నోబెల్ ప్యానెల్‌తో నర్గీస్ మహమ్మదీ
ఓస్లో, నార్వే: నోబెల్ శాంతి బహుమతి–2023 గ్రహీత, ఇరాన్‌కు చెందిన హక్కుల ఉద్యమకారిణి నర్గీస్ మహమ్మదీ తొలిసారి నోబెల్ ప్యానెల్‌తో మాట్లాడారు. అనారోగ్య రీత్యా బెయిలుపై ఉన్న ఆమెతో మాట్లాడినట్లు ఆ సంస్థ ఆదివారం వెల్లడించింది. ఈ మేరకు నోబెల్... సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేసింది. తనకు నోబెల్ వచ్చి విషయం కూడా నేరుగా తెలియలేదని, జైలులో తనతోపాటు ఉన్న మహిళ.. పురుషుల వార్డులో ఉన్న భర్తతో ఫోన్‌లో మాట్లాడగా విషయం తెలిసిందని చెప్పారు.
వార్త వినగానే నమ్మలేకపోయామని, ‘ఉమెన్.. లైఫ్.. ఫ్రీడమ్’నినాదాలతో జైలు ప్రతిధ్వనించిందని ఆమె గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. ఆనందంతో ఆమె ‘బెల్లా చావ్’స్వేచ్ఛాగీతాన్ని కూడా ఆలపించారు. తన ఆరోగ్య సమస్యల గురించి, ఇరాన్ రాజకీయ వాతావరణం గురించి కూడా ఆమె ప్యానెల్‌కు వివరించారు. ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా తన పిల్లలతో వీడియో కాల్‌లో మాట్లాడగలిగానని తెలిపారు. ఇరాన్‌లో మహిళలకు హిజాబ్‌కు, మరణశిక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న నర్గీస్.. ఎవిన్ జైల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment