వాషింగ్టన్: సామాజిక మాధ్యమం ట్వీటర్‌లో ప్రధాని మోదీని అనుసరించే వారి సంఖ్య 3.6 కోట్లకు పైమాటే. ఇంతలా మోదీ నెటిజన్లను ఆకర్షించడానికి గల కారణాలేమిటో తెలుసుకునేందుకు అమెరి కాకు చెందిన ఓ యూనివర్సిటీ పరిశోధన నిర్వహించి.. అసలు రహస్యాన్ని శోధించింది. మోదీ తన ట్వీట్లలో రాజకీయ వ్యంగ్యం, చతురత వంటి అంశాలను ఉపయోగించి నెటిజన్లను ఆకర్షిస్తూ.. తన రాజకీయ శైలిని పునరుద్ధరించుకున్నారని మిచిగాన్ వర్సిటీ వెల్లడించింది. దీనికోసం వర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌కు చెందిన పరిశోధకులు మోదీ గత ఆరేళ్ల కాలంలో చేసిన దాదాపు 9 వేల ట్వీట్లను విశ్లేషించారు. రాహుల్ గాంధీ, క్రికెట్, వినోదం, వ్యంగ్యం, అవినీతి, అభివృద్ధి, విదేశీ వ్యవహారాలు, హిందూ మతం, శాస్త్ర–సాంకేతికత వంటి 9 వైవిధ్య భరితమైన అంశాలు మోదీ ట్వీట్లలో ఉండేవని వారు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment