నేవీ రాడార్‌ స్టేషన్‌ కోసం అటవీ భూములు | Navy officials meeting with CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

నేవీ రాడార్‌ స్టేషన్‌ కోసం అటవీ భూములు

Published Thu, Jan 25 2024 4:42 AM | Last Updated on Thu, Jan 25 2024 4:42 AM

Navy officials meeting with CM Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని వికారాబాద్‌ మండలం పూ డూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో దేశంలోనే రెండో వీఎల్‌ఎఫ్‌ కమ్యూనికేషన్‌ (రాడార్‌) స్టేషన్‌ ఏ ర్పాటు ఖరారయ్యింది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని తూర్పు నౌకాదళ కమోడోర్‌ కార్తీక్‌ శంకర్, సర్కిల్‌ డీఈవో రోహిత్‌ భూపతి, కెప్టెన్‌ సందీప్‌ దాస్‌ కలి శారు.

వీఎల్‌ఎఫ్‌ కమ్యూనికేషన్‌ స్టేషన్‌ ఏర్పాటు కోసం అట వీ భూముల బదిలీ ఒప్పందంపై వికారాబాద్‌ డీఎఫ్‌వో, నా వల్‌ కమాండ్‌ ఏజెన్సీ అధికారులు సంతకాలు చేశారు. దామ గూడెం రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. 

దేశంలోనే రెండోది
భారత నావికాదళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో  వీఎల్‌ఎఫ్‌ కమ్యూనికేషన్‌ స్టేష న్‌ను వికారాబాద్‌ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్‌ఎఫ్‌ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్‌ను ఉపయోగిస్తుంది. దామగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసే స్టేష న్‌ దేశంలో రెండోది కాగా.. తమిళ నాడులోని తిరునల్వేలిలో ఉన్న ఐఎన్‌ఎస్‌ కట్టబొమ్మన్‌ రాడార్‌ స్టేషన్‌ మొదటిది. రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్‌ ఎప్పుడో గుర్తించింది.

2010 నుంచే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావ రణ అనుమతులు,  క్లియరెన్స్‌లన్నీ వచ్చినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. వాస్తవానికి 2014లోనే నేవీ ప్రతిపాదనలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లు కూడా నేవీ చెల్లించింది.

అయితే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని దామగూడెం ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ సంస్థ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉండటంతో దానికి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు నేవీ అంగీకరించింది. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం కూడా నౌకాదళ అధికారులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌ దిశగా ముందడుగు పడింది.

2027లో పూర్తి
దామగూడెంలో నేవీ స్టేషన్‌తో పాటు ఏర్పడే టౌన్‌షిప్‌లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. దాదాపు 600 మంది నావికా దళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది ఈ టౌన్‌షిప్‌లో నివసిస్తారు.

విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడతారు. ప్రాజెక్టులో భాగంగా దామగూడెం రిజర్వ్‌ ఫారెస్ట్‌ చుట్టూ దాదాపు 27 కి.మీ. రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్‌ఎఫ్‌ సెంటర్‌ ఏర్పాటు పూర్తి కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement