Jewelry
-
చూసేందుకు చిన్నదే..కానీ ఆదరణ పెద్దది..!
ఆభరణాల పెట్టెలో భారీ విశ్వం, నాలుగు అంగుళాలకు మించని మినీ బీచ్‌లో బృందాల జలకాలాటలు, అతి పెద్ద గొడపై నిలిచిన అతి చిన్ని డబుల్ థ్రెషోల్డ్... అబ్బురం అనిపించే ఈ సూక్ష్మ చిత్ర కళ ఇప్పుడు ప్రపంచంలో పెద్దగా ప్రజాదరణ పొందుతోంది. ఆర్ట్ గ్యాలరీలు, ఆర్ట్ ఫెయిర్స్లో ఈ కళ కొత్తగా ఆకట్టుకుంటుంది. ప్రపంచ ఆర్ట్ ప్రియులు కళ ఇలా రూపు మారడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఆర్ట్ మార్కెట్‌ను మినియేచర్ ఆర్టిస్టులు ఏలేస్తున్నారు అని ప్రశంసిస్తున్నారు. దేశీయ మినియేచర్ఇటీవల కాలంలో భారతదేశంలో అనేక మినీయేచర్ పెయింటింగ్ స్కూళ్లు పుట్టుకువచ్చాయి. ప్రతి ఒక్కటి దాని సాంస్కృతిక, ప్రాంతీయ, చారిత్రక సందర్భాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా ఆకట్టుకుంటున్నది మొఘల్ స్కూల్ ఆఫ్ మినియేచర్. దీనిలో కిషన్‌గఢ్ శైలి, రాధా కృష్ణుల దైవిక ప్రేమలు మరింత ప్రత్యేకమైనవి. పహారీ స్కూల్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూలోని కొండ ప్రాంతాలలో అభివృద్ధి చెందింది. దక్కన్ స్కూల్ పర్షియన్, టర్కిష్, భారతీయ అంశాల కలయికను ప్రదర్శిస్తుంది. సూక్ష్మ చిత్రాలలో వెలసిన పచ్చని ప్రకృతి దృశ్యాలు, అద్భుతమైన థీమ్‌లో ఇవన్నీ విభిన్నంగా ఉంటాయి. విదేశాలలో సూక్ష్మ కళసంవత్సరాల క్రితం కెనడియన్ మినియేచర్ ఆర్టిస్ట్ శాంటియాగో తనదైన పనితనంతో ఇంట్లోనే చిన్న చిన్న పెయింటింగ్స్ వేస్తూ, శిల్పాలు చెక్కుతూ ఉండేవాడు. కెనడియన్ కలెక్టర్ బ్రూస్ బెయిలీ శాంటియోగోను కలిసినప్పుడు అతని కళా నైపుణ్యాన్ని చూసి కొంతకాలం ‘ఓపికపట్టండి’ అని చెప్పాడట. శాంటియాగో నవ్వుతూనే కాలక్రమంలో అందరూ వదిలేసిన వుస్తవులను అతి చిన్న నమూనా బొమ్మలను తయారుచేశాడు. ఒక జత కఫ్లింగ్లకు సరిపోయేంత పెట్టెలో ఒక సముద్రాన్నే సృష్టించాడు. కాలక్రమంలో కళాభిరుచిగలవారు ఈ సూక్ష్మ కళ ప్రాముఖ్యతను గుర్తిస్తారని అతను నమ్మాడు. ఈ విషయాన్ని బెయిలీ ప్రస్తావిస్తూ ‘2018లో శాంటియాగో పని తనాన్ని చూసినప్పుడు, నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇన్నాళ్లకు నిజమయ్యింది’ అంటాడు. ఇటీవల గ్యాలరీలలో అతి చిన్న కళాకృతులు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘మనుషుల ఆలోచనలు ఎలా మారతాయో చూడటం ఆసక్తికరంగా ఉంది’ అంటాడు శాంటియాగో. 2010 చివర 2020ల ప్రారంభంలో సూక్ష్మ కళ అత్యున్నత శిఖరాలకు వెళ్ళిన సమయంగా చెప్పుకోవచ్చు. దీనిని యువ చిత్రకారులు చాలా ముందుకు తీసుకెళ్లారు. ఈవిషయం గురించి శాంటియోగో వివరిస్తూ ‘నేను ఇంతటి ఆదరణను ఊహించలేదు. ఆర్ట్నెట్ ప్రైస్ డేటాబేస్ ద్వారా సెకండరీ మార్కెట్లో ప్రదర్శించిన ఆర్ట్‌ను పరిశీలిస్తే కిందటి సంవత్సరం దాదాపు 2 మిలియన్లకు అమ్ముడైన పెయింటింగ్ ఉంది. అదేవిధంగా డిజిటల్ పెయింటింగ్‌లు, సైక్లాడిక్ మాస్క్, జపనీస్ హెల్మెట్ స్టాండ్ వంటివి ఉన్నాయి. మెక్సికోలో సూక్ష్మ ఆర్ట్ గ్యాలరీమహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉన్నారు. అప్పుడు వారి చూపు తమ ఇంటీరీయర్ వైపు మళ్లింది. అప్పుడే తమలోని సృజనకు పదును పెట్టినవారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది. షార్ప్ టైలర్ అనే కళాకారుడు మెక్సికో నగరంలో ‘లులు’ అనే సూక్ష్మ ఆర్ట్ గ్యాలరీని నడిపేవాడు. ఆ తరువాత లాస్ ఏంజిల్స్‌లోని పెద్ద స్టూడియోకు తన చిత్రకళను మార్చాడు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తమ దేశీయ సంస్కృతికి కళాకారులు అద్దం పడుతూనే ఉన్నారు. సోషల్ మీడియా ప్రభావంపరిమాణంతో సంబంధం లేకుండానే సోషల్ మీడియాలో ఈ చిత్రకళా ప్రదర్శన నిత్యం జరుగుతూనే ఉంది. అతి పెద్ద గోడలపైన అతి చిన్న కళాకృతి ఆసక్తిని రేపుతుంది.‘ చిత్రాలలో అంతర్లీనంగా ఉన్న సున్నితత్వం తోపాటు రహస్యం దాగుంటుంది. దానిని కనుక్కోవడంలో చేసే ప్రయత్నం అత్యంత మనోహరంగా ఉంటుంది’ అంటున్నారీ కళాకారులు. (చదవండి: భారత్ యువకుడిని పెళ్లాడిన గ్రీకు అమ్మాయి) -
డ్రైఫ్రూట్స్ నగల ధగధగలు
ఫంక్షన్లో పదిమంది దృష్టి పడేలా ప్రత్యేకంగా కనిపించాలనుకోవడం సహజం. మేకప్ ఆర్టిస్ట్ వసుంధర మరింత ప్రత్యేకంగా కనిపించాలని డిసైడై ‘డ్రై ఫ్రూట్స్ జ్యూలరీ’ ధరించింది. యూనిక్ లుక్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో బజ్ క్రియేట్ చేసింది. మాంగ్ టిక్క, గాజులు, జూకాలు, వడ్డాణం... ఇలా అన్నీ డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసినవే. ఫంక్షన్ తరువాత డ్రైఫ్రూట్స్‌ను రీయూజ్ చేస్తారా, పారేస్తారా అనేది మాత్రం తెలియదు. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వేలాది లైక్‌లతో వైరల్ అయింది. ‘భలే ఉన్నారు’ అనే ప్రశంసలతో పాటు ‘వేస్టేజ్ ఆఫ్ ఫుడ్’లాంటి కామెంట్స్ కనిపించాయి. -
శ్రీవారికి 2.12 కిలోల బంగారు కంఠాభరణం.. కానుకగా సమర్పించిన వైవీ సుబ్బారెడ్డి దంపతులు
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలత ఆదివారం శ్రీదేవి సమేత బంగారు కంఠాభరణాన్ని కానుకగా సమర్పించారు. ఈ ఆభరణాన్ని 2 కిలోల 12 గ్రాముల 500 మిల్లీ గ్రాములతో తయారు చేశారు. వైవీ సుబ్బారెడ్డి దంపతులు తొలుత శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌కు ఈ ఆభరణాన్ని అందించారు. విశ్వశాంతి కోసం తిరుమల ధర్మగిరి వేద విద్యాపీఠంలో ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం విజయవంతంగా ముగిసిన సందర్భంగా స్వామివారికి కానుకను సమర్పించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చదవండి: భద్రతకు గట్టి భరోసా -
ఆభరణమూ చరిత్ర చెబుతుంది
పొన్నియిన్ సెల్వన్... అది ఒక చరిత్ర పుస్తకం. అది ఒక సాహిత్య సుమం. అది ఒక సామాజిక దృశ్యకావ్యం. వీటన్నింటికీ దర్పణాలు ఈ ఆభరణాలు. ఆభరణం చరిత్రను చెబుతుంది. ఆభరణం కూడా కథను నడిపిస్తుంది. ఆ ఆభరణాలకు రూపమిచ్చిన డిజైనర్... ప్రతీక్ష ప్రశాంత్ పరిచయం ఇది. ప్రతీక్ష ప్రశాంత్... ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఆమె కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. తన క్రియేటివిటీతో తెరకు కళాత్మకతను పొదిగారామె. ఆ సినిమాలో నటీనటులు ధరించిన ఆభరణాలను రూపొందించిన ప్రతీక్ష ప్రశాంత్... సినిమా కోసం తనకు ఏ మాత్రం అవగాహన లేని చోళ రాజుల గురించి తెలుసుకున్నారు. వారి జీవన శైలి, వారికి ఇతర దేశాలతో ఉన్న వర్తక వాణిజ్యాలు, ఆచారవ్యవహారాలు, ధార్మికజీవనం... అన్నింటినీ ఔపోశన పట్టారు ప్రతీక్ష. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ‘‘మాకు సినిమా ప్రపంచంతో ఏ మాత్రం పరిచయం లేదు. మా ఇంట్లో వాళ్లు మహా బిడియస్థులు. మా పూర్వికులు నిజాం కుటుంబాలకు ఆభరణాలు తయారు చేశారు. హైదరాబాద్ లో ఆరు దశాబ్దాలుగా ఆభరణాల తయారీ, అమ్మకాల వ్యాపారంలో ఉన్నారు. కానీ వాళ్ల ఫొటోలు కూడా ఎక్కడా కనిపించవు. అలాంటిది ఒక్కసారిగా నేను సినిమా కోసం పని చేయడం ఊహించని మలుపు అనే చెప్పాలి. సినిమాకు ఆర్నమెంట్ డిజైనర్‌గా కంటే ముందు నా గురించి చెప్పాలంటే... మాది గుజరాతీ కుటుంబం. నేను పుట్టింది, పెరిగింది మాత్రం ముంబయిలో. మా నాన్నలాగే ఆర్కిటెక్చర్ చేశాను. పెళ్లితో కిషన్‌దాస్ ఆభరణాల తయారీ కుటుంబంలోకి వచ్చాను. నాకు ఉత్తరాది కల్చర్‌తోపాటు హైదరాబాద్ కల్చర్ తో మాత్రమే పరిచయం. అలాంటిది తమిళనాడుకు చెందిన ఒక పీరియాడికల్ మూవీకి పని చేయవలసిందిగా ఆహ్వానం అందడం నిజంగా ఆశ్చర్యమే. ఆ సినిమాకు డ్రెస్ డిజైనర్‌గా పనిచేసిన ‘ఏకా లఖానీ’కి నాకు కామన్ ఫ్రెండ్ సినీ నటి అదితి రావు హైదరీ. ఆమె ఆర్నమెంట్ డిజైనింగ్‌లో నా స్కిల్ గురించి ఏకా లఖానీకి చెప్పడంతో నాకు పిలుపు వచ్చింది. మణిరత్నం గారితో మాట్లాడిన తరవాత నేను చేయాల్సిన బాధ్యత ఎంత కీలకమైనదో అర్థమైంది. కొంచెం ఆందోళన కూడా కలిగింది. ఎందుకంటే నాకు చోళుల గురించి తెలియదు. ఆభరణాలు అర్థం కావడానికి కొన్ని పెయింటింగ్స్ చూపించారు. వాటిని చూసి యథాతథంగా చేయడం నాకు నచ్చలేదు. అందుకే చోళుల గురించి అధ్యయనం చేశాను. విదేశీ మణిమాణిక్యాలు చోళులు ధరించిన ఆభరణాల్లో ఉన్న మాణిక్యాలు మామూలు మాణిక్యాలు కాదు. అవి బర్మా రూబీలు. బర్మాతో చోళులకు ఉన్న వర్తక వాణిజ్యాల గురించి తెలిస్తేనే నేను ఆభరణంలో బర్మా రూబీ వాడగలుగుతాను. టాంజానియా, గోల్కొండతో కూడా మంచి సంబంధాలుండేవి. మరకతాలు, వజ్రాల్లో ఆ మేరకు జాగ్రత్త తీసుకున్నాం. అలాగే చోళులు శివభక్తులు, చేతికి నాగ వంకీలను ధరిస్తారు. తలకు పెద్ద కొప్పు పెట్టి, ఆ కొప్పుకు సూర్యవంక, చంద్రవంక, నాగరం వంటి ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాల్లో కమలం వంటి రకరకాల పూలు– లతలు, నెమలి, రామచిలుక వంటి పక్షులు, దేవతల రూపాలు ఇమిడి ఉంటాయి. ముక్కు పుడక నుంచి చేతి వంకీ, ముంజేతి కంకణం, వడ్డాణం, తల ఆభరణాలు... వేటికవి తనవంతుగా కథను చెబుతాయి, కథకు ప్రాణం పోస్తాయి. రంగస్థలం అయితే తల వెనుక వైపు ఆభరణాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండక పోవచ్చు. కానీ సినిమాలో ముఖ్యంగా మణిరత్నం మూవీలో కెమెరా పాత్ర చుట్టూ 360 డిగ్రీల్లో తిరుగుతుంది. కాబట్టి ఎక్కడా రాజీ పడడానికి వీల్లేదు. పైగా ఇప్పుడు ప్రేక్షకులు ఒకప్పటిలాగ సినిమా చూసి బాగుందనో, బాగోలేదనో ఒక అభిప్రాయంతో సరిపుచ్చడం లేదు. పాత్ర అలంకరణ నుంచి, సన్నివేశం నేపథ్యం వరకు ప్రతిదీ నిశితంగా గమనిస్తున్నారు, పొరపాటు జరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆటపట్టిస్తారు. అలాగే ఒకసారి ఐశ్వర్య ధరించిన ఆభరణాన్ని మరోసారి పారపాటున త్రిషకు అలంకరించామంటే ఇక అంతే. అప్పట్లో కోర్సుల్లేవు ఇక నా ఆర్నమెంట్ డిజైనర్ కెరీర్ విషయానికి వస్తే... నేను ఇందులో ఎటువంటి కోర్సూ చేయలేదు. ఇప్పటిలాగ పాతిక– ముప్పై ఏళ్ల కిందట కోర్సులు లేవు కూడా. మా మామగారికి సహాయంగా స్టోర్‌లోకి అడుగుపెట్టాను. నిపుణులైన మా కారిగర్స్ తమ అనుభవంతో పని నేర్పించారు. ప్రతి పనినీ ఆసక్తితో నేర్చుకున్నాను. ఇప్పటికీ రోజూ మధ్యాహ్నం వరకు నా ఆర్కిటెక్చర్ ఆఫీస్, మధ్యాహ్నం నుంచి ఆర్నమెంట్ స్టోర్ చూసుకుంటూ ఉంటాను. ఈ సినిమాకి పని చేయడం నా జీవితంలో ఒక విశిష్టమైన ఘట్టం’’ అన్నారామె. చారిత్రక దృశ్యమాలిక ఈ సినిమా కోసం మూడేళ్లు పనిచేశాను. నాలుగు వందల మంది డాన్సర్స్‌తో చిత్రీకరించిన విజయగీతం చాలా పెద్దది. సినిమా కోసం 450 ఆభరణాలు బంగారంతో చేశాం. ఐశ్వర్యారాయ్, త్రిష, విక్రమ్, జయం రవి, కార్తి, శోభిత... వంటి ముఖ్యపాత్రలతోపాటు మరికొన్ని ప్రధాన పాత్రలకు బంగారు ఆభరణాలు, చిన్న పాత్రలకు గిల్టు ఆభరణాలు చేశాం. దర్బార్ సన్నివేశాలు, యుద్ధఘట్టాలు, డాన్సులు... సన్నివేశాన్ని బట్టి ఆభరణం మారుతుంది. అలాగే ఒక్కో పాత్ర హెయిర్ స్టయిల్ ఒక్కో రకంగా ఉంటుంది. తలకు అలంకరించే ఆభరణాలు కూడా మారుతాయి. ప్రతి ఆభరణమూ చోళుల కాలాన్ని స్ఫురింపచేయాలి. చోళుల రాజ చిహ్నం పులి. రాజముద్రికల మీద పులి బొమ్మ ఉంటుంది. ఉంగరం మీద కొంత కథ నడుస్తుంది. కాబట్టి ఆ సీన్లో చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా పులితోపాటు పామ్ ట్రీ కూడా ఉండేటట్లు దంతంతో ఆభరణాన్ని రూపొందించాం. కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రఖ్యాత తమిళ నవలకు, చారిత్రక ఘట్టాలకు దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడా లోపం జరగకూడదనేది మణిరత్నం గారి సంకల్పం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. – ప్రతీక్ష ప్రశాంత్, ఆర్నమెంట్ డిజైనర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
ఇలియానాను నిత్యనూతనంగా చూపించే బ్రాండ్స్ ఇవే..!
ఇలియానా... ఈ మధ్య సినిమాల్లో కన్నా ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తోంది.. అదే గ్లామర్‌తో ఇలా! ఆమెను అలా నిత్యనూతనంగా చూపించే ఆ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. గోపి వేద్ చిన్ననాటి స్నేహితులిద్దరి భిన్న ఆలోచనల ఫ్యూజనే ‘గోపి వేద్’ లేబుల్. ఆ ఇద్దరిలోని ఒకరే గోపి వేద్. ఇంకో ఫ్రెండ్ అర్నాజ్ సూనావాలా. ముంబై వాసులు. గోపి వేద్ ‘లా’ చదివి.. బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చేసింది. అర్నాజ్ ఈఎన్టీ (డాక్టర్) గోల్డ్ మెడలిస్ట్. చదువు ఈ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్‌ను దూరం చేసినా డ్రెస్ డిజైనింగ్ పట్ల ఉన్న కామన్ ఇంటరెస్ట్ ఇద్దరినీ కలిపింది మళ్లీ. అలా కలిసి ‘గోపి వేద్’ను ప్రారంభించారు. నిజానికి గోపి వేద్ కుటుంబ నేపథ్యం కూడా వస్త్ర ప్రపంచమే. గోపి వాళ్లమ్మ డ్రెస్ డిజైనర్. వాళ్లింటి కింది అంతస్తులో వర్క్ షాప్ ఉండేది. అది చూసీ చూసీ గోపి వేద్‌లో డ్రెస్ డిజైనింగ్ పట్ల ఆసక్తి మొదలైంది. అందుకే చదువయ్యాక ఈ రంగంలోకి వచ్చింది. ఆమెకు అండగా నిలిచింది అర్నాజ్. గోపి వేద్ డ్రెస్ డిజైన్, కలర్స్ చూస్తే.. అర్నాజ్.. ఫ్యాబ్రిక్ అండ్ బిజినెస్ చూసుకుంటుంది. అలా ఈ ఇద్దరి వైవిధ్యమైన ఆలోచనలు, ధోరణుల మిశ్రమ ఫలితంగా ‘గోపి వేద్’ అనే కళాత్మాకమైన లేబుల్ ఆవిష్కృతమైంది. బ్రైడల్ కలెక్షన్స్ వీరి బ్రాండ్ వాల్యూ. పూజా డైమండ్స్ 1989లో మొదలైంది ఈ బ్రాండ్ ప్రస్థానం. వ్యవస్థాపకులు.. ముఖేశ్ మెహతా, పప్పు భాయ్. అహ్మదాబాద్ వాసులు. తొలుత ఈ ఇద్దరూ డైమండ్ హోల్‌సేల్ వ్యాపారం చేసేవాళ్లు. నగల తయారీ పట్ల ఈ ఇద్దరికీ ఉన్న ఇష్టం, సృజనే వీళ్లు పూజా డైమండ్స్‌ను స్థాపించేలా చేసింది. అలా పూజా డైమండ్స్ ఫస్ట్ షోరూమ్‌ను 2001లో అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. తమ బ్రాండ్‌కున్న డిమాండ్‌ను చూసి రెండో షోరూమ్‌ను 2016లో ముంబైలో స్టార్ట్ చేశారు. కొనుగోలుదారుల నమ్మకమే బ్రాండ్ వాల్యూగా వీళ్ల వ్యాపారం వృద్ధిచెందుతోంది. నా ఫిట్నెస్ రహస్యం వ్యాయామం. దిగులుగా ఉన్నా.. నిరుత్సాహంగా ఉన్నా వ్యాయామం మొదలుపెడతా. అంతే.. మనసు ఉత్సాహంతో ఉరకలేస్తుంది.. కొత్త శక్తి ఆవహిస్తుంది. – ఇలియానా జ్యూయెలరీ: డైమండ్ ఇయర్ రింగ్స్ బ్రాండ్: పూజా డైమండ్స్ ధర: నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. డ్రెస్ షరారా సెట్ బ్రాండ్: గోపి వేద్ ధర: 28,500 -
గోల్డ్ రష్
సాక్షి, అమరావతి బ్యూరో: పుత్తడి ధర అందనంతగా పరుగులు తీస్తోంది. బంగారం రోజురోజుకూ ప్రియమవుతోంది. పెళ్లిళ్ల సీజన్ ఆరంభమైన తరుణంలో పసిడి ధరలు ప్రియం కావడం శుభకార్యాలు నిర్వహించే కుటుంబాలకు భారంగా మారుతోంది. విజయవాడలో జనవరి రెండో వారంలో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.50 వేల లోపు, 22 క్యారెట్ల ధర రూ.46 వేల వరకు ఉంది. ప్రస్తుతం విజయవాడ, విశాఖలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ.50,470 ఉంది. అంటే మూడు నెలల్లో 10 గ్రాములపై రూ.4,200 నుంచి 4,500కిపైగా పెరిగింది. బంగారం మరింత ఎగబాకే అవకాశం ఉందని చెబుతున్నారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఇంట్లో వివాహ వేడుకలకు కనీసం నాలుగైదు తులాల (45–55 గ్రాముల) బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. పెరుగుతున్న కొనుగోళ్లు.. పసిడి ధర అమాంతం పెరుగుతున్నప్పటికీ శుభకార్యాలు నిర్వహించే కుటుంబాలకు కొనుగోలు చేయక తప్పడం లేదు. పెళ్లిళ్ల సీజను మొదలు కావడం, బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న ప్రచారంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మూడు నాలుగు నెలల క్రితంతో పోల్చితే ప్రస్తుతం బంగారం అమ్మకాలు బాగున్నాయని విజయవాడ వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన జ్యుయలరీ షాపు యజమాని నరేంద్ర ‘సాక్షి’కి తెలిపారు. కారణాలివీ.. ఆభరణాల కోసమే కాకుండా ఎలక్ట్రానిక్ డివైస్ల తయారీలోనూ బంగారాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఉత్పత్తి రంగాలు పుంజుకుంటున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ డివైస్ల తయారీ కూడా ఊపందుకుంటోంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు గణనీయంగా పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం, బంగారంపై పెట్టుబడులు సురక్షితమనే ఉద్దేశం, బ్యాంకుల వడ్డీ రేట్లు క్షీణించడం, షేర్ మార్కెట్లలో అనిశ్చితి.. వెరసి పసిడి ధరల పెరుగుదలకు ప్రత్యక్ష, పరోక్షంగా దోహదం చేస్తున్నాయని బులియన్ మార్కెట్ వర్తకులు విశ్లేషిస్తున్నారు. -
ఆ గోల్డ్.. మహా బోల్డ్
నరసాపురం (పశ్చిమ గోదావరి): వజ్రాలు, రత్నాల్లాంటి రాళ్లు పొదిగిన నెక్లెస్.. రూపాయి కాసంత కట్ ఉంగరం.. స్వర్ణ కంకణం సైజులో గాజులు.. నగిషీలతో తీర్చిదిద్దిన జూకాలు.. విభిన్న ఆకృతుల్లో వడ్డాణాలు.. అందాలు చిందే అర వంకీలు.. తలపై మెరిసే పాపట బొట్టు.. మెడలో హారం.. నడుముకు వడ్డాణం.. కాళ్లకు పట్టీలు.. వీటిలోనూ వందల రకాలు. బంగారు ఆభరణాల తళుకు బెళుకులకు ఏమాత్రం తీసిపోనివిధంగా అధునాతన డిజైన్లలో రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ ఆభరణాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. గీటు పెడితేనే గాని అవి గోల్డో, రోల్డ్ గోల్డో కనుక్కోలేని విధంగా వీటిని తయారు చేస్తున్నారు. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా వీటిదే హవా. పేద, ధనిక భేదం లేకుండా మహిళలంతా వీటినే ధరిస్తున్నారు. బంగారాన్ని తలదన్నేలా.. బంగారాన్ని తలదన్నే రీతిలో రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ నగల వ్యాపారం పైపైకి ఎగబాకుతోంది. బంగారం ధర బరువెక్కిన పరిస్థితుల్లో అది ధనికులకు పెట్టుబడి వ్యవహారంగా మారిపోయింది. ఇంకోవైపు నగలు ఇంట్లో పెట్టుకున్నా.. ధరించి వీధిలో తిరిగినా దొంగల భయం. దీంతో మహిళలు ఇటీవల కాలంలో ఫంక్షన్లలో సైతం రోల్డ్ గోల్డ్ ఆభరణాలనే ధరిస్తున్నారు. తక్కువ ఖర్చుతో.. కోరుకున్న డిజైన్లలో ఈ నగలు లభిస్తుండడంతో మహిళలు వీటిని ధరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సంపన్న వర్గాలకు చెందిన మహిళలు సైతం ఫంక్షన్లలో రోల్డ్ గోల్డ్ వస్తువులు ధరించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. యువతులను సైతం ఇమిటేషన్ జ్యూవెలరీ విశేషంగా ఆకర్షిస్తోంది. వారి అభిరుచులకు తగ్గట్టుగా వందలాది డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా రాగిని ఉపయోగించి వివిధ లోహాల మిశ్రమంతో వీటిని తయారు చేస్తున్నారు. పైన బంగారం పూత పూయడంతో ఈ నగలకు పసిడి వన్నెలు వస్తున్నాయి. ఇలా తయారుచేసిన ఆభరణాలకు క్వాలిటీని బట్టి ఏడాది నుంచి ఐదేళ్ల వరకూ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు. మెరుపు తగ్గినప్పుడు పూతవేస్తే తిరిగి అవి కొత్త వాటిలా తళతళలాడుతున్నాయి. అందుబాటులో ధరలు రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు మార్కెట్లో వివిధ క్వాలిటీలలో లభిస్తున్నాయి. సాధారణంగా ధరించే చెవి పోగులు, బుట్ట దుద్దులు, తాళ్లు లాంటివి రూ.50 నుంచి రూ.300 వరకు ధర పలుకుతున్నాయి. చెయిన్లు, గాజులు, రాళ్ల గాజులు రూ.300 నుంచి రూ.1,500 వరకు ఉన్నాయి. వడ్డాణాలు, ముత్యాల నెక్లెస్‌లు, ముత్యాల హారాలు లాంటివి నాణ్యతను బట్టి రూ.10 వేల వరకు ధరలు ఉన్నాయి. రంగంలోకి బడా కంపెనీలు కొంతకాలం క్రితం వరకు కృష్ణా జిల్లా చిలకలపూడిలో తయారయ్యే రోల్డ్ గోల్డ్ వస్తువులు మార్కెట్‌కు విరివిగా వచ్చేవి. రోల్డ్ గోల్డ్ కొత్త ట్రెండ్ సంతరించుకోవడంతో బడా కంపెనీలు రోల్డ్ గోల్డ్ వస్తువులను తయారు చేయడం ప్రారంభించాయి. ప్రస్తుతం రోల్డ్ గోల్డ్ నగలకు పెరిగిన డిమాండ్ దృష్ట్యా ముంబై, సూరత్, అమృత్సర్, ఆగ్రా, చెన్నై ప్రాంతాల్లో యంత్రాలపై తయారుచేసిన ఆభరణాలు ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. డిమాండ్ అంతా.. ఇంతా కాదు బంగారు ఆభరణమైతే అవసరానికి సొమ్ము చేసుకోవచ్చు. కానీ రోల్డ్ గోల్డ్ వస్తువులపై పెట్టిన సొమ్ము వృథా. అయినా ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. చిన్న మొత్తమే కాబట్టి వృథా అయినా ఫర్వాలేదన్న ఉద్దేశంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. బంగారు ఆభరణాలకు మించి రోల్డ్ గోల్డ్ ఆభరణాల అమ్మకాలు సాగుతుండటం విశేషం. కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఇమిటేషన్ జ్యూవెలరీ విక్రయించే దుకాణాలు 700 వరకు ఉన్నాయి. ఇళ్లల్లో సైతం చిన్నపాటి షాపులు నిర్వహిస్తూ మహిళలు వీటి అమ్మకాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో సీజన్లో అయితే రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు బంగారు ఆభరణాల అమ్మకాలు సాగుతున్నాయి. ఇమిటేషన్ జ్యూవెలరీ అమ్మకాలు రోజుకు రూ.40 లక్షల వరకు సాగుతున్నట్టు అంచనా. ఒకప్పుడు పట్టణానికి ఒకటి, రెండు రోల్డ్ గోల్డ్ షాపులు ఉండేవి. ప్రస్తుతం ప్రతి పట్టణంలో 20 నుంచి 30 వరకు షాపులు ఉన్నాయి. గ్రామాలకే వెళ్లి వన్ గ్రాము వస్తువులు తీసుకెళ్లి విక్రయించేవారు సైతం పెరిగారు. రోల్డ్ గోల్డ్ ఆభరణాలే బెటర్ అరకాసు బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాలి. మాకు నచ్చిన డిజైన్లలో రోల్డ్ గోల్డ్ వస్తువులు దొరుకుతున్నాయి. బంగారం కంటే ఎక్కువ డిజైన్లు వీటిలో లభిస్తున్నాయి. వాటిని ధరిస్తే రోల్డ్ గోల్డ్ అన్న ఆలోచనే రాదు. ప్రస్తుత తరుణంలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలే బెటర్. – అద్దేపల్లి రాధిక, గృహిణి బంగారు కంటే మిన్నగా.. ఇదివరకు రోల్డ్ గోల్డ్ వస్తువులు వేసుకుంటే అవి బంగారం కాదని చాలా ఈజీగా తెలిసిపోయేది. పెద్దగా నాణ్యత ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. రోల్డ్ గోల్డ్ వస్తువులు బంగారం వస్తువుల కంటే బాగుంటున్నాయి. రూ.5 వేలు పెట్టి రోల్డ్ గోల్డ్ వస్తువు కొని పెట్టుకుంటే మంచి అందంగా ఉంటుంది. అదే వస్తువు బంగారంతో చేయించాలంటే రూ.5 లక్షలకు పైనే పెట్టాలి. ఇదే బెటర్ కదా. – కె.సత్యవాణి, గృహిణి అమ్మకాలు బాగా పెరిగాయి రోల్డ్ గోల్డ్ వస్తువుల అమ్మకాలు బాగా పెరిగాయి. మా షాపులకు మధ్య తరగతివారే కాకుండా సంపన్న వర్గాలు వారు కూడా వస్తున్నారు. ప్రస్తుతం మంచి మంచి డిజైన్లలో వస్తువులు దొరుకుతున్నాయి. చెన్నై, ముంబై ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌గా కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతాం. – శిరం చంటి, రోల్డ్ గోల్డ్ షాపు యజమాని, నరసాపురం -
కోడలి నగలు భద్రపరచడం క్రూరత్వం కాదు
న్యూఢిల్లీ: కోడలి నగలను అత్తింటి వారు భద్రపరిస్తే భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 498–ఏ సెక్షన్ ప్రకారం అది క్రూరత్వం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్తింటి వారు తన నగలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా తనను వేధిస్తున్నారన్న ఆరోపణలపై భర్త, అత్త, బావపై పంజాబ్‌కు చెందిన ఒక మహిళ కేసు పెట్టింది. ఇలా నగలు తీసుకోవడం అత్తింటివారు కోడలిపై క్రూరత్వాన్ని ప్రదర్శించడమేనంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త తిరిగి వెళ్లడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఆ భర్త వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరిల ధర్మాసనం విచారించింది. ఎన్ని నగలు తీసుకున్నారో, వాటి విలువ ఎంత అనే వివరాలేవీ పిటిషనర్ వెల్లడించలేదని, తన జీవితం ఏ విధంగా నాశనం చేశారనే విషయాలనూ చెప్పలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయినా ఈ కేసులో నగలు తీసుకోవడం సెక్షన్ 498ఏ కింద క్రూరత్వం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు పంజాబ్ , హరియాణా హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఫోన్ సంభాషణను రికార్డు చేయడం గోప్యతకు భంగం కలిస్తుందా? భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ సంభాషణను రికార్డు చేయడం గోప్యతకు భంగం కలిస్తుందా? అనే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 12 డిసెంబర్ 2021న పంజాబ్–హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2009లో వివాహం చేసుకున్న వ్యక్తి 2017లో తనకు విడాకులు కావాలంటూ బటిండా ఫ్యామిలీ కోర్టులో కేసు వేశాడు. అందుకు కారణంగా భార్య ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాడు. 2020లో బటిండా ఫ్యామిలీ కోర్టు ఆ రికార్డులను అంగీకరించింది. సంభాషణల రికార్డును పరిగణనలోకి తీసుకోవడం తన గోప్యతకు భంగం కలిగించడమేనని ఆ మహిళ పంజాబ్,హరియాణా హైకోర్టులో అప్పీలు చేసింది. ఆమె వాదనలతో హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఏకీభవించింది. -
ఆత్మ గౌరవం.. జీవన వనాన విరిసే ఆమని
ఆత్మగౌరవం మనిషికి నిజమైన ఆభరణంలా భాసిస్తుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుని, నమ్మిన సిద్ధాంతం కోసం, విలువలకోసం రాజీ పడకుండా ముందుకు సాగే లక్షణానికి మనం చెప్పుకునే అందమైన పదభూషణం ‘ఆత్మ గౌరవం’. సమపాళ్ళలో కలిగి ఉండే ఈ లక్షణం సమాజంలో అగణ్యత, అగ్రగణ్యత సంపాదిస్తుందో లేదో తెలియదు కానీ, జీవన గమనానికి ఖచ్చితంగా నిజమైన నాణ్యతను సంతరిస్తుంది. ‘‘ఆయనకు చాలా ఆత్మగౌరవం ఎక్కువండీ.. ఎక్కడా రాజీ పడకుండా జీవిస్తాడు’’ అనే మాటను మనం కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి, మిగిలినవాళ్ళు మాట్లాడుకోవడం వింటూ ఉంటాం. అహంకారం ఉన్నవారు తమకోసం కాక, ఎదుటివాళ్ల దృష్టిలో తాము గొప్పగా వున్నట్లుగా భావన చేసుకుని జీవికను సాగిస్తారు. ఎవరైనా తన గురించి తక్కువ, ఎక్కువల తేడా చూపిస్తే చాలు, అవమానంతో రగిలిపోతారు. అహంకారంతో ఉండేవాళ్ళు, విలువలకోసం ప్రయత్నించక, పక్కవారి ముందు ఉన్నతులుగా గుర్తింపబడాలని కోరుకుంటారు. వీరిలో చెలరేగే అహంకారం వారిలో ఉన్న మంచిని కూడా ఎదుటివారిని చూడనీయకుండా చేస్తుంది. సంఘంలో మనకు ఎక్కువగా ఈ తరహా వ్యక్తులే తారసపడుతూ ఉంటారు. స్వల్పమాత్రపు భేదాన్ని మాత్రం మనం ఇక్కడ తప్పనిసరిగా గ్రహించాలి. అహంకారంతో వర్తించడం ఎటువంటి నేరమో, ఆత్మగౌరవాన్ని చంపుకోవడం అంతకుమించిన దోషం..!! మనం నమ్ముకున్న సూత్రాల విషయంలో అవలంబించే రాజీ ధోరణి తాత్కాలికంగా సుఖమయమనిపించినా, దీర్ఘకాలంలో తప్పనిసరిగా మనకు మానసిక క్లేశాన్ని కలిగిస్తుందని ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తాయి. ఆత్మగౌరవం అనే భావన ఒక వ్యక్తి తన గురించి కలిగి ఉన్న విలువ, అవగాహనకు సంబంధించిన భావన.దీని ఆధారంగా, ఒక వ్యక్తి తోటివారితో సాగే గమనంలో విభిన్న విషయాల్లో తనకు ఎటువంటి స్థానం ఉందో కనుగొంటాడు. ఆత్మగౌరవానికి నిర్వచనాన్ని చెప్పవలసి వస్తే, దాదాపుగా స్వీయ–ప్రేమకు, ఈ పదాన్ని సమానంగా చెప్పవచ్చు. తన గౌరవాన్ని గురించి ఎవరైనా, ఏ సందర్భంలోనైనా ప్రకటించ వలసి వస్తే,ఆత్మగౌరవం అనే పదం వ్యక్తికి గల స్వీయ గౌరవం అనే పదానికి ప్రత్యక్ష అర్థంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తనని తాను ప్రేమించడం స్వార్థం లేదా అనారోగ్యం కాదు; ఇది ఒక ప్రాథమిక భావన. తనని తాను ప్రేమించుకోవడం అనేది ప్రతి వ్యక్తీ చేసే పనే. తనకు మంచి జరగాలని కోరుకోవడమూ సహజమే.. అయితే, తనకే మంచి జరగాలని కోరుకోవడాన్ని స్వార్ధభావనగా మనం పేర్కొంటూ ఉంటాం. ప్రతికూల ఆలోచనలను అంతం చేయడం, జ్ఞానాన్ని పెంచే లేదా వ్యక్తికి మంచి అనుభూతిని కలిగించే కార్యకలాపాలు చేయడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, చేసిన తప్పులను తెలుసుకోవడం మొదలైనవి మనలో మరింత ఆత్మగౌరవాన్ని పెంచుతాయి. ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు గుర్తొచ్చే మరో పదం ‘అహంకారం’. పరిణతి చెందిన వ్యక్తులు సైతం తమ వైఖరిని వ్యక్తపరిచే సందర్భంలో, ఆ విధంగా మాట్లాడితే అహంకారులుగా తమను ఎదుటివారు భావిస్తారేమో అని సందేహించే సందర్భాలూ ఉంటాయి. అయితే, ఆత్మగౌరవానికీ, అహంకారానికీ మధ్య తేడా బాగానే ఉంది. సమాజం తీరును మనం నిశితంగా పరికిస్తే, అత్యాశలకు లోనైనప్పుడే, మనిషి జీవనశైలిలో ఉన్న సమతౌల్యం దెబ్బ తింటుంది. అనవసరమైన కోరికలనే గుర్రాలవెంట పరుగెడుతూ, వాటిని ఏ విధంగానైనా తీర్చుకోవాలనే తపన ప్రబలినప్పుడే, మనిషి తాను పాటించే విలువల విషయంలో, ఆత్మను వంచన చేసుకునేలా రాజీపడి, ఎదుటివాడి ముందు తలను వంచుతాడు. ఒకరకంగా దీన్నే నైతిక పతనానికి నాంది అని చెప్పవచ్చు. ఎందుకు ఈ అనవసరపు వెంపర్లాట..!! ఎవరికీ తలవంచకుండా, అధికమైన ఆశలతో ఎవరెవరినో ఆశించకుండా, దృఢమైన చిత్తంతో సాగుతూ, నిండుగా నిలుపుకునే ఆత్మగౌరవమే గుండెకు ఆనందరవం..!! జీవన వనాన విరిసే ఆమనిలో అదే మధురంగా కిలకిలమనే కోకిలారావం..!! ఆత్మగౌరవం అన్నది మనిషి ఉత్తమ ప్రవృత్తిని తెలియపరుస్తుంది. ఒక మంచి ప్రవర్తనకు జగతి లో అందే విలువను పరోక్షంగా ఆత్మగౌరవానికి నమూనాగా ప్రకటించవచ్చు. సంస్కారాలు, విలువలు, నియమాలతో కూడిన జీవన ఆచరణ కలిగినవారు ఒకరి ముందు తలవంచరు. దీనికి ధనంతో ఏమాత్రం పనిలేదు. సంస్కారాలకు ఉన్న మహత్తరమైన విలువ అలాంటిది. వీరు ఆదర్శ జీవనాన్ని జీవిస్తూ, ఉన్నంత లో ఎదుటివాళ్లచేత గుర్తింపును, గౌరవాన్ని పొందేవారుగా తమను తాము మలుచుకంటారు. అలాంటి వారు తమకు తాము కొన్ని హద్దులు పెట్టుకొని వాటిని దాటకుండా ఒక్కరిపైన ఆధారపడకుండా ఆత్మగౌరవంతో నిరంతరం జీవిస్తారు. – ‘‘వ్యాఖ్యాన విశారద’’ వెంకట్ గరికపాటి -
రిలయన్స్ ఆభరణాలపై తగ్గింపులు
ముంబై: రిలయన్స్ జుయల్స్ 14వ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పటికే కొనసాగుతున్న ‘ఆభర్’ జుయలరీ కలెక్షన్ విక్రయాల పండుగను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. చేతితో రూపొందించిన వినూత్నమైన బంగారం, వజ్రాల చెవి ఆభరణాలు ఇందులో ప్రత్యేకమని సంస్థ తెలిపింది. నూతన శ్రేణి చెవి రింగులను ఆవిష్కరించడంతోపాటు.. ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 1 వరకు చేసే కొనుగోళ్లపై ఆభరణాల తయారీ చార్జీల్లో 20 శాతం తగ్గింపునిస్తున్నట్టు సంస్థ తెలిపింది. -
మత్తు ఇచ్చి నగలు దోపిడీ
‘మేడమ్.. నాకు ప్రమోషన్ వచ్చింది.. స్వీట్ తీసుకోండి’ అంటూ ఇంటి యజమానితో మాట కలిపాడు. ఆమె తిరస్కరించడంతో.. కనీసం ఈ కూల్ డ్రింక్ అయినా తాగండి అంటూ ఆఫర్ చేశాడు. మత్తు మందు కలిపిన ఆ కూల్‌డ్రింక్ తాగిన వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇంకేముంది.. మన వాడు చేతి వాటం చూపించి ఆమె మెడలో ఉన్న ఐదు కాసుల బంగారు గొలుసు తెంపుకుని చక్కాపోయాడు. నూజివీడు: కొత్త ప్రదేశాలకు వెళ్లడం, అద్దె ఇంట్లో దిగటం, ఆ ఇంటి యజమానులతో పరిచయం పెంచుకోవడం, సమయం చూసి వారికి మత్తు మందు ఇచ్చి నగలు దోచుకెళ్లడం. కొన్నేళ్లుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను నూజివీడు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ కె.వెంకటనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరానికి చెందిన పబ్బరాజు యుగంధర్ (33) కృష్ణా జిల్లా నూజివీడు మండలం యనమదలలోని గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, ఝాన్సీరాణి దంపతులకు చెందిన ఇంట్లో జూలై నెలలో అద్దెకు దిగాడు. జూలై 18న తనకు ప్రమోషన్ వచ్చిందని, స్వీటు తినమంటూ అందులో మత్తు మందు కలిపి ఇచ్చాడు. వెంకటేశ్వరరావు తినగా, ఝాన్సీలక్ష్మీ తనకు డయాబెటిస్ ఉండటంతో తిరస్కరించింది. దీంతో ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. దీంతో దంపతులిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ తర్వాత యుగంధర్ ఆమె మెడలో ఉన్న ఐదు కాసుల నానుతాడును దోచుకొని వెళ్లిపోయాడు. దీనిపై సచివాలయానికి చెందిన మహిళా సంరక్షణ కార్యదర్శి స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సీసీఎస్, రూరల్ స్టేషన్ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడు యుగంధర్‌ను వెతికి పట్టుకుని మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 8 కాసుల రెండు నానుతాడులను స్వాధీనం చేసుకున్నారు. 2006 నుంచే దొంగతనాలు యుగంధర్‌ను విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇతను గుంటూరు జిల్లా తెనాలి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, విజయవాడ, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం, అన్నవరం, కృష్ణా జిల్లాలోని తిరువూరు ప్రాంతాల్లో ఇలాంటి దోపీడీలే చేసినట్లు తేలింది. 2006 నుంచి దొంగతనాలకు అలవాటైన యుగంధర్‌పై దాదాపు 15 కేసులు ఉన్నాయి. గతంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో వృద్ధ దంపతులకు మత్తు మందు ఇవ్వగా డోసు ఎక్కువై వృద్ధుడు చనిపోయాడు. యుగంధర్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. -
పెళ్లైన మరుసటి రోజే షాకిచ్చిన వధువు..
పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): పెళ్లైన మరుసటిరోజే భర్త ఇంటి నుంచి నగదు, నగలు తీసుకుని నవ వధువు ఉడాయించిన ఘటన కమ్మవారిపల్లిలో సంచలనం రేకెత్తించింది. పోలీసుల సమాచారం మేరకు.. పెద్దపప్పూరు మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన పయ్యావుల కేశవమురళి భార్య ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఇతనికి ఇద్దరు సంతానం. పిల్లల సంరక్షణ కోసమంటూ గత నెల 28న నల్లమాడ మండలం శ్రీరెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. మరుసటి రోజు భర్త ఇంటికి కాపురానికి వచ్చిన ఆమె.. ఇంటిలో ఉన్న మూడు తులాల బంగారు నగలు, రూ.80వేలు తీసుకుని పారిపోయింది. ప్రియుడితో కలిసి భార్య ఒడిశాలో ఉన్నట్లు తెలుసుకుని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి, వివాహిత కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: తెల్లారితే ముహూర్తం.. వరుడికి వధువు షాక్..! ప్రేమనాటకం.. పెళ్లనగానే ప్రేయసి పరార్ -
అతిథిలా వచ్చిన నగల దొంగ దొరికాడు
సాక్షి, విశాఖపట్నం: పెళ్లికి వచ్చిన అతిథిలా రిసార్ట్స్‌లోకి ప్రవేశించాడు. అంతా కలయతిరిగాడు. విందు భోజనం ఆరగించాడు. ఆపై పెళ్లి కుమార్తె నగలతో చాలా దర్జాగా ఓలా క్యాబ్‌లో ఉడాయించాడు. 53 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసిన పాత నేరస్తుడు పోకతోట గంగాధర్‌రావు(29)ను నగరపోలీసులు పట్టుకున్నారు. అతనినుంచి రూ. 26.5 లక్షల విలువైన 53 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సాయిప్రియ రిసార్ట్స్‌లో గత నెల 24న ఓ వివాహ వేడుకలో జరిగిన చోరీ కేసును ఛేదించారు. ఆ వివరాలను నగర పోలీస్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్లో సీపీ మనీష్‌కుమార్ సిన్హా బుధవారం మీడియాకు వెల్లడించారు. చదవండి: స్వామీజీల మాయాజాలం.. లబోదిబోమంటున్న రైతులు తెల్లారితే పెళ్లి.. ఓ తహసీల్దార్ కుమారునికి, మునగపాక మండలం సినసపల్లి తోటాడకు చెందిన టీచర్ కుమార్తెకు గత నెల 24న ఉదయం 11 గంటలకు వివాహ ముహూర్తం నిశ్చయించారు. తెల్లారితే పెళ్లి జరగాల్సిన సమయంలో వధువు గదిలో ఉంచిన 53 తులాల బంగారు ఆభరణాల బ్యాగు చోరీకి గురైంది. వధువు తల్లిదండ్రులు 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్క్యాడ్‌తో తనిఖీలు చేసినా లాభం లేకపోయింది. దొంగిలించిన అభరణాలు ఆభరణాలు తాకట్టు పెట్టి జల్సాలు విజయవాడకు చెందిన పాత నేరస్తుడు పోకతోట గంగాధర్‌రావు చిన్నప్పటి నుంచి బెంజ్ సర్కిల్లోని అనాథ ఆశ్రమంలో పెరిగాడు. గతంలో విజయవాడ సమీపంలో 7 కేసుల్లో నిందితుడు. విజయవాడ నుంచి విశాఖకు వచ్చి సిరిపురంలోని ఓ హోటల్లో వెయిటర్‌గా పని చేశాడు. అది మానేసి విశాఖలో చోరీలు చేయడం మొదలుపెట్టాడు. 10 కేసుల్లో నిందితుడు. మూడేళ్ల పాటు జైలులో కూడా ఉన్నాడు. జైలు నుంచి ఇటీవల విడుదలైన గంగాధర్ గత నెల 24న రాత్రి సాయిప్రియ రిసార్ట్స్‌లో జరిగిన వివాహ వేడుకలో భోజనం చేశాడు. వధువు ఆభరణాలపై కన్నేశాడు. ఆమెకు కేటాయించిన 301 గదికి వెనక వైపు తక్కువ ఎత్తులో కిటీకీలుండడం, ఆ గదికి వెనుక వైపున వెలుతురు అంతగా లేకపోవడంతో.. చోరీకి స్కెచ్ వేశాడు. అక్కడి నుంచి బ్యాగ్ పట్టుకుని రోడ్డుపైకి వచ్చి ఓలా క్యాబ్ బుక్ చేసుకుని శ్రీకాకుళం వెళ్లిపోయాడు. సోంపేటలోని మనప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో 6 తులాలు తాకట్టు పెట్టాడు. ఆ డబ్బులతో తిరిగి విశాఖకు వచ్చి జల్సాలు చేస్తున్నాడు. సీసీ కెమెరాలతో దొరికిన దొంగ జాడ రిసార్ట్స్‌లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దొంగ జాడను పోలీసులు కనిపెట్టారు. నగరంలో జల్సాలు చేస్తున్న గంగాధర్‌ను మంగళవారం మధ్యాహ్నం పూర్ణామార్కెట్‌లో అరెస్ట్ చేశారు. తాకట్టు పెట్టిన ఆరు తులాలతో సహా మొత్తం 53 తులాల బంగారు ఆభరణాలను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి ఈ సందర్భంగా సీపీ మనీష్‌కుమార్ సిన్హా మాట్లాడుతూ నగరంలోని రిసార్ట్స్, ఫంక్షన్ హాల్స్, హోటల్స్, రెస్టారెంట్లలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. మరో పదిహేను రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. లేకపోతే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే నగరంలో రాత్రి గస్తీ పెంచామన్నారు. 333 మంది పోలీసులతో వార్డు రక్షక దళాలను నియమించినట్టు చెప్పారు. అనంతరం కేసును ఛేదించిన పోలీసులకు సీపీ ప్రశంసా పత్రాలు అందజేశారు. డీసీపీ క్రైం సురేష్‌బాబు, ఏడీసీపీ క్రైం వేణుగోపాలనాయడు, ఏసీపీ (క్రైం)శ్రావణ్‌కుమార్, సీఐలు అవతార్, రామచంద్రరావు, సీహెచ్.సూరినాయడు, ఎస్ఐలు జి.అప్పారావు, పి.శివ, కె.మధుసూదనరావు, సోమేశ్వరరావు, ఏఎస్ఐలు శ్రీనివాసరాజు, రాజు, శేఖర్, పి.చిన్నరాజు, సిబ్బంది లక్ష్మణ్, ఎం.శేకర్, కె.వి శ్రీధర్, ఎ.దిలీప్, సోమశేఖర్‌లను అభినందించారు. చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసులకు వధువు, ఆమె తండ్రి రామ కోటేశ్వరారవు ధన్యవాదాలు తెలిపారు. నగలు పోయినప్పటి నుంచి మాకు కంటి నిండా నిద్ర కరవైందని వారు తెలిపారు. 28 రోజుల్లో దొంగను పట్టుకుని ఆభరణాలు అప్పగించిన సీపీ మనీష్‌కుమార్ సిన్హా, డీసీపీ(క్రైం) సురేష్‌బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. -
‘బాధితురాలు ఇచ్చింది రూ.38 లక్షలు మాత్రమే’
సాక్షి, విశాఖపట్నం : సింహాద్రి అప్పన్న ఆభరణాలు వేలం పాట పేరిట ఇప్పిస్తామని మోసగించిన కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోపాలపట్నం ప్రాంతానికి చెందిన హైమావతి తనకున్న పరిచయాన్ని ఆసరాగా తీసుకుని ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. గత పదేళ్లుగా అప్పన్న ఆలయానికి వచ్చే నెల్లూరుకు చెందిన శ్రావణికి వేలం పాట ద్వారా స్వామి ఆభరణాలు ఇప్పిస్తామంటూ హైమవతి ఫోన్ చేయగా ఆమె విడత వారీగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసింది. దీనికి రసీదుగా సింహాచలం అప్పటి ఈవో భ్రమరాంబ సంతకాలు చేసినట్లు రెండు రసీదులు కూడా పంపించారు. (విజయవాడకు మరో వరం ప్రకటించిన సీఎం) రోజుల తరబడి ఆభరణాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రావణి భర్త నేరుగా ఫోన్ చేయడంతో మోసం బయటపడింది. కాకా హైమావతికి ఈ రసీదులు తయారు చేయడంలో శ్రీకాకుళం జిల్లా చిన్న బరాటం వీధికి చెందిన మధు..విశాఖకు చెందిన శేఖర్ సహకరించినట్లు విచారణలో తేలింది. వీళ్లిద్దరు ఎన్ఏడి జంక్షన్ లో రసీదు ద్వారకా నగర్లో సింహాచలం దేవస్థానం స్టాంపు తయారు చేయించినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. కాగా ఈ వ్యవహారంలో కోటి 40 లక్షల రూపాయలు ఇచ్చినట్లు శ్రావణి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా విచారణ మాత్రం ఆమె 38 లక్షలు మాత్రమే ఇచ్చినట్టు గుర్తించారు. (వుడాకి పూర్వ వైభవం తీసుకువస్తాం..) -
ఏడు వారాల నగలతో దుర్గమ్మ దర్శనం
సాక్షి, విజయవాడ: ఈ నెల 12 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఏడు వారాల నగలతో దర్శనమివ్వనున్నారు. శనివారం దుర్గగుడి ఈవో ఎంవి.సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. సోమవారం-ముత్యాల అలంకారం, మంగళవారం-పగడాలు అలంకారం, బుధవారం-పచ్చల అలంకారం, గురువారం- కనక పుష్య రాగాల అలంకారం, శుక్రవారం-వజ్రాల అలంకారం, శనివారం-నీలాల అలంకారం, ఆదివారం- కెంపుల అలంకారంలో దర్శనమివ్వనున్నారని ఈవో వెల్లడించారు. అమ్మవారికి దేవస్థానంలో రెండు కిరీటాలు ఉన్నాయని.. వజ్ర కిరీటం చేయించాలనే యోచనలో ఉన్నామని తెలిపారు. దాతల నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ప్రసాదం పోటు, అన్నదానం, కేశ ఖండన శాల నిర్మాణాలకు ఈ నెలాఖరుకు ప్లాన్ పూర్తవుతుందన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పూర్తి చేస్తామని తెలిపారు. కేశ ఖండనశాల వేలానికి ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా నిర్వహించామన్నారు. కేశ ఖండనశాల తలనీలాల కాంట్రాక్ట్‌ను రద్దు చేశామని.. మరలా టెండర్లను ఆహ్వానిస్తామని ఈవో సురేష్‌బాబు పేర్కొన్నారు. -
కట్టు మారిన పట్టు
