అంబేద్కర్, జగ్జీవన్‌రాం జయంత్యుత్సవాల కమిటీ చైర్మన్‌గా కొప్పుల
కరీంనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్, భారత మాజీ ఉప ప్రధాని బాబుజగ్జీవన్‌రాం జయంత్యుత్సవాల కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ఎన్నికయ్యూరు. వైస్ చైర్మన్లుగా మానకొండూర్ ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమరుు బాలకిషన్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ ఎన్నియ్యూరు. సోమవారం కరీంనగర్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో జరిగిన దళిత సంఘాల ఐక్య వేదిక సమావేశంలో వీరిని ఎన్నుకున్నట్టు నాయకులు తెలిపారు.
చైర్మన్ బొత్త వెంకటమల్లయ్య, కన్వీనర్ గోపాల భూషణ్‌రావు, నాయకులు నల్లాల కనుకరాజు, మేడి మహేశ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 5న జగ్జీవన్‌రాం 107వ జయంత్యుత్సవాలను కరీంనగర్ మంచిర్యాల చౌరస్తాలోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ 124వ జయంతి వేడుకలు కోర్టు చౌరస్తాలోని ఆయన విగ్రహం వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు జయంత్యుత్సవాల నిర్వహణ కమిటీలను ఎన్నుకున్నట్టు చెప్పారు. దళితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయూలని కోరారు.
కమిటీల మిగిలిన కార్యవర్గం
అంబేద్కర్ జయంత్యుత్సవ కమిటీ కన్వీనర్లుగా నల్లాల కనుకరాజు, మామిడిపల్లి బాపయ్య, గంటల రేణుక, ప్రధాన కార్యదర్శులుగా గజ్జెల ఆనందరావు, మాదరి శ్రీనివాస్, గోష్కి శంకర్, ఉపాధ్యక్షులుగా కుక్క చంద్రమౌళి, మేడి అంజయ్య, శ్రీరాం రాజమ్మ, బత్తుల లక్ష్మీనారాయణ, దాసరి దశరథం, కార్యదర్శులుగా జక్కనపల్లి గణేష్, సుంకరి సంపత్, ఎం.మనోహర్, గువ్వల సత్యం, అంబటి నర్సింహారావు, కల్లెపల్లి శంకర్, నక్క రాజయ్య, భిక్షపతి, న్యాతరి జయరాజ్, బెజ్జంకి రాజయ్య మెంబర్లుగా ఉన్నట్లు వెల్లడించారు.
జగ్జీవన్‌రాం జయంత్యుత్సవ కమిటీ కన్వీనర్లులుగా బొత్త వెంకటమల్లయ్య, సొల్లు అజయ్‌వర్మ, గడ్డం కొమురమ్మ, ప్రధాన కార్యదర్శులుగా గోపాల భూషన్‌రావు, సముద్రాల అజయ్, మేకల రజని, ఉపాధ్యక్షులుగా బొగ్గుల మల్లేశం, మారువాడి సుదర్శన్, తీట్ల ఈశ్వరి, బోయినపల్లి చంద్రయ్య, కోశాధికారిగా మదునాల రవీందర్, కండె సమ్మయ్య, కార్యదర్శులుగా నల్లాల ప్రేమ్‌కుమార్, పెద్దెల్లి శేఖర్, విజయలక్ష్మి, శ్రీనివాస్, సంపత్, గోష్కి అజయ్, ఉప్పులేటి లక్ష్మణ్, ఉద్యోగుల సంఘం విభాగం నుంచి బత్తుల భూమయ్య, కవ్వంపెల్లి రాములు, జక్కుల రవికుమార్‌లను ఎన్నుకున్నట్లు దళిత సంఘాల నేతలు ప్రకటించారు. జయంత్యుత్సవాలపై ఈనెల 25న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ తెలిపారు.