న్యూఢిల్లీ: 2002 గోధ్రా అనంతర అల్లర్ల కేసులో హక్కుల కార్యకర్త తీస్తా సీతల్‌వాద్ బెయిల్‌ను జూలై 19 దాకా సుప్రీంకోర్టు పొడిగించింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, ఎ.ఎస్.»ొపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం బుధవారం ఈ మేరకు నిర్ణం వెలువరించింది.
పిటిషనర్ మహిళ గనుక గుజరాత్ హైకోర్టే బెయిల్ రూపంలో ఆమెకు ఎంతో కొంత రక్షణ కల్పించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను జూలై 19కి వాయిదా వేసింది. సీతల్‌వాద్‌కు జూలై 1న సుప్రీంకోర్టు వారం పాటు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment