కరోనా వైరస్ కేసులను కట్టడి చేసేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా 2నెలలపాటు కఠిన లాక్‌డౌన్‌ను విధించింది. అంతముందే ఉన్న మార్కెట్లో నెలకొన్న ఆర్థిక వృద్ధి భయాలకు లాక్‌డౌన్ పొడగింపు తోడవ్వడంతో మార్కెట్ మార్చి 24న ఏడాది కనిష్టాన్ని తాకింది. ఇప్పుడు దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు 2లక్షలను నమోదైనప్పటికీ.., ఈక్విటీ మార్కెట్లు ఏప్రిల్ నుంచి నుంచి జోరుగా ర్యాలీ చేస్తున్నాయి.
స్టాక్‌మార్కెట్ మార్చి కనిష్టస్థాయి నుంచి రివకరి అయ్యేందుకు రిలయన్స్ గ్రూప్ సంస్థల షేర్ల ర్యాలీ సహకారం అందించాయి. మార్కెట్ ప్రతికూల సమయంలో గ్రూప్‌లో అన్ని షేర్లు రాణించడం విశేషం. ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 33శాతం పెరిగింది. ఇదే కాలంలో గౌతమ్ అదానీ గ్రూప్ కూడా లాభపడ్డాయి. అయితే టాటా, బజాజ్ గ్రూప్ షేర్లు మాత్రం వెనకబడి ఉన్నట్లు ఏస్‌ఈక్వటీ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో ఏఏ గ్రూప్ చెందిన షేర్లు మార్కెట్ ర్యాలీని అందుకున్నాయి.? ఎన్ని షేర్లు ఎంతశాతం వరకు రాణించాయో ఇప్పుడు చూద్దాం..!
రిలయన్స్ గ్రూప్: ఈ చెందిన మొత్తం 5 షేర్లు మార్చి 24నుంచి 112శాతం ర్యాలీ చేశాయి. ఇందులో టాప్-3 గెయినర్లలో రిలయన్స్ లేకపోవడం విశేషం. హాత్‌వే కేబుల్స్ డాటాకామ్ షేరు 112 శాతం పెరిగింది. హాత్వే భవాని కేబుల్స్ అండ్ డామ్‌కామ్ (96 శాతం), డెన్ నెట్‌వర్క్స్(88 శాతం), రిలయన్స్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 68శాతం లాభపడ్డాయి. ఇదే కాలంలో రిలయన్స్ ఇండ్ట్రీస్ షేరు 73ర్యాలీ చేసింది. తద్వారా మార్చి 24న రూ.6లక్షల కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ ఇప్పుడు రూ.10లక్షల కోట్ల పైకి చేరుకుంది.
అదానీ గ్రూప్: మార్చి కనిష్టం నుంచి గౌతమ్ అదానీ గ్రూప్‌లో మొత్తం ఆరు షేర్లు 93శాతం మేర ర్యాలీ చేశాయి. తద్వారా ఈ మార్చి 24 నుంచి గ్రూప్ మార్కెట్ క్యాప్ 44శాతం పెరిగి 1.23లక్షల కోట్ల నుంచి 1.78లక్షల కోట్లకు చేరుకుంది. అదానీ గ్రీన్ 93శాతం, అదానీ గ్యాప్ 51శాతం, అదానీ పోర్ట్స్ 46శాతం, అదానీ పవర్ 44శాతం లాభపడ్డాయి. అయితే ఇదే గ్రూప్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 15శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్స్ 1శాతం క్షీణించాయి.
అదిత్యా బిర్లా గ్రూప్: మార్చి 24 నుంచి ఈ గ్రూప్ 2 మల్టీ బ్యాగర్లను ఇచ్చింది. వోడాఫోన్ ఐడియా 130శాతం, అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన టాన్ఫాక్ ఇండస్ట్రీస్ షేరు 105శాతం పెరిగాయి. హిందాల్కో గ్రూప్ 59శాతం, ఆదిత్యా బిర్లా మని 51శాతం, గ్రాసీం 50శాతం లాభపడ్డాయి. ఈ షేర్ల ర్యాలీతో మార్చి 24న రూ.1.65లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ క్యాప్ రూ.2.26లక్షల కోట్లకు చేరుకుంది.
బజాజ్ గ్రూప్: ఈ గ్రూప్‌లో లిస్టైన 10 షేర్లలో 5షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల్నిచ్చాయి. బజాజ్ హిందూస్థాన్ షుగర్స్ 84శాతం, బజాజ్ ఎలక్ట్రానిక్స్ 46శాతం, బజాబ్ అటో 44శాతం, బజాజ్ హోల్డింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్ 44శాతం, హెర్క్యులస్ హోయిస్ట్స్ షేరు 37శాతం ర్యాలీ చేశాయి. అయితే గ్రూప్‌లో అధిక వెయిటేజీ కలిగిన బజాజ్ ఫైనాన్స్ షేరు 5శాతం నష్టంతో మొత్తం గ్రూప్ మార్కెట్ క్యాప్‌పైనే ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
టాటా గ్రూప్: ఈ గ్రూప్‌లో మొత్తం 28 కంపెనీలకు చెందిన షేర్లు ఎక్చ్సేంజీల్లో లిస్ట్ అయ్యాయి. ఇన్ని కంపెనీ షేర్లలో కేవలం ఒకే ఒక్క కంపెనీకి చెందిన షేరు మాత్రమే మల్టీ బ్యాగర్‌గా మారింది. అదే టాటా కమ్యూనికేషన్ షేరు. ఈ మార్చి 24నుంచి 107శాతం లాభపడింది. గ్రూప్ స్టాక్స్ టయో రోల్స్, టాటా కెమికల్స్, నెల్కో, టీఆర్ఎఫ్, టాటా కాఫీ, టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, ర్యాలిస్ ఇండియా, టాటా ఎల్క్సీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) మరియు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) మరియు టాటా మోటార్స్ 40- 80 శాతం లాభపడ్డాయి.
‘‘ ప్రపంచ వ్యాప్తంగా, ఈక్విటీ మార్కెట్లకు బలమైన లిక్విడిటీ, వృద్ధి ఉద్దీపనల ద్వారా మద్దతు లభించే అవకాశాం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎఫ్22లో పునరుజ్జీవనం వస్తుందనే ఆశవాహన అంచనాలతో ఇన్వెసర్లు గత కాల ఆదాయాల క్షీణతను చూడటానికి సిద్ధంగా ఉండవచ్చు.’’ అని నోమురా ఇండియా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment