సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘనకార్యం
జీడిమెట్ల: ప్రేమించాడు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు.. ఏడాది పాటు కాపురం చేశాకా నీవు వికలాంగురాలివి వద్దు పొమ్మన్నాడు.. జీడిమెట్ల సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నమ్మడు, ఆంజనేయులు కుటుంబం తో సహా 2008లో నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్‌లోని వినాయకనగర్‌లో ఉంటున్నారు. వీరి కుమార్తె లక్ష్మి (27) షాపూర్‌నగర్‌లోని ఆర్‌కే ఫోర్స్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో ఈమెకు తూర్పు గోదావరి జిల్లా వెదురుకుదురుకు చెందిన కృష్ణవేణి, బాబూరావుల కుమారుడు బాలాజీతో ఫోన్‌లో పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో నగరానికి వచ్చిన బాలాజీ ఒక కాలు పోలియో ఉన్న లక్ష్మి ని చూసి ప్రేమను కొనసాగించాడు.
అమీర్‌పేటలో ఉంటూ సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకుంటున్న బాలాజీకి లక్ష్మి రూ. 50 వేలు ఇచ్చింది. జూన్ 13, 2012 లో షాపూర్‌నగర్‌లోని ఓ ఆలయంలో బాలాజీ.. లక్ష్మిలు వివాహం చేసుకున్నారు. అనంతరం బాలాజీకి హబ్సిగూడలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రావడంతో ఆరు నెలల పాటు అదే ప్రాంతంలో కాపురం పెట్టారు. తర్వాత బాలాజీకి హైటెక్ సిటీకి బదిలీ కావడంతో లక్ష్మిని కూకట్‌పల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంచా డు. ఎందుకు హాస్టల్‌లో పెట్టావని లక్ష్మి నిలదీయగా తప్పించుకు తిరుగుతూ వచ్చాడు.
ఇరు కుటుంబాల పెద్దలు ఆర్య సమాజ్‌లో 2014లో బాలాజీ, లక్ష్మిలకు తిరిగి పెళ్లి చేశారు. ఆ సమయంలో లక్ష్మి తల్లిదండ్రులు బాలాజీకి రూ. లక్ష కట్నంగా ఇచ్చారు. ఆ తర్వా త బాలాజీ భార్యను కుత్బుల్లాపూర్‌లో ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఉంచి వెళ్లిపోయాడు. తిరిగి రాకపోవగా ఫోన్ స్విచ్చాఫ్ పెట్టాడు. దీంతో లక్ష్మి పది రోజుల క్రితం జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం బాలాజీపై 498 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
వైకల్యం ఉందని వదిలేశాడు...
Published Wed, Nov 5 2014 3:16 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement