
సాక్షి, హైదరాబాద్: దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల టెన్నిస్ జట్టులో హైదరాబాద్ క్రీడాకారిణి సౌజన్య భవిశెట్టికి స్థానం లభించింది. దక్షిణాసియా క్రీడలు డిసెంబర్ 1 నుంచి 10 వరకు నేపాల్‌లో జరుగుతాయి. ఇటీవల జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచి జాతీయ చాంపియన్‌గా అవతరించిన సౌజన్య కొంపల్లిలోని సురేష్ కృష్ణ టెన్నిస్ అకాడమీ (ఎస్‌కేటీఏ)లో శిక్షణ పొందుతోంది. 26 ఏళ్ల సౌజన్య ఇప్పటివరకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్‌లో మూడు సింగిల్స్ టైటిల్స్... ఎనిమిది డబుల్స్ టైటిల్స్ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment