
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి అంబానీ స్నేహితులు, బంధువులతో పాటు, సినీ తారలు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
సంగీత్ వేడుకలో కనిపించిన అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ఇద్దరూ కూడా ప్రత్యేకమైన దుస్తులతో కనిపించారు. ఇవి మాస్టర్ కౌచర్స్ అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన దుస్తులని తెలుస్తోంది. అనంత్ అంబానీ ధరించిన జాకెట్ బంగారంతో తయారైనట్లు తెలుస్తోంది. రాధిక మర్చెంట్ ధరించిన ఆఫ్ షోల్డర్ బ్లౌజ్, లెహంగా స్వరోవ్‌స్కి స్ఫటికాలతో అలంకరించారు.
#WATCH | Anant Ambani and Radhika Merchant arrive at Jio World Centre in Mumbai for their 'Sangeet ceremony' pic.twitter.com/yzODKut59g
— ANI (@ANI) July 5, 2024
జూలై 12న ముకేశ్, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహం జరగనుంది. జూలై 14 వరకు వీరిద్దరి వివాహ వేడుకలు జరగనున్నాయి. వీరి పెళ్ళికి పలువురు పారిశ్రామిక వేత్తలు, ఇతర సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment