
భారత జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం నేడు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగనుంది. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ (డీడీ) నేషనల్ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ను ఈసారి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, మేటి వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను అందుకోనున్నారు. ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే ‘అర్జున అవార్డు’ కోసం 20 మందిని ఎంపిక చేశారు. ఈ జాబితాలో తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నేలకుర్తి సిక్కి రెడ్డి కూడా ఉంది.