rights activists
-
USA: ‘అతివాదం’తో తలనొప్పులు.. హక్కుల కార్యకర్త అరెస్టు
కాలిఫోర్నియా: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో చిధ్రమవుతున్న గాజా పరిస్థితి మానవతావాదుల హృదయాలను ద్రవింపజేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హక్కుల కార్యకర్తలు పాలస్తీనాకు మద్దతుగా తమ గళం విప్పుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా బేకర్స్ఫీల్డ్ నగర కౌన్సిల్లో హక్కుల కార్యకర్త రిద్ది పటేల్ పాలస్తీనాకు మద్దతుగా గొంతు వినపించారు. అయితే గీత దాటి అతివాదం వైపు వెళ్లి కష్టాలు కొనితెచ్చుకున్నారు. గాజాలో కాల్పుల విరమణ తీర్మానంపై హియరింగ్ సందర్భంగా ఓపిక నశించిన రిద్ది ఏకంగా మేయర్, కౌన్సిల్ సభ్యులనే బెదిరించారు. ‘ఏదో ఒక రోజు మీ ఇంట్లోనే మిమ్మల్ని చంపే పరిస్థితి వస్తుంది’ అని వారిని హెచ్చరించారు. గాజాలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ తీర్మానానికి ఎవరూ మద్దతు పలకకపోవడం..తీర్మానంపై సుదీర్ఘంగా చర్చ కొనసాగుతుండడంతో నిరాశ నిస్పృహలకు లోనైన రిద్ది పటేల్ తనలోని అతివాది బయటికి తీశారు. కౌన్సిల్ సభ్యులను బెదిరించినందుకుగాను రిద్దిపై 16 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పటేల్ తీరును హిందూ అమెరికన్ ఫౌండేషన్లు ఖండించాయి. బెదిరింపుల సందర్భంగా మహాత్మాగాంధీ పేరతో పాటు చైత్ర నవరాత్రిలను రిద్ది ప్రస్తావించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎంతటి తీవ్రత కలిగిన అంశంపై పోరాడాల్సిన సందర్భంలోనైనా హక్కుల కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాల్సిందేనని రిద్ది పటేల్ ఎదుర్కొంటున్న పరిణామాలే తెలియజేస్తున్నాయని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి.. సౌదీ జైలులో భారతీయుడు -
Alexey Navalny: నిరసన గళం మూగబోయింది
మాస్కో: రష్యాలో మరో అసమ్మతి గళం శాశ్వతంగా మూగబోయింది. మూడేళ్లుగా నిర్బంధంలో ఉన్న విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు 47 ఏళ్ల అలెక్సీ నవాల్నీ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ‘‘ఆయన శుక్రవారం ఉదయం వాకింగ్ అనంతరం అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయతి్నంచినా, తక్షణం అంబులెన్సు రప్పించినా లాభం లేకపోయింది’’ అని జైలు వర్గాలు తెలిపాయి. అయితే మరణానికి కారణమేమిటో బయట పెట్టలేదు. దశాబ్దానికి పైగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంట్లో నలుసుగా మారి ఆయనకు ప్రబల ప్రత్యర్థిగా ఎదిగిన నవాల్నీ మృతిపై తీవ్ర అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది కచి్చతంగా ప్రభుత్వ హత్యేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018లో రష్యా అధ్యక్ష పదవి కోసం పుతిన్‌తో పోటీ పడేందుకు విఫలయత్నం చేసిన నవాల్నీ, నాటినుంచీ ప్రభుత్వ అవినీతిపై పోరును తీవ్రతరం చేశారు. పలు స్థాయిల్లో పెచ్చరిల్లిన అవినీతిని బయటపెడుతూ సంచలనం సృష్టిస్తూ వచ్చారు. దాంతో ప్రభుత్వం ఆయన్ను నిర్బంధించడమే గాక దేశద్రోహం తదితర అభియోగాలు మోపింది. 19 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న నవాల్నీని మాస్కో సమీపంలోని జైలు నుంచి గత డిసెంబర్లో దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలోని స్పెషల్ రెజీమ్ పీనల్ కాలనీకి తరలించారు. అతి శీతల ఆర్కిటిక్ ప్రాంతంలోని ఈ కాలనీ రష్యాలోకెల్లా అత్యంత కఠినమైన పరిస్థితులుండే కారాగారం. వచ్చే నెలలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలున్న నేపథ్యంలో ఇది కచి్చతంగా ఆయన గొంతు నొక్కే ప్రయత్నమేనని అభిమానులు అప్పుడే ఆందోళనలకు దిగారు. ఈ ఎన్నికల్లో పుతిన్‌ను సవాలు చేసే గట్టి ప్రత్యర్థి లేకపోయినా ‘నవాల్నీ ఫ్యాక్టర్’ ఆయన్ను బాగా చీకాకు పరుస్తోంది. నవాల్నీ అనుయాయులతో పాటు నానాటికీ పెరిగిపోతున్న అభిమాన గణం సోషల్ మీడియా ద్వారా పుతిన్ వ్యతిరేక ప్రచారంతో దేశమంతటా హోరెత్తిస్తోంది. దేశ విదేశాల్లోని పుతిన్ అపార ఆస్తుల చిట్టాను కొద్ది రోజులుగా ఒక్కొక్కటిగా విప్పుతూ ఫొటోలు, వీడియోలతో సహా బయట పెడుతూ వస్తోంది. వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షలాది లైక్‌లు వచ్చి పడుతున్నాయి! ఈ నేపథ్యంలో నవాల్నీ ‘మృతి’ పుతిన్ పనేనని భావిస్తున్నారు. దీనిపై పాశ్చాత్య దేశాలన్నీ స్పందించాయి. పుతిన్ అణచివేతను నవాల్నీ ఆజన్మాంతం అత్యంత ధైర్యసాహసాలతో ఎదిరించారంటూ పలు దేశాధినేతలు కొనియాడారు. విషప్రయోగం జరిగినా... మూడున్నరేళ్ల క్రితం ప్రాణాంతక విషప్రయోగం జరిగినా వెరవని గుండె ధైర్యం నవాల్నీది! ఆయన 2020 ఆగస్టులో సైబీరియా పర్యటన ముగించుకుని తిరిగొస్తుండగా ‘నొవిచోక్’ దాడికి గురయ్యారు. రష్యాకే ప్రత్యేకమైన ఆ ప్రాణాంతక రసాయనాన్ని నవాల్నీ లో దుస్తులపై చల్లినట్టు తర్వాత తేలింది. నాడీ మండలాన్ని నేరుగా దెబ్బ తీసే నొవిచోక్ ప్రభావానికి విమానంలోనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అనుయాయులు హుటాహుటిన జర్మనీకి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. నెలల తరబడి చికిత్స తర్వాత కోలుకున్నాక పుతిన్‌పై ‘అండర్‌ప్యాంట్స్ (లో దుస్తుల) పాయిజనర్’ అంటూ చెణుకులు విసిరారు. దాంతో అండర్‌ప్యాంట్స్ పదబంధం ఒక్కసారిగా రష్యా సోషల్ మీడియాలో పాపులరైంది. దానిపై లెక్కలేనన్ని మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. నిర్బంధం ఖాయమని తెలిసి కూడా ఆరోగ్యం చక్కబడుతూనే 2021 జనవరిలో నవాల్నీ రష్యా తిరిగొచ్చారు. మాస్కోలో విమానం దిగీ దిగగానే ఆయన్ను నిర్బంధంలోకి తీసుకుని జైలుకు తరలించారు. చివరికి జైల్లోనే ప్రాణాలు కోల్పోయారు. నవ్వుతూనే కన్పించారు... నవాల్నీ చివరిసారిగా గురువారం బయటి ప్రపంచానికి కన్పించారు. ఓ కేసు విచారణలో వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండటమే గాక సరదాగా నవ్వుతూ, విచారణ సందర్భంగా జడ్జితోనూ జోకులు వేస్తూ గడిపారు. సాహసమే శ్వాస... మాస్కో శివారు ప్రాంతమైన బుటిన్లో జని్మంచిన నవాల్నీ మాస్కోలో లా డిగ్రీ అనంతరం విదేశాల్లో పై చదువులు పూర్తి చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడం ద్వారా పుతిన్ వ్యతిరేకునిగా తెరపైకి వచ్చారు. రష్యా చమురు, గ్యాస్ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసి వాటిలోని విచ్చలవిడి అవినీతిని బయట పెట్టారు. 2008 నుంచీ ఆయన పేరు క్రమంగా రష్యా అంతటా పాకింది. దాంతో 2012లో నవాల్నీ అరెస్టుల పర్వం మొదలైంది. 2014లో ఆశ్చర్యకరంగా జైలు నుంచి విడుదల చేయడంతో మాస్కో మేయర్ ఎన్నికల బరిలో దిగారు. ప్రచార మార్గాలన్నింటినీ మూసేసినా పుతిన్ బలపరిచిన అభ్యరి్థకి గట్టి పోటీ ఇవ్వడంతో నవాల్నీ పేరు మారుమోగిపోయింది. దాంతో ప్రభుత్వం మళ్లీ అరెస్టుల పర్వానికి తెర తీసింది. చివరికి 2018 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా ప్రకటించడంతో ప్రజల దృష్టిలో నవాల్నీ మళ్లీ హీరోగా మారారు. రష్యాలో రెండు దశాబ్దాలుగా విపక్ష నేతలు, పుతిన్ విమర్శకులు, వ్యతిరేకులు నిర్బంధం పాలవడం, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పరిపాటిగా మారింది. విపక్ష నేత బోరిస్ నెమ్త్సోవ్ను 2015లో పుతిన్ అధికార నివాసం క్రెమ్లిన్ ప్రాసాదానికి కూతవేటు దూరంలోనే కాల్చి చంపారు. పుతిన్‌ను విమర్శించిన వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ 2023 ఆగస్టులో ‘విమాన ప్రమాదం’లో మరణించాడు. ప్రభుత్వంపై విమర్శలు చేసి అకాల మరణం పాలైన రష్యా కుబేరుల జాబితా చాలా పెద్దది. నవాల్నీ మాత్రం పుతిన్‌ను గట్టిగా సవాలు చేస్తూ ప్రబల ప్రత్యర్థిగా ఎదుగుతూ వచ్చారు. సోషల్ మీడియాను, స్వతంత్ర మీడియాను సమర్థంగా వాడుకుంటూ చెమటలు పట్టించారు. భౌతిక దాడులు, హత్యాయత్నాలను ఏమాత్రం లెక్కచేయని తీరు ఆయనకు అసంఖ్యాకంగా అభిమానులను సంపాదించి పెట్టింది. నిరసనలు... ఆగ్రహావేశాలు నవాల్నీ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పుతిన్ పనేనంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మండిపడ్డారు. నవాల్నీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎవరినైనా అంతమొందించడం పుతిన్ నైజమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ దుయ్యబట్టారు. ఆయన సర్వం కోల్పోవడంతో పాటు తన తప్పిదాలకు బాధ్యునిగా శిక్ష అనుభవించి తీరాల్సిందేనన్నారు. నవాల్నీ తన అసమాన ధైర్యసాహసాలకు జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి రావడం బాధాకరమని జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కొల్జ్ ఆవేదన వెలిబుచ్చారు. అడుగడుగునా ప్రాణాపాయం పొంచి ఉన్నా మొక్కవోని ధైర్యసాహసాలు ప్రదర్శించడం నవాల్నీకే చెల్లిందంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కొనియాడారు. ఆయన్ను రష్యా ప్రభుత్వమే క్రూరంగా పొట్టన పెట్టుకుందని లాతి్వయా అధ్యక్షుడు రింకేవిక్స్ ఆరోపించారు. తాను అత్యంత బలహీనుడినని ఈ చర్యతో పుతిన్ రుజువు చేసుకున్నారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. రష్యాలో స్వేచ్చా గళాలపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మండిపడ్డారు. సొంత ప్రజల అసమ్మతి పుతిన్‌ను విపరీతంగా వణికిస్తోందని మరోసారి రుజువైందని ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్ అన్నారు. పుతిన్ ఆదేశాల మేరకే నవాల్నీ హత్య జరిగిందని ప్రపంచ మాజీ చెస్ చాంపియన్, రష్యా విపక్ష నేత గారీ కాస్పరోవ్ తదితరులు దుమ్మెత్తిపోశారు. పుతినే బాధ్యుడు: భార్య నవాల్నీ మరణ వార్తలపై ఆయన భార్య యూలియా నవాల్నయా అనుమానాలు వెలిబుచ్చారు. శుక్రవారం మ్యూనిచ్ భద్రతా సదస్సులో మాట్లాడుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నా భర్త మృతి నిజమే అయితే అందుకు పుతిన్, ఆయన అనుచర గణమే బాధ్యులు. ఎప్పటికైనా వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు’’ అన్నారు. సదస్సులో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తదితర నేతలు ఆమెను ఓదార్చారు. -
ఇలా అయితే ఎలా..?
దివ్యాంగుల హక్కుల కార్యకర్త, మోడల్ విరాళీ మోదీ ఇటీవల ముంబైలో పెళ్లి చేసుకుంది. వీల్‌చైర్ యూజర్ అయిన తనకు రిజిస్ట్రార్ ఆఫీసులో ఎదురైన ఇబ్బందుల గురించి ఆమె ట్విట్టర్లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘రిజిస్ట్రార్ ఆఫీసు రెండో ఫ్లోర్లో ఉంది. లిఫ్ట్ సౌకర్యం లేదు. మెట్లు ఎక్కడం తప్ప మరో దారి లేదు. మరి వీల్‌చైర్ యూజర్ అయిన నా పరిస్థితి ఏమిటి? నా పరిస్థితి గురించి ఏజెంట్‌తో చెప్పి పంపాను. అధికారులు కిందికి రాలేదు. అలా అని నాకు ప్రత్యేక సౌకర్యాలేవీ కల్పించలేదు. ఇక మెట్ల మార్గం ఎలా ఉందంటే... మెట్లు పగుళ్లు బారి ఉన్నాయి. రెయిలింగ్ వదులుగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దివ్యాంగులకు పెళ్లి చేసుకునే హక్కులేదా?’ అని తన మనసులోని ఆవేదనను నెటిజనులతో పంచుకుంది విరాళీ. ‘పబ్లిక్ స్పేస్, ప్రభుత్వ కార్యాలయాలలో దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలనే మాట నా చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను. కాని అది ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. దివ్యాంగుల కార్యకర్త పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి?’ అని ఒక యూజర్ స్పందించాడు. -
Teesta Setalvad: తీస్తా బెయిల్ పొడిగింపు
న్యూఢిల్లీ: 2002 గోధ్రా అనంతర అల్లర్ల కేసులో హక్కుల కార్యకర్త తీస్తా సీతల్వాద్ బెయిల్‌ను జూలై 19 దాకా సుప్రీంకోర్టు పొడిగించింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, ఎ.ఎస్.»ొపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం బుధవారం ఈ మేరకు నిర్ణం వెలువరించింది. పిటిషనర్ మహిళ గనుక గుజరాత్ హైకోర్టే బెయిల్ రూపంలో ఆమెకు ఎంతో కొంత రక్షణ కల్పించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను జూలై 19కి వాయిదా వేసింది. సీతల్వాద్‌కు జూలై 1న సుప్రీంకోర్టు వారం పాటు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. -
మూడేళ్ల తర్వాత సౌదీ యువరాణి విడుదల
దుబాయ్: అనుమానాస్పద పరిస్థితుల్లో మూడేళ్ల క్రితం జైలు పాలైన యువరాణిని సౌదీ అధికారులు విడుదల చేసినట్లు ఆమె అనునూయులు తెలిపారు. సౌదీ రెండో రాజు కూతురు బస్మా బిన్ సౌద్ 2019 మార్చిలో అదృశ్యమయ్యారు. అనంతరం ఆమె ఎలాంటి నేరారోపణలు లేకుండా కఠోరమైన సౌదీ జైల్లో కనిపించారు. ఆమెతో పాటు ఆమె కూతురుని కూడా అప్పట్లో నిర్భంధించారు. ఇందుకు సరైన కారణాలు తెలియరాలేదు. అయితే సింహాసనంపై పట్టు సాధించే క్రమంలో యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కఠినంగా వ్యవహరిస్తూవస్తున్న సందర్భంలో పలువురు రాజకుటుంబీకులు ఇబ్బందుల పాలయ్యారు. ఈ క్రమంలోనే బస్మా కూడా బందీగా మారి ఉండొచ్చని కొందరి అంచనా. ఆమె అక్రమంగా రాజ్యం విడిచి పారిపోవడానికి యత్నించినట్లు 2020లో సౌదీ మిషన్ టు యూఎన్ తెలిపింది. అయితే తాజాగా 58 ఏళ్ల బస్మాతో పాటు ఆమె 30ఏళ్ల కుమార్తె సుహౌద్ అల్ షరీఫ్‌ను రియాద్‌లోని అల్హైర్ జైలు నుంచి గతవారం విడుదల చేశారని, ఆమె జిద్దాలోని స్వగృహానికి చేరారాని బస్మా న్యాయ ప్రతినిధి హెన్రి ఎస్ట్రామెంట్ తెలిపారు. చదవండి: నాడు కలిచివేసిన ఫొటో.. నేడు ‘కన్నీటి’ సుఖాంతం బస్మా ఆస్టియోపోరోసిస్ సహా పలు అనారోగ్యాలతో బాధపడుతున్నారని, ఇకపై తగు చికిత్సలకు హాజరవుతారని వెల్లడించారు. చికిత్స కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్లే యత్నాల్లో ఉన్న బస్మాను సెక్యూరిటీ ఏజెంట్లు అన్యాయంగా నిర్భంధించారన్నారు. జైల్లో ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదన్నారు. ఆమె విడుదల కోసం ఐరాసకు దరఖాస్తు చేశామన్నారు. నెలలపాటు ఆమె ఆచూకీ తెలియరాలేదని, చివరకు ఆమె విడుదల కావడం సంతోషమని చెప్పారు. చదవండి: చంద్రుడిపై నీటి జాడలు.. ఇదే తొలిసారి! -
మట్టి రుణం ఇలాగ తీరింది
రైతుకు తెలిసిందేమిటి? దుక్కి దున్నడం... విత్తు నాటడం. కలుపు తీయడం... పంటను రాశిపోయడం. ఒళ్లు వంచి శ్రమించడం... మట్టిలో బంగారం పుట్టించడం. మరి... అలాంటి రైతుకు చట్టాల కష్టాలేమిటి? తన పొలంలో ఏం నాటాలో ఏం నాటకూడదో ఒకరు చెప్పేదేమిటి? రైతు మీద ఈ ఆంక్షలేమిటి? తనకు తెలియకుండానే తన మీద కేసు పెడితే ఏం చేయాలి? విదేశీ శక్తుల చేతిలో మనరైతు బలవుతుంటే చూస్తూ ఊరుకోవడమేనా? తనకంటూ హక్కులున్నాయని రైతుకు చెప్పేదెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క పోరాటంతో సమాధానం వచ్చింది. ఆ సమాధానమే జాతీయ రైతు హక్కుల కార్యకర్త కవిత కురుగంటి. సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో సింఘు బోర్డర్లో జరిగిన రైతుల ఆందోళనను దేశం యావత్తూ గుర్తించింది. రైతులకు జరుగుతున్న నష్టాన్ని తెలుసుకుంది. మౌనంగానే అయినా మనస్ఫూర్తిగా సంఘీభావం ప్రకటించింది. కార్పొరేట్ శక్తుల కోరల్లో రైతులు చిక్కుకోకూడదని చిత్తశుద్ధితో కోరుతుంది. అయితే అంతకంటే ముందు ఓ దశాబ్ద కాలంపాటు అమాయకమైన రైతులు కొందరు విదేశీ కార్పొరేట్ శక్తితో ఎదురొడ్డి పోరాడలేక, పోరాటం ఆపలేక సతమతమయ్యారు. వారు ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితిని న్యాయస్థానానికి తెలియచేయడం కోసం స్వయంగా సదరు విదేశీ కంపెనీ మీద కేసు వేశారు రైతు హక్కుల కార్యకర్త కవిత కురుగంటి. విదేశీ కంపెనీ మనదేశ రైతులను కబళించడానికి పన్నిన కుట్రను న్యాయస్థానానికి విశదపరిచారామె. రైతుల పక్షాన ఉన్న న్యాయం ఏమిటో తెలియచేశారు. ఫలితంగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రైతులకు రక్షణగా నిలిచింది. లేస్ చిప్స్ తయారు చేయడానికి అవసరమైన ఎఫ్ ఎల్ – 2027 బంగాళాదుంప పండించిన రైతుల మీద పెప్సీ కంపెనీ కేసు పెట్టింది. తమ కంపెనీతో అంగీకారం కుదుర్చుకోకుండా ఆ పంట పండించిన కారణంగా సదరు రైతులు తమకు కోట్లాదిరూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. కవిత న్యాయపోరాటం ఫలితంగా న్యాయస్థానం సదరు కంపెనీకి ఇచ్చిన పీవీపీ సర్టిఫికేట్‌ను కూడా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా. ఒకవైపు ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది ఉన్న బడా కార్పొరేట్ సంస్థ... మరోవైపు అసంఘటితంగా ఉన్న రైతులు. ఇలాంటి స్థితిలో రైతుల పక్షాన పోరాటం చేయడానికి వారి పట్ల సానుభూతి ఉంటే సరిపోదు. అంతకు మించిన ధైర్యం ఉండాలి. అంతకంటే ఎక్కువగా రైతు కష్టాలు, ప్రభుత్వ విధానాలు, కార్పొరేట్ కంపెనీల వ్యవహార ధోరణి పట్ల స్పష్టమైన అవగాహన కూడా ఉండాలి. గుంటూరులో పుట్టిన తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మాత్రమే వ్యవసాయరంగం గురించి తెలుసుకున్నానని చెప్పారామె. మహిళారైతులే స్ఫూర్తి ‘‘నాకు వ్యవసాయం గురించి మెదక్జిల్లాలోని పస్తాపూర్ మహిళలు నేర్పించారు. పీజీలో ఫీల్డ్ స్టడీ కోసం డీడీఎస్ (దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) తో కలిసి పని చేశాను. నిజానికి నేను కమ్యూనికేషన్స్ స్టూడెంట్‌ని. డాక్యుమెంటరీ కోసం ఆ ఊరికి వెళ్లి వ్యవసాయం చేసే మహిళలను దగ్గరగా చూశాను. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ను కూడా అక్కడ పరిచయం చేశాం. ఒక కొత్త విధానాన్ని చక్కగా అర్థం చేసుకుని సమష్టిగా పని చేసుకుంటారు వాళ్లు. వెనుకబడిన కుటుంబాలకు చెందిన మహిళలు తమ సమస్యలను నేర్పుగా చక్కబెట్టుకోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించేది. మన ఇళ్లలో మగవాళ్లకు ఒకరకం న్యాయం, మహిళలకు మరోరకమైన న్యాయం ఉండడం నాకు మింగుడుపడేది కాదు. బాల్యం నుంచి నన్ను వెంటాడిన అనేక ప్రశ్నలకు సమాధానం అక్కడ దొరికింది. ఇక ఎం.ఏ పూర్తి కాగానే పస్తాపూర్‌కి వెళ్లిపోయాను. ఆరేళ్లపాటు అక్కడ పని చేసి ఢిల్లీకి వెళ్లి అనేక సంస్థలతో పని చేశాను. ప్రస్తుతం బెంగళూరు నుంచి పని చేస్తున్నాను. నేను రైతు కుటుంబంలో పుట్టలేదు, కార్పొరేట్ కంపెనీలకు పని చేయలేదు, ప్రభుత్వ ఉద్యోగమూ చేయలేదు... కానీ ఈ మూడు రంగాల మీద చక్కటి అవగాహన ఉంది. భావసారూప్యం కలిగిన వాళ్లం ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి పని చేస్తున్నాం. అవసరమైన చోట వీథి పోరాటం చేస్తాం, అలాగే ప్రభుత్వానికి విధాన రూపకల్పన కోసం నివేదికలు ఇస్తాం, అవి దుమ్ముకొట్టుకుని పోతున్నాయనిపిస్తే వాటి అమలు కోసం ఉద్యమమూ చేస్తాం’’ అన్నారామె. కేసు ఈ నాటిది కాదు! పెప్సీ కంపెనీ రైతుల మీద 2008లో తొలిసారి కేసు పెట్టింది. నిందితులు విధిలేక తలకెత్తుకున్న న్యాయపోరాటం ఇది. ఇందుకోసం తమ శక్తికి మించి లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. అయినప్పటికీ అప్పట్లో తగినంతగా ప్రజల్లోకి వెళ్లలేదు. వార్తా కథనాలు కూడా పెద్దగా రాలేదు. ‘‘మేము రైతులకు మద్దతుగా పోరాటం మొదలు పెట్టిన వెంటనే చేసిన ప్రధానమైన పని ఈ అంశానికి విస్తృతంగా ప్రచారం కల్పించడమే. మనదేశంలో మంత్రులకు, అనేక సంస్థలకు ఉత్తరాల ద్వారా పోరాటాన్ని ఉధృతం చేశాం. సోషల్ మీడియా ద్వారా యూఎస్, యూరప్, యూకే, ఆఫ్రికా దేశాలకు కూడా తెలిసి వచ్చింది. సదరు కంపెనీ మన రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందనే భావన అందరిలోనూ కలిగింది. మన ప్రభుత్వాల మీద, ఆ కంపెనీ మీద ఇన్ని రకాలుగా ఒత్తిడి తీసుకురాగలిగాం. వాస్తవాల అన్వేషణ కోసం పంజాబ్, గుజరాత్లో మారుమూల ప్రదేశాలకు కూడా వెళ్లాం. ఇంత గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత 2019, జూన్‌లో స్వయంగా కేసు వేశాను. రైతులకు అనుకూలంగా వచ్చిన తీర్పు వెనుక ఇంత ఎక్సర్సైజ్ జరిగింది’’ అని చెప్పారు కవిత కురుగంటి. గడచిన గురువారం నాడు హైదరాబాద్, ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌లో జరిగిన ‘రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల పబ్లిక్ హియరింగ్’ కోసం వచ్చిన సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. ఈ తీర్పు గొప్ప విజయమే... కానీ! ‘ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ – 2001’ ప్రకారం రైతులు తమకు ఇష్టం ఉన్న పంటను పండించుకోవచ్చు. ఈ మేరకు మనదేశం రైతుల ప్రయోజనాలకు విఘాతం కలగని విధంగానే చట్టానికి రూపకల్పన చేసింది. అయితే రైతులకు మాత్రం ఆ విషయం తెలియదు. ఆ కారణంగానే పెప్సీ కంపెనీ రైతుల మీద కేసు వేయగలిగింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ద్వారా రైతులకు తమకు హక్కులున్నాయని తెలిసింది. ఈ విషయంలో పెప్సీ కంపెనీ కేసు వేయడానికి ముందు సదరు రైతులకు తెలియకుండా వారు పండిస్తున్న బంగాళాదుంపల శాంపుల్స్ సేకరించి వాటిని ల్యాబ్‌లో పరీక్షించింది. అది కూడా నేరమే. ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడితే పోరాడే శక్తులున్నాయని కార్పొరేట్ కంపెనీలకు ఈ తీర్పు ద్వారా తెలిసి వచ్చింది. ఇది నిజంగా ఒక హెచ్చరిక వంటిది. ప్రభుత్వాలు కూడా ఇకపై మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటాయని ఆశించవచ్చు. అయితే 30 నెలల పాటు జరిగిన ప్రొసీడింగ్స్నీ, తీర్పు పూర్తి పాఠాన్ని గమనిస్తే కొంత ఊగిసలాట కూడా ఉన్నట్లనిపిస్తోంది. ఆ కంపెనీ అగ్రిమెంట్ పూర్తి కావస్తోంది. ఈ దఫా అగ్రిమెంట్లో మరింత పక్కాగా కంపెనీకి ప్రయోజనకరంగా నిర్ణయం తీసుకునే ప్రమాదం లేకపోలేదనిపిస్తోంది. అందుకే అలాంటిది జరిగితే మళ్లీ పోరాడడానికి సిద్ధమవుతున్నాం. – కవిత కురుగంటి, కన్వీనర్, అలయెన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
నలుగురు మహిళల దారుణ హత్య.. ప్రకటించిన తాలిబన్లు
కాబూల్: తాలిబన్లు ఆక్రమించిన నాటి నుంచి అఫ్గనిస్తాన్‌లో అరాచకాలు.. ముఖ్యంగా మహిళలపై దారుణాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అఫ్గన్ ఉత్తర నగరమైన మజర్ ఈ షరిఫ్లో నలుగురు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ వార్తను అఫ్గన్ తాలిబన్ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఆ వివరాలు.. తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన నాటి నుంచి ఆ దేశ ప్రజలు.. ముఖ్యంగా మహిళలు విదేశాలకు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన నలుగురు మహిళలు కూడా ఈ ప్రయత్నంలోనే ఉన్నారు. వీరు నలుగురు స్నేహితులే కాక.. కోలిగ్స్ కూడా. వీరు దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఏజెంట్ ద్వారా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. (చదవండి: తాలిబన్ల దుశ్చర్య.. 13 మంది ఊచకోత) ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం వీరికి ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఏజెంట్ అని భావించిన మహిళలు అతడితో మాట్లాడారు. ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించడంతో అతడితో పాటు కారులో వెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి వారిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. చనిపోయిన నలుగురు కూడా హక్కుల కార్యకర్తలని సమాచారం. అయితే దీని గురించి మాట్లాడటానికి వారి కుటుంబ సభ్యులు నిరాకరించారు. చదవండి: తెరపైకి తాలిబన్ల సరికొత్త రూల్.. ఈ సారి ఏకంగా.. -
జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలే లక్ష్యం
బోస్టన్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పెగసస్ స్పైవేర్ ప్రధాన లక్ష్యం జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలేనని అంతర్జాతీయ మీడియా పరిశోధనలో తేలింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ పలువురు ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేసిందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. స్పైవేర్‌తో సంపాదించిన 50వేలకు పైగా ఫోన్ నెంబర్ల జాబితా ఫొరిబిడెన్ స్టోరీస్ అనే ఎన్జీఓకు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు దొరికింది. ఈ జాబితాను ప్రముఖ మీడియా గ్రూపులు విశ్లేషించాయి. 50 దేశాల్లో వెయ్యికి పైగా కీలక వ్యక్తులు నెంబర్లను ఇందులో గుర్తించారు. వీరిలో 189 మంది జర్నలిస్టులు, 600మంది రాజకీయవేత్తలు, 65మంది వ్యాపారులు, 85మంది మానవహక్కుల కార్యకర్తల నెంబర్లు ఇందులో ఉన్నాయని వాషింగ్టన్ పోస్టు ప్రకటించింది. సీఎన్ఎన్, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్ తదితర దిగ్గజ సంస్థల జర్నలిస్టుల నెంబర్లు ఈ జాబితాలో ఉన్నాయని తెలిపింది. ప్రముఖ జర్నలిస్టు ఖషోగ్గి హత్యకు నాలుగు రోజుల ముందు ఆయనకు కాబోయే భార్య ఫోనులో ఈ స్పైవేర్ ఇన్‌స్టాలైందని అమ్నెస్టీ తెలిపింది. ఈ ఆరోపణలన్నింటినీ ఎన్ఎస్ఓ కొట్టిపారేసింది. తాము ఎప్పుడూ ఎలాంటి టార్గెట్ల జాబితాను ఉంచుకోవమని తెలిపింది. తమపై వచ్చిన కథనాలు నిరాధారాలని నిందించింది. అయితే ఈ వివరణలను విమర్శకులు తోసిపుచ్చుతున్నారు. కాగా, తమకు లభించిన జాబితాలో 15వేలకు పైగా నంబర్లు మెక్సికోకు చెందినవని మీడియా వర్గాలు తెలిపాయి. తర్వాత అధిక సంఖ్యలో మధ్యప్రాచ్యానికి చెందిన ఫోన్లున్నట్లు తెలిపాయి. నిఘా స్పైవేర్‌కు సంబంధించి ఎన్ఎస్ఓ గ్రూప్‌పై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గతేడాది ఇజ్రాయిల్ కోర్టులో దావా వేసింది. అయితే సరైన ఆధారాలు లేవని కోర్టు ఈ పిటిషన్ కొట్టేసింది. ఆటంకవాదుల నివేదిక: షా పెగసస్ స్పైవేర్ అంశంపై కాంగ్రెస్, అంతర్జాతీయ సంస్థలపై హోంమంత్రి అమిత్‌షా ఎదురుదాడి చేశారు. ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టారన్న నివేదికను భారత ప్రగతిని అడ్డుకునేందుకు కుట్రతో ఆటంకవాదులు రూపొందించిన అవాంతరాల నివేదికగా అభివర్ణించారు. పార్లమెంట్ సమావేశాల తరుణంలోనే ఎంపిక చేసినట్లు లీకేజీలు బయటకు రావడాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి ఇలాంటి దాడులు ఊహించినవేనని షా విమర్శించారు. వారి పార్టీని వారు సరిదిద్దుకోలేని వారు పార్లమెంట్లో అభివృద్ధికర అంశాలను అడ్డుకునే యత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో ప్రజాసంక్షేమాన్ని వదిలి ఇలాంటి అసత్య నివేదికలతో సభా సమయం వృధా చేయడం మంచిది కాదని హితవు చెప్పారు. జాబితాలో రాహుల్, ప్రశాంత్ నంబర్లు! కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ పాటిల్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ఫోన్ నంబర్లు పెగసస్ హ్యాకింగ్ జాబితాలో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. పెగసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 300 మందికిపైగా భారతీయులున్నట్లు ‘ది వైర్’ వార్తా సంస్థ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌పై ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు ఉద్యోగి, ఆమె చుట్టాల నంబర్లు ..ప్రముఖ వైరాలజిస్టు గగన్‌దీప్ కాంగ్, వసుంధరరాజే పర్సనల్ సెక్రటరీ తదితరులున్నారు. భారత్‌పై బురద జల్లేందుకే...! పెగాసస్ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి పలువురు ప్రముఖులపై నిఘా పెట్టారన్న వార్తలను కేంద్రం ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కొట్టిపారేశారు. పార్లమెంట్ సమావేశాలు ఆరంభమవుతున్నవేళ దేశ ప్రజాస్వామ్యానికి అపత్రిçష్ట అంటించేందుకే ఈ కథనాలను వండివారుస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎంతో పటిçష్టమైన వ్యవస్థలున్నాయని, అందువల్ల భారత్‌లో అక్రమ, అనైతిక నిఘా అసాధ్యమని చెప్పారు. ఈఅంశాన్ని పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేవనెత్తడంతో మంత్రి లోక్‌సభలో ఈ వివరణ ఇచ్చారు. మీడియా జాబితాలో ఫోన్ నెంబరున్నంతమాత్రాన హ్యాకింగ్ జరిగినట్లు కాదని ఐటీ మంత్రి వ్యాఖ్యానించారు. పెగాసస్‌ను ప్రభుత్వం వాడుతున్నదీ లేనిదీ తెలపలేదు. అమిత్‌షా తొలగింపునకు కాంగ్రెస్ డిమాండ్ జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టిన పెగసస్ స్పైవేర్ అంశంలో హోంమంత్రి అమిత్‌షాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ అంశంలో ప్రధాని మోదీ పాత్రపై లోతైన విచారణ జరపాలని కోరింది. పెగసస్ అంశానికి షానే బాధ్యత వహించాలని, ఆయన్ను తొలగించాలన్నదే తమ ప్రధాన డిమాండని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఇతర పార్టీల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ విషయంపై న్యాయ లేదా పార్లమెంటరీ విచారణ కోరే అంశమై అన్ని పార్టీలతో కాంగ్రెస్ చర్చిస్తుందన్నారు. హోంమంత్రి పదవికి షా అనర్హుడని రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు. డిజిటల్ ఇండియా అని మోదీ చెబుతుంటారని, కానీ నిజానికి ఇది నిఘా ఇండియా అని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ దుయ్యబట్టారు. షాను వెంటనే ఎందుకు తొలగించరని ప్రశ్నించారు. ఈ నిఘా వ్యవహారం మొత్తం మోదీ ప్రభుత్వ కన్నుసన్నులోనే జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మోదీ, అమిత్‌షా స్పందించాలి పెగసస్‌తో ప్రముఖుల సమాచారం హ్యాక్ అయిందన్న వార్తలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా స్పందించాలని శివసేన డిమాండ్ చేసింది. దేశంలో ప్రభుత్వం, యంత్రాంగం బలహీనంగా ఉన్నాయని ఈ ఘటన చెబుతోందని సేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ప్రజలకు ప్రధాని, హోంమంత్రి ఈ అంశంపై స్పష్టతనివ్వాలని ఆయన కోరారు. -
వాట్సాప్ డేటాపై ‘పెగాసస్’ గురి
న్యూఢిల్లీ: వాట్సాప్‌లో భారత్‌కు చెందిన జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని ‘పెగాసస్’అనే స్పైవేర్ సాయంతో గుర్తు తెలియని సంస్థలు దొంగిలించాయంటూ గురువారం వాట్సాప్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 1,400 మందిని లక్ష్యంగా చేసుకుని సమాచార చోరీ జరిగినట్లు గుర్తించింది. ఇందుకు సంబంధించి ఎన్ఎస్వో కంపెనీపై అమెరికాలో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంతోపాటు, భారతీయ యూజర్ల వ్యక్తిగత సమాచార గోప్యతకు తీసుకుంటున్న చర్యలను ఈ నెల 4లోగా వివరణ ఇవ్వాలని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో అనే నిఘా సంస్థ ‘పెగాసస్’ స్పైవేర్‌ను గుర్తు తెలియని సంస్థలకు అప్పగించిందని, దీని సాయంతో నాలుగు ఖండాల్లోని సుమారు 1,400 మంది దౌత్యాధికారులు, రాజకీయ అసమ్మతివాదులు, జర్నలిస్టులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు చెందిన ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం చోరీ అయిందని వాట్సాప్ తెలిపింది. భారత్‌లో బాధితుల వివరాలు తెలిపేందుకు నిరాకరించింది. దీనిపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఎన్ఎస్వో గ్రూప్‌పై వాట్సప్ కేసు వేసింది. హక్కుల లాయర్ నిహాల్ సింగ్ రాథోడ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్యకర్త షాలిని గెరా, బీబీసీ మాజీ జర్నలిస్టు సుభ్రాన్షు చౌధరి తదితరులు బాధితులమంటూ ప్రకటించారు. ఉగ్రవాదం నేరాలపై పోరాడేందుకు గుర్తింపు పొందిన ప్రభుత్వ నిఘా సంస్థలకే ఈ సాంకేతికతను అందజేస్తున్నట్లు ఎన్ఎస్వో సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల వాట్సాప్ వినియోగదారుల్లో భారత్‌లో 40 కోట్ల మంది ఉన్నారు. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలను నేరస్తులుగా అనుమానిస్తూ మోదీ ప్రభుత్వం చేపట్టిన గూఢచర్యం తేటతెల్లమయిందని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్నే బాధ్యునిగా చేయాలని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును కోరింది. -
గణపతి, వరవరరావుల మధ్య ఈమెయిల్స్!
పుణె: మావోయిస్టులతో సంబంధం ఉందనే ఆరోపణలపై జూన్‌లో అరెస్టైన ఐదుగురు హక్కుల కార్యకర్తల బెయిల్ పిటిషన్లను మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వ్యతిరేకించింది. విరసం నేత వరవరరావు, పరారీలో ఉన్న సీపీఐ (మావోయిస్టు) నేత గణపతిల మధ్య జరిగిన ఈ–మెయిల్ సంభాషణలను మహారాష్ట్ర తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. హక్కుల కార్యకర్తలు సురేంద్ర గాడ్లింగ్, సోమసేన్, వెర్నన్ గోన్సాల్వేజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్‌లు జూన్‌లో అరెస్టయ్యారు. ఆ తర్వాతనే ఈ ఈ–మెయిల్ సంభాషణలు జరిగాయని ప్రభుత్వ తరపు న్యాయవాది ఉజ్వలా పవార్ కోర్టుకు తెలిపారు. ఈ–మెయిల్స్‌ను గణపతి వరవరరావుకు పంపారనీ, హక్కుల కార్యకర్తలు అరెస్టైన అంశంపై సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ ఆందోళన చెందినట్లు ఈ–మెయిల్ ద్వారా తెలుస్తోందని పవార్ పేర్కొన్నారు. -
నవలఖ విడుదలపై సుప్రీంకు మహారాష్ట్ర
న్యూఢిల్లీ: హక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖ(65)ను గృహనిర్బంధం నుంచి విడుదలచేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిశాంత్ కట్నేశ్వర్ బుధవారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద పిటిషన్ దాఖలుచేశారు. సీఆర్పీసీలోని సెక్షన్ 167(1), (2)లను తప్పుగా అర్థం చేసుకున్న హైకోర్టు పొరపాటున నవలఖను విడుదల చేసిందని, అతని ట్రాన్సిట్ రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేసిందని మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో తెలిపింది. సెక్షన్ 167(1) ప్రకారం నిందితుడిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలంటే సంబంధిత పోలీస్ అధికారులు కేస్ డైరీని రూపొందించాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే తమ న్యాయపరిధిలో లేని నిందితుల ట్రాన్సిట్ రిమాండ్ కోరేటప్పుడు కేస్ డైరీని సమర్పించాల్సిన అవసరంలేదని పేర్కొంది. -
గౌతమ్ నవ్‌లఖాకు విముక్తి
న్యూఢిల్లీ: గృహ నిర్బంధంలో ఉన్న హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్‌లఖాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. భీమా–కోరెగావ్ హింసకు కారణమంటూ గౌతమ్ నవ్లఖా సహా అరెస్టయిన ఐదుగురు హక్కుల కార్యకర్తలు ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటు మేరకు ఆయన తరఫున ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ ఎస్.మురళీధర్, జస్టిస్ వినోద్ గోయెల్‌ల ధర్మాసనం విచారించింది. నవ్‌లఖాను ట్రాన్సిట్ రిమాండ్‌కు ఆదేశిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆగస్టు 29న వెలువరించిన ఉత్తర్వులను కోర్టు కొట్టి వేసింది. ‘రాజ్యాంగంలోని ప్రాథమిక నియమాలకు వ్యతిరేకంగా, నేర శిక్షా స్మృతికి వ్యతిరేకంగా ఆ ఉత్తర్వులు ఉన్నాయి. చట్ట ప్రకారం నవ్లఖా 24 గంటల గృహ నిర్బంధం పూర్తయింది. ఫలితంగా ఆయన గృహ నిర్బంధం ముగిసినట్లే. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాబోవు’ అని కోర్టు స్పష్టం చేసింది. -
వారి అరెస్టుపై 2:1 మెజారిటీతో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని భీమా–కోరేగావ్ అల్లర్ల కేసుకు సంబంధించి హక్కుల కార్యకర్తలు వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలఖ, వెర్మన్ గంజాల్వెజ్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అరెస్టుల వ్యవహారంపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐదుగురు హక్కుల కార్యకర్తలను విడుదల చేయాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో శుక్రవారం తీర్పు ఇచ్చింది. తమ నిర్ణయంపై అప్పీలు చేసుకునేందుకు హక్కుల కార్యకర్తలకు ప్రస్తుతమున్న గృహనిర్బంధాన్ని 4 వారాల పాటు పొడిగించింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌లు తీర్పునిస్తూ తమ కేసును ఎవరు విచారించాలో ఎంచుకునే అధికారం నిందితులకు ఉండదని తేల్చారు. అసమ్మతి, రాజకీయ భిన్నాభిప్రాయం కారణంగా పోలీసులు ఈ అరెస్టులు చేపట్టలేదనీ, నిందితులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలను పరిశీలించామనీ, విచారణ సందర్భంగా ఏదో ఒకపక్షం వైపు తాము ప్రభావితమయ్యే అవకాశమున్నందున వాటి లోతుల్లోకి వెళ్లలేదని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 31న మహారాష్ట్రలోని పుణె సమీపంలో దళిత సంఘాలు ‘ఎల్గర్ పరిషత్’ పేరుతో సమావేశం నిర్వహించాయి. సదస్సు అనంతరం అక్కడి భీమా–కోరేగావ్ ప్రాంతంలో హింస చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించి పుణె పోలీసులు గత నెల 28న ఐదుగురిని అరెస్ట్ చేశారు. దీంతో వీరిని విడుదల చేసి, అరెస్టులపై సిట్ ఏర్పాటు చేయాలంటూ చరిత్రకారిణి రొమీలా థాపర్‌తో పాటు కొందరు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ఐదుగురిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీం ఆదేశించింది. తీర్పును స్వాగతించిన బీజేపీ.. దేశానికి వ్యతిరేకంగా, ప్రధాని మోదీ హత్యకు అర్బన్ నక్సల్స్ పన్నిన కుట్రను పోలీసులు విజయవంతంగా ఛేదించారని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అన్నారు. గృహనిర్బంధం పూర్తయ్యాక వీరి కస్టడీ కోసం కోర్టుకెళతామన్నారు. ఈ ఐదుగురికి మద్దతు ఇచ్చి జాతీయ భద్రతతో చెలగాటమాడిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సిగ్గుతో తలదించుకోవాలని బీజేపీ విమర్శించింది. వీరికి మద్దతు ఇచ్చినందుకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అసమ్మతి గొంతు నొక్కేస్తున్నారు ఇద్దరు న్యాయమూర్తుల అభిప్రాయంతో జస్టిస్ డీవై చంద్రచూడ్ విభేదించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రభుత్వం అసమ్మతి గొంతును నొక్కేసేందుకు ప్రయత్నిస్తోందని తన తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసమ్మతి, భిన్నాభిప్రాయం అసలైన ప్రజాస్వామ్యానికి సూచిక అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో, సరైన విచారణ జరపకుండా ఈ ఐదుగురిని వేధిస్తే భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కుకు అర్థం లేకుండా పోతుందని అభిప్రాయపడ్డారు. మావోయిస్టులు రాసుకున్నట్లు భావిస్తున్న లేఖలను మహారాష్ట్ర పోలీసులు మీడియాకు ఉద్దేశపూర్వకంగా విడుదల చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పాక్షిక విచారణపై అనుమానాలు తలెత్తేలా పోలీస్ అధికారులు వ్యవహరించారని దుయ్యబట్టారు. ఈ కేసులో సిట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందనీ, విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని తన 43 పేజీల తీర్పులో జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అసమ్మతి అన్నది ప్రెజర్ కుక్కర్‌కు ఉన్న సేఫ్టీ వాల్వ్ లాంటిదనీ, దాన్ని పోలీస్ బలంతో అణిచివేయలేరని పునరుద్ఘాటించారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా పోలీసులు మీడియాను వాడుకోవడం ద్వారా విచారణ నిష్పాక్షికత దెబ్బతింటుందనీ, కేసుల్లో దోషులెవరో నిర్ధారించి తీర్పు చెప్పేందుకు పోలీసులు న్యాయమూర్తులు కాదని వ్యాఖ్యానించారు. ఐదుగురు హక్కుల కార్యకర్తలు ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదనీ, కొత్తగా కేసును రిజస్టర్ చేయని విషయాన్ని ముగ్గురు జడ్జీలు తీర్పులో ప్రస్తావించారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ -
హక్కుల కార్యకర్తల అరెస్టుపై తీర్పు నేడే!
న్యూఢిల్లీ: వరవరరావు సహా ఐదుగురు హక్కుల కార్యకర్తలను తక్షణం విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇచ్చే అవకాశముంది. మహారాష్ట్రలో గతేడాది జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశం, ఆ తర్వాత చెలరేగిన భీమా–కోరేగావ్ అల్లర్ల నేపథ్యంలో వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలఖ, వెర్మన్ గంజాల్వెజ్‌లను పుణె పోలీసులు ఈ ఏడాది ఆగస్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను సవాలుచేస్తూ చరిత్రకారిణి రొమీలా థాపర్, ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్, దేవకీ జైన్, ప్రొ.సతీశ్ దేశ్‌పాండేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయడంతోపాటు ఈ ఘటనపై సమగ్ర విచారణ కోసం సిట్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో వరవరరావు సహా ఐదుగురు హక్కుల కార్యకర్తలను పోలీసులు ఆగస్టు 29 నుంచి గృహనిర్బంధంలో ఉంచారు. ఈ కేసులో తీర్పును ఈ నెల 20న రిజర్వు చేసిన సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం.. శుక్రవారం తుది తీర్పును వెలువరించే అవకాశముంది. -
ఆ కేసును డేగకళ్లతో పరిశీలిస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ: కోరెగావ్–భీమా అలర్లకు సంబంధించి గృహనిర్బంధంలో ఉన్న ఐదుగురు హక్కుల కార్యకర్తలపై ఆరోపణలు వచ్చిన కేసును డేగ కళ్లతో పరిశీలిస్తామని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. వ్యతిరేకత–అసమ్మతిలకు, సమాజంలో కల్లోలం సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించే చర్యలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుందని మహరాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలియజెప్పింది. హక్కుల కార్యకర్తలు వరవరరావు, అరుణ ఫెరీరా, వెర్నన్ గోన్సాల్వెజ్, సుధ భరద్వాజ్, గౌతమ్ నవ్లఖలను భీమా–కోరెగావ్ కేసులో తొలుత అరెస్టు చేసి అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో గృహనిర్బంధంలో ఉంచడం తెలిసిందే. వారి గృహ నిర్బంధం బుధవారంతో ముగుస్తున్నందున సుప్రీంకోర్టు గడువును మరోరోజు పొడిగించింది. ‘అసమ్మతి, వ్యతిరేకతలను కూడా పరిగణలోకి తీసుకునేలా మన ప్రజాస్వామ్య వ్యవస్థలు దృఢంగా ఉండాలి. అది ఈ న్యాయస్థానమైనా సరే. ఊహలు, కల్పనల కారణంగా స్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడటాన్ని మేం సహించం’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాయిబాబా పేరుతో కథలు అల్లారు మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా పేరును వాడుకుని ఐదుగురు హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా పోలీసులు కథలు అల్లుతున్నారని కొందరు ప్రముఖులు సుప్రీంకోర్టుకు తెలిపారు. -
19 వరకూ గృహనిర్బంధం
న్యూఢిల్లీ: కోరెగావ్–భీమా అల్లర్ల కేసులో ఐదుగురు హక్కుల కార్యకర్తల గృహనిర్బంధాన్ని సెప్టెంబర్ 19 వరకూ సుప్రీంకోర్టు పొడిగించింది. అరెస్టు సందర్భంగా పోలీసులు పేర్కొన్న ఆధారాల్ని పరిశీలించాల్సిన అవసరముందని, ఆ ఆధారాలు కల్పితమని కనుగొంటే సిట్ విచారణకు ఆదేశిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘ఆరోపణల ఆధారంగానే ప్రతీ నేర దర్యాప్తు సాగుతుంది. తగినన్ని ఆధారాలు ఉన్నాయా లేదా అని మనం చూడాల్సి ఉంది. మహారాష్ట్ర పోలీసుల వాదన వినకుండా, ఆధారాల్ని పరిశీలించకుండా.. స్వతంత్ర దర్యాప్తుపై ఎలా నిర్ణయం తీసుకుంటాం. పోలీసుల వద్ద ఉన్న ఆధారాల్ని మేం చూడాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. గత నెల్లో మహారాష్ట్రకు చెందిన పుణే పోలీసులు హక్కుల కార్యకర్తలు వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొంజాల్వేస్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖాల్ని అరెస్టు చేయగా.. వారిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
వరవరరావుకు గృహనిర్బంధం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో పౌర హక్కుల నేతల గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. భీమా-కొరేగావ్ అల్లర్లతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న పౌర హక్కుల నేతలకు గృహ నిర్బంధ గడువు పెంచుతూ మరోసారి వారికి భారీ ఊరట కల్పించింది. ఈ గడువు నేటితో (సెప్టెంబరు 12) ముగియనున్న నేపథ్యంలో సెప్టెంబరు 17వ తేదీవరకు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆగస్టు 28న విప్లవ కవి వరవరరావు సహా మరో అయిదుగురి నేతల ఇళ్లలో పుణే పోలీసుల సోదాలు నిర్వహించడంతో పాటు అరెస్ట్ చేసి పుణేకు తరలించారు. ఈ అరెస్టును సవాలు చేస్తూ చరిత్రకారులు రొమిల్లా థాపర్‌తో పాటు ఐదుగురు మేధావులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం పౌర నేతలను జైల్లో కాకుండా గృహనిర్బంధంలో ఉండాలని ఆగస్టు 30న ఆదేశించింది. మొదట సెప్టెంబరు 6వరకు, ఆ తరువాత 12వ తేదీవరకు వరుసగా పొడిగిస్తూ వచ్చింది. తాజాగా మరో అయిదురోజులపాటు వారిని కేవలం గృహ నిర్బంధంలోనే ఉంచాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ప్రధాని హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలకు సంబంధించి వరవరరావుతో సహా మరో నలుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం తదనంతర పరిణామాల నేపథ్యంలో వారిని గృహ నిర్బంధంలోనే ఉంచాలని ఆదేశించింది. అంతేకాతు గత విచారణ సందర్భంగా పుణే పోలీసుల వ్యవహారంపై జస్టిస్ దీపక్ మిశ్రా తదితరులతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
హక్కుల కార్యకర్తలను విడుదల చేయండి
లక్నో: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై సుధా భరద్వాజ్ సహా పలువురు హక్కుల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు తెలిపారు. దేశవ్యాప్తంగా రచయితలు, మేధావులు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు కొనసాగింపుగానే ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయని వ్యాఖ్యానించారు. భరద్వాజ్‌కు బెయిల్ రాకుండా చేసేందుకే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పోలీసులు ఆమెపై కేసు నమో దు చేశారన్నారు. భరద్వాజ్ పేరును చెడగొట్టేలా అధికారులు తప్పుడు కథనాలను కొన్ని టీవీ చానల్స్ ద్వారా ప్రసారం అయ్యేలా చేశారన్నారు. సుధా భరద్వాజ్ సహా పోలీసులు అరెస్ట్ చేసిన హక్కుల కార్యకర్తలందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులపై జాతీయ మానవహక్కుల కమిషన్‌తో నిష్పాక్షిక విచారణ జరిపించాలన్నారు. -
12 వరకూ గృహనిర్బంధం
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్న ఆరోపణలతో అరెస్టయిన ఐదుగురు హక్కుల కార్యకర్తల గృహనిర్బంధాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 12 వరకూ పొడిగించింది. ఈ సందర్భంగా పోలీసులు మీడియా సమావేశాలు ఏర్పాటుచేసి కేసు వివరాలను వెల్లడించడంపై కోర్టు మండిపడింది. పుణె ఏసీపీ మీడియా సమావేశం ఏర్పాటుచేసి అత్యున్నత న్యాయస్థానానికే దురుద్దేశాలు అంటగడుతున్నారని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న అంశాలపై మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీ పోలీసులకు చెప్పండి. ఈ కేసు విచారణ ఇప్పుడు మాముందు ఉంది. మేము తప్పు చేస్తున్నామని పోలీసుల నోటి నుంచి వినాలనుకోవడం లేదు’ అని మహారాష్ట్ర తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది. పుణెలోని భీమా కొరేగావ్‌లో గతేడాది డిసెంబర్ 31న జరిగిన ఎల్గర్ పరిషత్ సభ సందర్భంగా మావోలతో కలసి హింసకు కుట్ర పన్నారని విరసం సభ్యుడు వరవరరావు, వెర్మన్ గంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖా వంటి హక్కుల కార్యకర్తలను మహారాష్ట్ర పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి సంగతి తెలిసిందే. -
పౌరహక్కుల నేతల అరెస్ట్‌పై నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతల అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. పౌరహక్కుల నేతల అరెస్ట్‌ను ఖండిస్తూ.. ప్రమఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌తోపాటు మరో నలుగురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ చేసిన ఐదుగురు పౌరహక్కుల నేతలను వెంటనే విడుదల చేయాలని కోరారు. వారిపై తప్పుడు చార్జీషీట్లు మోపారాని.. దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం మధ్యాహ్నం 3.45 గంటలకు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. గతేడాది డిసెంబర్ 31న పుణెకి సమీపంలోని కోరెగావ్-భీమా గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో విరసం నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్‌లో ట్రేడ్ యూనియన్ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే గౌతం నవలఖా తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన సొంత పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టనుంది. -
ఆకాంక్షల జెండా అస్మా
అస్మా పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఎన్నో నివేదికలను రూపొందించారు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధిగా ఆమె ఇరాన్, భారతదేశం లాంటి చోట్ల జరుగుతున్న మత అసహనాన్ని నిగ్గదీశారు. ‘‘అనుభవాల నుంచి మనమెప్పుడూ సరైన పాఠాలు నేర్చుకోం. సమస్యల మూలాలను తెలుసుకోం. మనం మతాలని రాజకీయం చేయాలని చూస్తే, అది సృష్టించే మంటల్లో పడి మాడి మసైపోతాం!’’ మహా మేధావి, పాకిస్తాన్ మానవ హక్కుల నాయకురాలు అస్మా జహంగీర్ ప్రపంచానికి చేసిన హెచ్చరిక ఇది. అస్మా జహంగీర్ పాకిస్తాన్లో పుట్టి పెరిగారు. ప్రపంచంలో మృగ్యమవుతున్న మానవహక్కుల కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి, జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప యోధురాలు. మానవహక్కులే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా బతి కిన అస్మా ఇటీవల లాహోర్‌లో గుండెపోటుతో మరణించారు. అస్మా జహంగీర్ పేరు వినగానే హక్కుల పతాక రెపరెపలు స్ఫురణలోకి వస్తాయి. అస్మా చేసిన కృషిని గుర్తించి ఎన్నో అవార్డులు ఆమె తలుపు తట్టాయి. రామన్ మెగసెసె అవార్డు, నోబెల్ బహుమతికి ప్రత్యామ్నాయమైన ‘లైవ్లీ హుడ్ అవారు’్డ కూడా దక్కాయి. అవార్డుల కన్నా మిన్నగా అస్మా దృఢ దీక్ష కారణంగా పాక్ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షల జెండా గగనతలంపై రెపరెపలాడడమే కాదు, ప్రపంచ హక్కుల కరదీపికైంది. అస్మా జహంగీర్ పూర్తిపేరు అస్మా జిలానీ జహంగీర్. 1952, జనవరి 27న లాహోర్‌లో జన్మించారు. తండ్రి మాలిక్ గులాం జిలానీ ప్రభుత్వోద్యోగిగా పనిచేసి, పదవీ విరమణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. పార్లమెంటు సభ్యునిగా కొనసాగిన జిలానీ 1972లో జుల్ఫీకర్ విధించిన మిలిటరీ పాలనను వ్యతిరేకించారు. అందుకు గులాం జిలానీని నాటి ప్రభుత్వం నిర్బంధించి కారాగారానికి పంపించింది. మానవహక్కుల పట్ల అస్మాలో కనిపించే అలాంటి దృఢ సంకల్పానికి తండ్రి జిలానీ చూపిన మార్గమే స్ఫూర్తిగా నిలిచింది. ఆమె మొదటి పోరాటం తండ్రి నిర్బంధాన్ని సవాల్ చేయడంతోనే ఆరంభమైంది. అస్మా లాహోర్‌లోని కిన్నెర్డ్ కళాశాల నుంచి డిగ్రీనీ, పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి 1978లో ఎల్ఎల్బి పట్టానూ పొందారు. న్యాయవాద వృత్తిని ప్రారంభించిన ఒక సంవత్సరానికే 1983లో ప్రజాస్వామ్య ఉద్యమంలో క్రియాశీలకమైన కార్యకర్తగా అవతరించి, కీలక పాత్రను నిర్వహించారు. అప్పటి జియా ఉల్ హక్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి, కారాగారానికి పంపిం చింది. తరువాత అస్మా 1986లో జెనీవాలోని అంతర్జాతీయ బాలల రక్షణ విభాగానికి వైస్ చైర్‌పర్సన్‌గా నియమితుల య్యారు. 1988లో మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చారు. జెనీవాలో ఉన్న సమయంలోనే 1987లో పాకిస్తాన్ ప్రభుత్వం మానవహక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి అస్మా తన హక్కుల పోరాటానికి విరామం ఇవ్వలేదు. ఆమె పోరాటం అనేక అంశాలపై కొనసాగింది. ముఖ్యంగా ముస్లిం మహిళల సమస్యలు, రాజకీయ హక్కులు, మైనారిటీ మతాలపై వివక్ష, వేధింపులు, హత్యాకాండలపై నిరంతరం జహంగీర్ గళం విప్పారు. 2007 నవంబర్‌లో ఎమర్జెన్సీ విధిం చిన వెంటనే అస్మా జహంగీర్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. 2012 సంవత్సరంలో ఆమెను హత్య చేయడానికి పాకిస్తాన్ ఇంటె లిజెన్స్ వర్గాలు చేస్తున్న కుట్రలు బయటకు పొక్కడంతో ప్రపంచమంతా అస్మాకు అండగా నిలిచింది. అయినా ఆమె ఎప్పుడూ చావుకు భయపడలేదు. అక్కడే కాదు ఎక్కడైనా హక్కులను గురించి మాట్లాడ్డమంటే ప్రాణాలకు తెగించడమనే అర్థం. పాకిస్తాన్లో దైవదూషణ తీవ్రమైన నేరం. దానికి శిక్ష మరణ దండన. ఇటువంటి కేసుల్లో న్యాయవాదులెవ్వరూ నిందితులకు మద్దతుగా నిలబడరు. కానీ అస్మా మాత్రం అటువంటి కేసులలో పోరాడి విజయం సాధించడం ప్రపంచాన్ని అబ్బురపరిచింది. 1993లో ఒక మసీదు గోడలపై దైవాన్ని దూషిస్తూ రాసారనే నేరారోపణతో సలామత్ మసయ, అతని తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేశారు. క్రింది కోర్టు వారికి మరణశిక్ష విధించింది. ఆ కేసులో అస్మా జహంగీర్ లాహోర్ హైకోర్టులో వారి తరఫున వాదించి 1993 ఫిబ్రవరి, 23వ తేదీన శిక్షను రద్దు చేయించడం ఆమె సాహసానికి మచ్చుతునక. ఒక దేశద్రోహం కేసు విషయంలో కూడా ఆమె చూపిన చొరవ విశేషమైనది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎం.క్యూ.ఎం పార్టీ నాయకులు అల్తాఫ్ హుస్సేన్ మీద దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాతో సహా అన్ని పత్రికలు, చానళ్లు అల్తాఫ్‌ను బహిష్కరించాయి. న్యాయవాదులెవ్వరూ కూడా ఆ కేసులో వాదించడానికి ముందుకు రాలేదు. కానీ అస్మా ఒక్కరే, ఒక్కరంటే ఒక్కరే నిలబడి భావప్రకటనా స్వేచ్ఛాపతాకాన్ని ఎగురవేసారు. అందుకుగాను ఆమె ఇంటిని సైతం పూర్తిగా ధ్వంసం చేశారు. ఆమెపై భౌతిక దాడికి ఒడిగట్టారు. కానీ ఆమె హక్కుల పోరాటాన్ని కొనసాగించారే తప్ప వెనకడుగువేయ లేదు. పాకిస్తాన్లో 1978లో జియా ఉల్ హక్ మిలిటరీ పాలనలో అనేక కొత్త చట్టాలు వచ్చాయి. హుదూద్ పేరుతో ఉన్న ఈ చట్టంలో ఖురాన్ నుంచి తీసుకున్న అనేక అంశాలపై ఆధారపడి శిక్షలు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇందులో ముస్లిం మహిళల విషయంలో అనుసరించిన వైఖరిని అస్మా జహంగీర్ సహించలేకపోయారు. ఒక అమ్మాయి వివాహం చేసుకోవడానికి తండ్రితో సహా ఎవరైనా పురుష సంరక్షకుల అనుమతి కావాలి. ఒకవేళ యువతులెవరైనా దీనిని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారమే కాదు, కుటుంబ సభ్యులే ఆ యువతులను చంపేసే సంప్రదాయం ఉన్నది. వీటిని భారతదేశంలో జరుగుతోన్న పరువు హత్యలతో పోల్చవచ్చు. దీని మీద అస్మా జరిపిన పోరాటం గొప్ప ఫలితాలను సా«ధించింది. ఉన్నత న్యాయస్థానం నుంచి న్యాయమైన తీర్పును పొందింది. అంతేకాకుండా పరువు పేరుతో యువతులను హతమార్చిన వాళ్లు ఇస్లామిక్ సంప్రదాయం పేరుతో శిక్షల నుంచి తప్పించుకునేవారు. కానీ అస్మా జహంగీర్ న్యాయస్థానాల్లో జరిపిన పోరాటం అనేక మంది నేరస్తులకు శిక్షలు విధించేటట్టు చేసింది. ఇందుకుగాను ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొం దించవలసిన అవసరం కూడా ఏర్పడింది. అస్మా జహంగీర్ పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఎన్నో నివేదికలను రూపొందించారు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధిగా ఆమె ఇరాన్, భారతదేశం లాంటి చోట్ల జరుగుతున్న మత అసహనాన్ని నిగ్గదీశారు. మెజారిటీ మతాలు మైనారిటీలపై జరుపుతున్న వివక్ష, అణచివేత, హింసలను ఆమె ఎలుగెత్తి చాటారు. ఐక్యరాజ్యసమితికి చెందిన మానవహక్కుల విభాగం తరపున భారతదేశంలో మానవ హక్కుల నిర్లక్ష్యంపై కూడా అస్మా జహంగీర్ ఒక నివేదికను విడుదల చేశారు. 2009 జనవరి, 26న అది విడుదలయింది. భారతదేశంలో మానవ హక్కులు, పౌరహక్కులు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక హక్కులతో పాటు, డెవలప్మెంట్ రైట్స్ పైన కూడా 2008వ సంవత్సరం మార్చి 3 నుంచి 20 వరకు పర్యటించి ఎన్నో అంశాలను సేకరించారు. భారతదేశంలో మైనారిటీల హక్కులకు భంగం కలిగిస్తున్న అనేకానేక అంశాల పట్ల అస్మా జహంగీర్ ఆందోళన వెలిబుచ్చారు. 2006లో రూపొందించిన నూతన చట్టం ఇంకా ఆమోదం పొందక పోవడం పట్ల ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె జీవితమంతా హక్కుల సాధన కోసమే వెచ్చించారు. నిజానికి అస్మా జీవితం, పోరాటం వేర్వేరు కావు. ఆమె జీవితమే పోరాటంగా బతికారు. భవిష్యత్ హక్కుల ఉద్యమాలకు వేగుచుక్కగా నిలిచారు. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
మేనిఫెస్టోల్లో మాకు చోటేదీ?
రాజకీయ పార్టీలకు హక్కుల సంఘాల ప్రశ్న న్యూఢిల్లీ: ప్రస్తుత ఎన్నికల్లో మహిళల రక్షణ అంశాన్ని రాజకీయ పార్టీలు ఎందుకు పక్కకు పెట్టాయని మహిళా సంఘాలు, హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ‘‘భారత ఎన్నికల ప్రణాళిక చాలా చిన్నది. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలపై నేరాల అంశం రెండో అంశంగా పరిగణింపబడుతోంది, అవినీతి ప్రధానాంశమైంది’’ అని ఆవేదన వ్యక్తంచేశారు సుప్రీకోర్టు న్యాయవాది కరుణా నంది. మహిళల రక్షణ కోసం పనిచేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ఎన్జీవో అనంత సెంటర్, మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎమాన్సిప్ యాక్షన్ ఇండియా ఫౌండేషన్ల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న సదస్సులో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. భారతదేశంలో మహిళలపట్ల పురుషల ప్రవర్తన, విద్యావకాశాలు, ఆర్థికావకాశాలు, కళలు-మీడియాలో మహిళలు, చట్టాలు-అవి అమలవుతున్న తీరువంటి అనేక అంశాలపై జరిగిన చర్చల్లో దేశ నలుమూలలనుంచి వచ్చిన అన్ని రంగాల్లోని మహిళలు పాల్గొన్నారు. మహిళలపై హింస అంతమొందించడం కోసం నాయకులను ప్రశ్నించాలని కరుణానంది కోరారు. వందల ఏళ్లుగా సమాజంలో, మనలో పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థను అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అయితే ప్రభుత్వాలు దీన్ని ప్రాధాన్యతలేని అంశంగా చూస్తున్నాయని, మహిళల అంశాలపట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం దారుణమని కరుణా నంది విమర్శించారు. మహిళలపై హింసకు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చైతన్యం ఇంకా పెరగాల్సి ఉందని హెచ్ఎస్బీసీ కంట్రీ హెడ్ నైనా లాల్ కిద్వాయ్ పిలుపునిచ్చారు. మహిళా సాధికారత సంపూర్ణం కావాలంటే మహిళల ఆర్థిక స్వావలంబన, భూమి కలిగి ఉండడం ప్రధానమని సామాజిక కార్యకర్త మీరాయ్ ఛటర్జీ అన్నారు.ఆర్థిక సాధికారత అంటే కేవలం మహిళల చేతికి డబ్బు వెళ్లడమే కాదని, ఆహారం, సామాజిక భద్రత, పిల్లల రక్షణ, పెన్షన్, ఇల్లు... ఇలా ఇంట్లోనే కాదు... సమాజంలో మార్పు సంభవిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.