నా కల నెరవేర్చుకున్నా.. | I dared to dream and worked hard, says Deepa Malik | Sakshi
Sakshi News home page

నా కల నెరవేర్చుకున్నా..

Published Wed, Sep 14 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

నా కల నెరవేర్చుకున్నా..

నా కల నెరవేర్చుకున్నా..

పారాలింపిక్ పతక విజేత దీపా మలిక్
రియో డి జనీరో: ధైర్యంగా తాను కన్న కలల ఫలితమే తాజా పారాలింపిక్ పతకమని షాట్‌పుటర్ దీపా మలిక్ తెలిపింది. ఎఫ్53 షాట్ పుట్ విభాగంలో తను రజతం సాధించిన విషయం తెలిసిందే. ‘నేను ధైర్యంగా కల కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకునేందుకు అమితంగా శ్రమించాను. ఆత్మవిశ్వాసం, పట్టుదల కోల్పోనందువల్లే ఇది సాధ్యమైంది. మహిళలు సాధారణంగా ఈ విషయంలో వెనకడుగు వేస్తారు.

ఇదే క్రమంలో నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఈ పతకం గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విజయం నాలాంటి వారికి ఎంతగానో ప్రేరణగా నిలిచి వారికున్న అడ్డుగోడలను ఛేదించేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సాయ్‌తో పాటు నా శిక్షకులకు, నాకెంతగానో బలాన్నిచ్చిన భర్త, పిల్లలకు కృతజ్ఞతలు’ అని 45 ఏళ్ల దీప తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement