
మిశ్రాకు ధ్యాన్‌చంద్ పురస్కారం
న్యూఢిల్లీ : డేవిస్ కప్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ ఎస్‌పీ మిశ్రాకు ఈ ఏడాది ధ్యాన్‌చంద్ పురస్కారం లభించింది. ఆయనతో పాటు వాలీబాల్ మాజీ కెప్టెన్ నాయర్, హాకీ జట్టు మాజీ గోల్‌కీపర్ రోమియో జేమ్స్‌లను కూడా ఈ పురస్కారం వరించనుంది. 60 మంది జాబితాలో నుంచి ఈ ముగ్గురిని షార్ట్‌లిస్ట్ చేసిన కమిటీ క్రీడాశాఖకు పేర్లను పంపింది. తమ క్రీడా విభాగాల్లో అత్యున్నత సేవలందించినందుకు జీవిత సాఫల్య పురస్కారం కింద ధ్యాన్‌చంద్ పేరిట ఈ అవార్డును అందిస్తారు.