వారం రోజులుగా బెడ్‌పైనే.. కోలుకోలేకపోతున్నా: రకుల్‌ | Rakul Preet Singh Shares Health Update about Back Injury | Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: పిచ్చి పని చేశా.. ఇదో గుణపాఠం.. హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చిన రకుల్‌

Published Wed, Oct 16 2024 7:13 PM | Last Updated on Wed, Oct 16 2024 7:30 PM

Rakul Preet Singh Shares Health Update about Back Injury

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్‌ చేస్తోంది. అజయ్‌ దేవ్‌గణ్‌ 'దేదే ప్యార్‌ దే 2' మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. కథానాయికగా అందాన్ని కాపాడుకునేందుకు డైట్‌, వర్కవుట్స్‌పైనా ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. ఈ క్రమంలో జిమ్‌లో బెల్ట్‌ కూడా వాడకుండా 80 కిలోల బరువు ఎత్తింది. ఈ సమయంలో ఆమెకు వెన్ను నొప్పి మొదలైంది. అయినా పట్టించుకోకుండా వర్కవుట్స్‌ చేసింది.

ఓ పిచ్చిపని చేశా..
వెన్నునొప్పి తీవ్రమవడంతో వైద్యులను సంప్రదించగా కొన్నిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట! తాజాగా ఈ బ్యూటీ తన హెల్త్‌ అప్‌డేట్‌ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది. 'హాయ్‌ అందరికీ.. నేను ఓ పిచ్చిపని చేశాను. నా శరీరాన్ని పట్టించుకోలేదు. వెన్నునొప్పి ఉన్నా లెక్కచేయలేదు. చివరకు అది ఎక్కువైంది. ఆరు రోజులుగా బెడ్‌పైనే ఉన్నాను. పూర్తిగా కోలుకోవడానికి మరో వారం రోజులు పడుతుందనుకుంటాను.

ఇదొక గుణపాఠం
ఇలా మంచానికే పరిమితం కావడం ఏమీ బాగోలేదు. వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. కానీ ఇదొక గుణపాఠంగా భావిస్తాను. మన బాడీ ఏదైనా సిగ్నల్స్‌ ఇచ్చినప్పుడు దాని మాట పట్టించుకోకుండా ముందుకు వెళ్లకూడదని తెలుసుకున్నాను. నేను నా బాడీ కన్నా మైండ్‌ ఎక్కువ స్ట్రాంగ్‌ అని ఫీలయ్యాను. అన్నివేళలా అది నిజం కాదని తెలిసొచ్చింది. నా ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు మెసేజ్‌ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని పేర్కొంది.

చదవండి: ఓటీటీకి థ్రిల్లర్ వెబ్ సిరీస్‌.. తెలుగు ట్రైలర్ చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement