మనగడ్డ బిడ్డకు ప్రతిష్టాత్మక పురస్కారం
మనగడ్డ బిడ్డకు ప్రతిష్టాత్మక పురస్కారం
Published Tue, Aug 23 2016 12:05 AM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM
పెనుమంట్ర : మన జిల్లా ముద్దుబిడ్డ.. పరుగుల రాణి సత్తి గీత ధ్యాన్‌చంద్ పురస్కారానికి ఎంపికైంది. దేశంలోని ప్రఖ్యాత క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం సోమవారం పురస్కారాలు ప్రకటించింది. వాటిలో ప్రతిష్టాత్మకమైన ధ్యాన్‌చంద్ పురస్కారం గీతను వరించింది.
ప్రస్థానం ఇదీ1983లో జూలై 5వ తేదీన మార్టేరులో జన్మించిన సత్తి గీత పరుగులో అనిర్వచనీయమైన విజయాలను సొంతం చేసుకుంది. 1996 నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న గీత ఇప్పటివరకు 180 బంగారు, 63 రజత, 40 ఇతర పతకాలు సాధించింది. ఏషియన్ ఛాంపియన్ షిప్ (2005)లో రజతం సంపాదించింది. ఆ తరువాత ఒలింపిక్స్ స్థాయి అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
మార్టేరులో సంబరాలు : పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామం క్రీడాకారులకు పుట్టిల్లు. ఇదే గ్రామానికి చెందిన గీత గతంలో అనేక అవార్డులు, రివార్డులు సాధించి జిల్లా పేరు ప్రతిష్టతలను ఇనుమడింపచేసింది. ఆమె ధ్యాన్‌చంద్ పురస్కారానికి ఎంపికైందని తెలిసి మార్టేరులో సోమవారం సంబరాలు జరుపుకున్నారు. తోటి క్రీడాకారులు, ఆమె అభిమానులు స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తపరిచారు. గీత తల్లిదండ్రులు సత్తిరెడ్డి, కమల మాట్లాడుతూ తమ కుమార్తెకు ధ్యాన్‌చంద్ పురస్కారం లభించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
Advertisement