కొత్తగూడెం టౌన్: చదువుకు అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించిన ఓమహిళ తన లక్ష్యం నెరవేర్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన దివ్యాంగురాలు మౌనిక ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి న్యాయవాదిగా మంగళవారం తన ప్రాక్టీస్ ప్రారంభించారు. వీల్‌చైర్‌లో జిల్లా కోర్టుకు వచ్చిన ఆమెకు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు ఘనస్వాగతం పలికారు. సవాళ్లను అధిగమించి విజయం సాధించిన మౌనిక అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment