
అస్తానా (కజకిస్తాన్): ఫెడ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్ ‘ఎ’లో భారత మహిళల టెన్నిస్ జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 3–4 స్థానాల కోసం దక్షిణ కొరియాతో శనివారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 1–2తో ఓడిపోయింది. గాయం కారణంగా కర్మన్ కౌర్ ఈ పోటీలో ఆడలేదు. ఆమె స్థానంలో జాతీయ చాంపియన్ మహెక్ జైన్‌ను బరిలోకి దించారు.
తొలి సింగిల్స్‌లో మహెక్ 2–6, 6–3, 1–6తో నా రి కిమ్ చేతిలో ఓటమి పాలైంది. రెండో సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 6–3, 6–3తో సునమ్ జియోంగ్‌ను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో అంకిత రైనా–ప్రార్థన తొంబారే ద్వయం 4–6, 4–6తో సు జియోంగ్ జాంగ్–నా రి కిమ్ జంట చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment