాలు ఉంటే, వారు దానిని ఏటీఎస్‌కు అందివ్వా లి. అంతేకాకా హోం మినిస్టర్‌గా నేను మీకు హామీ ఇస్తున్నాను.. ఈ కేసు నుంచి ఎవరు తప్పించుకోలేరు’’ అన్నారు అని దేశ్ ముఖ్. చదవండి: అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు అంబానీ ఇంటివద్ద కలకలం : మరో కీలక పరిణామం -
బ్రేకింగ్: బాబు, ఉమపై వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు
గొల్లపూడి: తెలుగు వాడి చరిత్ర దేశంలో లిఖించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని, రాజకీయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. ఎన్టీ రామరావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, వదినను చంపిన ఉమా రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్లేస్, టైమ్, డేట్ ఉమా ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల ముందు పసుపు.. కుంకుమ ఇస్తే ప్రజలు టీడీపీకి కోసి కారం పెట్టారని తెలిపారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని.. సవాల్ అయినా ప్రతి సవాల్ అయినా మేము సిద్ధమేనని వంశీ ప్రకటించారు. మాజీ మంత్రి దేవినేని ఉమ దీక్షపై కౌంటర్ బదులిచ్చారు. అసంబద్ధమైన ఆరోపణలు చేసి చర్చకు రా అంటే ఎలా అని వంశీ ప్రశ్నించారు. అభివృద్ధిపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చర్చ పెట్టుకుందాం అని చెప్పాము కానీ కొట్లాటకు రమ్మని మేము చెప్పలేదని వంశీ వివరించారు. ఉమా తక్కువ తినలేదు తక్కువ మాట్లాడతాడని మేము అనుకోమని పేర్కొన్నారు. ఒకటి అని రెండు అనిపించుకోవడం ఉమాకి అలవాటు అని తెలిపారు. టీడీపీ చాలా గొప్ప పార్టీ.. ఎన్టీఆర్ టీడీపీ వేరు.. చంద్రబాబు టీడీపీ వేరు అని చెప్పారు. గత ప్రభుత్వంలో ఏ మేరకు అవినీతి జరిగిందో నాకు తెలుసని.. ఉమా ఒక లోఫర్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మా ఇంట్లో అనేక కులాలు ఉన్నాయి.. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే మేము గెలిచామని పేర్కొన్నారు. ఒక కులాన్ని టార్గెట్ గా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించడం అవాస్తవమని స్పష్టం చేశారు. ఒక కులం వాళ్లు ఓట్లు వేస్తే నేను నాని ఎమ్మెల్యేలుగా గెలవలేదని తెలిపారు. ఉమా ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకోవాలని వల్లభనేని వంశీ హితవు పలికారు. -
అబ్బే... ఆ ఉద్దేశం లేదు
‘రాజకీయమా? నేనా? అబ్బే.. ఆ ఉద్దేశమే లేదు’ అన్నారు శ్రుతీహాసన్. ‘మీ నాన్నగారు పార్టీ స్థాపించారు కదా. మిమ్మల్ని కూడా రాజకీయాల్లో చూడొచ్చా’ అని శ్రుతీహాసన్‌ని అడిగితే ఆమె నుంచి ఈ సమాధానం వచ్చింది. దీని గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘రాజకీయాల గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. ఎటువంటి అవగాహన లేకుండా రాజకీయాల్లోకి వెళ్లడం అయినా, సినిమాకు దర్శకత్వం వహించడం అయినా పెద్ద పొరపాటు అవుతుంది. మనకు తెలియకుండానే ఎంతోమందికి హాని చేసినవాళ్లం అవుతాం. మా నాన్నగారి పార్టీ ప్రచారానికి కూడా నేను వెళ్లను. ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆయన విజన్‌ను నేను నమ్ముతాను. ఆయనకు మంచి జరగాలని కచ్చితంగా కోరుకుంటాను’ అన్నారు. ఇదిలా ఉంటే.. కరోనా వల్ల జరిగిన నష్టాన్ని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించే దిశలో నటీనటులు పారితోషికం తగ్గించుకోవాలని ఇటీవల చిత్రపరిశ్రమకు సంబంధించిన కీలక శాఖలవారు పేర్కొన్నారు. ఆ విషయం గురించి శ్రుతీహాసన్‌ని అడిగితే – ‘నిజానికి సినిమా ఇండస్ట్రీలో పారితోషికం విషయంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు చెల్లించేది చాలా తక్కువ. ఇద్దరి పారితోషికాల్లో వ్యత్యాసం చాలా ఉంది. హీరో అందుకుంటున్న రెమ్యునరేషన్ హీరోయిన్‌కి రావాలంటే కచ్చితంగా మరో 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు. -
వివాదంలో ప్రముఖ కామెడీ షో
‘పాట్రియాట్ యాక్ట్ విత్ హసన్ మిన్హాజ్’ అనేది ఒక అమెరికన్ కామెడీ, వెబ్ టెలివిజన్ షో. సమకాలీన రాజకీయాలకు సంబంధించిన విషయాలను కామెడీతో కలిపి జనాల ముందు ప్రదర్శిస్తారు. అయితే ప్రస్తుతం ఈ షో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. దీని నిర్వహకులు విషపూరిత పని సంస్కృతిని పాటిస్తున్నారంటూ షో మాజీ నిర్మాత నూర్ ఇబ్రహీం నస్రీన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా నూర్ వరుస ట్వీట్లు చేశారు. ‘ఈ షోలో పని చేస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు పొందాను. చాలా సార్లు నన్ను టార్గెట్ చేశారు. కొన్నిసార్లు కావాలనే విస్మరించేవారు. వీరు షోలో చూపించే నీతిని నిజంగా పాటిస్తే చాల బాగుండేది. చాలా మంది నన్ను ఈ షో గురించి మాట్లాడమని కోరేవారు. కానీ నేను తప్పించుకునేదాన్ని. ఈ షోలో ఎన్నో అవమానాలు పొందాను. చాలా సార్లు డిప్రెషన్‌కు గురయ్యాను. ఇప్పుడు ఇలా ట్వీట్ చేయడం వల్ల నాకు, నాలా బాధపడే ఇతరులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అన్నారు నూర్. (సూపర్ క్రేజ్.. 1.7 మిలియన్ లైక్స్) A lot of people have asked me to talk about Patriot Act. I avoided it because each time I relive the experience of being humiliated and gaslit, targeted and ignored, I sink back into days of depression. Tweeting this will probably not help me or anyone who has suffered. — nur nasreen (@Nuri_ibrahim) August 20, 2020 అంతేకాక ‘కొందరు మహిళలు నాకంటే ధైర్యవంతులు. వారు దీని గురించి చర్చించారు. ఈ షో ఎంతో ముఖ్యమైనది.. ప్రముఖమైనది. ఇందుకు గాను నా పని పట్ల నేను చాలా గర్వంగా ఫీలవుతాను. నాకు లభించిన అవకాశాలకు నేను ధన్యవాదాలు తెలుపుతాను. అయితే గత కొద్ది నెలలుగా నేను అనుభవిస్తున్న మానసిక వేదనతో పోల్చితే.. ఇది అంత విలువైనదేం కాదని అర్థమవుతోంది. నిజంగానే మనకు ఓ దేశ భక్తి చట్టం ఉండాలని.. ఈ షో చూపించిన దానిని వారు నిజంగా పాటించాలని కోరుకుంటున్నారు. అప్పుడే వారు ప్రేక్షకుల ప్రేమకు అర్హులు’ అంటూ వరుస ట్వీట్లు చేశారు నూర్. రాజకీయాల మీద సెటర్లతో ఈ సాగే ‘పాట్రియాట్ యాక్ట్ షో’ మొదట అక్టోబర్ 28, 2018లో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శితమయ్యింది. అప్పటి నుంచి ఆరు సీజన్లుగా 40 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయిన ఈ షో ప్రస్తుతం ఆగిపోయింది. -
బ్యాండ్ బాజా 22nd Feb 2020
-
బ్యాండ్ బాజా 8th Feb 2020
-
బ్యాండ్ బాజా 1st Feb 2020
-
ఇక అంతే అంటవా..!
సాక్షి, సిరిసిల్ల : ఇది మున్సిపల్ ఎన్నికల సమయం. గల్లీ ముచ్చట్లు.. ఇంటి మీదకు తెచ్చే ప్రమాదం ఉంటుంది. ఏం మాట్లాడినా.. ఎవరితో తిరిగినా.. అనుమానాలు, అపోహలకు తావిచ్చే పరిస్థితి. సొంత పార్టీ వారే శంకించేందుకు అవకాశమున్న రోజులు. సిరిసిల్ల పట్టణంలోని ఓ వార్డు నాయకుడు అధికార పార్టీలో ఈ మధ్యనే చేరాడు. ఆ పార్టీ టికెట్ వచ్చిన అభ్యర్థికంటే.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన వ్యక్తి అంటేనే అభిమానం. అతనంటేనే మక్కువ. కానీ పార్టీ క్యాండేటును కాదని దగ్గరి మనిషికి ప్రచారం చేసే పరిస్థితి లేదు. దీంతో లోలోపల నీకు మద్దతు కానీ.. వాడకట్టులో నీ కోసం మాత్రం తిరగ అంటూ హామీ ఇచ్చేశాడు. ఆ నేతలిద్దరూ ఒకప్పుడు మంచి దోస్తులు.. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కల్వకుంట చేసినయి.. అధికార పార్టీలో ఉన్న కొందరు ఆ పార్టీ అభ్యర్థికి మనస్ఫూర్తిగా ప్రచారం చేయడం లేదు. దగ్గరి మనిషిని ఇడిసిపెట్టి తిరగబుద్ది అయితలేదు. ఎంతైనా ఇది ఎన్నికల సమయం కదా.. ఆ ఎలక్షన్లు అయిపోతే.. ఎవరి సంగతి ఎంటో తెలుస్తుంది.. అన్నా. మరి ఎన్నికలప్పుడు ఏం మాట్లాడినా.. పట్టుకుని మనసుల పెట్టుకుంటరు.. గందుకే ఏం మాట్లాడకపోవడమే ఉత్తమమని సదరు నాయకులు చెప్పడం.. అంతేనంటవా అని మిగతావాళ్లు అనడంతో ఛాయ్ పే చర్చ ముగిసింది. -
బ్యాండ్ బాజా 4th Jan 2020
-
బ్యాండ్ బాజా 21st Dec 2019
-
బ్యాండ్ బాజా
-
బ్యాండ్ బాజా 16th Nov 2019
-
బ్యాండ్ బాజా 9th Nov 2019
-
బ్యాండ్ బాజా 26th Oct 2019
-
బ్యాండ్ బాజా 19th Oct 2019
-
బ్యాండ్ బాజా 12th Oct 2019
-
బ్యాండ్ బాజా 5th Oct 2019