దీపకు రూ. 4 కోట్ల నజరానా | Deepa to Rs. Offering 4 million | Sakshi
Sakshi News home page

దీపకు రూ. 4 కోట్ల నజరానా

Published Tue, Nov 1 2016 11:52 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

దీపకు రూ. 4 కోట్ల నజరానా - Sakshi

దీపకు రూ. 4 కోట్ల నజరానా

గుర్గావ్ (హరియాణా): రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం అందించిన హరియాణా షాట్‌పుట్ క్రీడాకారిణి దీపా మలిక్‌కు రూ. 4 కోట్ల నజరానా అందజేశారు. హరియణా రాష్ట్ర స్వర్ణోత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో దీపా మలిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ భారీ మొత్తాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి, ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, క్రీడల మంత్రి అనిల్ విజ్ పాల్గొన్నారు. రియో పారాలింపిక్స్‌లో దీపా మలిక్ షాట్‌పుట్‌లో ఇనుప గుండును 4.61 మీటర్ల దూరం విసిరి రజతం సాధించింది. తద్వారా ఈ మెగా ఈమెంట్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement