Dhyan Chand Award
-
హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ‘ఖేల్‌రత్న’ అవార్డు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటనకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 12 మంది సభ్యుల సెలక్షన్ కమిటీ అర్జున, ఖేల్‌రత్న, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ తదితర అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాను ప్రభుత్వానికి అందించింది. మార్పులు లేకుండా దాదాపు ఇదే జాబితా ఖాయమయ్యే అవకాశం ఉంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేరును ‘ఖేల్‌రత్న’ పేరు కోసం ప్రతిపాదించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్‌ప్రీత్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. హర్మన్‌తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం సిఫారసు చేసింది. పారిస్ పారాలింపిక్స్ హైజంప్ (టి64 క్లాస్)లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు సాధించిన షూటర్ మనూ భాకర్ పేరు ఖేల్‌రత్న జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న ప్లేయర్‌గా మరో చర్చ లేకుండా ‘ఖేల్ రత్న’ అవార్డుకు ఆమె అర్హురాలు. అయితే మనూ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. దానిని మనూ తండ్రి రామ్‌కిషన్ ఖండించారు. తాను సరైన ఫార్మాట్లోనే అప్లికేషన్ అందించామని స్పష్టం చేశారు. ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోయినా ... ప్రదర్శనను బట్టి అవార్డుకు ఎంపిక చేసే అధికారం జ్యూరీకి ఉంది. కాబట్టి మనూ సాధించిన ‘డబుల్ ఒలింపిక్ మెడల్’ ఘనతను బట్టి చూస్తే ఆలస్యంగానైనా ఆమె పేరు ఈ జాబితాలో చేరవచ్చు. ‘అర్జున’ జాబితాలో 30 మంది కమిటీ ప్రతిపాదించిన ‘అర్జున’ అవార్డీల జాబితాలో 13 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, మరో 17 మంది పారా ఆటగాళ్లు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న అమన్ (రెజ్లింగ్), సరబ్జోత్, స్వప్నిల్ కుసాలే (షూటింగ్) పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పారా ఆటగాళ్లలో తెలంగాణకు చెందిన దీప్తి జివాంజికి ‘అర్జున’ దక్కనుండటం విశేషం. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి పారిస్ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు (టి20)లో కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు ఆసియా పారా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో ఆమె ఖాతాలో రెండు స్వర్ణాలు ఉన్నాయి. పారా షూటింగ్ కోచ్ సుభాష్ రాణా పేరును ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం కమిటీ సిఫారసు చేసింది. ఈ జాబితాలో మరో కోచ్ అమిత్ కుమార్ సరోహా పేరు కూడా ఉండటం చర్చకు దారి తీసింది. అతను ఎప్పుడూ అధికారికంగా కోచ్‌గా పని చేయలేదని... పైగా ఇటీవల పారిస్‌లోనూ ఆటగాడిగా బరిలోకి దిగాడు కాబట్టి ద్రోణాచార్య అవార్డుకు అర్హుడు కాదని విమర్శలు వస్తున్నాయి. -
మన్‌ప్రీత్ సింగ్‌కూ ‘ఖేల్ రత్న’
ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అందుకోనున్న ఆటగాళ్ల సంఖ్య 12కు చేరింది. ఇటీవల 11 మందికి ‘ఖేల్ రత్న’ ప్రకటించగా... తాజాగా ఈ జాబితాలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పేరును కూడా చేర్చారు. ఈ ఏడాది 35 మందికి ‘అర్జున’... పది మందికి ‘ద్రోణాచార్య’ అవార్డు... ఐదుగురికి ‘ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డు ఇవ్వనున్నారు. ఈనెల 13న రాష్ట్రపతి భవన్లో 2021 జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. -