పట్టు చీరలు వేడుకల సందర్భంలోనే కొనుగోలు చేస్తారు. అలాగే వాటిని సంప్రదాయ వేడుకలకే ధరిస్తారు. సంప్రదాయ వేడుకలతో పాటు గెట్ టు గెదర్, రిసెప్షన్ వంటి ఇండోవెస్ట్రన్ పార్టీలకు కూడా ఇలా రెడీ అవచ్చు. ఇప్పుడు చలికాలం కూడా కాబట్టి సీజన్‌కి తగ్గట్టు చీరకట్టులో మార్పులు చేసుకోవచ్చు. ►బ్లూ బెనారస్ పట్టు చీరకి సిల్వర్ జరీతో ఉండే స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జత చేశారు. బ్లౌజ్, మెడలో సిల్వర్ హారం, హెయిర్ స్టైల్.. ఈ చీర కట్టు లుక్‌ని పూర్తిగా మార్చేసింది. ►ఆకుపచ్చ అంచు ఉన్న గులాబీ రంగు కంచి పట్టుచీరకు పూర్తి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంపిక చేసుకోవాలి. అది కూడా పెప్లమ్ బ్లౌజ్ అయితే మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు. ఈ చీరకు వంగపండు రంగు పెప్లమ్ బ్లౌజ్‌ను వాడారు. లైట్ మేకప్, హెయిర్‌ను వదిలేస్తే చాలు స్టైలిష్‌గా కనిపిస్తారు. ఇతరత్రా ఆభరణాలు ధరించనవసరం లేదు. ఈ స్టైల్ ఏ పార్టీకైనా, వేడుకకైనా బాగుంటుంది. ►ఇది బ్లాక్ కలర్ బెనారస్ పట్టు చీర. దీనికి సెల్ఫ్కలర్ హా‹ఫ్ షోల్డర్ బ్లౌజ్‌ని వాడారు. అలాగే కాంట్రాస్ట్ టైని మెడకు అలంకరించారు. దీంతో పట్టు చీర లుక్ పూర్తి స్టైలిష్‌గా మారింది. ►ఆరెంజ్ కలర్ పట్టుచీరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వాడుకోవచ్చు. వెస్ట్రన్ స్కర్ట్మీదకు వాడే టాప్ వేసుకుంటే ప్రెట్టీగా కనిపిస్తారు. దీని మీదకు పిస్తా షేడ్ గ్రీన్ జాకెట్‌ను వేసుకుంటే లుక్ పూర్తిగా స్టైలిష్‌గా మారిపోతుంది. కాక్టెయిల్ పార్టీస్‌కు కూడా నప్పే డ్రెస్ అవుతుంది. ►ప్లెయిన్ పట్టు చీరకి పూర్తి కాంట్రాస్ట్ కలర్లో సైడ్ కట్స్ ఉన్న ఎల్లో లాంగ్ జాకెట్‌ను వాడారు. దీనికి నడుము భాగంలో బెల్ట్‌ను ఉపయోగించారు. ఫిష్ టెయిల్, సైడ్ జడ వేసుకుంటే చాలు మేకోవర్ పూర్తయినట్టే. ►ఇది బ్రైట్ రెడ్ శారీ. సహజంగా పెళ్లి కూతురు డ్రెస్‌గా వాడుతారు. దీనిని ఇండోవెస్ట్రన్ పార్టీలకూ ధరించాలంటే ఇలా జరీ కలర్లో జాకెట్‌ని ధరించాలి. పల్లూని ముందువైపుగా తీసుకొని, కుచ్చిళ్ల పార్ట్‌ని లెహంగా స్టైల్లో అమర్చుకోవాలి. ఈ లెహంగా శారీ విత్ జాకెట్ స్టైల్ డ్రేప్ ఏ వేడుకలోనైనా హైలైట్‌గా నిలుస్తుంది. -
ట్రెండ్‌కు తగినట్టు ఉంటేనే ఎవరైనా చూసేది
అక్కా! నువ్వు చేయించుకున్నావ్ కదా! నాక్కూడా చేయించవే!! ఏమండీ!నా తోటికోడలు చేయించుకుందిగా!! అత్తా! మీ అమ్మాయికి చేయించారుగా!! వదినా! మా అన్నయ్య నీకు చేయించాడుగా!! పండగ చేసుకునే సమయంలో ఈ చేయించడమేంటీ?! ఇవాళ ధనత్రయోదశి.. ఎల్లుండి పండగ! మరి కన్నుల పండుగ చేయించాలి కదా! ఆభరణాల కొనుగోలులోనే కాదు కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగ్గట్టుగా ఎప్పుడూ అవి కొత్తదనంతో ఆకట్టుకుంటూ ఉండాలి. ఒకసారి నగ కొన్నాక అదెప్పుడూ ట్రెండ్‌లో ఉండాలి. అలాంటి ఆభరణాలు ఎన్నో మెడల్స్‌లో వచ్చాయి. అతివల మనసు దోచేస్తున్నాయి. ఎప్పటికీ ఎవర్గ్రీన్ అనిపించే డిజైన్స్‌ను ధరించిన మన ‘తారా’మణులు ఆభరణాలకు కొత్త సింగారాలను అద్దుతున్నారు. వీటిలో ఖరీదైనవే కాదు అచ్చూ అలాగే ఉండే ఇమిటేషన్ జువెల్రీ కొంగొత్తగా ఆకట్టుకుంటుంది. ఏ వేడుకకు ఏ ఆభరణమో ఎంపికలోనే ఉంటుంది అసలు అందం. ♦ వరుసలుగా కూర్చిన పేటల హారాలు, జంతువులు, పక్షుల డిజైన్లతో రూపొందించిన హారాలు అన్నింటి ఔరా! అనిపిస్తూనే ఉన్నాయి. ♦ పోల్కీ కుందన్స్ సెట్ సంప్రదాయ వస్త్రాలంకరణ లోనే కాదు వెస్ట్రన్ డ్రెస్సులకు ఓ ప్రత్యేక అందాన్ని, ఆకర్షణను తెచ్చిపెడతాయి. అందుకే తారల అలంకరణలో తప్పనిసరి ఆభరణం అయ్యింది. ♦ మామిడి పిందెల హారాలు ఏ సందర్భాన్నైనా కాంతివంతంగా మార్చేస్తాయి. కాలాలు మారినా మారని ఈ డిజైన్ అతివలకు ఎప్పుడూ ఆకర్షణీయమే! ♦ మిగతా ఆభరణాలేవీ అవసరం లేకుండా పెద్ద పెద్ద చెవి బుట్టాలు ఏ వేడుకనైనా ప్రత్యేకతను నిలిపేలా చేస్తున్నాయి. ♦ పెద్ద పెద్ద పోల్కీచోకర్ సెట్స్ వేడుకకు ఒక రాణివాసపు లుక్‌ను తీసుకువస్తున్నాయి. అందుకే మన సంప్రదాయ వేడుకలో తప్పనిసరి గ్రాండ్ ఆభరణమైంది. ♦ దేవతా మూర్తుల రూపాలతో డిజైన్ చేసిన ఆభరణాలు (టెంపుల్ జువెల్రీ) సంప్రదాయ వేడుకలో హైలైట్‌గా నిలుస్తున్నాయి. ♦ ముత్యాల సొగసు ఎప్పుడూ కొత్త సింగారాలను మోసుకొస్తూనే ఉంటుంది. అందుకే ప్రతి వేడుకను ముత్యాల ఆభరణాలు ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ♦ వజ్రాభరణాలు ఏ వయసు వారికైనా తీరైనా ఖరీదైన అందాన్ని తీసుకువస్తాయి. మగువల మనసు దోచే ఆభరణాలలో ఒక్కటైనా వజ్రాభరణం ఉండాల్సిందే! -
డిస్నీ బ్యూటీ
మిక్కీమౌజ్, డోరెమాన్,టామ్ అండ్ జెర్రీ..డిస్నీ వరల్డ్ అంటేపిల్లలకు చెప్పలేనంత ఇష్టం.ఆ బొమ్మలున్న డ్రెస్సులు కూడాఅంతే ప్రత్యేకతను చూపుతున్నాయి.టీవీ కార్టూన్ షోలలో కనిపించే ఈ బొమ్మలకు ఓఅరుదైన గుర్తింపు కలిపిస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.కామిక్ బొమ్మల ప్రింట్లున్న చీరలుఅమ్మలే కాదు అమ్మాయిలూఇష్టపడి ఎంచుకుంటున్నారు.పార్టీలో ప్రత్యేకతనుచాటుతున్నారు. పువ్వుల రింగులు వేడుక ఏదైనా డ్రెస్ సెలక్షన్ తర్వాత ఆభరణాలు సింగారం మీదనే దృష్టి పెడతారు అతివలు. గ్రాండ్‌గా కనులకువిందు చేసే ఆభరణాల కోసం ఎంతమొత్తమైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే, ప్రస్తుత కాలం వేరు. పార్టీకి తగ్గట్టు డ్రెస్ ఉండాలి. ఆ డ్రెస్ మరింత అందంగా కనిపించడానికి తగిన ఆభరణాలు ఉండాలి. అందుకు ఈ పువ్వుల డిజైన్లు ఉన్న రింగులు ప్రత్యేక సింగారాన్ని తీసుకువస్తున్నాయి. సింపుల్‌గానూ, గ్రేస్‌గా ఉండే ఈ పువ్వుల డిజైన్ రింగులు సిల్వర్, స్టీల్ మెటల్‌తో తయరుచేసినవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వందరూపాయల నుంచి లభించే ఈ డిజైనర్ రింగ్స్‌తో వేడుకలో మరింత ఆహ్లాదంగా, బ్యూటిఫుల్‌గా వెలిగిపోవచ్చు. ఇండియన్ డిజైనర్ సత్యపౌల్ సిల్క్ పై చేసే ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. సిల్క్, షిఫాన్, క్రేప్ చీరల మీద కామిక్ డిజైన్స్‌ను ప్రింట్లుగా వేసి ఓ ప్రత్యేకతను తీసుకువచ్చారు. ఆ డిజైన్స్‌ను పోలిన కామిక్ వరల్డ్ ప్రింటెడ్ శారీస్ గెట్ టు గెదర్ పార్టీలో ప్రత్యేకతను చాటుతున్నాయి. -
నేటి అక్షయ తృతీయకు ఆభరణ సంస్థల ఆఫర్ల ఆహ్వానం
జోయాలుక్కాస్ ‘గోల్డ్ ఫార్ట్యూన్’! వరల్డ్ ఫేవరేట్ జ్యూయలర్ జోయాలుక్కాస్... పవిత్ర పసిడి కొనుగోళ్ల పర్వదినాన్ని పురస్కరించుకుని గోల్డ్‌ఫార్ట్యూన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా బంగారం, డైమెండ్ జ్యూయలరీ కొనుగోలు దారులకు ఉచితంగా బంగారు నాణేలు బహూకరిస్తారు. సరికొత్త అక్షయ తృతీయ 2019 కలక్షన్‌ను ఆరంభించామని, కస్టమర్లకు సంపదతో సేవ చేయడానికి ఈ పండుగ తమకు అవకాశం కల్పిస్తోందని సంస్థ ఎండీ, చైర్మన్ జాయ్ అలూక్కాస్ పేర్కొన్నారు. ఒర్రా భారీ రాయితీలు... దేశంతో వేగంగా విస్తరిస్తున్న రిటైల్‌చైన్స్‌లో ఒకటైన ఒర్రా, అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు భారీ ఆఫర్లను ప్రకటించింది. డైమెండ్ జ్యూయలరీ కొనుగోలుపై 25 శాతం తగ్గింపు సదుపాయాన్ని కల్పిస్తోంది. పసిడి ఆభరణాల మేకింగ్ చార్జీలపై కూడా 25 శాతం రాయితీ ప్రకటించింది. గోల్డ్ నాణేలు, కడ్డీలపై అసలు మేకింగ్ చార్జీలు ఉండవు. డైమెండ్ జ్యూయలరీ కొనుగోలుకు సంబంధించి వడ్డీ రహిత ఇన్స్టాల్మెంట్ చెల్లింపు సౌలభ్యతను కల్పిస్తున్నట్లు ఒక ప్రకటన పేర్కొంది. మలబార్ గ్రూప్ ప్రత్యేక ఏర్పాట్లు... అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ ఆభరణాల సంస్థ– మలబార్ గ్రూప్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 7 గంటల నుంచే షోరూమ్‌లను ప్రారంభిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు ఈ పండుగ సందర్భంగా అందుబాటులో ఉండనున్నాయి. పండుగను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా దాదాపు 2000 కేజీల పసిడి విక్రయం అవుతుందని, భావిస్తున్నట్లు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ పేర్కొన్నారు. -
గార్డెన్ కుర్తీ
నిజానికి వీటి పేరు లాన్ కుర్తీస్‌ఎంత ఎండ ఉన్నా అందమైన గడ్డిపువ్వుల్లామెరిసిపోతుంటాయి.జీన్స్, పలాజో, లెగ్గింగ్, జెగ్గింగ్‌స్లిమ్ ఫిట్, టైట్ ఫిట్..బాటమ్‌గా ఏది ఎంచుకున్నాపైన ఈ టాప్ వేసుకుంటే చాలు గార్డెన్ అంత ముచ్చటగా ఉంటుంది. ►ఈ లాన్ కుర్తీలు ఎవరికైనా నప్పుతాయి. వయసు తేడాలు అవసరం లేదు. చూడటానికి ఫ్రాక్లా ముచ్చటగా ఉంటాయి. వేసుకుంటే మాత్రం స్టైలిష్‌గా కనిపిస్తాయి. కంఫర్ట్‌లో ప్రత్యేకం అనిపిస్తాయి. గాఢమైన రంగులు, ప్రింట్లు పెద్దగా హంగామా లేనివి ఎంచుకోవాలి. వీటికి లైట్ ట్రౌజర్, ధోతీ ప్యాంట్ బాటమ్‌గా ధరించాలి. క్యాజువల్‌గా బయటకు వెళ్లినా, ఈవెనింగ్ పార్టీ అయినా లాన్ డ్రెస్సింగ్ సమ్మర్‌కి సరైన ఎంపిక అవుతుంది. ►ఆభరణాల హంగులు అవసరం అని భావిస్తే ఫ్యాషన్ జ్యువెల్రీలో భాగంగా సిల్వర్, ఉడెన్.. ఆభరణాలను ఎంచుకోవాలి. అవి కూడా చాలా డ్రెస్‌ను హైలైట్ చేసేలా ఉండేలి. ►డ్రెస్ ఎంపికలోనే ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది కాబట్టి వీటికి జ్యువెలరీ హంగులు అవసరం లేదు. సాదా సీదా హెయిర్ స్టైల్, ఫుట్‌వేర్ ఎంపికలు ఈ గార్డెన్ కుర్తీలకు బెస్ట్ ఎంపిక. . -
గోల్డ్ స్కీమ్స్‌తో జాగ్రత్త!
బంగారు వర్తకులు ఆఫర్ చేసే బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా...? ఏడాది పాటు పొదుపు చేయడం వల్ల ఒక నెల మొత్తం బోనస్‌గా లభించడం, ఎటువంటి తరుగు లేకుండా నగలు కొనుగోలుకు అవకాశం కల్పించే ఆఫర్లు ఆకర్షిస్తున్నాయా..? కానీ, జ్యుయలర్స్ ఆఫర్ చేసే సేవింగ్స్ పథకాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలన్నది నిపుణుల సూచన. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి లేని డిపాజిట్ పథకాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వాస్తవానికి అనుమతి లేని అన్ని పథకాలకు ఇది వర్తిస్తుందని భావించారు. జ్యుయలరీ సంస్థల పథకాలకు కూడా బ్రేక్ పడుతుందనుకున్నప్పటికీ... అవి మాత్రం ఇంతకుముందు మాదిరే నిధులను సమీకరిస్తూనే ఉన్నాయి. కాకపోతే చట్టంలో ఉన్న చిన్న వెసులుబాటును అనుకూలంగా మలచుకుని జ్యూయలరీ సంస్థలు తమ పొదుపు పథకాలను కేవలం పదకొండు నెలల కాలానికే పరిమితం చేస్తున్నాయి. చట్టానికి అతీతంగా జ్యుయలరీ సంస్థలు వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. కంపెనీల చట్టం 2014... బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మినహా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించే ఇతర సంస్థలకు షరతులు విధించింది. 365 రోజులకు మించిన కాలానికి డిపాజిట్లు తీసుకునే రిజిస్టర్డ్ సంస్థలు అన్నీ కూడా కచ్చితంగా తిరిగి చెల్లించే సామర్థ్యంపై రేటింగ్ తీసుకోవడంతోపాటు, డిపాజిట్ ఇన్సూరెన్స్‌ను కూడా తీసుకోవాలి. పైగా డిపాజిట్‌పై వడ్డీని ఎన్‌బీఎఫ్‌సీల కంటే ఎక్కువ ఆఫర్ చేయరాదు. కానీ, జ్యుయలరీ సంస్థలు మాత్రం గతంలో 12, 24, 36 నెలల పథకాలను నిర్వహించగా, చట్టంలోని నిబంధనలు కఠినతరం కావడంతో తమ పథకాల కాల వ్యవధిని 11 నెలలకు కుదించుకున్నాయి. సంస్థ బిచాణా ఎత్తేస్తే? ఆభరణాల సంస్థలు వినియోగదారులను మోసం చేసిన ఘటనలు కూడా లేకపోలేదు. ఇందుకు నిదర్శనం తమిళనాడుకు చెందిన నాదెళ్ల సంపత్ జ్యుయలరీ సంస్థ వ్యవహారమే. తమిళనాడులో బంగారు ఆభరణాల మార్కెట్లో మంచి పేరున్న సంస్థ. 75 ఏళ్లకు పైగా కార్యకలాపాల్లో ఉన్న సంస్థ. కానీ 2017 అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆభరణాల దుకాణాలను ఆర్థిక సమస్యల కారణంగా ఈ సంస్థ మూసేసింది. ఖాతాల్లో అవకతవకలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం వెలుగు చూశాయి. నాదెళ్ల బంగారు పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు ఉసూరుమనక తప్పలేదు. కంపెనీ 2018 మే నెలలో దివాలా పిటిషన్ వేసింది. ఈ తరహా పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ సంఘటన ఓ హెచ్చరిక వంటిది. బంగారు ఆభరణాల సంస్థ దివాలా పిటిషన్ దాఖలు చేస్తే, ఆస్తులను విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ఖర్చులు పోను, ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లిస్తారు. మిగిలి ఉంటే సెక్యూర్డ్ రుణదాతలకు చెల్లింపులు చేస్తారు. ఆ తర్వాత అన్సెక్యూర్డ్ రుణదాతల వంతు వస్తుంది. బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారు అన్సెక్యూర్డ్ ఆపరేషనల్ క్రెడిటర్ల కిందకు వస్తారని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కనుక కస్టమర్ల వంతు ఆఖరు అవుతుంది. లొసుగులు.. అనుమతి లేని డిపాజిట్ పథకాల నిషేధ ఆర్డినెన్స్... డిపాజిట్‌కు నిర్వచనం ఇచ్చింది. అడ్వాన్స్ రూపంలో తీసుకోవడం లేదా రుణం, తిరిగి నగదు లేదా సేవ రూపంలో ఇస్తానన్న హామీతో తీసుకునే మొత్తాన్ని డిపాజిట్‌గా పేర్కొంది. ఎవరు డిపాజిట్ తీసుకున్నారన్నది ఇక్కడ అంశం కాదు. వ్యక్తి లేదా యాజమాన్య సంస్థ, భాగస్వామ్య సంస్థ, కోపరేటివ్ సొసైటీ లేదా ట్రస్ట్ అయినా కావచ్చు. కనుక జ్యుయలర్స్ నిర్వహించే పథకాలు ఈ చట్టం పరిధిలోకే వస్తాయంటున్నారు కొందరు. అయితే, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. బంధువుల నుంచి రుణాల రూపంలో తీసుకోవడం, వ్యాపార సరుకుల సరఫరా కోసం అడ్వాన్స్ రూపంలో తీసుకోవడానికి డిపాజిట్ నిర్వచనం నుంచి మినహాయింపు ఉంది. భవిష్యత్తులో ఆభరణాల కొనుగోలు సాధనాలుగా తాము బంగారం పొదుపు పథకాలను విక్రయిస్తున్నట్టు జ్యుయలరీ వర్తకులు సమర్థించుకుంటున్నారు. కనుక దీన్ని ముందస్తు వాణిజ్యంగా చూడాలని పేర్కొంటున్నాయి. డిపాజిట్లు కాదు... ‘‘జ్యుయలర్ల పొదుపు పథకాలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురాలేదు. జ్యుయలర్స్ సమీకరించే నిధులు కేవలం ముందస్తు వాణిజ్య రూపంలోనే. దీన్ని డిపాజిట్‌గా చూడరాదు. ఈ పథకాల కింద కస్టమర్లకు తగ్గింపులు, బహుమానాలు ఆఫర్ చేయవచ్చా, స్పష్టం చేయాలని కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాశాం’’ అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు. నిపుణుల అభిప్రాయాలు వేరు అయితే, బంగారం డిపాజిట్ పథకాలు అనుమతి లేని డిపాజిట్ పథకాల నిషేధ ఆర్డినెన్స్ పరిధిలోకి వస్తాయా అన్న దానిపై అస్పష్టత నెలకొందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ముందస్తు వాణిజ్యం పేరుతో తప్పించుకోవడం కుదరదని మరో నిపుణుడు పేర్కొన్నారు. ‘‘ఓ కస్టమర్ కొన్ని నెలల పాటు నగదు ఉంచి, చివర్లో ఏది కొనుగోలు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. లేదా ఆ డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు. అన్ని నెలల పాటు అతడు చెల్లించినది డిపాజిట్‌కు భిన్నమేమీ కాదు. వస్తువులకు ముందస్తుగా చెల్లించడం అంటే... మా అభిప్రాయం ప్రకారం ఆ సరుకులు ఏంటన్నది ముందే గుర్తించాల్సి ఉంటుంది. ఏదన్నది గుర్తించకుండా ముందుగానే అడ్వాన్స్‌గా ఎవరూ చెల్లించరు. కనుక ఈ తరహా పథకాలను నిషేధించాలి’’ అని వినోద్ కొతారి అండ్ కంపెనీ సీనియర్ అసోసియేట్ సీఎస్ శిఖా బన్సాల్ అభిప్రాయపడ్డారు. ఎవరి నియంత్రణ? బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ లేదా కంపెనీల చట్టం కింద నమోదైన ఓ కంపెనీ, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో డిపాజిట్ చేసి చేతులు కాల్చుకుంటే... సంబంధిత నియంత్రణ సంస్థలు ఆర్బీఐ, కార్పొరేట్ శాఖ, సెబీ ఫిర్యాదుల పరిష్కార బాధ్యత చూస్తాయి. బంగారం పొదుపు పథకాల విషయానికొస్తే వీటిని నియంత్రించే సంస్థ లేదు. చాలా వరకు ఈ జ్యుయలరీ సంస్థలు కంపెనీలుగా రిజిస్టర్డ్ అయినవి కావు. కనుక కార్పొరేట్ వ్యవహారాల శాఖ జోక్యం చేసుకోదు. ఈ తరహా అనియంత్రిత డిపాజిట్ పథకాలకు సంబంధించి సమస్య ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్ప పరిష్కారం లేదు. కనుక పరిష్కారానికి సమయం తీసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
మువ్వల నగలు
మువ్వలు సవ్వడి కాలికే అనేది నిన్నటి మాట. నేడు.. మెడలో హారంలా, చెవులకు జాకాల్లా, చేతికి గాజుల్లా.. నవ్వులతో పోటీ పడుతూ చేసే మువ్వల సందడి ఇంతంత కాదు. ఇది వివాహ వేడుకల సమయం. మెడ నిండుగా కళ్లకు పండగలా మువ్వల హారాలు సందడి చేస్తున్నాయి. -
కాచిగూడ –యశ్వంత్‌పుర్ రైల్లో దోపిడీ
హైదరాబాద్: బెంగళూరు నుంచి కాచిగూడకు వస్తున్న యశ్వంత్‌పుర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ప్రయాణీకుల వద్ద నుంచి 28.4 తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదు, సెల్ఫోన్లను గుర్తుతెలియని దుండగులు దోచుకెళ్లారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పి జి.అశోక్‌కుమార్ కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దివిటిపల్లి వద్ద కొంతమంది దుండగులు రైల్వే సిగ్నల్స్‌ను ట్యాంపరింగ్ చేసి ప్రయాణీకుల వద్దనుంచి బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను దొంగలించారని తెలిపారు. బెంగళూరుకు చెందిన నిమ్మి గీత (27) మెడలోంచి 8.5 తులాల బంగారు ఆభరణాలు, బ్యాగులో ఉన్న 3 సెల్ఫోన్లు, రూ.10వేల నగదు, మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన కె.జయశ్రీ (57) వద్ద నుంచి 9తులాల బంగారు ఆభరణాలు, శ్రీకాకుళం, రాజం ప్రాంతానికి చెందిన బలివాడ లక్ష్మి (65) నుంచి 2.4 గ్రాముల బంగారు ఆభరణాలు, కర్నాటకలోని బాగేపల్లి ప్రాంతానికి చెందిన లాల్యం లలిత (40) నుంచి 8.5 తులాల బంగారు ఆభరణాలు, హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతానికి చెందిన హుస్సేన్ ఫీరా (54) నుంచి ఒక సెల్‌ఫోన్‌ను దొంగిలించారు. ఉదయం 4గంటల సమయంలో రైల్లో కిటికీలు తెరిచి ఉంచిన ప్రయాణీకుల వద్ద ఈ ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను దొంగిలించారు. ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎం.రమేశ్ కేసు నమోదు చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం మహబూబ్‌నగర్ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. -
మీ లుక్ ఇలా మార్చుకోండి
ఎత్తు తక్కువ ఉన్నవారు పొడవుగా కనిపించాలన్నా, సన్నగా ఉన్నవారు కొంచెం బొద్దుగా కనిపించాలన్నా ఈ చిన్న చిన్న కిటుకులు పాటించాలి... ఎత్తు తక్కువ ఉన్నవారు చిన్న అంచు(బార్డర్) లేదా అసలుఅంచు లేని చీరలు కట్టుకుంటే పొడువుగా కనిపిస్తారు.చర్మరంగుకు దగ్గరగా ఉండే రంగు దుస్తులను ధరిస్తే మీ రూపం పొడువుగా కనిపిస్తుంది. సన్నగా ఉన్నవారు అలంకరణలు ఎక్కువ ఉన్న అంటే గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులు, చీరలు కట్టుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు.నలుపు, ఎరుపు, నీలం.. వంటి బాగా ముదురు రంగు దుస్తుల మీదకు బంగారు ఆభరణాలు ధరిస్తే అందం రెట్టింపు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బొద్దుగా ఉన్నవారు చర్మం రంగు దుస్తులు ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు.బొద్దుగా, ఎత్తు తక్కువ ఉన్నవారు చారల దుస్తులు, చీరలు ధరించాలంటే.. నిలువు చారలున్నవి ఎంచుకోవాలి. -
అహనా పెళ్లంట అలనాటి స్టైలంట
ఫ్యాషన్‌లో రెట్రో స్టైల్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఇప్పుడీ స్టైల్ పెళ్లిలోనూ కళకళలాడుతోంది. కట్టులో పాత కళకు పడతులు పట్టం కడుతున్నారు. ఆభరణాల అలంకరణలోనూ పాత సొబగులకే వోటేస్తున్నారు. అలనాటి కళ.. నేడు కళ కళ పెళ్లి కుదరగానే ముందు పట్టు దుస్తుల మీదకు వెళతాయి ఇంట్లో వారి ఆలోచనలు. ముందుగానే కేటాయించిన బడ్జెట్లో కంచిపట్టు ప్రధానంగా ఉంటుంది. వీటితో పాటు బెనారస్ మనవైన చేనేతలు గద్వాల, నారాయణపేట, ఇక్కత్, ఉప్పాడ వంటివి ఉంటున్నాయి. వీటిలోనూ ముదురు రంగులు, పాతగా అనిపించే జరీ జిలుగులు, చెక్స్ వంటి డిజైన్లకే ఓటేస్తున్నారు వధువులు. వీటి రూపురేఖలు అమ్మమ్మల కాలం నాటివేమో అనిపించేలా ఉంటున్నాయి. అమ్మ, అమ్మమ్మల స్టైల్ బహుబాగు అంటున్నారు. కుట్టులోనూ ఓల్డే! అమ్మమ్మల కాలంనాటి చీరనా అని పెదవి విరిచే అమ్మాయిలు ఇప్పుడు ఇలాంటి డిజైన్స్‌నే అపురూపంగా ఎంచుకుంటున్నారు. వీటితో పాటు బ్లౌజ్ డిజైనింగ్‌లో ‘పాత కళ’నే ఇష్టపడుతున్నారు. కొన్నాళ్లు బోట్‌నెక్ బాగా ట్రెండ్‌లో ఉండేది. ఇప్పుడు మెడను పట్టేసినట్టుగా ఉండే క్లోజ్డ్ రౌండ్నెక్కి ఓటేస్తున్నారు. ఇవి దక్షిణాది కళనే కాదు ఉత్తరాది అమ్మాయిలనూ బాగా ఆకట్టుకుంటుంది. మోచేతుల వరకు ఉండే జాకెట్టు స్లీవ్స్ మరో ఆకర్షణ అవుతున్నాయి. బ్లౌజ్‌కు రకరకాలుగా గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీ చేయించుకోవడం పాత జాబితాలో చేరిపోయింది. కాంట్రాస్ట్ రంగులు లేదంటే చీరలోనే వచ్చే పీస్తో డిజైన్ చేసిన బ్లౌజ్‌లు ఇప్పుడు మళ్లీ ముందుకు వచ్చాయి. ఆభరణాలూ ‘పాత’వే! మామిడిపిందెలు, చంద్రహారాలు, కాసుల పేర్లు, మెడను పట్టి ఉంచే చోకర్స్ .. ఆభరణాలలోనూ పాత డిజైన్లవైపు మక్కువ చూపుతు న్నారు. దీంతో అలాంటి ఆభరణాలు పెళ్లింట కళకళలాడుతున్నాయి. ్జ్టకొప్పు ఎవర్గ్రీన్ ఎన్ని హెయిర్‌స్టైల్స్ వచ్చినా ఇప్పటికీ అమ్మమ్మల కాలం నాటి కొప్పులే పెళ్లికి కరెక్ట్ హెయిర్ స్టైల్. కొప్పు వేసి, ఆ కొప్పు చుట్టూ పువ్వులను చుడితే వచ్చే కళ మరే హెయిర్‌స్టైల్‌కి రాదన్నది స్టైలిస్టులమాట. – నిర్వహణ: ఎన్.ఆర్ -
పదములే చాలవు... భామా!
ఇండోవెస్ట్రన్ అయినాఇంటింటి వేడుకైనా తల నుండి పాదం వరకు ఒకే కాంబినేషఒకే థీమ్ ఆభరణాలు అలంకరణలో చేరితే ఆ రూపాన్ని వర్ణించడానికి పదములే చాలవు సాయంకాలం షికారుకు వెళ్లాలన్నా, సంప్రదాయ వేడుకైనా ఆభరణాలు ధరించే దుస్తులకు సరిపోయేలా ఉన్నాయో లేవో సరి చూసుకోవడం అనేది తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆభరణాలతో పాటు ఇతర అలంకరణ వస్తువులన్నీ ఒకే థీమ్‌తో ఉండేలా జాగ్రత్త తీసుకునే టైమ్ వచ్చేసింది. అదే ఇప్పుడు ట్రెండ్ అయ్యింది. పాపిట బిళ్ల నుంచి పాదం వరకు ముత్యాలు, రత్నాలు, కుందన్స్, పూసలు.. ఆభరణమేదైనా పాపిట్లో అలంకరించిన నగమాదిరే పాదరక్షల డిజైన్ కూడా ఉండాలి. అదెలా?! అనే వారికి ఇప్పుడీ డిజైన్లు అందుబాటులోకి వచ్చేశాయి. చెవి జూకాలు – చెప్పుల డిజైన్ ఒకేలా ఉంటే అదీ ఓ స్టైల్. కాలి పట్టీల రాళ్ల డిజైన్‌తో పోటీ పడే షూ ఉంటే ఆ కాలి అందం ఎన్నింతలు పెరుగునో అని మగువలు మురిసిపోవచ్చు. చేతి గాజులు – కాలి చెప్పుల డిజైన్‌తో జత కలిస్తే ధరించే దుస్తుల అందం రెట్టింపు అవకుండా ఉంటుందా! అనుకున్నారేమో అందమైన కాంబినేషన్‌గా జత కట్టేశారు. మెడలో హారం రంగు కాలి చెప్పుల రంగు ఒకేలా కాంతులీనుతుంటే! ఆ చెప్పుల మీదుగా పారాడే చీర అంచు డిజైన్ వాటితో పోటీపడుతుంటే నిలువెత్తు అందం నడిచివచ్చినట్టే! ముక్కుబేసరి పెట్టుకుంటేనే ముఖకాంతి పండువెన్నెల పోటీపడుతుంది. ఇక బేసరితో పోటీ పడేలా చెప్పుల జత కూడా తోడైతే మేలి ముసుగులో వధువు మెరిసిపోకుండా ఉండగలదా అనేది డిజైనర్స్ చెబుతున్న మాట. ఇన్ని డిజైనర్ అలంకరణతో పాటు వీటితో జత కలిసే హ్యాండ్ బ్యాగ్ లేదా క్లచ్ మరో అదనపు ఆకర్షణను నింపుతుంది. అలంకరణ వస్తువులన్నీ మ్యాచ్ చేయాలంటే అందుకే సమయం పడుతుంది. పైగా అన్నీ ఒకేలా దొరుకుతాయన్న గ్యారంటీ ఉండదు. ఇలా అన్నీ ఒకే థీమ్‌తో లభించే ఆభరణాలు, అలంకరణ వస్తువుల డిజైన్, నాణ్యతలను బట్టి ధరలు ఉన్నాయి.వెస్ట్రన్స్టైల్ నుంచి మన సంప్రదాయ దుస్తులకూ ఈ ట్రెండ్ అనుకరణ వచ్చింది. డ్రెస్‌లో ఒక ముఖ్యమైన డిజైన్ ప్యాటర్న్ తీసుకొని దానికి తగ్గట్టుగా చెప్పులు, బ్యాగ్, బ్యాంగిల్.. ఇలా అన్నీ ఒక సెట్‌లా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ మోడల్ సెట్స్ యువతరాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మ్యాచింగ్ కోసం ఎక్కువ పాట్లు అవసరం లేని ఈ కొనుగోళ్లు ఆన్లైన్ మార్కెట్లోనూ అందుబాటులోకి వచ్చాయి. -
దారం బంగారం
సిల్క్ దారాలను చుట్టి, పూసలు గుచ్చి, తీగలు అల్లి .. ఇలా అందమైన ఆభరణాలను రూపొందించుకోవచ్చు. పండుగకు స్వర్ణాభరణాలు ఎలాగూ ఉంటాయి. తేలికగా, అత్యంత ఆకర్షణీయంగా, సంప్రదాయ దుస్తులకు మ్యాచ్ అయ్యేలా దారాల ఆభరణాలు ఉంటే.. పండుగ కళ కొత్తగా శోభిళ్లుతుంది. దారాలతో రూపొందించిన ఆభరణాల డిజైన్స్‌లో కొన్ని మోడల్స్.. తయారీకి కావల్సినవి రంగుల సిల్క్ దారాలు, సన్నని ప్లాస్టిక్ ట్యూ (గాజులు, హారాల తయారీకి)/ టూల్స్, గ్లూ, టూల్స్ కట్టర్, పూసలు, బీడ్ క్యాప్స్, జుంకా బేస్, చెయిన్స్.... వంటివి ముందుగా సిద్ధం చేసుకోవాలి. (ఈ కిట్ మార్కెట్లోనూ, ఆన్‌లైన్‌లోనూ లభిస్తుంది). ఎక్కువ మొత్తంలో, నచ్చిన డిజైన్లను రూపొందించుకోవడానికి ఈ కిట్స్ ఉపయోగపడతాయి. నేరుగా సిల్క్ థ్రెడ్ ఆభరణాలు కొనుగోలు చేయాలంటే రూ.100 నుంచి వేలల్లో లభిస్తున్నాయి. -
వందలు ఎరవేసి.. 25 లక్షల ఆభరణాలు చోరీ
ఖమ్మం క్రైం: కొన్ని రూ. 50 నోట్లను ఎరగా వేసి కారు డ్రైవర్ దృష్టి మళ్లించి.. రూ. 25 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన ఖమ్మంలో సోమవారం జరిగింది. నగరానికి చెందిన గుర్రం రాధిక, ఆమె కోడలు వనజ ఓ బ్యాంక్ లాకర్లో ఉన్న తమ బంగారు ఆభరణాలను ఓ సూట్‌కేస్‌లో భద్రపరిచి కారు సీటు కింద పెట్టి.. గాంధీచౌక్‌లోని ఓ బంగారం షాపులోనికి వెళ్లారు. డ్రైవర్‌ను కారు పార్కింగ్ చేయాలని సూచించి, బంగారం భద్రపరిచిన సూట్‌కేçస్ను అతడికి అప్పగించారు. ఈలోపు గుర్తు తెలియని ఆగంతకుడు కారు వద్దకు వచ్చి ‘కింద రూ.50 నోట్లు పడి ఉన్నాయి.. అవి మీవేనా..?’అంటూ అడగడంతో అతను కిందకు దిగి వరుసగా పడి ఉన్న నోట్లను ఏరుకుంటుండగా.. గుర్తు తెలియని వ్యక్తి కారులోని సూట్‌కేసుతో పరారయ్యాడు. నోట్లు తీసుకున్నాక డ్రైవర్.. కారులో కూర్చొని సీట్ కింద ఉన్న సూట్ కేసును చూసుకోగా.. అది కనిపించలేదు. వెంట కారుదిగి చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. డ్రైవర్ వెంటనే వెళ్లి తన యజమానురాలికి విషయం చెప్పగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ పింగళి నరేశ్‌రెడ్డి సందర్శించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చోరీ అయిన సూట్‌కేసులో బంగారం, వజ్రాల నగలు ఉన్నాయని బాధితులు తెలిపారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఈ దృశ్యాలు సరిగా లేకపోవటంతో దొంగలను గుర్తు పట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది. -
సీతారాములకే శఠగోపం..?
► మాయమైన ఆభరణాలు లభ్యం ► రాముడి ఆభరణాలు నృసింహుడి బీరువాలో ప్రత్యక్షం ► పరిపాలనా విభాగంలో మాయాజాలం ► నివ్వెరపోతున్న యంత్రాంగం ► ఉద్యోగి సస్పెన్షన్‌తో బయటపడ్డ వైనం వేములవాడ: సీతారాములకే శఠగోపం పెట్టాలని చూశారు ఉద్యోగులు. తమ మొక్కులు తీరిన తర్వాత భక్తులు భక్తితో స్వామివారికి సమర్పించిన వెండి ఆభరణాలను చాకచక్యంగా కాజేయాలని యత్నించి పట్టుబడ్డ వైనం ఉద్యోగి సస్పెన్షన్‌తో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓదెలు కుటుంబసభ్యులతో కలసి వచ్చి మామిడిపల్లి సీతారామచంద్రస్వామివార్లకు వెండి ఆభరణాలు బహూకరించారు. అవి మాయం కావడంతో అక్కడ విధులు నిర్వహించే ప్రశాంత్‌బాబు అనే ఉద్యోగిని ఈనెల 25న సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో దూస రాజేశ్వర్ ఉత్తర్వులు వెలువరించారు. ఈనెల 28లోగా సంజాయిషీ ఇవ్వకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో అసలు కథ బయటపడింది. ఆలయ పరిపాలనా విభాగం కార్యాలయంలోని నాంపల్లి నర్సింహాస్వామి ఆలయానికి చెందిన బీరువాలో మామిడిపల్లి సీతారామచంద్రస్వామివారికి భక్తులు సమర్పించిన వెండి శంఖు, నామాలు రూ.50వేల విలువైన ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆలయ అధికారుల్లో తర్జనభర్జన మొదలైంది. రాజన్న ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని స్థానికంగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలేం జరిగింది వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ దేవాలయమైన మామిడిపల్లి సీతారామచంద్రస్వామివారి ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన ఓదెలు అనే భక్తులు ఇటీవలే వెండి శంఖు, నామాలతోపాటు కూడిన ఆభరణాలను బహూకరించారు. అయితే ఈ ఆభరణాలను సదరు ఉద్యోగి ప్రశాంత్‌బాబు ఆలయానికి అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ క్రమంలో భక్తుడే స్వయంగా మరోసారి వేములవాడకు చేరుకుని తనకు రశీదు ఇవ్వాలని పట్టుబట్టడంతో ఈ అంశం మరింత వెలుగుచూపింది. భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలను అప్పగించాలని, లేకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ప్రశాంత్‌బాబును సస్పెండ్ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడంతో సీతారామచంద్రుడికి సంబంధించిన ఆభరణాలు నాంపల్లి లక్ష్మీనర్సింహుడి బీరువాలో బుధవారం ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆలయ అధికారులు కంగుతిన్నారు. పరిపాలనా విభాగంలో మాయాజాలం వేములవాడ రాజన్న ఆలయంతోపాటు అనుబంధ, దత్తత దేవాలయాలకు సంబంధించిన పరిపాలనా విభాగం ఆలయంలోని ప్రధాన కార్యాలయంలో జరుగుతుంటుంది. ఇందుకు సిబ్బంది, మందీమార్బలం అంతా ఉంటారు. ఇంతేకాకుండా ఇటీవలే ఈ కార్యాలయంలోకి వచ్చేవారి వివరాలు నమోదు చేసేందుకు రక్షణ సిబ్బందిని సైతం నియమించారు. ఇన్ని ఉన్నా రూ.50వేల విలువ చేసే వెండి ఆభరణాలను ఎవరు తీసుకొచ్చి నాంపల్లి నర్సింహాస్వామి దేవస్థానానికి చెందిన బీరువాలో పెట్టారన్నది ఆలయ ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. రూ.కోట్ల ఆదాయం వస్తున్న ఈ ఆలయంలో ఇంతటి భద్రత లోపం జరుగుతుందంటూ స్థానికంగా ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగుల మధ్య లడాయి మామిడిపల్లి సీతారామచంద్రస్వామివారి ఆలయంలో ఇటీవల ఉద్యోగుల బదాలాయింపు జరిగింది. దీంతో ఇరువురు ఉద్యోగుల మధ్య లడాయి జరగడం, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకోవడం లాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో అసలు కథ బయటికి పొక్కింది. ఆభరణాలు దొరికాయి హైదరాబాద్‌కు చెందిన ఓదెలు అనే భక్తుడు సీతారామచంద్రస్వామికి బహూకరించిన వెండి ఆభరణాలు నాంపల్లి నర్సింహాస్వామి ఆలయానికి చెందిన బీరువాలో దొరికాయి. ఈ అంశంలో తనకు సైతం చార్జిమెమో ఇచ్చారు. – గౌరీశంకర్, పర్యవేక్షకుడు -
నగలు మాయం..పోలీసుల అదుపులో పనిమనిషి
బంజారాహిల్స్: పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నంబర్ -14లోని డాక్టర్స్ క్వార్టర్స్‌లో నివసించే పి.అనంతలక్ష్మి రోజూ తన నగలను తీసి బెడ్రూంలో ఉన్న కప్‌బోర్డులో భద్రపరుస్తుంటారు. శుక్రవారం కూడా ఎప్పటిలాగే సాయంత్రం నగలు కప్‌బోర్డులో పెట్టి తాళాలు వేయటం మర్చిపోయారు. రోజు మాదిరిగా పని మనిషి లక్ష్మి బెడ్రూం క్లీన్చేయడానికి లోనికి ప్రవేశించింది. 7.30 గంటలకు క్లీన్‌చేసి వెళ్లిపోయింది. అనంతలక్ష్మి ఉదయం కప్బోర్డు తెరవగా అందులో రూ. 2 లక్షల విలువ చేసే వజ్రాలు పొదిగిన గాజులు, ముత్యాల హారంతో పాటు రూ. 35 వేల విలువ చేసే గొలుసులు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే రంగంలోకి దిగి ఇంట్లో విచారణ చేపట్టారు. పని మనిషిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నగలు... కష్టాలు!
రాణి పద్మిని జీవితం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పద్మావతి’. ఈ చిత్రం షూటింగ్‌కి ఇప్పటికే పలు ఆటంకాలు ఎదురయ్యాయి. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ సినిమాని ఆపివేయాలని కొందరు వివాదం రేపారు. ఆ తర్వాత ఈ చిత్రం లొకేషన్లో ఓ ప్రమాదం జరిగింది. ఇప్పుడు టైటిల్ రోల్ చేస్తోన్న దీపికా పదుకొనె కారణంగా షూటింగ్‌కి ఆటంకం ఏర్పడింది. మహరాణి పాత్ర కాబట్టి బరువైన ఆభరణాలు ధరిస్తున్నారు దీపిక. సుకుమారి శరీరం ఈ నగలను మోయలేకపోతోందట. నగలు మాత్రమే కాదు.. ఈ చిత్రం కోసం ఆమె ధరిస్తున్న కాస్ట్యూమ్స్ బరువు కూడా ఎక్కువేనట. ఈ భారం మోయలేక దీపిక నానా అవస్థలు పడుతున్నారని సమాచారం. దీపిక మెడ దగ్గర నొప్పి మొదలైందని వినికిడి. భరించలేనంత నొప్పి కావడంతో షూటింగ్లో పాల్గొనలేకపోయారట. దాంతో సంజయ్ లీలా భన్సాలీ దగ్గర అనుమతి తీసుకుని, రెస్ట్ తీసుకుంటున్నారని బాలీవుడ్ టాక్. -
అస్థికలతో ఆభరణాలు
నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో పురావస్తుశాఖ అధికారులు కొనసాగిస్తున్న తవ్వకాల్లో శుక్రవారం అస్థికలతో చేసిన ఆభరణాలు లభ్యమయ్యాయి. మెన్హిర్ వద్ద ఉన్న మొదటి సమాధిలో 50 సెంటీమీటర్ల ఎముకతోపాటు, చిన్న ముక్కలు, ఎర్రమట్టి పాత్ర, మూడు నల్లటిమట్టి గిన్నెలు లభిం చాయి. ఈ సందర్భంగా పురావస్తు శాఖ సహాయ సంచాలకుడు నాగరాజు, ఎర్రమరాజు భానుమూర్తి మాట్లాడుతూ నర్మెటలోని పెద్ద సమాధిలో రెండున్నర మీటర్ల లోతు తవ్వకాలు జరిపి కీలకమైన ప్రాచీన మానవుడి ఆనవాళ్లను గుర్తించామని చెప్పారు. పొడవాటి కాలి ఎముకతోపాటు, ఎముకలతో చేసిన ఆభరణాలను వెలికి తీశామన్నారు. ఆనాటి మహిళలు దీన్ని ఆభరణంగా ధరించి ఉండవచ్చని భావిస్తున్నామని, పరీక్షల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మరికొన్ని మృణ్మయ పాత్రలు లభించాయన్నారు. ఇప్పటికే చాలా సమాచారాన్ని సేకరించామని, ఐదు రోజుల్లో తవ్వకాలు పూర్తి చేస్తామని అన్నారు. -
బంగారం కొనుగోలు విలువ రూ.2 లక్షలు మించితే..
-
ఆభరణాల కొనుగోలు విలువ రూ.2 లక్షలు మించితే పన్ను
న్యూఢిల్లీ: నగదుతో పెద్ద మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేసే వారు ఇకపై ఒక శాతం పన్ను భారం భరించాల్సి ఉంటుంది. రూ.2 లక్షలకు మించిన లావాదేవీలకు నగదు రూపంలో చెల్లింపులు చేస్తే ఒక శాతం మూలం వద్ద పన్ను కోత (టీసీఎస్) విధిస్తారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం రూ.5 లక్షలకు మించి నగదు రూపంలో ఆభరణాల కొనుగోళ్లపై ఈ నిబంధన అమల్లో ఉంది. రూ.3 లక్షలకు మించిన నగదు లావాదేవీలను నిషేధిస్తూ 2017–18 బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీన్ని ఉల్లంఘిస్తే అంతే మొత్తం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆభరణాలపై ఒక శాతం టీసీఎస్ విధింపునకు ఉన్న రూ.5 లక్షల పరిమితిని రూ.2 లక్షలకు తగ్గించాలని ఆర్థిక బిల్లు 2017 స్పష్టం చేసింది. ఈ మార్పు కారణంగా ఆభరణాలను కూడా సాధారణ వస్తువుల కిందే పరిగణిస్తారు. దీంతో రూ.2 లక్షల విలువ దాటిన లావాదేవీపై ఒక శాతం టీసీఎస్ విధించడం జరుగుతుంది. ‘‘ఆదాయపన్ను చట్టం ప్రకారం రూ.2 లక్షలకు మించి విలువ చేసే వస్తు, సేవలపై ఒక శాతం టీసీఎస్ విధించాల్సి ఉంటుంది. వస్తువులు అంటే అర్థం ఆభరణాలు కూడా. దీంతో రూ.2 లక్షలకు మించిన ఆభరణాల నగదు కొనుగోళ్లకూ టీసీఎస్ వర్తిస్తుంది’’ అని ఆదాయపన్ను శాఖ అధికారి ఒకరు తెలిపారు. నల్లధనం నియంత్రణ చర్యల్లో భాగమే తాజా మార్పుల వెనుక ఉన్న కారణంగా ఆర్థిక బిల్లు స్పష్టం చేసింది. -
పార్టీ 2017
17లో 16 ఏళ్ళ అమ్మాయిలా కనపడాలంటే! ఎన్నేళ్ళొచ్చినా 16 ఏళ్ళ అమ్మాయిలా పార్టీ చేసుకోవాలంటే... గెట్ రెడీ! గెట్ ఎ ప్రామ్! సింగిల్ పీస్ బ్యూటీలివి. పార్టీలను పరమళింప చేసే సూట్లు ఇవి. కమాన్.. లెటజ్ గో పార్టీ! ►ఎక్కడ ఉన్నా పార్టీకే ప్రత్యేకం అనిపించే బ్లాక్ కలర్ ప్రామ్ గౌన్. ► మత్స్య సుందరిని తలపిస్తున్న గ్రే కలర్ ప్రామ్ డ్రెస్. పార్టీకి ప్రత్యేక హంగులను అద్దుతుంది. ► కొత్త సంవత్సరాన పచ్చని పరవశాన్ని మోసుకొస్తుంది గ్రీన్ కలర్ ప్రామ్డ్రెస్. పొడవాటి గౌనులా ఉండే ప్రామ్ విదేశాలలో సాయంకాల బాల్రూమ్ డ్యాన్స్‌లకు తప్పనిసరి డ్రెస్‌గా ఉంటుంది. శరీరానికి అతుక్కుని ఉండే ఈ గౌన్‌ను ధరించడం వల్ల శరీరాకృతి అందంగా కనిపిస్తుంది. కట్టుకున్నవాళ్లు డ్రెస్ కట్ వల్ల మత్స్యసుందరిలా, యువరాణుల్లా, మహారాణుల్లా కనిపిస్తారు. ఎ–లైన్, కోణాకృతి శరీర ఆకృతి గలవారికీ బాగా నప్పే ఈ డ్రెస్ దాదాపు 16, 17 శతాబ్దంలో వెలుగులోకి వచ్చింది. 18వ శతాబ్దంలో ఫార్మల్ డ్రెస్‌గా, ఈవెనింగ్ బాల్ డ్యాన్స్ డ్రెస్‌గా పేరొందింది. 19వ శతాబ్దంలో పార్టీ డ్రెస్ అంటే ప్రామ్ డ్రెస్ తప్పక ఉండాల్సిందే అనే ముద్ర పడిపోయింది. పాశ్చాత్య వివాహవేడుకలలో తప్పక కనిపించే ఈ డ్రెస్ మన దగ్గర ఈవెనింగ్ పార్టీలో తళుక్కుమంటోంది. ► పువ్వులు, లతలు ప్రామ్ డ్రెస్ మీద కొత్త సింగారాలు అద్దుతుంటే వేడుకలో సిండ్రెల్లా అనిపించాల్సిందే! ► వంగపండు రంగు ప్రామ్డ్రెస్ ధరిస్తే యువరాణిలా మెరిసిపోకుండా ఉండలేరు. ► చీకటి వెలుగులకు కొత్త బాష్యాన్ని చెప్పే నలుపు–తెలుపు కాంబినేషన్ ప్రామ్ పార్టీలో హైలైట్. ► రాయల్ బ్లూ కలర్, ఒన్ షోల్డర్ ప్రామ్ డ్రెస్. పార్టీకి రాచరికపు సొబగులను మోసుకొస్తుంది. పార్టీలో డ్రెస్కే ప్రత్యేకత ►ఆభరణాలు, ఇతర అలంకారాలు అవసరమే లేదు. ► సింపుల్ మేకప్ పార్టీ వినోదానికి స్పెషల్ అట్రాక్షన్. ► హెయిర్ స్టైయిల్స్కు హైరానా వద్దు. లూజ్ హెయిర్ ప్రామ్ డ్రెస్‌కి సిసలైన స్టైల్. -
నెక్ వర్సెస్ నెక్లెస్
న్యూలుక్ రౌండ్ నెక్, లో నెక్, స్క్వేర్ నెక్, బోట్ నెక్... ఇలా ఏ మోడల్ బ్లవుజ్ మీదకైనా ఒకే తరహా ఆభరణాలు ధరించే వాళ్లు ఒకప్పుడు. ఆ రోజులు పోయాయి. హైనెక్ బ్లౌజ్ అయితే ఒక టైప్, వి–నెక్ అయితే మరో టైప్, రౌండ్ నెక్ అయితే ఇంకో టైప్... ఇలా నెక్ డిజైన్‌కి తగ్గట్టు ఆభరణాలు ధరించడం వల్ల సై్టల్, సింగారం రెట్టింపుగా ఆకట్టుకుంటుంది. -
రెండు నగలు మాయం
నిర్థారించిన ఆలయ అధికారులు కనిపించని నగలలో సీతమ్మ పుస్తెల తాడు, లక్ష్మణ స్వామి లాకెట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈఓ రమేష్‌బాబు ఆలయ అర్చకులపై కేసు నమోదు ఆలయాన్ని పరిశీలించిన ప్రత్యేక భద్రతాధికారులు అన్ని ఆభరణాలను నేడు తనిఖీ చేయనున్న జ్యూయలరీ అధికారి భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో రెండు బంగారు ఆభరణాలు మాయమైనట్టుగా అధికారులు నిర్థారించారు సీతమ్మ వారి పుస్తెల తాడు,లక్ష్మణస్వామి బంగారు లాకెట్ కనిపించడం లేదంటూ భద్రాద్రి పోలీసులకు దేవస్థానం ఈఓ రమేష్‌బాబు సోమవారం ఫిర్యాదు చేశారు. భద్రాద్రి రామాలయంలో నిత్య పూజాది కార్యక్రమాలు.. ఉత్సవాల సమయంలో స్వామి వారికి అలంకరించే బంగారు ఆభరణాలన్నీ ఇద్దరు ప్రధానార్చకులు, మరో తొమ్మిదిమంది అర్చకుల పర్యవేక్షణలో ఉంటాయి. వీటిలోని రెండు ఆభరణాలు కనిపించడం లేదు. దీనికి బాధ్యులైన అర్చకులపై శాఖాపరంగా కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ముందుగా పోలీసులకు ఆలయ ఈఓ ఫిర్యాదు చేశారు. ఆలయంలోని బంగారు ఆభరణాల లెక్క తేల్చాలంటూ ఆలయ అర్చకులకు సోమవారం సాయంత్రం వరకు ఈఓ గడువు ఇచ్చారు. ఆభరణాలన్నీ తనిఖీ చేసిన అర్చకులు.. సీతమ్మ పుస్తెల తాడు, లక్ష్మణ స్వామి బంగారు లాకెట్ కనిపించకడం లేదంటూ ఈఓకు నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా తదుపరి చర్యల కోసం ఇక్కడ జరిగిన మొత్తం పరిణామాలను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఈఓ రమేష్‌బాబు నివేదించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. సమగ్ర విచారణకు ఆదేశించించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక భద్రత దళం (ఎస్పీఎఫ్) అధికారుల బృందం సోమవారం సాయంత్రం భద్రాచలం రామాలయాన్ని సందర్శించి, ఈఓ రమేష్‌బాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బంగారు ఆభరణాల మాయం, అంతకు ముందు.. ఆ తరువాత జరిగిన మొత్తం పరిణామాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈ బృందంలో ఎస్పీఎఫ్ కమాండెంట్ మాధవరావు, డీఎస్పీ భాస్కర్‌రావు, సీఐలు మోహన్‌రావు, రవీందర్‌రెడ్డి ఉన్నారు. తేలనున్న ఆభరణాల లెక్క అర్చకుల ఆధ్వర్యంలోగల ఆభరణాల్లో రెండు నగలు మాయమైన నేపథ్యంలో మిగతావన్నీ భద్రంగా ఉన్నాయో లేదో లెక్క తేల్చేందుకు దేవాదాయశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ దేవాదాయ శాఖ ఆభరణాల తనిఖీ అధికారి(జేవీఓ) భాస్కర్‌ను ఆదేశించారు. ఆయన సోమవారం సాయంత్రం ఇక్కడకు వచ్చి దేవస్థానం ఈఓతో చర్చించారు. ఆలయంలోని మొత్తం ఆభరణాలను మంగళవారం పూర్తిస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఈఓ తెలిపారు. అర్చకులపై కఠిన చర్యలు ఆలయంలోని బంగారు ఆభరణాలు మాయమవడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో బాధ్యులైన అర్చకులపై కఠిన చర్యలు తీసకుంటామని ఈఓ రమేష్‌బాబు తెలిపారు. ఆయన సోమవారం ఇక్కడ తన చాంబర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మాయమైన నగలలో సీతమ్మ పుస్తెల తాడు (70 గ్రామలు), లక్ష్మణ స్వామి బంగారు లాకెట్ (21 గ్రాములు) ఉన్నాయని; వీటి విలువ రూ.2.13 లక్షలు ఉంటుందని అన్నారు. వాటిని ఓ దాత స్వామి వారికి నిత్య కల్యాణోత్సవ అలంకారంలో వినియోగించేందుకు చేయించి ఇచ్చినట్టుగా ఉందన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ పరిణామాలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తున్నామన్నారు. వారి ఆదేశానుసారంగా బాధ్యులైన అర్చకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే ఇద్దరు ప్రధానార్చకులకు మెమోలు జారీ చేసేందకు రంగం సిద్ధమైంది. ఈఓ ఫిర్యాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు భద్రాచలం సీఐ శ్రీనివాసులు, ఎస్సై కరుణాకర్ తెలిపారు. -
యజమానులు ఇంట్లో ఉండగానే చోరీ
చైతన్యపురి: ఇంట్లో వారు నిద్రలో ఉండగా వెనుక తలుపు నుంచి చొరబడ్డ దొంగలు బీరువాలోని నగదు, నగలు ఎత్తుకెళ్లారు. చైతన్యపురి సీఐ గురురాఘవేంద్ర ప్రకారం... మారుతీనగర్ రోడ్ నెం–5లో నివాసముండే అరుణ్‌కుమార్ మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి అరుణ్‌కుమార్ కుటుంబసభ్యులంతా ఇంట్లో నిద్రిస్తుండగా వెనుక కిటికీ ద్వారా డోర్ తెరిచిన దొంగలు బీరువాలోని రూ.1.8 లక్షల నగదు, 9 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసుకెళ్లారు. ఉదయం నిద్ర లేచిన అరుణ్‌కుమార్ చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. మరో రెండు ఘటనలు... బంజారాహిల్స్: నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో దొంగలు పడి సెల్ఫోన్లతో పాటు నగదు ఎత్తుకెళ్లిన రెండు ఘటనలు బంజారాహిల్స్ ఠాణా పరిధిలో జరిగాయి. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.2 ఇందిరానగర్‌లోని నల్లపోచమ్మ గుడి సమీపంలో యుగేంధర్ తన స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి నిద్రించిన యుగేంధర్ ఆదివారం ఉదయం నిద్రలేచి చూసేసరికి అతని ఐఫోన్, స్నేహితుడి సామ్సంగ్ గాలక్సీ ఫోన్ అదృశ్యమయ్యాయి. ఇదే విధంగా రోడ్ నెం.14లో మరో ఘటన జరిగింది. శ్రీకాంత్‌రెడ్డి అనే సిస్టం ఇంజినీర్ రాత్రి నిద్రపోయి ఉదయం లేచి చూసేసరికి అతని గదిలో ఉండాల్సిన మోటో జీ, సెల్కాన్, సామ్సంగ్ ఫోన్లతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఎస్బీఐ ఏటీఎం కార్డులతో కూడిన పర్సు పోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దోపిడీ కేసులో ఏడుగురికి జీవితఖైదు
బంజారాహిల్స్ : తమ వద్ద అరుదైన విగ్రహాలు ఉన్నాయంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను నమ్మించి వారిని బంధించి ఆభరణాలతో పాటు లక్షలాది రూపాయలు దోచుకెళ్లిన ఘటనలో నిందితులకు కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2009లో ఈసంఘటన జరిగింది. 2009 మే 10న కె.శ్రీధర్, సత్యజిత్ రాజేష్, శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, తనుజిత్‌కుమార్, ఎస్. పోతురాజు, రామలింగ ప్రసాద్ తదితరులు తమ వద్ద అరుదైన విగ్రహాలున్నాయని నమ్మబలికారు. ఇందుకు ఆకర్షితులైన వరంగల్జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జ్యోతికుమార్, కేరళకు చెందిన కేబీ బహులేయం, కోయంబత్తూర్‌కు చెందిన ఆర్. శివం వీరిని సంప్రదించారు. తమ వద్ద అరుదైన అక్షయపాత్ర ఉందని ఒకటికి రెండింతలవుతుందని నమ్మబలికారు. ఈముగ్గురూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే నిందితులు వీరిని వెంకటగిరిలోని ఓ గదికి తీసుకువెళ్లి అక్కడ వీరిని బంధించి రూ. 5.50 లక్షల నగదుతో పాటు వారి వద్ద ఉన్న ఆభరణాలు పెద్ద మొత్తంలో దోచుకున్నారు. అంతేకాకుండా శివన్ భార్యకు ఫోన్ చేసి ఏటీఎం కార్డు ద్వారా లక్షలాది రూపాయలు డ్రా చేయించి పరారయ్యారు. బాధితులు అదే రోజు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేయగా 2009 జూలై 1న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆధారాలను జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టుకు పక్కాగా సమర్పించారు. ఈ మేరకు మంగళవారం రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. -
కాలుష్యాన్నే ఆభరణంగా మార్చే యంత్రం
చైనా రాజధాని బీజింగ్‌లో కాలుష్య మేఘాలు దట్టంగా కమ్ముకొని ప్రజలను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసిన సంఘటన చూసి డచ్‌కు చెందిన డాన్ రూసర్ గార్డె కాలుష్యానికి విరుగుడుగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్యూరిఫయర్ కనుగొన్నాడు. ఆకాశాన్ని కమ్ముకున్న కాలుష్య మేఘాల నుంచి కణాలను తన వైపు ఆకర్షించి స్వచ్ఛమైన గాలిలా మార్చే స్మాగ్ ఫ్రీ టవర్‌కు రూసర్ రూపకల్పన చేశాడు. అంతే కాకుండా కాలుష్య కణాలను ఈ టవర్ కంప్రెస్ చేసి డైమండ్ రూపంలో ఉన్న రాళ్లను ఉత్పత్తి చేస్తుంది. చూడడనికి అందంగా ఉండే ఈ రాళ్ల రూపంలో ఉన్న వస్తువు ఆభరణంగా వాడడానికి పనికొస్తుంది. ఇది ఇయాన్(ఐఓఎన్) టెక్నాలజీతో పనిచేస్తుందని గార్డె తెలిపాడు. ఈ టవర్ చుట్టు పక్కల పరిసరాలను 75 శాతం వరకు క్లీన్ గా ఉంచగులుగుతుందని గార్డె తెలిపాడు. ఈ టవర్‌ను తొలిసారిగా సెప్టెంబర్‌లో బీజింగ్‌లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్మాగ్ ఫ్రీ టవర్ వాతావరణ కాలుష్య సమస్యల పై ప్రజల్లో అవగాహ కల్పించడానికి కూడా ఉపయోగపడుతుందని తెలిపాడు. హాలాండ్‌లో నిర్వహించిన ముందస్తు పరీక్షల్లో స్మాగ్ ఫ్రీ టవర్ మంచి ఫలితాలను ఇచ్చింది. బీజింగ్‌లో అమర్చిన తర్వాత ప్రపంచంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని వాడనున్నారు. బీజింగ్‌లో కాలుష్య మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో గతంలో 'రెడ్ అలర్ట్' ప్రకటించిన విషయం తెలసిందే. ఈ కాలుష్య మేఘాల దాటికి ఏకంగా పాఠశాలలకు సెలవులిచ్చారు. భవన నిర్మాణాలను నిలిపివేశారు. రోడ్డు పక్కన తినుబండారాలను తయారుచేసే షాపులను మూసివేశారు. ప్రజలు వీధుల్లోకి వస్తే తప్పనిసరి మాస్కులు ధరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కొన్ని విదేశీ, కొన్ని దేశీయ విమాన సర్వీసులను రద్దుచేశారు. రోడ్లపై సగానికి సగం కార్ల రాకపోకలను నియంత్రించారు. భారీ వాహనాలను, చెత్తను తీసుకెళ్లే మున్సిపల్ వాహనాలను కొన్ని రోజులపాటు పూర్తిగా నిలిపివేశారు. చలికాచుకునేందుకు ఏర్పాటు చేసుకొనే కుంపట్లలో బొగ్గు వినియోగాన్ని తగ్గించాలని హెచ్చరికలు జారీ చేశారు. కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్న ప్రపంచ నగరాల్లో బీజింగ్ నగరమే మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. -
లైన్ పేరిట మోసం
► రూ.1.92 కోట్ల బంగారు ఆభరణాలతో ఉడాయింపు ► నిందితుడి అరెస్ట్ రూ.75.70 లక్షల బంగారు స్వాధీనం నెల్లూరు (క్రైమ్) : లైన్ బిజినెస్ పేరిట వ్యాపారులను బురిడీ కొట్టించి రూ.1.92కోట్ల బంగారు ఆభరణాలతో ఉడాయించిన నిందితుడిని మూడో నగర పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రూ.75.50 లక్షల బంగారును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ విశాల్‌గున్నీ నిందితుడి వివరాలను వెల్లడించారు. స్టోన్‌హౌస్‌పేట లక్ష్మీపురానికి చెందిన వల్లేటి కృష్ణసాగర్ అలియాస్ సాగర్ ఆచారివీధిలో జ్వాలాముఖి జ్యుయలరీ దుకాణం నిర్వహిస్తున్నాడు. నెల్లూరులోని బంగారు వ్యాపారుల నుంచి ఆభరణాలను తీసుకుని లైన్ బిజినెస్ చేసేవాడు. రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లోని వ్యాపారులకు ఆర్డర్లపై సరఫరా చేసేవాడు. ఈ నేపథ్యంలో అతను వ్యసనాలకు బానిసై అప్పుల పాల య్యాడు. ఈ క్రమంలో గతనెల 26వ తేదీన నెల్లూరు మండపాల వీధిలోని సుదర్శన్ జ్యుయలరీస్, లక్ష్మీ జ్యూయలరీ యజమాని కటకం వెంకట రవికుమార్ వద్ద నుంచి 1400 గ్రాములు, పి. మణి ఆచారివద్ద 540 గ్రాములు, దినేష్‌జైన్ వద్ద 450 గ్రాములు ఇలా పలువురు వ్యాపారుల వద్ద నుంచి రూ. 1.92 కోట్లు విలువ చేసే 6.630 కేజీల బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యాడు. బాధితుడు రవికుమార్ ఈ నెల 3న మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం నిందితుడు లక్ష్మీపురంలోని ఇంట్లో ఉన్నాడన్న సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ జి. రామారావు అతన్ని అరెస్ట్ చేసి రూ. 75.70 లక్షలు విలువ చేసే 2,600 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌చేసి సొత్తు రాబట్టుటకు కృషి చేసిన మూడోనగర ఇన్స్పెక్టర్ జి. రామారావు, ఎస్ఐ పి. రామకృష్ణ, హెచ్‌సీలు ఎస్కే సిరాజ్, జి. ప్రభాకర్, ఎస్కే షమీర్, బీవీ నరసయ్య, కానిస్టేబుల్స్ వెంకటేశ్వర్లు, ఇ. వేణుగోపాల్, జి. వేణుగోపాల్, శివప్రసాద్, పి. మహేష్, దయాశంకర్‌ను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. -
ఇంటికి - ఒంటికి
గులాబి పువ్వై... గులాబి పూలను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. చాలామందికి వాటిని తల్లో పెట్టుకోవడం కన్నా.. వాటిని చూస్తూ ఉండటమే ఇష్టం.. అందుకే ఇంట్లో ప్లవర్ వాజుల్లో వాటిని పెట్టుకుంటారు. కానీ ఒరిజినల్ పూలు ఒక్కరోజుకు మించి తాజాగా ఉండవు. కాబట్టి ప్లాస్టిక్ లేదా పేపర్ గులాబీలతో అడ్జస్ట్ కాక తప్పదు. అలాంటి పేపర్ గులాబీలను ఇకపై షాపుల్లోంచి కొనుక్కురాకుండా ఇంట్లోనే తయారు చేసుకుందాం.. ఇందులో ఇంకో సౌలభ్యం కూడా ఉంది. బయట దొరికే ఒరిజినల్ గులాబీలో లేని రంగులనూ మీ పేపర్ గులాబీల్లో చూసుకోవచ్చు. వీటి తయారీని చూద్దాం. కావలసినవి: రంగురంగుల పేపర్లు, పెన్, కత్తెర, గ్లూ, స్టిక్స్ తయారీ: ముందుగా మీకు నచ్చిన రంగుకాగితంపై ఫొటోలో కనిపిస్తున్న విధంగా సర్కిల్స్ గీసుకోవాలి. ఎన్ని సైజుల్లో కావాలంటే అన్ని సర్కిల్స్ గీసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని కత్తెర సాయంతో స్ప్రింగ్స్‌లా కట్ చేసుకోవాలి. ఎన్ని గులాబీలు కావాలనుకుంటే అన్ని కాగితాలను ఒకదానిపై ఒకటి లేయర్స్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు విడిగా ఒక్కో స్ప్రింగ్ పేపర్‌ను తీసుకొని రోల్ చేసుకుంటూ పోవాలి. అది గులాబి షేప్‌లోకి రాగానే.. వాటి కింది భాగంలో ఓ స్టిక్ పెట్టి, గ్లూతో అతికించాలి. తర్వాత ఈ గులాబీలను ప్లవర్వాజుల్లో పెట్టి అలంకరించుకోవచ్చు. అంతేకాదు.. ఈ గులాబీలతో విండ్చైమ్స్ను అందంగా తయారుచేసుకోవచ్చు. అలాగే ఫొటోల్లో కనిపిస్తున్న విధంగా వీటితో ఇంటిని ఎలాగైనా అలంకరించొచ్చు. జీన్స్‌కు జోడీ... అలంకరణ విషయంలో యువత ఒకప్పటిలా లేదు.. ఎలాంటి డ్రెస్‌కి ఎలాంటి జ్యుయెలరీ వేసుకోవాలనే విషయంలో క్లారిటీతో ఉంది. అంతే కదా.. చుడీదార్లకు సెట్ అయ్యే జ్యుయెలరీ జీన్స్ మీదకు అసలు సూట్ అవదు. అలాగే జీన్స్ తరహానే వేరు. ఒక్కసారి పక్కనున్న ఫొటోలను చూడండి.. జీన్స్ మీదకు ఎలాంటి నెక్లేస్, బ్రేస్లెట్, స్కార్ఫ్‌లు సెట్ అవుతాయో మీకే అర్థమవుతుంది. ఫ్యాషనబుల్‌గా కనిపిస్తున్న వీటికి పైసా ఖర్చు చేయాల్సిన పని లేదు. ఇంట్లోనే.. అదీ పాతబడిన టీ-షర్ట్స్‌తో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.. కావలసినవి: పాత టీ-షర్ట్స్, కత్తెర, బ్రేస్లెట్ హుక్స్, ఓల్డ్ బ్యాంగిల్స్ తయారీ: టీ-షర్ట్‌ను ఫొటోలో కనిపిస్తున్న విధంగా కత్తెరతో అడ్డంగా సన్నగా కట్ చేసుకోవాలి. అలా అండర్ ఆర్మ్ వరకు కట్ చేసుకొని, ముక్కలను ఒక బంచ్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బంచ్లోని రింగ్స్‌ను తీసుకొని జ్యుయెలరీ స్కార్ఫ్‌గా మార్చుకోవచ్చు. అలా వివిధ రంగుల రింగ్స్‌ను ఎంచుకొని మెడలో వేసుకుంటే ఆ అందమే వేరు. అలాగే బ్రేస్లెట్ల కోసం మూడు సన్నని ముక్కలను తీసుకొని.. జడలా అల్లి చివర్లో ఒక హుక్ పెడితే సరి. అలాగే ఓల్డ్ బ్యాంగిల్స్‌కు ఈ టీ-షర్ట్ ముక్కలను చుడితే.. ఆ గాజులు భలేగా ఉంటాయి. అంతేకాదు, కావాలంటే వీటికి పూసలను చేర్చుకోవచ్చు. ఇకపై రంగు రంగుల పాత టీ షర్ట్స్‌ను భద్రంగా దాచుకుంటారు కదూ... -
జమాయీ రాజా చచ్చిపోయాడు
బార్మర్: అతను ఎపుడూ పెళ్లి చేసుకోలేదు...ఎవరితోనూ కలిసి ఉండలేదు.. కానీ 55 మంది పెళ్లికూతుళ్లతో కాపురం చేశాడు.. ఆనక చల్లగా అక్కడ నుంచి నగలతో ఉడాయించేవాడు. ఈ క్రమంలో 56వ అమ్మాయికి వలవేసి పోలీసులకు బుక్కయ్యాడు. చివరకు అనామకుడిగా రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో శవమై తేలాడు. నింబాల్ కోట్ గ్రామంలో శనివారం మరణించిన అతగాడికి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఎలా చనిపోయాడు .. పోలీసులు ఎందుకు దహన క్రియలు చేశారు అనేది స్పష్టత లేదు. వివరాల్లోకి వెళ్తే, జియారామ్ జాట్ (54)కు ఉన్న క్రిమినల్ రికార్డు సామాన్యమైంది కాదు. వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు18 కేసులు నమోదయ్యాయి. బాల్యవివాహం అయిన అమ్మాయిలే అతని టార్గెట్. చిన్నప్పుడే పెళ్లయ్యి... వయసు వచ్చి కాపురానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిలున్న మధ్య తరగతి కుటుంబాలను ఎంచుకొని దోచుకోవడం అతని మోడెస్ ఒపరాండీ. అలా ఇంట్లో ఆడవాళ్లు ఒంటరిగా ఉన్నపుడు వారితో పరిచయం పెంచుకుని..అల్లుడిగా నమ్మించి .. ఇంట్లోకి చొరబడేవాడు. అమ్మాయిని కాపురానికి తీసుకెళతానని అత్తమామల్ని నమ్మించి ఆ అమ్మాయిలతో కాపురం చేసేవాడు. అనంతరం వారి దగ్గరున్న నగలతో పరారయ్యేవాడు. 2004 లో వేధింపుల కేసులో పోలీసులు జియారామ్ ను అరెస్టు చేసినపుడు స్వయంగా ఈ వివరాలన్నీ విచారణలో అంగీకరించాడు. ఈ తర్వాత కొంత కాలం లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన జియా రామ్ 2013 లో మళ్లీ ఇదే కేసులో అరెస్ట్ అయ్యాడు. దీంతో పోలీసులు అతగాడిని 'జమాయీ రాజా' (అల్లుడుగారు) అని పోలీస్ ఫైల్స్ లో పేర్కొన్నారు. -
ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
115.75 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం సూళ్లూరుపేట: జిల్లాలో పలు దొంగతనాలతో సంబంధాలు ఉన్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.16.97 లక్షలు విలువచేసే 115.75 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలు వివరించారు. ఈ నెల 10వ తేదీ రాత్రి షార్ బస్టాండ్ సమీపంలో కొక్కు శంకరయ్య ఇంటి తాళాలు పగులగొట్టి 18 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.30 వేలు నగదు చోరీ జరిగింది. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా చెంగాళమ్మ ఆల యం సమీపంలోని పాత చెక్‌పోస్టు వద్ద అనుమానాస్పదంగా ఉన్న చిత్తూరు జిల్లా గుడిపాల మండలం యామ్నూరు కు చెందిన రహంతుల్లా మస్తాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. 2015 జూలైలో నెల్లూరురూరల్ మండలం కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో 8 సవర్లు, 2015 లో ఏప్రిల్‌లో వెంకటగిరిలో 12 సవర్లు, నవంబర్‌లో తడ హైస్కూల్ రోడ్డులోని ఓ ఇంట్లో 3 సవర్లు, 2016 జనవరిలో తడకండ్రిగ రాజీవ్‌నగర్‌లో మరో ఇం ట్లో ఒకటిన్న సవర, అదే నెలలో వెంకటగిరి ఓ ఇంట్లో అర సవర , ఫిబ్రవరిలో గూడూరు మార్కెట్ వీధిలో ఓ ఇంట్లో 30 సవర్ల బంగారు నగలను అపహరించినట్లు విచారణలో తేలింది. అతని నుంచి 72 సవర్ల ఆభరణాలను స్వాధీ నం చేసుకున్నామని, వీటి విలువ రూ. 10.61 లక్షలు ఉంటుందని తెలిపారు. మరో దొంగ.. ఆనంతపురం జిల్లా తాటిపర్తికి చెందిన ఆకుల రాంబాబు (35) ప్రస్తుతం తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నివాసం ఉంటూ జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ నెల 2వ తేదీ రాత్రి మండలంలోని జంగాల పల్లిలో నాగారపమ్మ ఆలయంలో అమ్మవారి మెడలో ఉన్న ఆరున్నర సవర్ల బం గారు ఆభరణాలు, హుండీలో ఉన్న రూ. 10వేలు నగదు అపహరించాడు. నింది తుడు స్థానిక రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా ఉండటంతో అనుమానించి పట్టుకుని విచారించగా సూళ్లూరుపేట, గూడూరు, మనుబోలు, రాపూరు, వెంకటగిరి పట్టణాల్లో సుమారు ఏడు దొంగతనాలు చేనినట్టు ఒప్పుకున్నాడని చెప్పా రు. అతని వద్ద నుంచి 43.5 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ. 6,36 లక్షలు ఉంటుంది. ఈ కేసులను ఛేదిం చిన డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ విజయకృష్ణ, ఎస్సైలు గంగాధర్‌రావు, సురేష్, ఐడీ పార్టీ సిబ్బందిని అభినందించారు. -
ఇక గోల్డ్ టూరిజమ్
వినూత్నం పర్యాటకులు భారత్‌కు తాజ్‌మహల్ చూడటానికి వస్తారు. రెడ్ ఫోర్ట్ చూడటానికి వస్తారు. తిరుమల వేంకటేశ్వరుణ్ణి, మధుర మీనాక్షిని చూడటానికి వస్తారు. ఇక మీదట దేవుని ఆభరణాలను చూడటానికి వస్తే? దేశంలో ప్రస్తుతం 25000 టన్నుల బంగారు ఆభరణాలు ఉన్నాయని ఒక అంచనా. ఇందులో ఐదు శాతం బంగారం మన గుడులలోనే ఉందట. ఈ బంగారం ఇవాళ్టిది నిన్నటిది కాదు. వందల ఏళ్లుగా భక్తులు ఆయా దేవుళ్లకు సమర్పించిన కానుకల్లో భాగంగా సురక్షితంగా ఉంది. పాతకాలం నాటి ఆ ఆభరణాలు, వాటి నైపుణ్యం, అందం, విలువ దర్శించడం కూడా ఒక విడ్డూరంగా ఉంటుంది. ఉదాహరణకు తిరువనంతపురంలో నిక్షిప్తమైన విలువైన ఆభరణాలను ప్రదర్శనకు పెడితే ఈ దేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి దర్శించరూ? అందుకే ప్రపంచంలో ఏ దేశానికీ లేని ఈ వెసులుబాటును భారత్ పరిశీలిస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఫిక్కీ) సంయుక్తంగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి. భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తే కనుక దేవుని ఆభరణాలు ప్రదర్శనకు పెట్టవచ్చనే ఆలోచనతో ఈ రెండూ ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదొక విధానంగా అయితే మాత్రం దేవుడు ధరించే ఆభరణాలకు నమస్కారం పెట్టుకోవడానికి భక్తులు క్యూ కడతారనడంలో ఆశ్చర్యం లేదు. -
మళ్లీ ఆభరణాల వర్తకుల సమ్మె
మద్దతివ్వని ప్రధాన సంఘాలు న్యూఢిల్లీ: అభరణాలు, బులియన్ వర్తకులు సోమవారం నుంచి మళ్లీ సమ్మెకు దిగారు. వెండి మినహా ఇతర ఆభరణాలపై విధించిన ఒక్క శాతం సుంకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో వర్తకులు మళ్లీ సమ్మె చేయడం ప్రారంభించారు. ఢిల్లీ, ఇతర ప్రధాన నగరాల్లో ఆభరణాల షోరూమ్‌లు మూతబడ్డాయని ఆల్ ఇండియా సరఫ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురీందర్ కుమార్ జైన్ చెప్పారు. మూడు రోజుల పాటు షాపులను పూర్తిగా మూసేయాలని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సమ్మె చేస్తున్న సంఘాలు ఉమ్మడిగా నిర్ణయించాయని వివరించారు. కాగా సమ్మెకు మద్దతుగా ఆభరణాల వర్తకులు, కళాకారులు ఢిల్లీ లోని జంతరమంతర్ వద్ద ధర్నా చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్, జోధ్‌పూర్, కోటలతో సహా పలు ప్రాంతాల్లోనూ, కాన్పూర్, ఉత్తర ప్రదేశ్‌ల్లోనూ పైగా ఆభరణాల షాపులను మూసేశారు. అయితే ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్), ఇండియా బులియన్ అండ్ జెవెలర్స్ అసోసియేషన్స్ తదితర ప్రధాన సంఘాలు ఈ సమ్మెకు మద్దతివ్వలేదు. -
టైట తళుకులు
విశాఖ వాసులకు సరికొత్త నగలు ‘క్లే ఆర్ట్’లో మాధురి రాణింపు ఇంటి నుంచే మార్కెటింగ్ ఆదర్శంగా నిలుస్తున్న మహిళ విశాఖపట్నం: ఆమె.. అనుబంధాలు పెనవేసుకున్న గృహిణి. పరిణితి చెందిన వ్యక్తిత్వం ఉన్న మహిళ. ఇతరులపై ఆధారపడకుండా జీవించాలని చెబుతున్న ధీరోధాత్త.. మట్టితో అద్భుతాలు సృష్టిస్తున్న కళాకారిణి. సామాజిక మాధ్యమాన్ని మార్కెటింగ్‌కు ఉపయోగించుకుంటున్న బిజినెస్ వుమెన్. ఆమే దొమ్మేటి మాధురి. ఊరు విజయరామరాజుపేట మండలం బుచ్చెయ్యపేట. మాధురి తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర బోడసకుర్రులో జన్మించినప్పటికీ.. విశాఖలో ఉన్నత చదువులు చదివారు. విశాఖ, హైదరాబాదులో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. తిరుమల రెడ్డి జగదీష్‌ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో గృహిణిగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ...కానీ.. ఎక్కడో వెలితి.. తన గమ్యం ఇది కాదనే ఆలోచన ఆమెను అనుక్షణం తొలచివేసేది. ఉద్యోగం చేసే అవకాశం లేదు. అలాగని ఏమీ చేయకుండా ఉండిపోవడం తన నైజం కాదు. అలాంటి సమయంలో ఇంటర్నెట్ ఆమెకు దారి చూపించింది. అంతులేని వెబ్సైట్లలో ఓ ఫొటో ఆమెను కట్టిపడేసింది. లోతుగా చూస్తే ఆ ఫొటోలో కనిపిస్తున్న నగ బంగారం, ఇతర ఖనిజాలతో తయారు చేసింది కాదని అర్థమైంది. తాను చూసిన నగ మట్టితో రూపొందిందని తెలిసి ఆశ్చర్యపోయారామె. దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. గంటలు, రోజులు ఆ నగలు ఎలా తయారు చేస్తారనేది తెలుసుకోవడంలోనే గడిపారు. కొంత వరకూ అవగాహన వచ్చింది. తానూ ఆ పని ప్రారంభిస్తే మానసిక ప్రశాంతతకు అదో మార్గమవుతుందని భావించారు. అనుకున్నదే తడవుగా దానికి కావాల్సిన ప్రయత్నాలు ప్రారంభించారు. తనకు తానుగా ప్రయోగాలు చేస్తూ గంటల తరబడి పని చేస్తూ మట్టితో నగలు తయారు చేయడం నేర్చుకున్నారు. వాటిని ముందుగా మిత్రులకు చూపిస్తే వారు ఆశ్చర్యపోయారు. ఇంతటి అద్భుతమైన వాటిని తయారు చేసి వృథాగా పోనివ్వకూడదని.. పది మందికీ పరిచయం చేయమని సలహా ఇచ్చారు. దీంతో ఫేస్బుక్లో ఓ పేజీ క్రియేట్ అయింది. అక్కడ ఆమె తయారు చేసిన నగల మోడల్స్ ఉంటాయి. వాటిని ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. తమకు కావాల్సిన రంగుల్లో, డిజైన్ చేయించుకోవచ్చు. చెప్పిన సమయానికి నగలు తయారయై ఇంటి ముంగిటకు వస్తాయి. ఓ విద్యావంతురాలు ఉద్యోగాన్ని వదిలి.. సాధారణ గృహిణిగా జీవిస్తూ ఆత్మ సంతృప్తి కోసం మొదలుపెట్టిన చిన్న పని ఇప్పుడు మన జిల్లాను దాటి ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. కేరళతో పాటు ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్లు వస్తున్నాయి. ‘క్లే ఆర్ట్’ అంటే క్లే ఆర్ట్ గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ ఇదేమి కొత్త కళ కాదు. పూర్వం నుంచి మట్టి పాత్రలు తయారు చేయడం మన సంప్రదాయ వృత్తుల్లో ఓ భాగం. అయితే ఇప్పుడు ఆ పాత్రలను వాడేవారు తగ్గిపోయారు. ఓ ప్రత్యేకమైన మట్టిని తీసుకుని క్లే ఆర్ట్ పేరుతో ఆభరణాలు తయారు చేస్తున్నారు. ప్రవహించే నదుల అడుగున లభించే ఎర్రని మట్టిని ‘టైట’ అని పిలుస్తుంటారు. ఆ మట్టినే ఈ నగల తయారీకి వాడుతున్నారు మాధురి. ఆన్లైన్ ద్వారా ఈ మట్టిని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారు. మన రాష్ట్రంలోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ మట్టి లభ్యమవుతోంది. -
నటి రాజశ్రీ నగలు చోరీ
తమిళసినిమా: ప్రఖ్యాత నటి రాజశ్రీ ఖరీదైన బంగారు నగలు,వజ్రాలు చోరీకి గురైయ్యాయి. ప్రఖ్యాత నటీమణి రాజశ్రీ. 75 ఏళ్ల రాజశ్రీ స్థానిక టీ.నగర్,సోమసుంధరం వీధిలో నివశిస్తున్నారు. మంగళవారం రాజశ్రీ తన కొడుకుతో కలసి టీ.నగర్,పనక్కల్ పార్క్ సమీపంలో గల బ్యాంక్‌లో లాకర్లో ఉంచిన తన బంగారు ఆభరణాలను తీసుకోవడానికి వెళ్లారు.లాకర్లో ఆభరణాలను తీసుకుని కారు కారు ఎక్కి తన కొడుకు రాక కోసం వేచి ఉన్నారు. ఆ సమయంలో ఒక అగంతుకుడు కారు వద్దకు వచ్చి పది రూపాయల నోట్లను కింద పడేసి కారులో ఉన్న రాజశ్రీతో అమ్మా కారు పక్కన డబ్బు పడి ఉంది తమరివా? అని అడిగాడు. దీంతో తన డబ్బు కింద పడిందేమోనని భావించి కారు నుంచి కిందికి దిగారు.అంతలోనే ఆ అగంతుకుడి కారులోని నగల బ్యాగ్‌ను తీసుకుని ఉడాయించాడు.కొంత దూరంలో అతని కోసం రెడీగా ఉన్న మరో వ్యక్తి మోటార్ సైకిల్‌పై ఎక్కి పారిపోయాడు. ఆ బ్యాగ్‌లో 15 లక్షల విలువైన బంగారు, వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి. ఊహించని ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురైన రాజశ్రీ కొంత సేపటికి తేరుకుని పాండిబజార్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను,ఆ ప్రాంతంలోని బంగారు ఆభరణాల దుకాణాల సీసీ కెమెరాలను పరిశీలించారు. ఒక కెమెరాలో నటి రాజశ్రీతో ఒక వ్యక్తి మాట్లాడిన దృశ్యం నమోదైంది. దాని ఆధారంగా పోలీసులు విచారణ తీవ్రవంతం చేశారు. అదే ప్రాతంలో సీబీఐ అధికారినంటూ ఒక వ్యక్తి కేరళా నగల షాప్ యజమాని నుంచి లక్షల విలువైన నగలను దోచుకుపోయాడు.అతను గురించి ఇంతవరకూ పోలీసులకు ఎలాంటి ఆధారం లభించలేదన్నది గమనార్హం. -
వృద్ధుని మాయచేసి నగలు చోరీ
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని బస్టాండు సమీపంలో బస్సుకోసం నిలబడిన ఒక వృద్ధుడికి మాయమాటలు చెప్పి అతని వద్ద నుంచి రూ.4 లక్షల విలువైన బంగారు నగలు దోచుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. మంగళగిరి సమీపంలోని నవులూరుకు చెందిన ప్రకాశరావు(70) అనే వృద్ధుడు నిత్యం బంగారు చైను, బ్రాస్లెట్, చేతి వేళ్లకు ఉంగరాలతో తిరుగుతుంటాడు. ఇది గమనించిన దుండగులు ఆయనను వెంబడించారు. ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి బస్టాండులో బస్సుకోసం వేచి ఉండగా మాటల్లోపెట్టి అతని వద్దనుంచి బంగారు చైను, బ్రాస్లెట్ దోచుకెళ్లారు. ఈమేరకు అతను మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ చేసిన వస్తువుల విలువ రూ.4 లక్షలు ఉంటుందని అతను పోలీసులకు తెలిపాడు. -
రూ.50 లక్షల పైగా ఆర్జించే వర్గాలపై ఐటీ దృష్టి
న్యూఢిల్లీ: ఇకపై వార్షికంగా రూ.50 లక్షల పైగా ఆదాయమున్న వారు తప్పనిసరిగా ఖరీదైన ఆభరణాలు, ఎయిర్‌క్రాఫ్ట్ మొదలైన ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి రానుంది. ఈ మేరకు 2016-17 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను విభాగం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫారంలను నోటిఫై చేసింది. వీటి ప్రకారం రూ. 50 లక్షలు దాటిన వార్షికాదాయం గల వారిని ఉద్దేశించి ఐటీఆర్‌లలో (ఐటీఆర్-2, 2ఏ) ప్రత్యేకంగా ‘సంవత్సరాంతాన ఆస్తులు, అప్పులు’ పేరిట కాలమ్‌ను పొందుపర్చింది. స్థలం, భవంతులు వంటి స్థిరాస్తులను ఎలాగూ కొత్త ఐటీఆర్‌లో వెల్లడించాల్సి ఉన్నా.. ఇకపై చేతిలో ఉన్న నగదు, ఆభరణాలు, బంగారం, వాహనాలు, యాట్స్, బోట్లు, విమానాలు వంటి చరాస్తులన్నింటి గురించీ చెప్పాల్సి వస్తుంది. ఇది సుమారు 1.5 లక్షల మంది అత్యంత సంపన్నులపై మాత్రమే ప్రభావం చూపుతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. -
ఒంటరి మహిళలే లక్ష్యంగా చోరీలు
అప్రమత్తంగా ఉండాలని సీఐ విజయకృష్ణ సూచన తడ: ఒంటరిగా ఇంట్లో ఉండే మహిళలనే లక్ష్యంగా చేసుకుని హత్యలు, దోపిడీలకు పాల్పడే వ్యక్తిని గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలని సూళ్లూరుపేట సీఐ టీ విజయకృష్ణ కోరారు. సోమవారం స్థానిక పోలీస్ ష్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ బిక్షగాడిలా అవతారం వేసుకుని ఇంట్లో ఎవరూ లేకుండా మహిళలు మాత్రమే ఉన్న సమయంలో చెల్లి పెళ్లి ఉందని చీరలు, ఇతర దుస్తులు ఇవ్వాలంటూ మభ్య పెట్టి కత్తితో చంపి అందినకాడికి నగలు, విలువైన వస్తువులు దోచుకువెళ్లే సత్తెనపల్లికి చెందిన కుంచెల నాగరాజు అనే వ్యక్తి సంచరిస్తున్నట్లు చెప్పారు. అనుమానంవస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. -
3 నెలల కనిష్టానికి పసిడి
అంతర్జాతీయ ప్రభావం న్యూయార్క్/న్యూఢిల్లీ: పసిడి ధర పడిపోతోంది. ఢిల్లీలో మూడు నెలల కనిష్ట స్థాయికి దిగింది. అంతర్జాతీయ అంశాలు దీనికి ప్రధాన కారణం. దీపావళి నేపథ్యంలో... ఆభరణాలు, రిటైల్ వర్తకుల కొనుగోళ్లు మందగించడం కూడా దీనికి కారణం. ఢిల్లీలో 10 గ్రాములకు 24, 22 క్యారెట్ల ధరలు క్రితంతో పోల్చితే రూ.300 తగ్గి రూ.25,950, రూ.25,800 చొప్పున నమోదయ్యాయి. వెండి సైతం ఇదే ధోరణిలో కేజీకి రూ.500 తగ్గి రూ.34,400గా ఉంది. అంతర్జాతీయ బలహీన ధోరణి... న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (కామెక్స్)లో ఔన్స్ (31.1గ్రా) గురువారం ముగింపు 1,084 డాలర్లు. ఒక దశలో 1,074 డాలర్లకు సైతం పడిపోయింది. ఇది ఐదేళ్ల కనిష్ట స్థాయి. అంటే 2010 ఫిబ్రవరి తరువాత ఈ స్థాయికి అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పతనం ఇదే తొలిసారి. ‘ఫెడ్’ ఎఫెక్ట్! అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుత జీరో స్థాయి నుంచి పెంచే అవకాశం ఉందన్న వార్త ప్రధానంగా పసిడి ఫ్యూచర్స్ మార్కెట్‌పై పడుతోంది. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బులి యన్ ఆధారిత ఫండ్లను విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. గురువారం వరకూ జరిగిన 12 ట్రేడింగ్ దినాల్లో 11 రోజులు ఈ మెటల్ నష్టాలను ఎదుర్కొంటూ వస్తోంది. శుక్రవారం తొలి సమాచారం అందే సరికి మాత్రం అతి స్వల్ప స్థాయి లాభాల్లో ట్రేడవుతోంది. భారత్ ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా ఇదే ధోరణి కనబడుతోంది. దేశంలో టారిఫ్ విలువ కోత అంతర్జాతీయంగా ధర భారీగా తగ్గిన నేపథ్యంలో... పసిడి. వెండి దిగుమతుల టారిఫ్ విలువలను కేంద్రం తగ్గించింది. ఇప్పటి వరకూ 10 గ్రాములకు 373 డాలర్లుగా ఉన్న దిగుమతి టారిఫ్ విలువను 354 డాలర్లకు తగ్గించింది. వెండి (కేజీ) టారిఫ్ విలువను కూడా 517 డాలర్ల నుంచి 470కి తగ్గించింది. అంటే బంగారం టారిఫ్ విలువ 5 శాతంపైగా తగ్గగా, వెండి టారిఫ్ విలువ 9 శాతంపైగా పడింది. ఈ మేరకు కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు (సీబీఈసీ) ఒక ప్రకటన చేసింది. మెటల్స్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. టారిఫ్ విలువలో 5% మార్పు ఉంటే ఆ ప్రభావం స్పాట్ బులియన్ మార్కెట్‌పై ఉంటుంది. తాజా నిర్ణయం స్పాట్ మార్కెట్లో పసిడి విలువ మరింత తగ్గడానికి దారితీసే అంశమే. -
బిహార్ దొంగల గ్యాంగ్ అరెస్టు
రైళ్లలో ప్రయాణిస్తూ దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే బిహార్ గ్యాంగ్ విశాఖ రైల్వే పోలీసులకు చిక్కింది. శనివారం మధ్యాహ్నం కాకినాడ- విశాఖ ప్యాసింజర్ రైలు నుంచి దిగిన ఆరుగురు సభ్యుల బిహార్ ముఠాను జీఆర్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు నేతృత్వంలో సిబ్బంది పట్టుకున్నారు. వారి నుంచి రూ.6 లక్షల విలువ చేసే 250 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్‌కు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీసొత్తును వదిలేసి పరారయ్యారు..
పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసిన ముగ్గురు దొంగలు తాము దొంగతనం చేసిన సొత్తును వదిలేసి పరారయ్యారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 5 గంటల మేడ్చల్ క్రైం పోలీసులు మేడ్చల్ పెద్ద చెరువు కట్టపై నుండి మేడ్చల్ పట్టణంలోకి పెట్రోలింగ్ చేస్తూ వస్తుండగా కట్టపై నుండి ముగ్గురు దొంగలు ద్విచక్రవాహనంపై దేవాలయాల్లో దొంగతనం చేసిన సొత్తును మూట కట్టుకుని వెళుతున్నారు. దొంగలు ఎదురుగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని చూసి వాహనానికి కొద్ది దూరంలో మూట ను, బైక్ ను పడేసి.. పరార్ అయ్యారు. పోలీసులు అనుమానంతో ముగ్గురిని పట్టుకునే ప్రయత్నం చేసినా వారు దొరకలేదు. మూటను విప్పి చూడగా అందులో దేవుళ్ళకు అలంకరించే వెండి ఆభరణాలు, హుండీలో దొంగతనం చేసిన కొంత నగదు లభించింది. దొంగలు మూడు, నాలుగు ఆలయాల్లో దొంగతనం చేసిన సొత్తును వదిలివేసి వెళ్ళారని సీఐ తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల బట్టి త్వరలోనే దొంగలను అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి అందం,వైభవం, వైభోగం అంతా ఆభరణాలోనే...
-
‘బంగారం’ లాంటి పథకం..!
- పసిడి డిపాజిట్‌తో లాభాలు అధికమే - ఆభరణాలు పెడితే ప్రతికూలతలూ ఉన్నాయ్ ప్రజలు, సంస్థల దగ్గర ఉత్పాదకత లేకుండా పడి ఉన్న పసిడిని చలామణిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం మరోసారి బంగారం డిపాజిట్ స్కీమ్‌ను ప్రకటించింది. 1999లో ఈ తరహా పథకాన్నే ప్రవేశపెట్టినప్పటికీ .. అప్పట్లో దీనికి అంతగా ఆదరణ దక్కలేదు. గోల్డ్ డిపాజిట్ చేసేవారికి పన్నులపరంగా ప్రయోజనాలు లభించేలా చూస్తామంటున్నప్పటికీ, గతానికి భిన్నంగా 1% కన్నా ఎక్కువ వడ్డీ రేటు ఇస్తే తప్ప ఇది వర్కవుట్ కాదంటున్నారు విశ్లేషకులు. ఈ వడ్డీ కూడా నగదు రూపంలో ఉంటుందా.. పసిడి రూపంలో ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. స్కీముపై ప్రస్తుతం ముసాయిదా మార్గదర్శకాలనే ప్రకటించింది ప్రభుత్వం. వీటిపై జూన్ 2 లోగా ప్రజలు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను తెలుసుకుని ఆ తర్వాత తుది నిబంధనలను ఖరారు చేయనుంది. దీనివల్ల వచ్చే ప్రయోజనాలు, ఇందులోని ప్రతికూలతల్లో కొన్ని.. ప్రయోజనాలు.. - గతంలో కనీసం 500 గ్రాములు డిపాజిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు కనిష్టంగా 30 గ్రాముల బంగారమైనా డిపాజిట్ చేయొచ్చు. - ఉత్తినే బ్యాంకు లాకర్లలోనో.. ఇంట్లో బీరువాల్లోనో ఉంచే బదులు డిపాజిట్ చేయడం వల్ల ఏడాదికి ఎంతో కొంత వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుంది. ఈలోగా బంగారం రేటు పెరి గితే ఆ ప్రయోజనం ఉండనే ఉంటుంది. - మీ బంగారం మీ అకౌంట్లోనే ఉంటుంది. అమ్మకుండానే వడ్డీ ఆదాయం వస్తుంది. పైగా దీనిపై పన్ను కూడా ఉండదు. - ఇలా వచ్చే ఆదాయాన్ని ఏ రికరింగ్ డిపాజిట్ స్కీమో లేదా ఏ పెన్షన్ స్కీములోనో ఇన్వెస్ట్ చేస్తే అదనంగా మరికాస్త ప్రయోజనమూ దక్కుతుంది. ప్రతికూలతలూ ఉంటాయ్ .. - మీరు ఆభరణాలు డిపాజిట్ చేస్తే బంగారం మీ అకౌంట్లోనే ఉంటుంది కానీ.. ఆభరణాల రూపంలో ఉండదు. వాటిని కరిగించేసి ఆ మేర పసిడి బరువును మాత్రమే మీ ఖాతాలో చూపిస్తుంది బ్యాంకు. దీనివల్ల బంగారంపై మీకు వడ్డీ ఆదాయం వచ్చినా.. ఆ ఆభరణాన్ని అలాగే మీరు వాడుకోలేరు. - డిపాజిట్ చేసిన బంగారం మొత్తాన్ని కాల వ్యవధి తీరాక విత్‌డ్రా చేసుకున్నాక.. మరోసారి అభరణాలు చేయించుకోవాలంటే ఆ మేర మేకింగ్ చార్జీలు వగైరాలు మళ్లీ తప్పకపోవచ్చు. రెండు వారాల లాభాలకు బ్రేక్... విదేశీ మార్కెట్లలో నెగటివ్ ధోరణుల కారణంగా ఇటు దేశీ బులియన్ మార్కెట్లోనూ పసిడి, వెండి రేట్లు గత వారం తగ్గాయి. పసిడి రెండు వారాల పరుగుకు బ్రేక్ పడింది. వారం ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతుతో పుత్తడి రేట్లు పుంజుకున్నప్పటికీ .. వారాంతానికల్లా తగ్గాయి. సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ సాధనంగా అంతర్జాతీయంగా డాలర్‌కు డిమాండ్ పెరగడం, ఇటు దేశీయంగా జ్యుయెలర్లు, రిటైలర్ల నుంచి బంగారానికి డిమాండ్ తగ్గడం వంటివి పసిడి పరుగుకు బ్రేక్ వేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. పెరుగుతున్న ఈక్విటీ మార్కెట్ల వైపు నిధులు మళ్లడం కూడా పసిడిపై ప్రభావం చూపిందని తెలిపాయి. అంతర్జాతీయంగా చూస్తే వారంలో బంగారం ధర 1.7 శాతం క్షీణించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో వారాంతానికి పసిడి ధర 10 గ్రాములకు రూ.350 మేర తగ్గి, మేలిమి బంగారం రేటు రూ.27,450, ఆభరణాల బంగారం ధర రూ. 27,300 వద్ద ముగిసింది. అటు వెండి కూడా లాభనష్టాల్లో ఊగిసలాడి ఆఖరుకు కిలోకి రూ. 850 తగ్గి రూ. 38,800 వద్ద క్లోజయ్యింది. -
సెలెక్ట్ యువర్స్..
నిగనిగలాడే నగలంటే మగువలకు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. అందుకే బంగారం ధర భగభగ మండినా.. కొంగొత్త ధగధగలతో మేనంతా మెరిసిపోవాలనుకుంటారు. ష్యాషన్‌కు రెడ్‌కార్పెట్ పరచి స్వాగతించే అతివల కోసం.. యునెటైడ్ ఎగ్జిబిషన్ మెగా జ్యువెలరీ ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. ప్రముఖ డిజైనర్ల లేటెస్ట్ కలెక్షన్స్ ఇందులో కొలువుదీరనున్నాయి. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో ఈ రోజు నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ఫోన్: 040-66466778 -
హైవేపై దారిదోపిడీ
సినీ ప్రముఖుల నుంచి రూ. 3లక్షల ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు! షాద్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలో గురువారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై సినీఫక్కీలో కొందరు దుండగులు మారణాయుధాలను చూపించి దోపిడీకి పాల్పడ్డారు. ఘటనలో కొందరు సినీ ప్రముఖుల నుంచి దాదాపు రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. గురువారం ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్ పుట్టినరోజు సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గ్రామ సమీపంలోని తన గెస్ట్‌హౌస్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రముఖులు హాజరవుతున్నారని ముందే పసిగట్టిన దుండగులు దారికాచారు. అర్ధరాత్రి సమయంలో ఇన్నోవా కారులో సినీ ప్రముఖులు డీవీవీ దానయ్య, కోన వెంకట్, ప్రవీణ్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో షాద్‌నగర్ బైపాస్ రహదారికి రాగానే చెట్టుకొమ్మలను రోడ్డుకు అడ్డుగావేసి అడ్డగించారు. వాహనం నిలపగానే మారణాయుధాలతో భయభ్రాంతులకు గురిచేసి వారి ఒంటిపై ఉన్న దాదాపు రూ.మూడులక్షల బంగారు ఆభరణాలను దోచుకొని పరారయ్యారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టుకొమ్మలను తొలగించారు. పోలీసులపై సినీప్రముఖులు చిందులు వేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని షాద్‌నగర్ పోలీసులు గోప్యంగా ఉంచారు. -
ఆ ధగధగలు తగ్గకూడదంటే...
ఆభరణాలను అలంకరించుకోవడంలో ఉన్నంత శ్రద్ధ వాటిని శుభ్రంగా ఉంచడంలో చాలామందికి ఉండదు. అందుకే ఆభరణాలు త్వరగా మెరుపు కోల్పోయినట్టుగా కనపడతాయి. బంగారు ఆభరణాలను శుభ్రపరచడానికి మేలైన చిట్కాలు... ఆభరణాలను దాదాపుగా ఇంట్లోనే శుభ్రపరుచుకోవడం శ్రేయస్కరం. ఖర్చు తక్కువ అవుతుంది. బయట శుభ్రపరచడానికి ఇచ్చినప్పుడు తలెత్తే మోసాలనూ అరికట్టవచ్చు. వేటికవి విడిగా విభిన్నరకాల ఆభరణాలు ఉంటాయి. వెండి, బంగారు, ప్లాటినమ్, పూసలు, రాళ్లు.. ఇలా ఆభరణాలను వేటికవి విడివిడిగా ఉంచాలి. లిక్విడ్ సోప్ డ్రాప్ట్స్ (మార్కెట్లో లభిస్తాయి) వీటిని ఆభరణాల మీద వేసి మృదువుగా రుద్ది, కడిగి, మెత్తని నూలు వస్తంతో తుడవాలి. ఇంకా దుమ్ము, జిడ్డు ఉన్నాయి.. పోవడం లేదు అనుకుంటే క్లబ్ సోడాను ఉపయోగించాలి. బంగారు ఆభరణాల జిడ్డు వదలాలంటే 15 నిమిషాల పాటు సబ్బు నీటిలో ఉంచి, తర్వాత శుభ్రపరచాలి. మృదువైన టూత్ బ్రష్ ఆభరణాల మురికిని తీసివేయడానికి బ్రష్‌ను వాడుతుంటారు. ఇందుకు మృదువైన బ్రష్‌ను ఉపయోగించాలి. టూత్‌బ్రష్ కొనుగోలు చేసే ముందు లేబుల్‌పై ‘సాఫ్ట్ బ్రిస్టల్స్’అని ఉన్నది తీసుకోవాలి. బ్రష్‌తో ఆభరణాలను శుభ్రం చేయడానికి ముందు దానిని 10 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి, ఆ తర్వాత ఉపయోగించాలి. దీని వల్ల బ్రష్ కుచ్చు మృదువుగా తయారవుతుంది. ఫలితంగా ఆభరణాలకు హాని కలగదు. మురికి కూడా వదులుతుంది. ఐబ్రో బ్రష్, హెయిర్ డై బ్రష్‌లను ఆభరణాల శుభ్రతకు ఉపయోగించకూడదు. అమ్మోనియా ద్రావణం అమ్మోనియా ద్రావణానికి ఆరు భాగాల నీళ్లు కలపాలి. ఆభరణాలను సబ్బు నీటితో శుభ్రపరిచిన తర్వాత వాటిని అమ్మోనియా నీటిలో ముంచి, తడి లేకుండా తుడవాలి. ఇలా చేస్తే ఆభరణాలకు మెరుపు వస్తుంది. అయితే ధరించిన ప్రతీసారి అమ్మోనియాతో శుభ్రపరచకూడదు. ఒక్కోసారి అమ్మోనియా కారణంగా ఆభరణం రంగు మారే అవకాశం ఉంటుంది. వెచ్చని నీరు ఆభరణాన్ని బ్రష్‌తో రుద్దుతున్నప్పుడు గోరువెచ్చని నీటిని పోస్తూ రబ్ చేస్తూ ఉంటే మురికి వదులుతుంది. ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం ఉండదు. అయితే, ఆభరణాలను అన్నింటినీ కలిపి కాకుండా విడి విడిగా శుభ్రపరచాలి. రత్నాలను నీటిలో ఉంచరాదు రత్నాలు పొదిగి ఉండే ఆభరణాలను ఎక్కువసేపు నీళ్లలో ఉంచకూడదు. సబ్బు నీటిలో ముంచి, వెంటనే తీయాలి. గోరువెచ్చని నీటిని పోస్తూ మృదువుగా రుద్దాలి. తర్వాత మెత్తని వస్త్రంతో తడి లేకుండా తుడవాలి. ఆభరణం వెనకవైపు కూడా తడి లేకుండా తుడిచి, భద్రపరచాలి. టూత్‌పేస్ట్ ఉపయోగం టూత్బ్రష్కి కొద్దిగా పేస్ట్ అద్ది, దాంతో బంగారు ఆభరణాలను శుభ్రపరచాలి. గోరువెచ్చని నీళ్లు పోస్తూ రుద్దుతూ కడిగితే, చక్కగా శుభ్రపడతాయి. మరిగితే మెరుపు మైనం, గ్రీజ్ వంటివి ఆభరణాలకు అంటితే త్వరగా పోవు. ఇలాంటప్పుడు మరుగుతున్న నీటిలో ఆభరణాలను వేసి, తర్వాత సబ్బునీటితో శుభ్రపరచాలి. -
ఇంటి దొంగల పనేనా!
