Nani's Shyam Singha Roy Movie Shooting Starts In Hyderabad | Shyam Singha Roy Movie Update - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ శ్యామ్‌ సింగరాయ్ షూటింగ్‌

Published Mon, Dec 21 2020 2:44 PM | Last Updated on Mon, Dec 21 2020 3:37 PM

Hero Nani New Shyam Singha Roy Movie Shooting Starts In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్యాక్సివాలా ఫేం రాహుల్‌ సంక్షిర్త్యన్‌ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘శ్యామ్‌ సింగరాయ్’‌ మూవీ షూటింగ్‌ సెట్స్‌పై వచ్చింది. ఇటీవల షూటింగ్‌ ప్రారంభ వేడుకను ఘనంగా జరుపుకున్న ఈ మూవీ సోమవారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యూలర్‌ షూటింగ్‌ జరపుకోనున్నట్లు నిహారిక ఎంటటైన్‌మెంట్ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. అనిల్ రావిపూడి  దర్శకత్వంలో  నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: హీరో నాని కొత్త మూవీ షురూ)

‘రాయ్‌ స్టార్ట్స్‌ రోల్‌’ అంటూ షేర్‌ చేసిన ఈ ట్వీట్‌లో ఓ వ్యక్తి కుర్చీలో కుర్చుని అటూవైపు చూస్తున్నట్లు కనిపించగా టెబుల్‌పై ఓ టీ కప్పు, డైరీ ఉంది. దీంతో ఇది చూసిన నెటిజన్‌లు సెట్స్‌లో నాని అయింటాడని అభిప్రాయం వ్యక్తం చేస్తు కామెంట్‌ చేస్తున్నారు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌, కాన్సెప్ట్ పోస్టర్‌ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్  సంగీతాన్ని అందిస్తున్నారు. మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్‌, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. (చదవండి: మొదటిసారి తెలుగులో.. సంతోషంగా ఉంది: నజ్రియా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement