అంగవైకల్యం ఉన్న వారు కూడా ఏటీఎంలను వినియోగించుకోవడాన్ని సులభతరం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వికలాంగుల కోసం ఏటీఎంలలో ర్యాంప్‌లు ఏర్పాటు చేయాలని బ్యాంకులకు సూచించింది. సాధ్యమైన చోట్ల బ్యాంకు శాఖల్లో కూడా ఇవి ఉండాలి.
ఒకవేళ ఏదైనా కారణం చేత ఏటీఎంలలో ర్యాంప్ ఏర్పాటు చేయలేకపోతే ర్యాంప్ అందుబాటులో లేని విషయాన్ని తెలియజేసేలా సైన్‌పోస్టు ఉంచాలి. అలాగే, కొత్తగా ఏర్పాటు చేసే వాటిలో కనీసం మూడో వంతు ఏటీఎంలలో బ్రెయిలీ కీప్యాడ్స్‌ని అందుబాటులో ఉంచాలి. వీటితో పాటు కొత్త ఏటీఎంలన్నింటిలో ఆడియో సదుపాయం కూడా ఉండాలి.
ఏటీఎంలలో బ్రెయిలీ కీప్యాడ్స్..
Published Sat, Jun 21 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM
Advertisement