భూపాలపల్లి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ)లో ఘరానా చోరీ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. రెండు శాఖల్లో దొంగతనం జరగడం కలకలం రేపింది.. ఒక బ్యాంకు తాళాలు తీసి ఉన్నా.. మరో బ్యాంకు తాళాలు వేసిఉన్నా భారీగా నగలు, నగదు ఆపహరణకు గురయ్యూరుు.. చోరీ జరిగిన విధానాన్ని చూస్తే ఇంటి దొంగల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నారు. భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్ : పట్టణంలోని ఏపీజీవీబీ భూపాలపల్లి, ఆజంనగర్ బ్రాంచీల చోరీ ఇంటిదొంగల పనేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూపాలపల్లి బ్రాంచి ప్రధాన రహదారిపై ఉండగా ఆజంనగర్ బ్రాం చీని ఆరు రోజుల క్రితమే కారల్‌మార్క్స్ కాలనీలోని ఎస్బీఐ బ్యాంకు పైఅంతస్తులోకి మార్చారు. శనివారం ఒంటిపూట పనిదినం కావడంతో రెండు బ్రాంచీల అధికారులు మధ్యాహ్నమే పని ముగించుకుని ఇళ్లకు వెళ్లారు. రోజువారీ విధుల్లో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు రెండు బ్రాంచీ ల మేనేజర్లు మూర్తి, శ్రీనివాస్‌లు ఉద్యోగులతో కలిసి బ్యాంకులకు వెళ్లారు. భూపాలపల్లి బ్రాంచి షెట్టర్ తాళం అప్పటికే తీసి ఉంది. అనుమానం వచ్చిన అధికారులు స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లారు. తాళం తీసి ఉండగా, లాకర్లోని నగదు, బం గారం, వెండి అపహరణకు గురైనట్లు గుర్తించారు. మరో వైపు ఆజంనగర్ బ్రాంచీ అధికారులు బ్యాంకు వద్దకు వెళ్లి ప్రధాన ద్వారం తాళం తీసి లోపలికి వెళ్లారు. స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లి తాళం తీసి లాకర్‌ను తెరిచిచూడగా అందులోని నగదు, బం గారం దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. చోరీల విషయా న్ని రెండు బ్రాంచీల అధికారులు స్థానిక పోలీసులకు తెలిపారు. ఈ మేరకు వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, ములుగు డీఎస్పీ కటకం మురళీధర్... క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో సంఘటన స్థలాల వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. ఆజంనగర్ బ్రాంచీ కిందనే ఎస్బీఐ ఉన్నప్పటికీ ఒకే సంస్థకు చెందిన రెండు బ్రాంచీల్లో చోరీ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక బ్రాంచిలో షెట్టర్ తాళాలు తీసి ఉండడం, మరోచోట వేసి ఉండడమే కాక సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. అలారం మోగకుండా, ఆనవాళ్లు దొరకకుండా దొంగలు జాగ్రత్తపడడం వెనుక ఇంటి దొంగలు ఉన్నారనే అనుమానాలకు బలం చేకూరుతోంది. బ్యాంకు లాకర్ తాళాలు 3 సెట్లు ఉంటాయని, అవి మేనేజర్, హెడ్ క్యాషియర్, అకౌంటెంట్ వద్ద ఉంటాయని సమాచారం. అధికారులు అజాగ్రత్తగా ఉన్న సమయంలో సిబ్బందిలో ఎవరైనా ఆ తాళాల మాదిరిగానే మరో సెట్‌ను తయారు చేయించి చోరీకి పాల్పడ్డారా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం భూపాలపల్లి బ్రాంచీలో పని చేసే ఒక తాత్కాలిక ఉద్యోగి విధులకు హాజరు కాలేదు. అతనికి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్విచ్చాఫ్ వచ్చింది. ఈ మేరకు పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఆందోళనలో ఖాతాదారులు భూపాలపల్లిలోని రెండు ఏపీజీవీబీ బ్రాంచీల్లో చోరీ జరిగినట్లుగా తెలియడంతో ఖాతాదారులు భారీ ఎత్తున బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. భూపాలపల్లి బ్రాంచి మేనేజర్ మూర్తి బ్యాంకు నుంచి బయటకు రావడంతో అతడిని ఖాతాదారులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. తాకట్టు పెట్టిన బంగారం సంగతేంటని, వ్యక్తిగత లాకర్ల విషయమేంటని ప్రశ్నించారు. ఇందుకు మేనేజర్ స్పందిస్తూ వ్యక్తిగత లాకర్ల ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బ్యాంకు లాకర్లోని డబ్బు, నగలు మాత్రమే చోరీకి గురయ్యాయని బదులిచ్చారు. కాగా, ఏపీజీవీబీ భూపాలపల్లి బ్రాంచిలో రూ.4,37,67,000 విలువైన 16 కిలోల 22 తులాల బంగారం, రూ.17, 40,000 నగదు చోరీకి గురైనట్లు పోలీసులు తేల్చారు. ఆజంనగర్ బ్రాంచిలో రూ.4,86,00,000 విలువైన 18 కిలోల బంగారం, రూ.3,76,100 నగదు అపహరణకు గురైనట్లు వెల్లడించారు. రెండు బ్యాంకుల్లో కలిపి నగదు, బంగారం కలిపి రూ.9,44,83,100 విలువ ఉంటాయని వివరించారు. -
బంగారం దుకాణంలో చోరీ
గిద్దలూరు : బంగారం దుకాణంలో దొంగలు పడి రూ.6 లక్షల విలువైన ఆభరణాలు అపహ రించిన ఘటన స్థానిక వైశ్యాబ్యాంకు రోడ్డులో ఆదివారం రాత్రి జరిగింది. దుకాణం యజమాని, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జీవన్ జ్యుయలరీ దుకాణం యజమాని పీ వెంకటరమణ అందులోనే నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి దుకాణం ముందు ఉన్న ఇనుప గ్రిల్ గేటుకు తాళం వేసి..లోపల ఉన్న షట్టర్‌ను కిందకు దించి తాళం వేయలేదు. గమనించిన దొంగలు గ్రిల్‌కు వేసిన తాళం తొలగించి, దుకాణంలోకి ప్రవేశించి అందులోని ఆరు నక్లెస్‌లు, ఆరు కేజీల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. వాటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని దుకాణం యజమాని వెంకటరమణ తెలిపాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిశీలించిన ఓఎస్డీ, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ అధికారులు: చోరీకి గురైన దుకాణాన్ని మార్కాపురం ఓఎస్డీ సమైజాన్‌రావ్, సీఐ నిమ్మగడ్డ రామారావు, ఎస్సై ఎం.రాజేష్ పరిశీలించారు. చోరీ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గృహంలో ఉండగానే దుకాణంలోని ఆభరణాలు చోరీకి గురవడమేంటని వారు ప్రశ్నించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్ రూబీ కౌంటరు వద్ద దొంగలు వదిలివెళ్లిన సుత్తి, ఇనుప రాడ్లను పరిశీలించి, అక్కడే నివాసం ఉంటున్న యజమాని వద్ద, స్నానం గది, బెడ్ రూం వద్దకు వెళ్లింది. ఆ తర్వాత బయటకు వచ్చిన డాగ్ వీధిలోని రెండు చివరలకు వెళ్లి ఆగి, తిరిగి దుకాణం వద్దకు చేరుకుంది. మరో పర్యాయం గృహంలోకి వెళ్లి మొరిగింది. క్లూస్ టీం సీఐ రాజు, తన సిబ్బందితో కలిసి వేలిముద్రలు, ఆధారాలను సేకరించారు. చోరీ జరిగిన తీరుపై అనుమానాలు: జీవన్ జ్యుయలరీ షాపులో దొంగలు పడి ఆభరణాలు చోరీ చేసిన సంఘటనను పరిశీలిస్తే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే ప్రాంతంలో 15 వరకు నగల దుకాణాలున్నాయి. అవన్నీ వదిలేసి దుకాణంలోనే నివాసం ఉంటున్న చోట దొంగ లు చోరీకి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. విలువైన ఆభరణాలు ఉన్న దుకాణానికి కేవలం గ్రిల్స్‌కు తాళం వేసి న యజమాని,షట్టరుకు తాళం వేయలేదని చెప్పడాన్ని కూడా పోలీసులు సందేహిస్తున్నారు. దొంగలను త్వరలోనే పట్టుకునే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. -
దొంగల ముఠాకు చెక్
సికింద్రాబాద్: ప్రయాణికుల దృష్టి మళ్లించి నగదు, నగలు ఎత్తుకెళ్తున్న ఓ ఘరానా ముఠా ఆట కట్టించారు గోపాలపురం పోలీసులు. నిందితుల నుంచి 105 తులాల బంగారు నగలు, 370 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర మండలం డీసీపీ ఆర్.జయలక్ష్మి, గోపాలపురం ఏసీపీ కె.శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్ ప్రాంతాల్లో మహిళా ప్రయాణికుల నగల చోరీతో పాటు జేబు దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో నిందితులను పట్టుకొనేందుకు ఉత్తర మండలం ఎస్ఐలు ఎంఎస్వీ కిషోర్, భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పక్కా పథకం ప్రకారం రెక్కీ నిర్వహించిన ఈ బృందం.. రైల్వేస్టేషన్ ప్రాంతంలో సంచరిస్తున్న నిందితులు నలుగురినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఓల్డ్ అల్వాల్ సూర్యనగర్‌లో నివాసముండే ఆవుల గణేష్ అలియాస్ ఆకుల రాజు (40) పాత నేరస్తుడు. ఎనిమిదేళ్లుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో దృష్టి మళ్లించి చోరీలు, జేబుదొంగతనాలు చేస్తున్నాడు. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదయ్యాడు. అనంతపురం జిల్లాకు చెందిన మరో నిందితురాలు దుర్గ (35) ఇదే తరహా నేరాలు చేస్తోంది. ఇటీవల బోయిన్పల్లి పోలీసులు దుర్గను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, జైలు నుంచి బెయిల్ విడుదలైన ఆవుల గణేష్ తన తరహాలోనే దోపిడీలకు పాల్పడే దుర్గతో పాటు అనంతపురం పట్టణానికి చెందిన గొల్ల సురేష్ (25), బలిజ ప్రశాంత్‌కుమార్ (28)తో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. మహిళల వద్ద దుర్గ అపహరించిన నగలను గణేష్ బృందం బయటికి తరలిస్తుంది. గణేష్ బృందం మహంకాళి, గోపాలపురం, మార్కెట్, బోయిన్పల్లి, మారేడుపల్లి, కార్ఖానా, బొల్లారం పోలీస్స్టేషన్ల పరిధిలోని బస్టాప్‌ల్లో చోరీలకు పాల్పడింది. నలుగురినీ అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కిలో 50 గ్రాముల (105 తులాలు) బంగారు ఆభరణాలు, 370 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
ఫ్యాషన్ జ్యూట్
బ్యాగులు మాత్రమే కాదు జనపనారతో తయారైన ఆభరణాలూ అలంకరణలో భాగమవడానికి సిద్ధమవుతున్నాయి. ఇవి తేలికగా ఉండటమే కాకుండా మన దేశీయతను చాటుతున్నాయి. ఇవి సాధారణ దుస్తుల మీదకు ధరించినా ఆకర్షణీయతను రెట్టింపు చేస్తాయి. విభిన్న రంగులు, డిజైన్లలో ఆకట్టుకుంటున్న ఇవి తక్కువ ధరలో లభించడమే కాకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. పర్యావరణానికి అనుకూలమైనవి. పర్యావరణ ప్రేమికులకు ఈ ఆభరణాలు నేస్తాల్లాంటివి. ఫ్యాషన్‌కి చిరునామా: అందంగా కాదు అధునాతనంగా తయారవడానికి నేటి యువతరం ఆసక్తి చూపిస్తున్నారు. దేశీయ ఉత్పత్తులు ధరించడం వల్ల ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు ఆధునికతకు కొత్త భాష్యం చెబుతున్నారు. అందుకే దేశీయ ఆభరణాలకు డిమాండ్ పెరుగుతోంది. జనపనారతో తయారైన ఈ ఆభరణాలే అందుకు నిదర్శనం. కాస్ట్యూమ్ జువెల్రీగా పేరొందిన జ్యూట్ ఆభరణాలు భిన్నమైన రంగులు, మోడల్స్‌లో లభిస్తున్నాయి. పర్యావరణ నేస్తాలు కూడా కావడంతో ఇవి చర్మానికి హాయినిస్తాయి. ఫ్యాషనబుల్‌గా, నాణ్యతగా రూపొందించడానికి తయారీదారులు మరింత శ్రద్ధ పెడుతున్నారు. లోహాలతో తయారైన ఆభరణాల డిమాండ్ ఎక్కువ ఉన్న ఈ కాలంలో దుస్తుల మ్యాచింగ్‌కి అధిక ప్రాధాన్య మిస్తున్నారు. నారతో తయారుచేసిన కేశాలంకరణ బ్యాండ్స్, క్లిప్పులు, గాజులు, హారాలు.. డ్రెస్‌లకు చక్కగా సరిపోలేవి లభిస్తున్నాయి. రూ.50 నుంచి లభించే ఈ ఆభరణాలు దుస్తుల రంగులకు తగినవి వీలైనన్ని ఎంపిక చేసుకోవచ్చు. షాపింగ్ మాల్స్, ఆన్లైన్ మార్కెట్ లోనూ విభిన్నంగా కనువిందుచేస్తున్న జ్యూట్ ఆభరణాల నుంచి వినియోగ దారుల దృష్టి మళ్లడం లేదు. మగువలకే కాదు మగవారికీ నప్పే జ్యూట్ డిజైన్లు ఎన్నో కొలువుదీరాయి. -
ప్రాణాలు తీశారు.. దోచుకెళ్లారు
రఘునాథపల్లి : ఆ అర్ధరాత్రి వారికి కాళరాత్రి అయ్యింది. ఇంట్లో గాఢనిద్రలో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులపై దోపిడీ దొంగలు దాడికి పాల్పడ్డారు. పసిపిల్లలు, వృద్ధులు అని చూడకుండా కిరాతకంగా ప్రవర్తించారు. రాడ్లతో చితకబాది నగలు, నగదు ఎత్తుకెళ్లారు. రఘునాథపల్లిలో శుక్రవా రం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిచింది. పోలీసుల కథనం ప్రకారం... మండల కేంద్రానికి చెందిన చెరుకు నర్సింహ, రేణుక దంపతులు గీత వృత్తి చేస్తూనే కుటుంబ సభ్యులతో హోటల్ నిర్వహిస్తున్నారు. వారి కూతురు అఖిరానందిని(11), కుమారుడు హర్షవర్ధన్ జనగామ ఎస్వీఆర్ పాఠశాలలో చదువుతున్నారు. రోజూ పాఠశాలకు బస్సులోనే వెళ్లొస్తున్నారు. కాగా రేణుక తండ్రి ఇటీవల మృతిచెందడంతో అప్పటి నుంచి ఆమె తల్లి లచ్చమ్మ(51) కూతురి వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే ఈ నెల 8న న ర్సింహ తండ్రి కొమురయ్య ఆనారోగ్యంతో మృతిచెందగా గురువారం ఐదోరోజు కార్యక్రమం చేశారు. అనంతరం రాత్రి న ర్సింహ తన అత్త లచ్చమ్మను, ఆమె తల్లి లింగంపల్లి రాధమ్మ(71)తోపాటు పిల్లలు హర్షవర్దన్, అఖిరా నందినిని హోటల్లో పడుకోమని చెప్పి పంపాడు. నలుగురు ముందు గదిలో నిద్రిస్తుండగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగు లు ఇంటి వెనకాల ఉన్న తలుపును పైకి లేపి ప్రవేశించారు. దొంగల అలికిడి విని వారు నిద్రలేచి అరవడంతో వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. చిన్నారి నందినికి గదవ భాగంలో తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందగా మిగతావారంతా తీవ్రగాయూలతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. అనంతరం దొంగలు లచ్చమ్మ, రాధమ్మ ఒంటిపై ఉన్న నగలతోపాటు బీరువాలోని రూ.80 వేల నగదు, గల్లగురిగిలోని రూ.10 వేలకుపైగా నాణాలు, రెండు, మూడు తులాల బంగారు పుస్తెలతాళ్లు, మూడు తులాల నగలు, చిన్నారులకు చెందిన నాలుగు ఉంగరాలను దోచుకెళ్లారు. పక్కింటికి గడియ పెట్టి దారుణం.. నర్సింహ హోటల్ పక్కనే అతడి అక్క కోళ్ల అండాలు తన కుటుంబ సభ్యులతో మరో హోటల్ నిర్వహిస్తోంది. గురువారం రాత్రి ఆమె కుమారుడు సందీప్ స్నేహితులతో కలిసి హోటల్ వెనుక గదిలో నిద్రించాడు. పక్క హోటల్లో దోపిడీకి వచ్చిన దొంగలు వారి తలుపు గడియపెట్టారు. ఉద యం లేచాక సందీప్ తలుపు తీయబోగా తెరుచుకోలేదు. బయట గడియ పెట్టినట్లు గుర్తించిన అతడు తన తల్లి అండాలుకు ఫోన్ చేశాడు. దీంతో అతడి తమ్ముడు వచ్చి తలుపు గడియ తీశారు. 8 గంటల ప్రాంతంలో హరీష్ స్నానం చేసేందుకు బకెట్ తెచ్చుకునేందుకు నర్సింహ ఇంటి వెనకాలకు వెళ్లగా తలుపు తొలగించి ఉండటంతో దొంగలు పడిన ట్లు భావించాడు. లోపలికి వెళ్లి చూడగా రక్తపుమడుగులో కొనఊపిరితో ఉన్న హర్షవర్దన్ డాడీ.. డాడీ అని పిలుస్తూ కనిపించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన హరీష్ వెంట నే తండ్రి శ్రీనుకు సమాచార మిచ్చాడు. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చూడగా అప్పటికే అఖిరానందిని, లచ్చమ్మ మృతి చెందగా, అపస్మారకస్థితిలో ఉన్న హర్షవర్ధన్, రాధమ్మను ఆస్పత్రికి తరలించారు. రాధమ్మ చికిత్సపొందుతూ మృతిచెందింది. రోదనలతో మిన్నంటిన రఘునాథపల్లి దారణం గురించినవార్త దావలంలా వ్యాపించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, 3స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారి రోదనలతో రఘునాథపల్లి మార్మోగింది. ఈ ఘటనను చూసిన స్థానికులు కన్నీరుపెట్టారు. వరంగల్ రేంజ్ డీఐజే కాంతారావు, వరంగల్ రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాస్, అడిషనల్ ఎస్పీ కె శ్రీకాంత్ , జనగామ డీఎస్పీ కూర సురేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఫింగర్ ప్రింట్ సీఐ రఘు బృందం అణువణువు క్షుణ్ణంగా పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలించింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : డిప్యూటీ సీఎం రాజయ్య మృతుల కుటుంబాలను ఆదుకుంటామని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆయ న పరామర్శించి ఓదార్చారు. దుండగులను వెంటనే పట్టుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి, ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ సభ్యురాలు బానోతు శారద, టీఆర్ఎస్ మండల కన్వీనర్ రవి, నాయకులు బుచ్చయ్య, రాంబాబు, గోపాల్‌నాయక్ ఉన్నారు. -
నగల కోసం హతమార్చారు
హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ మదనపల్లెక్రైం : సులభ సంపాదనకు అలవాటుపడిన జులాయిలు బంగారు నగల కోసం ఒక వ్యక్తిని దారుణంగా హతమార్చినట్లు మదనపల్లె డీఎస్పీ కే.రాఘవరెడ్డి తెలిపారు. ఈ కేసులో సోమవారం రెండో పట్టణ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. డీఎస్పీ, సీఐ సీఎం.గంగయ్య కథనం మేరకు.. పీటీఎం మండలం సంపత్కోటకు చెందిన కోటకొండ సుధాకర్(45), మదనపల్లె మండలం కోటవారిపల్లె పంచాయతీ ఉడుమువారిపల్లెతాండాకు చెందిన బనావత్ శంకర్‌నాయక్(31), తంబళ్లపల్లె మండలం చెట్లవారిపల్లెకు చెందిన మధు(33) మదనపల్లె నీరుగట్టువారిపల్లె టమాట మార్కెట్ యార్డులో కూలీలుగా పనిచేస్తున్నారు. దుర్వ్యసనాలకు బానిసై డబ్బు కోసం నేరాల బాట పట్టారు. వాల్మీకిపురం తేనీటి వీధికి చెందిన పీ.రమేష్‌బాబు (50) జూలై 24న మదనపల్లెకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండులో వేచి ఉన్నాడు. అతని మెడలో బంగారు చైను, వేళ్లకు రెండు ఉంగరాలు ఉండడంతో అతని వద్ద డబ్బు బాగా ఉంటుందని భావించిన సుధాకర్, శంకర్‌నాయక్, మధు మాటలు కలిపారు. తమ వద్ద కాలేజీ అమ్మాయిలు ఉన్నారని, కావాలనుకుంటే రాత్రికి వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పారు. మాటలు నమ్మిన రమేష్‌బాబు వారి వెంట రవి గ్రూపు థియేటర్ సమీపంలోని పెద్దతోపు వద్దకు వెళ్లాడు. ముగ్గురు కలిసి నగలు ఇవ్వాలంటూ రమేష్‌బాబుపై దాడి చేశారు. రాళ్లతో తీవ్రంగా కొట్టి *60 వేలు విలువగల చైను, రెండు ఉంగరాలు, 2వేలు నగదు, 2వేలు విలువగల సెల్‌ఫోన్ తీసుకుని అతన్ని ముళ్లపొదల్లో పడేసి పారిపోయారు. రాత్రంతా అక్కడే ఉన్న రమేష్‌బాబును ఉదయాన్నే స్థానికులు గమనించి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా 30వ తేదీ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 2008లో ఇదేవిధంగా ఆర్టీసీ బస్టాండు సమీపంలోని కోమటివానిచెరువులో ఒక హత్య జరిగింది. ఆ కేసులో నూలుకుమార్తో పాటు సుధాకర్, శంకర్‌నాయక్, మధు నిందితులుగా ఉన్నారు. నూలుకుమార్ ఓ కేసులో జైలుశిక్ష అనుభవిస్తుండడంతో మిగతా ముగ్గురే ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావించారు. ఆ మేరకు తట్టివారిపల్లె వినాయకగుడి వద్ద సుధాకర్, శంకర్‌నాయక్ ఉన్నట్లు సమాచారం రావడంతో అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. మధు పరారీలో ఉన్నాడు. దోచుకున్న నగలను రికవరీ చేసి, నిందితులను అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించారు. కేసును ఛేదించిన ఎస్ఐలు హనుమంతప్ప, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు రాజేష్, రాకేష్, శ్రీకాంత్‌లను డీఎస్పీ అభినందించారు. -
‘రుద్రమ దేవి’ నగలపై కదులుతున్న డొంక
ఎగ్జిక్యూటివ్ రవి తీరుపైనే అనుమానం విచారిస్తున్న పోలీసులు గచ్చిబౌలి: రుద్రమదేవి సినిమా షూటింగ్లో మాయమైన నగల కేసులో ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 19న షూ టింగ్‌కు ముందు రెండు డబ్బాల నగలు మాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘నాదేళ్ల ఆంజనేయులు శెట్టి నగల కంపెనీ’కి చెందిన ఎగ్జిక్యూటివ్ రవి సుబ్రహ్మణ్యంను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని తెలుసుకున్న రవి భార్య మరుసటి రోజే ‘నాదేళ్ల ఆంజనేయులు శెట్టి కంపెనీ’ ప్రతినిధులకు తమ ఇంట్లో నగలున్నట్టుగా సమాచారం అందించారు. కంపెనీ ప్రతినిధులు గచ్చిబౌలి పోలీసులకు సమాచా రం ఇవ్వగా చెన్నై పోలీసుల సహకారం తీసుకున్నారు. చెన్నైలోని రవి ఇంట్లో దాదాపు పది కేజీల గిల్డ్ నగలను చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటివరకు షూటింగ్ వద్దకు నగలు తీసుకొచ్చానని చెప్పిన రవి మాట మార్చారు. కొన్ని ఇంట్లోనే ఉన్నాయని తమ కంపెనీ యాజమన్యానికి తెలియదని చెప్పారు. యాజ మాన్యానికి తెలియకుండా నగలు ఇంట్లో పెట్టుకోవడంతో రవి తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రవి మాత్రం ఎన్ని నగలు తీసుకొచ్చావనే దానిపై పోలీసులకు రోజుకో తీరుగా చెబుతున్నట్టు సమాచారం. ఇదిలావుంటే రాణి రుద్రమ దేవి విగ్రహలపై ఉన్న నగలను ఫొటోల ఆధారంగా ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా నగలను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు తెలిసింది. రుద్రమదేవి సంప్రదాయ నగలను ప్రత్యేకంగా డిజైన్ చేసి ఇస్తామని ఆంజనేయులు శెట్టి కంపెనీ అంగీకరించింది. కళాకారులు, యంత్రాల ద్వారా గిల్డ్, బంగారు నగలు తయారు చేశారు. ఈ క్రమంలో భారీగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. రవి సుబ్రహ్మణ్యం ద్వారా గిల్డ్ నగలతోపాటు ఏడు బంగారు నగలు షూటింగ్ కోసం పంపించినట్టు పోలీసులతో కంపెనీ ప్రతినిధులు తెలిపినట్లు సమాచారం. -
షాపింగ్ స్పాట్
‘ఓ మంచి పనికోసం కొద్దిసేపు ఆగండి’ అంటూ దేశవ్యాప్త సంప్రదాయ, సమకాలీన డిజైనర్ వస్త్రాలు, ఆభరణాలు, యాక్సెసరీస్‌ను ఎగ్జిబిషన్‌గా మన ముందు పెట్టింది తాజ్ డెక్కన్‌లోని కోహినూర్ హాల్. దేశవ్యాప్తంగా పేదల విద్య, వైద్యం, కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న ఇండియా ఫౌండేషన్ కోసం వై.మధుపమ ‘పాజ్ ఫర్ ఏ కాజ్’ పేరిట ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే స్టైలిష్ డిజైన్స్ కాశ్మీరీ జర్దోసీ, మెరిసే షిఫాన్స్, అద్భుతమైన జార్జెట్స్ కొలువుదీరాయి. ఫ్యాషన్ ప్రియుల కోసం ఇండో-వెస్ట్రన్ వేర్ కూడా ఉంది. శనివారం కూడా ప్రదర్శన ఉంటుంది. - సాక్షి, సిటీ ప్లస్ ఫ్రెష్ లుక్ బుక్స్‌తో కుస్తీ పట్టే స్టూడెంట్స్ కాస్త ‘బ్రేక్’ తీసుకున్నారు. స్పైసీ లుక్స్‌తో మాస్ సాంగ్‌లకు స్టెప్పులేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో న్యూ స్టూడెంట్స్‌కు వెల్కమ్ చెప్పారు. బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ అవ్మూరుులు... శుక్రవారం ఫ్రెషర్స్ డే ను జాలీగా ఎంజాయ్ చేశారు. Petals కేరాఫ్ లేటెస్ట్ లగ్జరీ వరల్డ్‌లో తిరుగులేని ఎగ్జిబిషన్ పెటల్స్. పేరుకు తగ్గట్టుగానే పూల రెక్కలకు కొన్ని తేనెచుక్కలు కలిపి తయారు చేసినట్టున్న వస్త్రాలు, ఆభరణాలు తాజ్ కృష్ణాలో కొలువుదీరాయి. ముంబై, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, పుణే, బెంగళూర్, కోల్‌కతా, చెన్నయ్ వంటి ప్రముఖ నగరాల్లోని 60 మంది టాప్‌మోస్ట్ డిజైనర్లు రూపొందించిన డిజైన్లు చూపరులను కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. డ్రెస్‌లు, యాక్ససరీస్, గృహోపకరణాలు, గిఫ్టుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లేటెస్ట్ ట్రెండ్స్‌కి అద్దం పట్టిన ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు పద్మలతను సిటీ ప్లస్ పలకరించింది... ‘ఫిబ్రవరి, జూలై, దసరాకు ముందు ఏడాదిలో మూడుసార్లు జరిగే ఈ ఎగ్జిబిషన్ లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఇష్టపడే ఇన్నోవేటివ్ పీపుల్‌కి కరెక్ట్ ప్లేస్. అయితే మొదటి దఫాలో చేనేతకు పట్టం కడితే.. రెండోసారి దేశవ్యాప్తంగా డిజైనర్లను హైదరాబాదీలకు పరిచయం చేయడం, ఇక మూడో విడతలో పాకిస్థాన్ సహా అంతర్జాతీయ డిజైనర్స్ లక్ష్యంగా ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో పెట్టుకొని మహిళల కోసం వెడ్డింగ్ కలెక్షన్ ఈ ఎగ్జిబిషన్లో ఉంచాం. ప్రత్యేకించి కంచి, బెనారస్‌తో పాటు ఇకత్ వంటి అన్ని రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. 60 స్టాళ్లలో కిడ్స్ కోసం కొన్ని ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశాం. వాటితోపాటు సూట్స్, బ్లౌజ్‌లు, హెయిర్ ఫ్యాషన్ యాక్సెసరీస్, ఫుట్‌వేర్, బ్యాగ్స్ ఇలా అన్నింటిలో లేటెస్ట్ ట్రెండ్స్. ఆకర్షణీయమైన పసిడి, వెండి, వజ్రాభరణాలు ఇక్కడ ప్రత్యేకత’ అంటున్నారు పద్మలత. ప్రవుుఖ గాయుని ఉష ఇందులోని వెరైటీలు చూసి వుుచ్చటపడ్డారు. -
కుబేరులు..ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు..
డబ్బును ఇన్వెస్ట్ చేసే విషయానికొస్తే.. అనేకానేక సాధనాలు వెతికేస్తుంటాం. బంగారమని, షేర్లని, రియల్ ఎస్టేట్ అని రకరకాల వాటి గురించి ఆరా తీస్తుంటాం. మనలాగే, కుబేరులు వేటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారన్న దానిపై కొద్ది రోజుల క్రితం జరిపిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బైటపడ్డాయి వాటిలో కొన్ని .. పెయింటింగ్స్.. కళాభిరుచి కావొచ్చు మరొకటి కావచ్చు .. చాలా మంది సంపన్నుల ఇళ్లల్లో పేరొం దిన చిత్రకారులు గీసిన చిత్రరాజాలు కనిపిస్తుంటాయి. ఇవి కేవలం అలంకారప్రాయమే కాదు.. ఇన్వెస్ట్మెంట్ సాధనాలుగా కూడా ఉంటున్నాయి. ఆర్టిస్టును బట్టి కాలం గడిచిన కొద్దీ ఈ పెయింటింగ్స్ విలువ పెరుగుతుంది కనుక.. వీటిపై ఇన్వెస్ట్ చేయడానికి కుబేరులు ఆసక్తి చూపుతున్నారు. వాచీలు..వైన్.. సంపన్నుల కలెక్షన్లో పెయింటింగ్స్ తర్వాత స్థానం వాచీలది. ప్రముఖులు ఉపయోగించిన వాచీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. బ్రిటిష్ రాక్ గిటారిస్టు ఎరిక్ క్లాప్టన్కి చెందిన ప్లాటినం క్రోనోగ్రాఫ్ వాచీని వేలంలో దాదాపు రూ. 20 కోట్లు పెట్టి కొనుక్కున్నారో అభిమాని. అలాగే, పేరొందిన బ్రాండ్స్‌కి చెందిన వైన్ కూడా. వైన్ ఎంత పాతదైతే అంత ఎక్కువ రేటు పలుకుతుంది. కావాలంటే లాగించేయవచ్చు .. లేదా మంచి రేటు వస్తే అమ్మేయనూ వచ్చు అనే ఆలోచనతో వీటిపైనా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుంటారు. ఆభరణాలు.. ఆస్తి, అంతస్తుల హోదాతో సంబంధం లేకుండా చాలా మందికి ఆభరణాలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఆభరణాలనేవి సూపర్ సంపన్నులకు కూడా ఫేవరెట్సే. కాకపోతే.. కేవలం ఎమోషనల్‌గా కాకుండా వీటిని చాలా మంది ఇన్వెస్ట్మెంట్ సాధనంగా కూడా చూస్తుంటారు. స్పోర్ట్ టీమ్స్.. కొన్నాళ్లుగా మన దగ్గర సెలబ్రిటీలూ, సూపర్ రిచ్ వర్గాలూ స్పోర్ట్స్‌పై దృష్టి పెడుతున్నారు. దీంతో క్రికెట్లో ఐపీఎల్ మొదలుకుని ఫుట్‌బాల్, హాకీ లీగ్ దాకా చాలా టోర్నీలు పుట్టుకొచ్చాయి. వీటిలో ఆడే జట్లను వేలం పాటలో సెలబ్రిటీలు భారీ రేట్లు పెట్టి కొంటున్నారు. పెట్టిన పెట్టుబడులపై కొందరు మంచి రాబడులే అందుకుంటున్నారు కూడా. కార్లు .. కాయిన్లు.. సంపన్నుల ఫేవరెట్స్ జాబితాలో వింటేజ్ కార్లు, ప్రత్యేకమైన కరెన్సీ నాణేలు, యాంటిక్ ఫర్నిచర్ కూడా ఉంటున్నాయి. వీటి తర్వాత చిట్టచివరి స్థానం స్టాంపులది ఉంటోంది. -
అంతర్జిల్లా దొంగల అరెస్ట్
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : వరంగల్, హైదరాబాద్ నగరాల్లో చైన్‌స్నాచింగ్, చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను వరంగల్ అర్బన్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ. 6 లక్షల విలువైన 200 గ్రాముల బంగారు ఆభరణాలు, సోనీ ఎల్సీడీ టీవీ, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ క్రైం డీఎస్పీ రాజమహేంద్రనాయక్ కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా ఓదెల మండలం రూపునారాయణ గ్రామానికి చెందిన ఐలవోని రామకృష్ణ, విశాఖపట్నంకు చెందిన దండేటి నాగరాజు ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని కృష్ణానగర్‌లో నివాసముంటున్నారు. రామకృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటుపడిన అతడికి తనకు వచ్చే జీతం సరిపోక మోటార్ సైకిల్, సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడటంతో 2012లో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అతడు శిక్షా కాలం పూర్తి చేసుకొని తిరిగి వచ్చి ఫుడ్ క్యాటరింగ్లో పనిచేస్తూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవ న్ ప్రాంతానికి మకాం మార్చాడు. ఇదే ఎన్టీఆర్ భవన్ ప్రాంతంలో ఒకరి వద్ద రెండో నిందితుడు దండేటి నాగరాజు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన యజమాని ఇంటి వద్ద కారు పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో అతడు కారును రామకృష్ణ నివాసముంటున్న ఇంటి పరిసరాల్లోని చెట్ల నీడలో పార్కింగ్ చేసుకుని సేద తీరేవాడు. ఈ క్రమంలోనే నాగరాజు, రామకృష్ణ మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరు కలసి జల్సాలు చేయడంతోపాటు చెడు వ్యసనాలకు బానిసలై తమ సంపాదన సరిపోకపోవడంతో జల్సాల కోసం చైన్‌స్నాచింగ్‌లు, తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు చేయడమే మార్గంగా ఎంచుకున్నారు. ఇద్దరు కలిసి వరంగల్, హైదరాబాద్ నగరాల్లో పలుచోట్ల చోరీలకు పాల్పడ్డారు. హన్మకొండ, సుబేదారి, మట్టెవాడ పోలీస్స్టేషన్ల పరిధిలో మూడు చైన్‌స్నాచింగ్‌లు, సుబేదారి ప్రాంతంలో ఒక చోరీ, హైదరాబాద్‌లో నాలుగు చోరీలకు పాల్పడ్డారు. గురువారం ఉదయం నిందితులు తమ వద్ద ఉన్న దొంగసొత్తును వరంగల్ చౌరస్తాలోని బులియన్ మార్కెట్లో అమ్మేందుకు రాగా సమాచారం అందుకున్న డీఎస్పీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ ఆదినారాయణ తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తాము పాల్పడిన నేరాలను ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన అర్బన్ క్రైం డీఎస్పీ రాజమహేంద్రనాయక్, ఇన్స్పెక్టర్ ఆదినారాయణ, ఎస్సై లక్ష్మీనారాయణ, ఏఎస్సై సంజీవరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరాజు, కానిస్టేబుళ్లు మహ్మద్ అలీ, రవి, సల్మాన్‌పాషా, జంపయ్య, హోంగార్డు రవికి అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు చేతుల మీదుగా రివార్డులను అందజేయడం జరుగుతుందని డీఎస్పీ వెల్లడించారు. -
కాపలాదారే హంతకుడు
నగల కోసమే దారుణం మహిళ హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు మెహిదీపట్నం, న్యూస్‌లైన్: మహిళ అదృశ్యం...హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. అపార్ట్మెంటు వాచ్‌మన్‌ను హంతకుడిగా తేల్చారు. బుధవారం వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని రోలుగుంటకు చెందిన దుర్గాలమ్మ(58) మధురానగర్ ఎఫ్-బ్లాక్‌లోని సమ్రీనాహైస్ అపార్ట్మెంట్ ఉంటూ.. జీటీఎస్ కాలనీలోని ఏపీసీపీడీసీఎల్ ట్రైనింగ్ సెంటర్లో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఆమె రోజూ మెడలో నగలు ధరించి విధులకు వెళ్తుంటుంది. దుర్గాలమ్మ నివాసముండే అపార్ట్మెంటు వద్ద విశాఖ జిల్లాకు చెందిన పి.సన్యాసిరావు(32) వాచ్‌మన్‌గా పని చేస్తున్నారు. ఇతనికి ఇటీవల సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన వచ్చింది. ఈనెల 6న ఉదయం 11 గంటలకు దుర్గాలమ్మ విధులు ముగించుకొని తానుండే అపార్ట్మెంటు వద్దకు వచ్చింది. మొదటి అంతస్తుకు వెళ్లేందుకు ఆమె లిఫ్ట్‌లోకి వెళ్లగా.. సన్యాసిరావు కూడా వెళ్లాడు. ఆమెను మాటల్లో పెట్టి లిఫ్ట్ 3వ అంతస్తు బటన్ నొక్కాడు. 3వ అంతస్తుకు వెళ్లగానే ఆమె చీరతోనే నొరు నొక్కి.. అదే అంతస్తులో ఖాళీ ఉన్న 301 ఫ్లాట్‌లోకి తీసుకెళ్లాడు. ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు నగలు లాక్కొని.. ఆ తర్వాత చీరతో గొంతు బిగించి చంపేశాడు. మృతదేహాన్ని అదే ఫ్లాట్‌లోని బాత్రూంలో దాచాడు. తర్వాత కిందకు వెళ్లి వాచ్‌మన్ విధులు నిర్వహించాడు. విధులకు వెళ్లిన దుర్గాలమ్మ రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుమారు నూకరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది గమనించిన నిందితుడు సన్యాసిరావు అర్ధరాత్రి 1 గంటకు దుర్గాలమ్మ మృతదేహాన్ని లిఫ్ట్‌లో 3వ అంతస్తు నుంచి తీసుకెళ్లి అపార్ట్మెంటు వెనుక గేటు వద్ద వేశారు. బుధవారం ఉదయం 5.30కి దుర్గాలమ్మ మృతదేహం వెనుక గేటు వద్ద ఉందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాచ్‌మన్ సన్యాసిరావుపై అనుమానం వచ్చి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నగలను స్వాధీనం చేసుకొని, అతడిని రిమాండ్‌కు తరలించామన్నారు. -
వాదాలకుంటలో భారీ దోపిడీ
వాదాలకుంట (గోపాలపురం), న్యూస్‌లైన్ : వాదాలకుంటలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడి 72 కాసుల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదు దోచుకుపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వాదాలకుంట గ్రామం నడిబొడ్డున ఉన్న రామాలయం సమీపంలో ముళ్లపూడి గెరటారావు ఇల్లు ఉంది. ఆయన శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లారు. అతని భార్య చినసత్యవతి ఆరుబయట నిద్రిస్తోంది. ఆమె తోటి కోడలు పెదసత్యవతి, ఇద్దరు కుమారులు, ఓ కోడలు ఇంట్లో నిద్రిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సుమారు 12 గంటలకు ముసుగులు ధరించిన నలుగురు యువకులు ఆ ఇంటి పెరట్లోకి చొరబడ్డారు. చిన సత్యవతి నోట్లో చీర కుక్కడంతో ఆమెకు మెళకువ వచ్చింది. ఏం జరుగుతోందో అర్ధం చేసుకునేలోపే అరిస్తే చంపేస్తామని ఆమెను బెదిరించారు. ఆమెను తీసుకుని ఇంట్లోకి చొరబడి అక్కడ నిద్రిస్తున్న కుమారులు, కోడలిని ఒక్కొక్కరిని చినసత్యవతితోనే నిద్రలేపించారు. కేకలు వేస్తే చంపేస్తామని వారిని కత్తి, చాకులతో బెదిరించారు. వారి చేతులు కట్టేశారు. కోడలు మెడలో ఉన్న బంగారం, కొడుకు చేతికి ఉన్న ఉంగరాలు వలుచుకున్నారు. పక్కగదిలో నిద్రిస్తున్న చిన సత్యవతి తోటికోడలు పెదసత్యవతిని లేపి ఆమె మెడపై కత్తి పెట్టి బీరువా తాళాలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. తాళాలు తీసుకుని బీరువా తెరిచి అందులో బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఈ తతంగమంతా అయ్యేప్పటికి గంట సమయం పట్టింది. దొంగలు వెంట తెచ్చుకున్న కత్తి, రంపపు బ్లేడును వదిలేశారు. నిద్రలేపి బెదిరించి, చేతులు కట్టి చంపుతామనడంతో భయపడినట్టు బాధితులు తెలిపారు. తాము ఉన్నంత వరకు ఎవరైనా అరిస్తే చంపేస్తామని బెదిరించారని చెప్పారు. నలుగురికీ సుమారు 30 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలిసినవారే చేశారు : బాధితుల ఆరోపణ తమ ఇంటికి రంగులు వేసిన యువకులే దోపిడీకి పాల్పడి ఉంటారని బాధితులు పేర్కొన్నా రు. దీంతో ఆ ఇంటికి రంగులు వేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలవరం సీఐ జీఆర్ఆర్ మోహన్ చెప్పారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ఏవీ సుబ్బరాజు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. ఫొరెన్సిక్ విభాగం వారు వేలి ముద్రలు సేకరించారు. -
కల్యాణ వైభోగమే..
నక్కపల్లి, న్యూస్‌లైన్: కల్యాణ కాంతులతో ఉపమాక కళకళలాడింది. కోనేటిరాయుని పరిణయోత్సవం ఉపమాకకు వినూత్న అందాలను తీసుకువచ్చింది. ప్రసిద్ధి గాంచిన ఉపమాక వెంకన్న వార్షిక కల్యాణం గురువారం తెల్లవారుజామున కనుల పండువగా జరిగింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి కల్యాణం ఘట్టాన్ని తనివితీరా చూసి పులకించిపోయారు. ఉపమాకకు చెందిన సింహాద్రాచార్యుల ఇంటి వద్ద స్వర్ణాలంకరణ భూషితుడైన వేంకటేశ్వరస్వామిని గరుడ వాహనంపైన, పట్టువస్త్రాలు బంగారు ఆభరణాలతో ముస్తాబైన శ్రీదేవి, భూదేవిని సప్పరవాహనంపైన ఉంచి పెళ్లి మాటల తంతును నిర్వహించారు. ఈ సందర్భంగా సింహాద్రాచార్యుల కుటుంబీకులు స్వామివారికి పసుపు కుంకుమలు, పండ్లు, పట్టు వస్త్రాలు, తాం బూలం సమర్పించారు. అనంతరం చిన్నరథంపై తిరువీధిసేవ నిర్వహించారు. తదుపరి స్వామివారి కల్యాణాన్ని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భద్రాచలంకు చెందిన రామాయణం శర్మ, తెలుగు పండితురాలు డాక్టర్ వేదాల గాయత్రీ దేవి, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఈవోలు శేఖర్‌బాబు, రంగనాథస్వామి, వెంకటాద్రి, పాలకమండలి సభ్యులు బుజ్జి, సింహాద్రి, శ్రీను, చిరంజీవి, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు మణిరాజు, శివాలయం మాజీ చైర్మన్లు సిద్దాబత్తుల జోగారావు, కొండబాబు పాల్గొన్నారు. కల్యాణోత్సవాల సందర్భంగా వెంకన్నకు అలంకరించేందుకు విశాఖలోని ట్రెజరీ నుంచి తీసుకొచ్చిన బంగారు ఆభరణాలను గురువారం తిరిగి పంపించేశారు. -
అందానికి సింగారం కలప బంగారం
ఆభరణాలు అతివకు అందం. అతివ ధరిస్తేనే ఆభరణాలకు అందం. అందుకే... బంగారం, వెండి, వజ్రం, ప్లాటినమ్.. లాంటి లోహాలే కాదు అమ్మాయి మేనికి అలంకరణగా మారడానికి కలప కూడా పోటీపడుతోంది. కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ఏటికొప్పాకలో భామల మనసును ఆకట్టుకునేలా కలపతో రూపుదిద్దుకున్న ప్రత్యేక ఆభరణాలు ఇవి... తయారీ ఇలా! అంకుడు చెట్టు కలపను తగిన పరిమాణంలో చెక్కి.. బొమ్మలు, ఆభరణాలను అత్యంత నైపుణ్యంతో తయారు చేస్తారు లక్క(చెట్ల నుంచి వచ్చిన జిగురు)ను ‘ఫినిషింగ్’ కోసం వాడుతారు. పసుపు రంగు కోసం పసుపుకొమ్ములను పొడిచేసి, ఉడకబెట్టగా వచ్చిన రసాన్ని లక్కలో కలుపుతారు కరక్కాయ, పాతబెల్లం కలిపి మూడు నెలల పాటు నిల్వ ఉంచి, దీని నుంచి నలుపురంగును తయారుచేస్తారు లేత, ముదురు ఆకుపచ్చ, నీలం రంగుల కోసం... ఇండుప ఆకులను రుబ్బి, ముద్దలా చేసి, నీరు పోసి ఉడకబెట్టి ఆ రసాన్ని లక్కలో కలుపుతారు తయారుచేసుకున్న ఆభరణాలకు రంగు కలిపిన లక్కను అద్దుతారు మొగలి చెట్టు ఆకులను ఎండబెట్టి, ఆ ఆకుతో కలప డిజైన్ పై భాగాన్ని ‘షైన్’ చేస్తారు చీర, డ్రెస్ రంగులను చెబితే వాటికి సరిపోలే ఆభరణాలను తయారుచేసి ఇస్తారు. రోజంతా ధరించవచ్చు... వేసవిలో ఇతర లోహపు ఆభరణాలు చర్మ సమస్యలు కలిగిస్తుంటాయి. కలపతో తయారైనవి కాబట్టి ఇవి పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవి, తేలికైనవి కావడంతో ఈ ఆభరణాలను రోజంతా ధరించినా ఇబ్బంది అనిపించదు. రంగు వెలిసిపోవు కనుక వర్షాకాలంలోనూ నిరభ్యంతరంగా వీటిని ధరించవచ్చు. పగలు వేడుకలకు బాగా నప్పుతాయి. ఏటికొప్పాకకే ప్రత్యేకం అనదగ్గ ఈ కలప ఆభరణాలు మరెక్కడా దొరకవు. ఈ ఆభరణాలు జీవితకాలం మన్నుతాయి. రూ. 200/- నుంచి లభిస్తున్నాయి. ఈ ఆభరణాలు సంప్రదాయ దుస్తులైన చీరలు,చుడీదార్లు, పంజాబీ డ్రెస్సుల మీదకే కాదు ఆధునిక దుస్తులకూ కొత్త హంగులను అద్దుతున్నాయి. మన హస్తకళా వైభవాన్నిచాటుతున్నాయి. అవార్డుల కళ ఏటికొప్పాక గ్రామం కొయ్యబొమ్మల తయారీకి ప్రసిద్ధి. విశాఖపట్టణానికి-ఏటికొప్పాకకి మధ్య దూరం 60 కి.మీ. 200 ఏళ్ల క్రితం నుంచే ఏటికొప్పాకలో కలపతో బొమ్మలు, ఇతర అలంకరణ వస్తువులు తయారుచేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఇక్కడి 200 కుటుంబాలు బొమ్మల తయారీలోనే ఉపాధిని వెతుక్కుంటున్నాయి. పదేళ్లుగా నేను ఆభరణాల తయారీని మొదలుపెట్టాను. చెవిలోలాకులు, గాజులు, హారాలు, కేశాలంకరణ సామగ్రి తయారుచేస్తున్నాను. కలపతో చేసిన చేతి గడియారం, పెళ్లి తంతుతో నిండిన హారానికి రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ నుంచి అవార్డు లభించింది. - పెదపాటి శరత్, కలప ఆభరణాల డిజైనర్, ఏటికొప్పాక -
యువతిని మోసగించిన మరో యువతి
వరంగల్ రైల్వేస్టేషన్ లాకర్లోని బ్యాగుతో అపహరణ బ్యాగులో 10 తులాల బంగారు ఆభరణాలు, దుస్తులు ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన జీఆర్పీ పోలీసులు ఎదుట బాధితురాలి ఆవేదన మట్టెవాడ, న్యూస్‌లైన్ : ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చిన ఓ యువతికి మాయ మాటలు చెప్పి, ఆమెకు సంబంధించిన బ్యాగ్‌ను మరో యువతి ఎత్తుకెళ్లిన సంఘటన వరంగ ల్ రైల్వేస్టేషన్లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి తండ్రి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన బెరైడ్డి నర్సింహారెడ్డికి కూతురు సోనీ(18) ఉంది. ఆమె తన అత్తగారి ఊరైన అదే జిల్లా వల్లభాపూర్ నుంచి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హుజురాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి బస్సులో ఫిబ్రవరి 16న వరంగల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. రెండురోజులపాటు ప్లాట్ ఫాంపైనే గడిపింది. 18న సుధ అనే యువతి కలిసి సోనీకి మాయమాటలు చెప్పి ఆమె వద్ద ఉన్న బ్యాగును రైల్వేస్టేషన్‌లోని లాకర్లో పెట్టింది. సుధా తన పేరుతోనే అడ్రస్ రాయించి, రశీదు కూడా తీసుకుంది. అనంతరం సోనీని కరీమాబాద్‌లోని ఎరుకల సాయమ్మ ఇంట్లో వదిలేసి వెళ్లిపోయింది. తిరిగి రైల్వేస్టేషన్‌కు వచ్చిన సుధ లాకర్లోని బ్యాగు తీసుకుని ఉడాయించింది. సాయమ్మ ఇంట్లో ఉన్న ఆమె సుధ కోసం ఎన్నిరోజులు ఎదురు చూసినా ఆమె రాకపోవడంతో అనుమానం కలిగింది. 24వ తేదీన సోనీ తన పుట్టింటికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె తండ్రి నర్సింహారెడ్డితోపాటు బంధువులు వచ్చి సోనీని తీసుకెళ్లారు. అయితే బ్యాగు కోసం వరంగల్ స్టేషన్ లాకర్ వద్దకు వెళ్లగా సుధ అనే యువతి తీసుకెళ్లినట్లు లాకర్ నిర్వాహకుడు చెప్పాడు. అందులో 10 తులాల బంగారం, బట్టలున్నాయని సోనీ బోరున విలపించింది. సుధను పట్టుకుని తమకు న్యాయం చేయాలని వారు రైల్వే పోలీసులను కోరారు. ఈ విషయమై జీఆర్పీ ఎస్సై మునీరుల్లా మాట్లాడుతూ వీణవంక పోలీస్‌స్టేషన్‌లో సోనీ మిస్సింగ్ కేసు నమోదై ఉందని, అక్కడివారే కేసు విచారణ చేస్తారని తెలిపారు. కేసును జీఆర్పీకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు తాము స్పందించనున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా సాయమ్మను వీణవంక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి, సుధను రెండు రోజుల్లో తమ వద్దకు తీసుకురావాలని హెచ్చరించినట్లు తెలిసింది. -
చెవి రంధ్రం సాగితే!
కమ్మలు పెట్టుకునే చెవి రంధ్రాలు కొందరికి మరీ సాగినట్టు కనిపిస్తాయి. కొందరికైతే సాగిన చెవి రంధ్రాలు తెగిపోయి కూడా కనిపిస్తాయి. పెద్ద పెద్ద ఆభరణాలు ధరించడం వల్ల... వయసు పైబడి చర్మం బలహీనంగా మారడం వల్ల ఇలా జరుగుతుంటాయి. ఈ సమస్యకు రెండు పద్ధతుల ద్వారా చికిత్స ఉంటుంది. కార్టిలేజ్ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా బలహీనంగా ఉన్న చెవి రంధ్రాన్ని పూర్తిగా మూసేసి, ఆ ప్రాంతంలో చర్మాన్ని శక్తిమంతం చేస్తాం. తర్వాత మళ్లీ రంధ్రం చేస్తాం. ప్లాప్ మెథడ్ ద్వారా చెవిరంధ్రాన్ని పూర్తిగా మూసేయకుండా చిన్నదిగా మారుస్తాం. ఈ పద్ధతులకు ఒక గంట సమయం పడుతుంది. ఆ తరువాత గంటలో ఇంటికి వెళ్లిపోవచ్చు. నోట్: బరువున్న ఆభరణాలు దీర్ఘకాలం ఉపయోగించకూడదు. ఏ వయసు వారైనా ఈ చికిత్స చేయించుకోవచ్చు. ఆసుపత్రిని బట్టి రూ.10-15 వేలు ఖర్చు అవుతుంది. - డా. మురళీమనోహర్ రెడ్డి, ప్లాస్టిక్ సర్జన్ -
అక్కాచెల్లెళ్ల నుంచి ఆభరణాల దోపిడీ
మొయినాబాద్, న్యూస్‌లైన్: ప్యాసింజర్ ఆటోలాగా నమ్మించి అక్కాచెల్లెళ్లను ఎక్కించుకుపోయారు. కత్తితో బెదిరించి ఆభరణాలను దోచుకుపోయారు. ఈ సంఘటన మండల పరిధిలోని తోల్కట్ట సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు, సీఐ రవిచంద్ర కథనం ప్రకారం.. చేవెళ్ల మండలం పలుగుట్ట గ్రామానికి చెందిన విజయలక్ష్మి, పరమేశ్వరి అక్కాచెల్లెళ్లు. వీరు మంగళవారం ఉదయం మొయినాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. మధ్యాహ్నం సమయంలో స్వగ్రామానికి వెళ్లేందుకు మొయినాబాద్ బస్‌స్టాప్‌లో నిరీక్షిస్తున్నారు. కాగా వీరిని ముందునుంచే గమనిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ ఆటోలో వచ్చారు. ఆటో చేవెళ్లకు వెళ్తుంది.. వస్తారా..? అని అడిగారు. దీంతో అక్కాచెల్లెళ్లు ప్యాసెంజర్ ఆటోగా భావించి అందులో ఎక్కారు. ఆటో మార్గంమధ్యలో ఆపకుండా నేరుగా మండలంలోని తోలుకట్ట సమీపంలో ఉన్న ఓ ఫాంహౌస్ వైపు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. దీంతో వారికి అనుమానం వచ్చి అడిగారు. పక్కనే కూరగాయలు ఉన్నాయని, వాటిని తీసుకొని చేవెళ్లకు వెళ్దామని చెప్పడంతో వారు మిన్నకున్నారు. కొద్దిదూరం లోపలికి తీసుకెళ్లి ఆటో ఆపారు. కత్తితో బెదిరించి వారి వద్ద ఉన్న నాలుగున్నర తులాల బంగారు నగలు (కమ్మలు, గొలుసులు)తో పాటు 30 తులాల వెండి పట్టాలు దోచుకొని మహిళలను అక్కడే వదిలేసి ఆటోలో వెళ్లిపోయారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ రోడ్డుపైకి వచ్చారు. స్థానికుల సాయంతో చేవెళ్ల పోలీసులను ఆశ్రయించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పరిధి మొయినాబాద్ ఠాణాలోకి వస్తుందని తెలిపారు. దీంతో బాధితులు సీఐ రవిచంద్రకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఎవరిదీ ఘాతుకం?
సాక్షి, సిటీబ్యూరో: సంఘీ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని వస్తున్న దంపతులపై జరిగిన దాడి ఘటనపై సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడిలో భర్త వెంకటేశ్వరరావు (27) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన అతని భార్య సౌజన్య హయత్‌నగర్‌లోని టైటాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బంగారు ఆభరణాల కోసమే దుండగులు దంపతులపై దాడి చేశారా? లేక మరేవైనా కారణాలున్నాయా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెళ్లయిన మూడు నెలలకే జరిగిన దాడి నేపథ్యంలో కుటుంబ వ్యవహారాలపైనా దృష్టి పెట్టినట్టు పోలీసులు చెప్పారు. ఆదివారం క్లూస్‌టీంతో పాటు డీసీపీ రవివర్మ, ఏసీపీ ఆనంద్‌భాస్కర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌కుమార్ సంఘటన స్థలాన్ని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. ఇరు కుటుంబాలతో పాటు బెంగళూరులో సౌజన్య స్నేహితులను కూడా విచారించాలని భావిస్తున్నారు. హత్య జరిగిన తీరును బట్టి ప్రొఫెషనల్ కిల్లర్స్ పనిగానూ అనుమానించాల్సి వస్తుందని పోలీసులు అంటున్నారు. కోలుకుంటున్న సౌజన్య దుండగుల దాడిలో గాయపడ్డ సౌజన్య హయత్‌నగర్ టైటాన్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆమెకు వీపు, మోకాలు, నడుము భాగంలో గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె ఇంకా ఐసీయూలోనే చికిత్స పోందుతున్నారని, కొలుకునేసరికి మరోరోజు పడుతుందన్నారు. కాగా దుండగులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు డీసీపీ రవివర్మ తెలిపారు. సౌజన్య పూర్తిగా కొలుకున్నాక ఆమెను విచారిస్తామని తెలిపారు. మల్కాజిగిరిలో విషాదఛాయలు పోస్టుమార్టం అనంతరం వెంకటేశ్వరరావు మృతదేహానికి ఆదివారం శాంతినగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. జూబ్లీ బ స్డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు (27) సౌమ్యుడని ఈ సందర్భంగా స్థానికులు గుర్తుచేసుకున్నారు. ఇంటి పెద్దకొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.