కోహ్లికి ఖేల్ రత్న.. ద్రవిడ్‌కు ద్రోణాచార్య
కోల్కత్తా: రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరును, భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పేరు ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డుకు, ధ్యాన్‌చంద్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డుకు లెజెండరీ ఓపెనర్ సునీల్ గావస్కర్ పేరును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సిఫార్సు చేసింది. భారత క్రికెట్ టీంలో విరాట్ కొంతకాలం నుంచి ముఖ్యభూమిక పోషిస్తున్నాడు. క్రికెట్లో బ్యాట్‌తో రాణిస్తూ దిగ్గజ ఆటగాడు సచిన్‌ను మరిపిస్తున్నాడు. దీన్ని పరిగణలోనికి తీసుకుని ఈ అవార్డుకు కోహ్లి అర్హుడని భావించి ఆయన పేరును ప్రతిపాదించారు. రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న అండర్-19 టీం ఇటీవల ప్రపంచ కప్ నెగ్గిన సంగతి తెల్సిందే. భారత క్రికెట్‌కు గావస్కర్ చేసిన సేవలకు గానూ, 70,80వ దశలకాల్లో బ్యాట్‌తో రాణించి భారత్‌కు పేరు ప్రఖ్యాతులు తెచ్చింనందకు గానూ ఆయన పేరును ధ్యాన్‌చంద్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డుకు ప్రతిపాదించారు. -
మనగడ్డ బిడ్డకు ప్రతిష్టాత్మక పురస్కారం
పెనుమంట్ర : మన జిల్లా ముద్దుబిడ్డ.. పరుగుల రాణి సత్తి గీత ధ్యాన్‌చంద్ పురస్కారానికి ఎంపికైంది. దేశంలోని ప్రఖ్యాత క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం సోమవారం పురస్కారాలు ప్రకటించింది. వాటిలో ప్రతిష్టాత్మకమైన ధ్యాన్‌చంద్ పురస్కారం గీతను వరించింది. ప్రస్థానం ఇదీ1983లో జూలై 5వ తేదీన మార్టేరులో జన్మించిన సత్తి గీత పరుగులో అనిర్వచనీయమైన విజయాలను సొంతం చేసుకుంది. 1996 నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న గీత ఇప్పటివరకు 180 బంగారు, 63 రజత, 40 ఇతర పతకాలు సాధించింది. ఏషియన్ ఛాంపియన్ షిప్ (2005)లో రజతం సంపాదించింది. ఆ తరువాత ఒలింపిక్స్ స్థాయి అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మార్టేరులో సంబరాలు : పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామం క్రీడాకారులకు పుట్టిల్లు. ఇదే గ్రామానికి చెందిన గీత గతంలో అనేక అవార్డులు, రివార్డులు సాధించి జిల్లా పేరు ప్రతిష్టతలను ఇనుమడింపచేసింది. ఆమె ధ్యాన్‌చంద్ పురస్కారానికి ఎంపికైందని తెలిసి మార్టేరులో సోమవారం సంబరాలు జరుపుకున్నారు. తోటి క్రీడాకారులు, ఆమె అభిమానులు స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తపరిచారు. గీత తల్లిదండ్రులు సత్తిరెడ్డి, కమల మాట్లాడుతూ తమ కుమార్తెకు ధ్యాన్‌చంద్ పురస్కారం లభించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. -

మిశ్రాకు ధ్యాన్‌చంద్ పురస్కారం
న్యూఢిల్లీ : డేవిస్ కప్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ ఎస్పీ మిశ్రాకు ఈ ఏడాది ధ్యాన్‌చంద్ పురస్కారం లభించింది. ఆయనతో పాటు వాలీబాల్ మాజీ కెప్టెన్ నాయర్, హాకీ జట్టు మాజీ గోల్‌కీపర్ రోమియో జేమ్స్‌లను కూడా ఈ పురస్కారం వరించనుంది. 60 మంది జాబితాలో నుంచి ఈ ముగ్గురిని షార్ట్‌లిస్ట్ చేసిన కమిటీ క్రీడాశాఖకు పేర్లను పంపింది. తమ క్రీడా విభాగాల్లో అత్యున్నత సేవలందించినందుకు జీవిత సాఫల్య పురస్కారం కింద ధ్యాన్‌చంద్ పేరిట ఈ అవార్డును అందిస్తారు.