
రిలయన్స్ జ్యువెల్స్ తన వినియోగదారులకు పండుగ ఆఫర్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఉగాది, మహారాష్ట్రలో గుడిపడ్వా పర్వదినాన్ని పురస్కరించుకొని బంగారం, వజ్రాభరణాల కొనుగోలుదారుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
ఈ ఉత్సవాలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు రిలయన్స్ జ్యువెల్స్ మార్చి 31 వరకు ప్రత్యేక పండుగ సేల్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగా కొనుగోలుదారులు బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 50% వరకు, వజ్రాభరణాల విలువ, వాటి తయారీ ఛార్జీలపై 35% వరకు తగ్గింపును పొందవచ్చని పేర్కొంది. నిర్దేశించిన తేదీలోపు దేశంలోని రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్‌ల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.
ఇదీ చదవండి: చైనా ఆర్మీలోకి ‘డీప్‌సీక్’!
మహారాష్ట్రలో గుడిపడ్వా అనేది పెద్ద పండుగ. ఈ సమయంలో చాలామంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారని కంపెనీ తెలిపింది. వీరికోసం ప్రత్యేక డిజైన్లలో నాథ్ (ముక్కు ఉంగరం), చంద్రకోర్ బిందీ, తుషి నెక్లెస్‌లు.. వంటివి అందిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా తెలుగు వారి తొలి పండుగ ఉగాదిని పురస్కరించుకొని గుట్టపూసలు, నెక్లెస్‌లు, లక్ష్మీ నాణెం హరాలు, కాసు మాలలు..వంటివి ప్రత్యేక డిజైన్‌ల్లో రూపొందించినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment