SP Mishra
-
మిశ్రాకు ధ్యాన్‌చంద్ పురస్కారం
న్యూఢిల్లీ : డేవిస్ కప్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ ఎస్పీ మిశ్రాకు ఈ ఏడాది ధ్యాన్‌చంద్ పురస్కారం లభించింది. ఆయనతో పాటు వాలీబాల్ మాజీ కెప్టెన్ నాయర్, హాకీ జట్టు మాజీ గోల్‌కీపర్ రోమియో జేమ్స్‌లను కూడా ఈ పురస్కారం వరించనుంది. 60 మంది జాబితాలో నుంచి ఈ ముగ్గురిని షార్ట్‌లిస్ట్ చేసిన కమిటీ క్రీడాశాఖకు పేర్లను పంపింది. తమ క్రీడా విభాగాల్లో అత్యున్నత సేవలందించినందుకు జీవిత సాఫల్య పురస్కారం కింద ధ్యాన్‌చంద్ పేరిట ఈ అవార్డును అందిస్తారు. -
సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎస్పీ మిశ్రా
ఏఐటీఏ ప్రకటన న్యూఢిల్లీ: భారత సీనియర్ టెన్నిస్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ ఆటగాడు, హైదరాబాద్‌కు చెందిన ఎస్పీ మిశ్రా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న అనిల్ ధుపార్ స్థానంలో మిశ్రాను నియమించినట్లు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ప్రకటించింది. సెలక్షన్ కమిటీలో డేవిస్ కప్ లేదా ఫెడరేషన్ కప్ ఆడిన ఆటగాళ్లే ఉండాలనే తమ నిబంధన మేరకు మిశ్రాకు చోటు కల్పించినట్లు ఏఐటీఏ కార్యదర్శి భరత్ ఓజా వెల్లడించారు. దీంతో పాటు రెండేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా మిశ్రాకు స్థానం లభించింది. డేవిస్ కప్ కెప్టెన్‌గా ఆనంద్ అమృత్‌రాజ్, కోచ్‌గా జీషాన్ అలీ కొనసాగనున్నారు. మరోవైపు 2015లో జరిగే ఫెడరేషన్ కప్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని ఈసీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.