అడవిలో షూటింగ్ చేయడం అంటే ఆషామాషీ కాదు. అది కూడా రాత్రిపూట షూటింగ్ అంటే చిన్న విషయం కాదు. అయినా పని మీద ప్రేమ ఉంటే ఏదైనా ఈజీయే. ఆ ప్రేమ ఉంది కాబట్టే అడవిలో షూటింగ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఆమె నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘డాక్టర్ జి’ షూటింగ్ భోపాల్‌లో జరుగు తోంది. అక్కడి అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు షాట్ గ్యాప్‌లో రకుల్ ‘చాట్’ ఆరగించారు.
‘‘జంగిల్‌లో షూటింగ్ చేస్తూ చాట్ తింటే ఆ మజానే వేరు’’ అని కూడా అంటున్నారు. లేడీ డైరెక్టర్ అనుభూతీ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ వైద్య విద్యార్థిని ఫాతిమా పాత్రలోనూ, డా. ఉదయ్ గుప్తా పాత్రలో ఆయుష్మాన్ కనిపిస్తారు. ఇది కాకుండా హిందీలో ‘ఎటాక్’, ‘థ్యాంక్ గాడ్’, ‘మేడే’ చిత్రాల్లో నటిస్తున్నారు రకుల్. తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, ఇంకా కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’ కూడా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment