హైవేపై దారిదోపిడీ | Highway thugs | Sakshi
Sakshi News home page

హైవేపై దారిదోపిడీ

Published Sat, Mar 28 2015 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM

Highway thugs

  • సినీ ప్రముఖుల నుంచి రూ. 3లక్షల ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు!
  • షాద్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలో గురువారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై సినీఫక్కీలో కొందరు దుండగులు మారణాయుధాలను చూపించి  దోపిడీకి పాల్పడ్డారు. ఘటనలో కొందరు సినీ ప్రముఖుల నుంచి దాదాపు రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. గురువారం ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్ పుట్టినరోజు సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గ్రామ సమీపంలోని తన గెస్ట్‌హౌస్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు.  

    ఈ వేడుకలకు ప్రముఖులు హాజరవుతున్నారని ముందే పసిగట్టిన దుండగులు దారికాచారు. అర్ధరాత్రి సమయంలో ఇన్నోవా కారులో సినీ ప్రముఖులు డీవీవీ దానయ్య, కోన వెంకట్, ప్రవీణ్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో షాద్‌నగర్ బైపాస్ రహదారికి రాగానే చెట్టుకొమ్మలను రోడ్డుకు అడ్డుగావేసి అడ్డగించారు. వాహనం నిలపగానే మారణాయుధాలతో  భయభ్రాంతులకు గురిచేసి వారి ఒంటిపై ఉన్న దాదాపు రూ.మూడులక్షల బంగారు ఆభరణాలను దోచుకొని పరారయ్యారు.

    విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టుకొమ్మలను తొలగించారు. పోలీసులపై సినీప్రముఖులు చిందులు వేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని షాద్‌నగర్ పోలీసులు గోప్యంగా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement