లవ్‌ ప్రెగ్నెన్సీ!  | Sania Mirza on motherhood, marriage and missing tennis | Sakshi
Sakshi News home page

లవ్‌ ప్రెగ్నెన్సీ! 

Published Wed, Aug 1 2018 12:24 AM | Last Updated on Wed, Aug 1 2018 12:24 AM

Sania Mirza on motherhood, marriage and missing tennis - Sakshi

ఇండియన్‌ టెన్నిస్‌కు ఒక తిరుగులేని క్రేజ్‌ తెచ్చిన సూపర్‌స్టార్‌ సానియా మీర్జా త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను 2010లో పెళ్లాడిన ఆమె, కెరీర్‌ కోసం ఇంతకాలం పిల్లలకు దూరంగా ఉంటూ వచ్చింది. షోయబ్, సానియా దంపతులు అక్టోబర్‌ నెలలో తల్లిదండ్రులయ్యే అవకాశాలున్నాయి. సానియా చివరి మూడు నెలల ప్రెగ్నెన్సీకి వచ్చేయడంతో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారట! ‘మనందరికీ ఇదొక గొప్ప అదృష్టం. డైట్‌ విషయంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఆకుకూరలు, గ్రీన్‌ జ్యూస్‌ బాగా తీసుకుంటున్నా’ అని ప్రెగ్నెంట్‌గా ఉన్న మహిళలకు సూచనలు ఇస్తున్నారు సానియా.

ప్రస్తుతం హైదరాబాద్‌లోనే కుటుంబ సభ్యులతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రెగ్నెన్సీ టైమ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారామె. దీనికి ‘లవ్‌ ప్రెగ్నెన్సీ’ అని ట్యాగ్‌ పెట్టుకొని ఉత్సాహంగా పుట్టబోయే బిడ్డకోసం ఎదురుచూస్తున్నారు. అలాగే బిడ్డ పుట్టాక అందరూ అనుకునేట్టు టెన్నిస్‌కు దూరం కానని కూడా చెప్పేశారు. ‘2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొంటా. ప్రెగ్నెన్సీ తర్వాత, బేబీ పుట్టాక రెండే రెండేళ్ల గ్యాప్‌లో మళ్లీ ఆటంటే, అదీ ఇంతకుముందు ఉన్న ఫామ్‌లో అంటే కష్టమే. అయినా సాధిస్తా’ అని ధీమాగా చెబుతున్నారు సానియా.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement