సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎస్పీ మిశ్రా | SP Mishra appointed as chairman of Indian senior tennis team selection committee | Sakshi
Sakshi News home page

సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎస్పీ మిశ్రా

Published Tue, Nov 11 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎస్పీ మిశ్రా

సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎస్పీ మిశ్రా

ఏఐటీఏ ప్రకటన

 న్యూఢిల్లీ: భారత సీనియర్ టెన్నిస్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ ఆటగాడు, హైదరాబాద్‌కు చెందిన ఎస్పీ మిశ్రా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న అనిల్ ధుపార్ స్థానంలో మిశ్రాను నియమించినట్లు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ప్రకటించింది. సెలక్షన్  కమిటీలో డేవిస్ కప్ లేదా ఫెడరేషన్ కప్ ఆడిన ఆటగాళ్లే ఉండాలనే తమ నిబంధన మేరకు మిశ్రాకు చోటు కల్పించినట్లు ఏఐటీఏ కార్యదర్శి భరత్ ఓజా వెల్లడించారు.

దీంతో పాటు రెండేళ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా మిశ్రాకు స్థానం లభించింది. డేవిస్ కప్ కెప్టెన్‌గా ఆనంద్ అమృత్‌రాజ్, కోచ్‌గా జీషాన్ అలీ కొనసాగనున్నారు. మరోవైపు  2015లో జరిగే ఫెడరేషన్ కప్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని ఈసీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement