
ఒంటరి మహిళలే లక్ష్యంగా చోరీలు
అప్రమత్తంగా ఉండాలని సీఐ విజయకృష్ణ సూచన
తడ: ఒంటరిగా ఇంట్లో ఉండే మహిళలనే లక్ష్యంగా చేసుకుని హత్యలు, దోపిడీలకు పాల్పడే వ్యక్తిని గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలని సూళ్లూరుపేట సీఐ టీ విజయకృష్ణ కోరారు. సోమవారం స్థానిక పోలీస్ ష్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ బిక్షగాడిలా అవతారం వేసుకుని ఇంట్లో ఎవరూ లేకుండా మహిళలు మాత్రమే ఉన్న సమయంలో చెల్లి పెళ్లి ఉందని చీరలు, ఇతర దుస్తులు ఇవ్వాలంటూ మభ్య పెట్టి కత్తితో చంపి అందినకాడికి నగలు, విలువైన వస్తువులు దోచుకువెళ్లే సత్తెనపల్లికి చెందిన కుంచెల నాగరాజు అనే వ్యక్తి సంచరిస్తున్నట్లు చెప్పారు. అనుమానంవస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.