Vaishnav Tej Kondapolam Movie In OTT Streaming On Amazon Prime - Sakshi
Sakshi News home page

Kondapolam OTT Streaming: ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోన్న ‘కొండపొలం’, ఎక్కడంటే..

Published Thu, Dec 9 2021 7:01 PM | Last Updated on Thu, Dec 9 2021 7:13 PM

Vaishnav Tej Kondapolam Movie Streaming Now On OTT - Sakshi

Kondapolam Movie Streaming Now On OTT: మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’.  క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్‌ విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. కోట శ్రీనివాసరావు, సాయిచంద్‌, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 8 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన  సంగతి తెలిసిందే.

చదవండి: ఎంఎస్‌ చివరి క్షణాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న బ్రహ్మానందం

ఈ మూవీ విడుదలైన రెండు నెలల తర్వాత కొండపోలం ఓటీటీలోకి  అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. కాగా ఇంజనీరింగ్‌ చదివిన ఓ యువకుడు పట్టణంలో ఉద్యోగం తెచ్చుకోలేక ఇంటికి తిరిగి రావడం, భయపడుతూనే కొండపొలం వెళ్లడం, అక్కడ జరిగిన సంఘటనలతో మానసికంగా ఎలా బలంగా మారాడు? యూపీఎస్సీ పరీక్షల్లో ఐఎఫ్‌ఎస్‌కు ఎలా ఎంపికయ్యాడన్నదే ఈ సినిమా కథ. ఇందులో రకుల్‌ ఒబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో నటించి అందరిని మెప్పించింది. 

చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement