Ambanis
-
బార్ల్కేస్ హురున్ లిస్ట్.. బిజినెస్‌లో ఈ ఫ్యామిలీలదే హవా
దేశంలోని వ్యాపార కుటుంబాల్లో అంబానీ ఫ్యామిలీ హవా చాటింది. 2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యూబుల్ ఫ్యామిలీ బిజినెస్‌ల జాబితా ప్రారంభ ఎడిషన్‌లో అగ్రస్థానాన్ని పొందింది. అంబానీ కుటుంబం విలువ 309 బిలియన్ డాలర్లు (రూ.25.75 లక్షల కోట్లు). ఇది భారతదేశ జీడీపీలో దాదాపు 10 శాతానికి సమానం.బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్, హురున్ ఇండియా 2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాను విడుదల చేశాయి. ఈ లిస్ట్ విలువ పరంగా దేశంలోని అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాలకు ర్యాంక్ ఇచ్చింది. వ్యవస్థాపక కుటుంబం నుంచి తదుపరి తరం సభ్యులు వ్యాపార నిర్వహణలో లేదా దాని బోర్డులో ఉంటున్న కుటుంబ వ్యాపారాలను మాత్రమే ఈ జాబితాలోకి తీసుకున్నారు. 2024 మార్చి 20 నాటికి ఈ విలువలను లెక్కించారు.ఈ జాబితాలో బజాజ్ కుటుంబం మొత్తం రూ.7.13 లక్షల కోట్ల వ్యాపార విలువతో రెండో స్థానాంలో ఉండగా బిర్లా కుటుంబం రూ.5.39 లక్షల కోట్ల విలువతో మూడవ స్థానాన్ని ఆక్రమించింది. ఇక మొదటి తరం వ్యవస్థాపక కుటుంబాల ప్రత్యేక కేటగిరీలో అదానీ కుటుంబం రూ.15.45 లక్షల కోట్ల విలువతో ముందంజలో ఉంది. ఆ తర్వాత రూ.2.37 లక్షల కోట్ల విలువతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహణలో పేరుగాంచిన పూనావాలా కుటుంబం ఉంది.2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యూయబుల్ ఫ్యామిలీ బిజినెస్‌ల ఉమ్మడి విలువ రూ.130 లక్షల కోట్లు. ఇది స్విట్జర్లాండ్, యూఏఈ వంటి దేశాల జీడీపీ కంటే అధికం. ఈ లిస్ట్‌లో మొదటి మూడు కుటుంబ వ్యాపారాల విలువ మాత్రమే రూ.46 లక్షల కోట్లు. ఇది సింగపూర్ జీడీపీకి సమానం. -
భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ బాస్ ఎవరో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన అంబానీ ఫ్యామిలీ చాలా కాలంగా వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తోంది. ధీరూభాయ్ అంబానీ కుటుంబంలోని అందరూ వ్యాపారంలో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ ముకేశ్ అంబానీ సారథ్యంలో నడుస్తోంది. ఇందులో ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ కంపెనీ నేడు ఈ స్థాయికి రావడానికి కారణమైన వాళ్లలో ధీరూభాయ్ అంబానీ సోదరీమణులలో ఒకరు కూడా ఉన్నారు.ధీరూభాయ్ అంబానీ అంటే.. ముఖేష్ అంబానీ తండ్రి, నీతా అంబానీ మామ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు అని అందరికీ తెలుసు. అయితే ఈయనకు నలుగురు తోబుట్టువులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరు త్రిలోచన బెన్, రామ్నిక్లాల్ అంబానీ, జాసుబెన్, నతుభాయ్. త్రిలోచన బెన్ వయసులో ధీరూభాయ్ అంబానీ కంటే పెద్దవారు.త్రిలోచన బెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపనలో పరోక్షంగా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే ఈమె గురించి చాలామందికి తెలియకపోవడం గమనార్హం. త్రిలోచన బెన్ కుమారుడు రిలయన్స్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన రసిక్లాల్ మెస్వానీ. ఈమె మనవళ్లు నిఖిల్ ఆర్ మేస్వానీ, హిటల్ ఆర్ మేస్వానీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కీలక పదవుల్లో ఉన్నారు.నిఖిల్ ఆర్ మేస్వానీ 1986లో ఆర్ఐఎల్లో చేరి కంపెనీ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈయన పెట్రోకెమికల్ విభాగాన్ని చూసుకుంటూ.. ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌తో పాటు ఇండియన్ సూపర్ లీగ్‌ను నిర్వహించడంలో కూడా పాల్గొంటారు.ఇక త్రిలోచన బెన్ చిన్న మనవడు హిటల్ ఆర్ మేస్వాని 1995లో కంపెనీలో చేరి.. తన అన్న నిఖిల్ మాదిరిగానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అదే పదవిని నిర్వహించారు. పెట్రోలియం రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రోకెమికల్స్ తయారీతో పాటు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (HR), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్ & టెక్నాలజీ వంటి కంపెనీ ఇతర కార్పొరేట్ విధులను కూడా ఈయన నిర్వహిస్తారు.ముకేశ్ అంబానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వ్యాపార ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. నా మొదటి బాస్.. నా అత్త కుమారుడు రసిక్లాల్ మెస్వానీ అని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈయన సంస్థను సరైన దిశలో నడిపించారని ప్రశంసించారు.రసిక్లాల్ మెస్వానీ చాలా ఓపెన్‌గా ఉంటారు. మేము ఒకరి క్యాబిన్లోకి మరొకరు వెళ్ళవచ్చు. సమావేశాల్లో, చర్చల్లో పాల్గొనవచ్చు. దీన్ని మా నాన్న ప్రోత్సహించారు. నేను అధికారికంగా రిలయన్స్‌లో చేరినప్పుడు.. నాన్న పాలిస్టర్ వ్యాపారాన్ని రసిక్‌భాయ్ కింద ఉంచారు. ఇందులో పాలిస్టర్ ఫైబర్‌ను దిగుమతి చేసుకోవడం, దానిని టెక్స్టైల్ చేయడం, మా సొంత మిల్లులలో విక్రయించడం వంటివి ఉన్నాయని ముకేశ్ అంబానీ వెల్లడించారు. -
అనంత్ అంబానీ పెళ్లికి మమతా బెనర్జీ.. మహారాష్ట్ర నేతలతో భేటీ
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి హాజరయ్యేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు (జూలై 12) ముంబైకి రానున్నారు. ఈ సందర్భంగా ఆమె మహారాష్ట్ర నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలను కలుసుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆమె ఈ దిగ్గజ నేతలను కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది.సీఎం మమతా బెనర్జీ ఈరోజు మధ్యాహ్నం ముంబైకి చేరుకోనున్నారు. అనంతరం అమె పలు సమావేశాలలో పాల్గొననున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మమతా బెనర్జీ ఈరోజు మహారాష్ట్ర నేతలు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లతో విడివిడిగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య జాతీయ రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ భేటీ కీలకం కానుంది. అలాగే మరికొద్ది వారాల్లో పార్లమెంట్ హౌస్‌లో బడ్జెట్ సమావేశాలు కూడా జరగనున్నాయి. దీనిపై కూడా మమత, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ మధ్య చర్చ జరగనున్నదని తెలుస్తోంది. ఇదిలావుండగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇటీవల ఢిల్లీలో సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్‌ను కలిశారు. అనంతరం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ముంబైలో కలుసుకున్నారు. -
అనంత్ అంబానీ వేసుకుంది మామూలు డ్రెస్ కాదు! తెలిస్తే..
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి అంబానీ స్నేహితులు, బంధువులతో పాటు, సినీ తారలు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.సంగీత్ వేడుకలో కనిపించిన అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ఇద్దరూ కూడా ప్రత్యేకమైన దుస్తులతో కనిపించారు. ఇవి మాస్టర్ కౌచర్స్ అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన దుస్తులని తెలుస్తోంది. అనంత్ అంబానీ ధరించిన జాకెట్ బంగారంతో తయారైనట్లు తెలుస్తోంది. రాధిక మర్చెంట్ ధరించిన ఆఫ్ షోల్డర్ బ్లౌజ్, లెహంగా స్వరోవ్స్కి స్ఫటికాలతో అలంకరించారు.#WATCH | Anant Ambani and Radhika Merchant arrive at Jio World Centre in Mumbai for their 'Sangeet ceremony' pic.twitter.com/yzODKut59g— ANI (@ANI) July 5, 2024జూలై 12న ముకేశ్, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహం జరగనుంది. జూలై 14 వరకు వీరిద్దరి వివాహ వేడుకలు జరగనున్నాయి. వీరి పెళ్ళికి పలువురు పారిశ్రామిక వేత్తలు, ఇతర సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. -
అంబానీ బుక్ చేసుకున్న క్రూయిజ్‌లో వెళ్తారా.. ఒక్కరోజుకి అన్ని లక్షలా?
జులైలో పెళ్లి చేసుకోబోతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గతంలో జామ్‌నగర్‌లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇటీవలే మరోసారి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ క్రూయిజ్ షిప్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుక 29 మే నుంచి జూన్ 1 వరకు జరిగింది.ఇటలీ నుంచి సౌత్ ఫ్రాన్స్ వరకు సుమారు 4,380 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన విలాసవంతమైన క్రూయిజ్ లైనర్‌లో సుమారు 800 మంది ప్రముఖులు పాల్గొన్నారు. అంబానీ ఫ్యామిలీ బుక్ చేసుకున్న ఈ క్రూయిజ్ షిప్ విలాసవంతమైన సదుపాయాలను కలిగి ఉంటుంది.గతంలో జామ్‌నగర్ వేడుకలకు అంబానీ కుటుంబం రూ.1,200 కోట్లు ఖర్చు చేసింది. ఈ సారి క్రూయిజ్ షిప్లో జరిగిన వేడుకలకు ఎంత ఖర్చు చేశారనేది అధికారికంగా వెల్లడి కాలేదు. దీనికి కూడా వేలకోట్లు ఖర్చు చేసి ఉంటారని తెలుస్తోంది.క్రూయిజ్ షిప్లో బస చేయడానికి అయ్యే ఖర్చుఅంబానీ ఫ్యామిలి బుక్ చేసుకున్న సెలబ్రిటీ అసెంట్ క్రూయిజ్ షిప్లో ఒక రాత్రి బస చేయాలనంటే ఒక గదికి 1849 డాలర్ల నుంచి 2879 డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 153705 నుంచి రూ. 239328 ఖర్చు అవుతుందని సమాచారం. సెలబ్రిటీ క్రూయిసెస్ ప్రకారం, ఓషన్-వ్యూ స్టేట్‌రూమ్ అండ్ సూట్ కోసం 5,736 డాలర్లు లేదా దాదాపు రూ. 4,76,828 వెచ్చించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. 👉 : (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మూడు రోజులు.. వెయ్యి కోట్లు! అంబానీ అంటే అట్లుంటది మరి..
ధనవంతుల ఇళ్లలో పెళ్లి అంటే ఖర్చు భారీగా ఉంటుందని అందరికి తెలుసు.. అలాంటిది ప్రపంచ కుబేరులలో ఒకరు, భారతదేశంలో అత్యంత సంపన్నులు అయిన 'ముఖేష్ అంబానీ' ఇంట పెళ్లి అంటే మాటలా? ఈ రోజు చాలా మంది మనసులో మెదిలే ప్రశ్న అంబానీ ఇంట జరుగుతున్న ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలకు ఎంత ఖర్చు చేయనున్నారు. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. లక్షల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్, ఎన్కోర్ హెల్త్‌కేర్ అధినేత 'వీరెన్ మర్చంట్' కుమార్తె రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైపోయాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలలో ఫుడ్ లిస్ట్ చూస్తేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. తినడటానికి 2500 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, రాత్రి డిన్నర్ కోసం ఇలా చాలానే వంటకాలను తయారు చేస్తున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ రోజు నుంచి మొదలైన 'అనంత్, రాధిక' ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు 1000 మంది సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్టార్ క్రికెటర్స్, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశారు. అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు 120 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 1000 కోట్లు) ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీవెడ్డింగ్గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఆయన ఆస్తిలో అది కేవలం 0.1శాతం మాత్రమే అని పలువురు చెబుతున్నారు. ఇదీ చదవండి: 10 భారతీయ కంపెనీ యాప్‌లపై కన్నెర్రజేసిన గూగుల్! అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పర్ఫామెన్స్ చేయనున్న 'రిహాన్నా'కు ఏకంగా 8 నుంచి 9 బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 66 కోట్ల నుంచి రూ. 74 కోట్లు. దీన్ని బట్టి చూస్తే అంబానీ తన కొడుకు పెళ్లి కోసం ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. -
ఇషితా సల్గావ్కర్ ఎవరు.. అంబానీతో సంబంధం ఏంటి?
భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముఖేష్ అంబానీ' గురించి తెలిసిన చాలా మందికి, ఆయన మేనకోడలు 'ఇషితా సల్గావ్కర్' (Isheta Salgaocar) గురించి తెలియకపోవచ్చు. వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు పొందిన ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరీ ఇషితా సల్గావ్కర్? ఇషితా సల్గావ్కర్.. దీప్తి సల్గావ్కర్, దత్తరాజ్ సల్గావ్కర్ దంపతుల కుమార్తె. ఈమె స్వయానా ముకేశ్ అంబానీకి మేనకోడలు. ఎందుకంటే ఇషితా తల్లి 'దీప్తి సల్గావ్కర్' ధీరూభాయ్ అంబానీ కుమార్తె.. ముకేశ్ అంబానీ సోదరి. నిజానికి ముకేశ్ అంబానీ మేనకోడలుగా కాకుండా వ్యాపార కార్యకలాపాలు, దాతృత్వ కార్యక్రమాలతోనే సుపరిచితం అయింది. ఈమె 2016లో నీరవ్ మోదీ తమ్ముడు నీషాల్ మోదీని వివాహం చేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిరువురు విడిపోయారు. ఆ తరువాత ఇషితా బిజినెస్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ మేనల్లుడు 'అతుల్య మిట్టల్'తో ప్రేమలో పడింది. వీరిద్దరూ 2022లో వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంలోని తన బంధువుల మాదిరిగా కాకుండా.. ఇషితా చదువుకునే రోజుల నుంచి గొప్ప విజయాలను సాధించింది. ఈమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తరువాత సల్గావ్కర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కార్పొరేట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తోంది. ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారు - సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్ ఆమె తల్లి దీప్తి సల్గావ్కర్ మాదిరిగానే.. ఇషితా సల్గావ్కర్ దాతృత్వ కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనేది. ఇప్పటికే అనేక విద్య, ఆరోగ్య సంరక్షణ సంబంధిత కార్యకలాపాలకు పెద్ద ఎత్తున సాయం కూడా చేసింది. ప్రస్తుతం ఇషితా నికర విలువ గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు, అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం ఈమె నికర విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని, వ్యాపార రంగంలో కూడా బాగా రాణిస్తున్నట్లు సమాచారం. -
మనవరాలి కోసం లగ్జరీ కొనవే ఏర్పాటు చేసిన ముకేశ్ అంబానీ
-
ముఖేష్ అంబానీ ఒక ఎత్తైతే.. వారి పిల్లలు అంతకు మించి!
కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ఆసియాలో అత్యంత ధనవంతుడిగా కీర్తి పొందిన 'ముఖేష్ అంబానీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వ్యాపార ప్రపంచంలో తిరుగులేని వ్యాపారవేత్తగా ముందుకు సాగుతున్న ఈ అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే కాకుండా.. పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం రంగాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ముఖేష్ అంబానీ ప్రపంచంలోని 13వ అత్యంత సంపన్న బిలియనీర్ స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు ఇటీవల ఫోర్బ్స్ నివేదించింది. ఈయన నికర ఆస్తుల విలువ 84.1 బిలియన్ డాలర్లు అని అంచనా. అంబానీ పిల్లలు కూడా తండ్రి వ్యాపారాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ.. తండ్రికి తగ్గ పిల్లలుగా ఖ్యాతి పొందారు. ఇంతకీ ముఖేష్ అంబానీ పిల్లలు రిలయన్స్ గ్రూప్‌లో ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం. ఆకాష్ అంబానీ: ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ రిలయన్స్ జియో చైర్మన్. భారతదేశంలో అతి పెద్ద టెలికాం బిజినెస్ ఆకాష్ నియంత్రణలో ఉంది. అంతే కాకుండా ఈయన ముంబై IPL జట్టుకు కో-ఓనర్ కూడా. ముంబైలోని క్యాంపియన్ స్కూల్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించిన ఆకాష్ అంబానీ 2013లో యూఎస్‌లోని బ్రౌన్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత తండ్రి వ్యాపార రంగంలో అడుగులు వేశారు. మొదట్లో జియో ఇన్ఫోకామ్‌లో స్ట్రాటజీ చీఫ్‌గా ప్రారంభమై దానిని వేగంగా అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. ప్రస్తుతం ఆతని ఆస్తుల విలువ 40 బిలియన్ డాలర్లు. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన కోటి రూపాయల లెక్సస్ కారు, ఇదే.. చూసారా?) ఇషా అంబానీ: ముఖేష్, నీతా అంబానీల కవల పిల్లలు ఇషా, ఆకాష్. వీరి ముగ్గురు పిల్లల్లో 'ఇషా' ఒక్కగానొక్క అమ్మాయి. ఈమె ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ రిటైల్ వ్యాపారానికి బాధ్యత వహిస్తోంది. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పూర్తి చేసిన తరువాత మిలియనీర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇషా అంబానీ ఆస్తుల విలువ 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. (ఇదీ చదవండి: MG Comet EV: ఇది పొట్టిది కాదండోయ్.. చాలా గట్టిది - బుకింగ్స్ & లాంచ్ ఎప్పుడంటే?) అనంత్ అంబానీ: ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లల్లో చిన్నవాడు అనంత్ అంబానీ. ఈయన రిలయన్స్ న్యూ ఎనర్జీ వ్యాపారానికి బాధ్యతలు వహిస్తూ.. రిలయన్స్ 02C & రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీకి డైరెక్టర్ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 40 బిలియన్ డాలర్లు అని అంచనా. ఇటీవల అనంత్ అంబానీకి రాధిక మర్చంట్‌తో నిశ్చితార్థం జరిగింది. -
చిన్నప్పుడే ఆ ఉద్యోగంపై మనసుపడిన ఇషా అంబానీ
అపరకుబేరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త 'ముఖేష్ అంబానీ' గురించి గానీ, వారి కుటుంబం గురించి గానీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' గురించి కొంతమందికి తెలియకపోవచ్చు. చిన్నప్పుడు టీచర్ కావాలని కలలు కన్న ఈమె ఈ రోజు ఫ్యాషన్ ప్లాట్‌ఫారమ్ AJIO బోర్డులో మేనేజింగ్ డైరెక్టర్ స్థానంలో కూర్చుంది. ఇషా అంబానీ 1991 అక్టోబర్ 23న జన్మించింది. ఈమె ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఏకైక కుమార్తె. వీరికి ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆకాష్ అంబానీ శ్లోకా మెహతాను పెళ్లి చేసుకున్నారు, అనంత్ అంబానీకి ఇటీవల రాధిక మర్చంట్‌తో నిశ్చితార్థం జరిగింది. ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి పాఠశాల విద్యను ప్రారంభించిన ఇషా అంబానీ అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. (ఇదీ చదవండి: టాటా కార్లు కొనేవారికి శుభవార్త.. ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, అంతకుమించిన బెనిఫిట్స్) 23 సంవత్సరాల వయసులో తండ్రి వ్యాపారంలో చేరిన ఇషా 2020లో రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో బోర్డులలో ఒకరుగా నిలిచింది. ఆ తరువాత ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుని, ఈ రోజు ఇషా అంబానీ ముంబైలో 450 కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లాలో నివసిస్తున్నారు. -
అంబానీ సోదరి రూ.68 వేల కోట్ల కంపెనీకి అధిపతి.. ఈమె గురించి తెలుసా?
అంబానీ కుటుంబం గురించి అందరికీ తెలుసు. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం కలిగిన కుటుంబం వారిది. దివంగత ధీరూభాయ్ అంబానీ స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు మరింత విస్తరించారు. వివిధ వ్యాపారాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ప్రసిద్ధి చెందారు. అయితే వారి సోదరీమణుల గురించి ఎక్కువ మందికి తెలియదు. ధీరూభాయ్ అంబానీకి ముఖేష్, అనిల్‌లతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి పేర్లు నీనా కొఠారి, దీప్తి సల్గావ్కర్. వీరిలో నీనా కొఠారి రూ.68 వేల కోట్ల విలువైన కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ కంపెనీకి అధిపతి. 2003లో ఆమె జావగ్రీన్ అనే కాఫీ, ఫుడ్ చైన్‌ని స్థాపించారు. నీనా కొఠారి 1986లో వ్యాపారవేత్త భద్రశ్యామ్ కొఠారిని వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అర్జున్ కొఠారి, కుమార్తె నయనతార కొఠారి ఉన్నారు. అనారోగ్య కారణాలతో శ్యామ్ కొఠారి 2015లో మరణించారు. ఆ తర్వాత నీనా కొఠారి వారి కుటుంబ వ్యాపారమైన కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ బాధ్యతలను తీసుకున్నారు. 2015లో ఆమె కంపెనీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. కార్పొరేట్ షేర్‌హోల్డింగ్స్ ప్రకారం.. నీనా భద్రశ్యామ్ కొఠారి పబ్లిక్‌గా రెండు స్టాక్లను కలిగి ఉన్నారు. వాటి నికర విలువ రూ. 52.4 కోట్లకు పైగానే. -
అదానీ, అంబానీ షేర్లే ‘‘బుల్’’ను పరిగెత్తిస్తున్నాయి..!
కరోనా వైరస్ కేసులను కట్టడి చేసేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా 2నెలలపాటు కఠిన లాక్‌డౌన్‌ను విధించింది. అంతముందే ఉన్న మార్కెట్లో నెలకొన్న ఆర్థిక వృద్ధి భయాలకు లాక్డౌన్ పొడగింపు తోడవ్వడంతో మార్కెట్ మార్చి 24న ఏడాది కనిష్టాన్ని తాకింది. ఇప్పుడు దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు 2లక్షలను నమోదైనప్పటికీ.., ఈక్విటీ మార్కెట్లు ఏప్రిల్ నుంచి నుంచి జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. స్టాక్‌మార్కెట్ మార్చి కనిష్టస్థాయి నుంచి రివకరి అయ్యేందుకు రిలయన్స్ గ్రూప్ సంస్థల షేర్ల ర్యాలీ సహకారం అందించాయి. మార్కెట్ ప్రతికూల సమయంలో గ్రూప్‌లో అన్ని షేర్లు రాణించడం విశేషం. ఇదే సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 33శాతం పెరిగింది. ఇదే కాలంలో గౌతమ్ అదానీ గ్రూప్ కూడా లాభపడ్డాయి. అయితే టాటా, బజాజ్ గ్రూప్ షేర్లు మాత్రం వెనకబడి ఉన్నట్లు ఏస్ఈక్వటీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఏఏ గ్రూప్ చెందిన షేర్లు మార్కెట్ ర్యాలీని అందుకున్నాయి.? ఎన్ని షేర్లు ఎంతశాతం వరకు రాణించాయో ఇప్పుడు చూద్దాం..! రిలయన్స్ గ్రూప్: ఈ చెందిన మొత్తం 5 షేర్లు మార్చి 24నుంచి 112శాతం ర్యాలీ చేశాయి. ఇందులో టాప్-3 గెయినర్లలో రిలయన్స్ లేకపోవడం విశేషం. హాత్వే కేబుల్స్ డాటాకామ్ షేరు 112 శాతం పెరిగింది. హాత్వే భవాని కేబుల్స్ అండ్ డామ్కామ్ (96 శాతం), డెన్ నెట్వర్క్స్(88 శాతం), రిలయన్స్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 68శాతం లాభపడ్డాయి. ఇదే కాలంలో రిలయన్స్ ఇండ్ట్రీస్ షేరు 73ర్యాలీ చేసింది. తద్వారా మార్చి 24న రూ.6లక్షల కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ ఇప్పుడు రూ.10లక్షల కోట్ల పైకి చేరుకుంది. అదానీ గ్రూప్: మార్చి కనిష్టం నుంచి గౌతమ్ అదానీ గ్రూప్‌లో మొత్తం ఆరు షేర్లు 93శాతం మేర ర్యాలీ చేశాయి. తద్వారా ఈ మార్చి 24 నుంచి గ్రూప్ మార్కెట్ క్యాప్ 44శాతం పెరిగి 1.23లక్షల కోట్ల నుంచి 1.78లక్షల కోట్లకు చేరుకుంది. అదానీ గ్రీన్ 93శాతం, అదానీ గ్యాప్ 51శాతం, అదానీ పోర్ట్స్ 46శాతం, అదానీ పవర్ 44శాతం లాభపడ్డాయి. అయితే ఇదే గ్రూప్‌లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 15శాతం, అదానీ ట్రాన్స్మిషన్స్ 1శాతం క్షీణించాయి. అదిత్యా బిర్లా గ్రూప్: మార్చి 24 నుంచి ఈ గ్రూప్ 2 మల్టీ బ్యాగర్లను ఇచ్చింది. వోడాఫోన్ ఐడియా 130శాతం, అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన టాన్ఫాక్ ఇండస్ట్రీస్ షేరు 105శాతం పెరిగాయి. హిందాల్కో గ్రూప్ 59శాతం, ఆదిత్యా బిర్లా మని 51శాతం, గ్రాసీం 50శాతం లాభపడ్డాయి. ఈ షేర్ల ర్యాలీతో మార్చి 24న రూ.1.65లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ క్యాప్ రూ.2.26లక్షల కోట్లకు చేరుకుంది. బజాజ్ గ్రూప్: ఈ గ్రూప్‌లో లిస్టైన 10 షేర్లలో 5షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల్నిచ్చాయి. బజాజ్ హిందూస్థాన్ షుగర్స్ 84శాతం, బజాజ్ ఎలక్ట్రానిక్స్ 46శాతం, బజాబ్ అటో 44శాతం, బజాజ్ హోల్డింగ్స్ ఇన్వెస్ట్మెంట్ 44శాతం, హెర్క్యులస్ హోయిస్ట్స్ షేరు 37శాతం ర్యాలీ చేశాయి. అయితే గ్రూప్‌లో అధిక వెయిటేజీ కలిగిన బజాజ్ ఫైనాన్స్ షేరు 5శాతం నష్టంతో మొత్తం గ్రూప్ మార్కెట్ క్యాప్పైనే ప్రతికూల ప్రభావాన్ని చూపింది. టాటా గ్రూప్: ఈ గ్రూప్‌లో మొత్తం 28 కంపెనీలకు చెందిన షేర్లు ఎక్చ్సేంజీల్లో లిస్ట్ అయ్యాయి. ఇన్ని కంపెనీ షేర్లలో కేవలం ఒకే ఒక్క కంపెనీకి చెందిన షేరు మాత్రమే మల్టీ బ్యాగర్‌గా మారింది. అదే టాటా కమ్యూనికేషన్ షేరు. ఈ మార్చి 24నుంచి 107శాతం లాభపడింది. గ్రూప్ స్టాక్స్ టయో రోల్స్, టాటా కెమికల్స్, నెల్కో, టీఆర్ఎఫ్, టాటా కాఫీ, టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, ర్యాలిస్ ఇండియా, టాటా ఎల్క్సీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) మరియు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) మరియు టాటా మోటార్స్ 40- 80 శాతం లాభపడ్డాయి. ‘‘ ప్రపంచ వ్యాప్తంగా, ఈక్విటీ మార్కెట్లకు బలమైన లిక్విడిటీ, వృద్ధి ఉద్దీపనల ద్వారా మద్దతు లభించే అవకాశాం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎఫ్22లో పునరుజ్జీవనం వస్తుందనే ఆశవాహన అంచనాలతో ఇన్వెసర్లు గత కాల ఆదాయాల క్షీణతను చూడటానికి సిద్ధంగా ఉండవచ్చు.’’ అని నోమురా ఇండియా తెలిపింది. -
మోడీ వస్తే అంబానీలకే మేలు
వృత్తి దారులకు సబ్‌ప్లాన్ అమలు చేయాలి: రాఘవులు హైదరాబాద్, నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే అంబానీలకే మేలు జరుగుతుంది కాని బీసీలకు కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు.తెలంగాణలో బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామని చంద్రబాబు పేర్కొనడం ప్రజలను మభ్యపెట్టటానికేనని విమర్శించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘మత్స్యకారుల జీవనోపాధి రక్షణకై ప్రత్యామ్నాయ విధానాలకే ఓటు వేయాలని, అభ్యుదయ వామపక్షాల అభ్యర్ధులను గెలిపించాలనే’ బుక్లెట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ వృత్తిదారులకు సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టినప్పుడే వారి అభివృద్ది జరుగుతుందని అన్నారు. -
ఎన్నికలకు కార్పొరేట్లూ రెడీ..!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల పోరుకు రాజకీయ పార్టీలన్నీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటుండగా... కార్పొరేట్ కంపెనీలు కూడా తమ ప్రణాళికలకు పదునుపెడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటం... ఖర్చులు కూడా భారీగా ఎగబాకడంతో పార్టీలకు నిధుల అవసరం అంతకంతకూ పెరుగుతోంది. అంతేకాదు దేశ చరిత్రలోనే ఈసారి ఎన్నికల యుద్ధం హోరాహోరీగా జరగనుంది. ప్రపంచమంతా చాలా ఉత్కంఠతో గమనించనుంది కూడా. దీంతో పార్టీల నిధుల అవసరాలను తీర్చేందుకు కార్పొరేట్ సంస్థలు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ‘ఎలక్టోరల్ ట్రస్టు’లను ఏర్పాటు చేస్తున్నాయి. దేశంలో అయిదు అగ్రగామి కార్పొరేట్ గ్రూప్‌లు ఇప్పటికే ఈ ట్రస్టులను ఏర్పాటు చేయగా.. మరో రెండు డజన్ల వరకూ వ్యాపార సంస్థలు, గ్రూప్‌లు కూడా ఇదే బాటలో ఉన్నాయి. కొత్త నిబంధనల అమలు... వ్యాపార సంస్థలు వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం మామూలే. అయితే, అవి ఇచ్చే నిధులకు పన్ను ప్రయోజనాలు లభించాలంటే మాత్రం ఏర్పాటు చేసే కొత్త ట్రస్టుల రిజిస్ట్రేషన్‌లో ‘ఎలక్టోరల్ ట్రస్టు’ అనే పేరును కచ్చితంగా జోడించాలనేది కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. ఇటీవలే ఆమోదముద్ర పడిన కొత్త కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద, అదేవిధంగా పాత చట్టంలోని సెక్షన్ 25ను అనుసరించి ఈ ట్రస్ట్‌లు ఏర్పాటవుతున్నాయి. గడిచిన అయిదు నెలల్లో ఈ నిబంధనల ప్రకారమే పలు కంపెనీలు ఈ ఎలక్టోరల్ ట్రస్ట్‌లను నాన్-ప్రాఫిట్ కంపెనీలుగా ఏర్పాటు చేసినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. కొత్త నిబంధనల కింద ‘ఎలక్టొరల్ ట్రస్టు’లను నెలకొల్పిన వాటిలో ఇలాంటి వాటిలో జనహిత్ ఎలక్టోరల్ ట్రస్ట్( అనిల్ అగర్వాల్-వేదాంత గ్రూప్), సత్య ఎలక్టొరల్ ట్రస్ట్(సునీల్ మిట్టల్-భారతీ గ్రూప్), పీపుల్స్ ఎలక్టొరల్ ట్రస్ట్(అనిల్ అంబానీ-రిలయన్స్ గ్రూప్), సమాజ్ ఎలక్టొరల్ ట్రస్ట్ అసోసియేషన్(కేకే బిర్లా గ్రూప్) ఉన్నాయి. మరో 25 వరకూ బడా వ్యాపార సంస్థలు తమ సొంత ఎలక్టోరల్ ట్రస్టులను ఏర్పాటు చేసుకొనే ప్రక్రియలో నిమగ్నమైనట్లు ప్రభుత్వ, కన్సల్టెన్సీ వర్గాల సమాచారం. కాగా, ఇలా కొత్తగా పుట్టుకొస్తున్న ట్రస్టుల్లో ఎక్కువగా తమ అనుబంధ వ్యాపార గ్రూపులకు సంబంధించి ఎలాంటి రిఫరెన్స్లూ ఇవ్వకపోవడం గమనార్హం. వివాదాలకు అడ్డుకట్ట... గతంలో కూడా అనేక బడా కార్పొరేట్లు తమ ట్రస్టుల ద్వారా పార్టీలకు విరాళాలు ఇచ్చాయి. టాటా గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, భారతీ గ్రూప్‌లతోపాటు అనేక కంపెనీలు తాము ఇచ్చిన నిధుల వివరాలను వెల్లడించాయి కూడా. అయితే, ఈ నిధుల ప్రవాహాన్ని క్రమబద్ధీకరించేందుకు, పారదర్శకతకు వీలుగా ‘ఎలక్టోరల్ ట్రస్టుల స్కీమ్’ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఇటీవల ఇచ్చిన విరాళం వివాదాస్పదం కావడంతో తాజా నిబంధనలపై దృష్టిసారించారు. దీని ప్రకారం ఏదైనా ట్రస్టు తాము అందుకున్న నిధుల్లో 95 శాతం మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఇస్తేనే వాటికి పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాదు.. ట్రస్టులకు సొమ్ములు ఇచ్చేవారు నగదురూపంలో ఇవ్వడానికి వీల్లేదు. భారతీయుల నుంచైతే పాన్ నంబర్‌ను, ప్రవాసీయులైతే పాస్‌పోర్ట్ నంబర్‌ను ట్రస్టులు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీయులు లేదా విదేశీ కంపెనీల నుంచి ఎలాంటి నిధులనూ సమీకరించకూడదనేది కూడా కీలక నిబంధనల్లో ఒకటి. కాగా, ఇలాంటి ఎలక్టొరల్ ట్రస్టులను ఏర్పాటు చేయకుండా కూడా కంపెనీలు పార్టీలకు నేరుగా విరాళాలు ఇవ్వొచ్చు. కానీ... ఆ నిధుల ప్రవాహం ఇతరత్రా పక్కా వివరాలన్నీ వెల్లడించాల్సి ఉంటుంది.