టెన్నిస్‌ జట్టులో నలుగురు తెలంగాణ అమ్మాయిలు  | Four Telangana Women Players In India Tennis Team | Sakshi
Sakshi News home page

భారత టెన్నిస్‌ జట్టులో నలుగురు తెలంగాణ అమ్మాయిలు 

Published Tue, Nov 26 2019 3:22 AM | Last Updated on Tue, Nov 26 2019 8:37 AM

Four Telangana Women Players In India Tennis Team - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే భారత టెన్నిస్‌ జట్లను ప్రకటించారు. మహిళల జట్టులో ఏకంగా నలుగురు తెలంగాణ క్రీడాకారిణులకు చోటు లభించడం విశేషం. తెలంగాణకు చెందిన జాతీయ చాంపియన్‌ సౌజన్య భవిశెట్టితోపాటు కాల్వ భువన, సామ సాత్విక, చిలకలపూడి శ్రావ్య శివానిలకు జాతీయ జట్టులో స్థానం లభించింది. ఈ నలుగురితోపాటు ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ), ప్రార్థన తొంబారే (మహారాష్ట్ర) కూడా భారత జట్టులోకి ఎంపికయ్యారు. పురుషుల జట్టులో సాకేత్‌ మైనేని, నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్‌), విష్ణువర్ధన్‌ (తెలంగాణ), మనీశ్‌ సురేశ్‌ కుమార్, శ్రీరామ్‌ బాలాజీ, జీవన్‌ నెడుంజెళియన్‌ (తమిళనాడు) భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. జాతీయ మాజీ చాంపియన్‌ అశుతోష్‌ సింగ్‌ భారత పురుషుల, మహిళల జట్లకు కోచ్‌ కమ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. దక్షిణాసియా క్రీడలు డిసెంబర్‌ 1 నుంచి 12 వరకు నేపాల్‌లో జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement