విరాట్ కోహ్లి, రాహుల్ ద్రావిడ్, సునీల్ గావస్కర్(పాత చిత్రం)
కోల్‌కత్తా: రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరును, భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పేరు ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డుకు, ధ్యాన్‌చంద్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డుకు లెజెండరీ ఓపెనర్ సునీల్ గావస్కర్ పేరును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సిఫార్సు చేసింది.
భారత క్రికెట్ టీంలో విరాట్ కొంతకాలం నుంచి ముఖ్యభూమిక పోషిస్తున్నాడు. క్రికెట్‌లో బ్యాట్‌తో రాణిస్తూ దిగ్గజ ఆటగాడు సచిన్‌ను మరిపిస్తున్నాడు. దీన్ని పరిగణలోనికి తీసుకుని ఈ అవార్డుకు కోహ్లి అర్హుడని భావించి ఆయన పేరును ప్రతిపాదించారు. రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న అండర్-19 టీం ఇటీవల ప్రపంచ కప్ నెగ్గిన సంగతి తెల్సిందే. భారత క్రికెట్‌కు గావస్కర్ చేసిన సేవలకు గానూ, 70,80వ దశలకాల్లో బ్యాట్‌తో రాణించి భారత్‌కు పేరు ప్రఖ్యాతులు తెచ్చింనందకు గానూ ఆయన పేరును ధ్యాన్‌చంద్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డుకు ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment