exploitation
-
యూరియా కావాలా?.. ఇతర ఎరువులు కొనాల్సిందే.. కంపెనీల దోపిడి..
ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ వస్త్ర,వస్తు తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగేదే. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఇది కొంటేనే అదిస్తామంటూ షరతులు పెడుతున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో డీలర్లు రైతులపై ఇదే పద్ధతిలో ఒత్తిడి తెస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు తమకు అవసరం లేకపోయినా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి రైతులు నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ముఖ్యంగా యథేచ్ఛగా ఎరువుల వినియోగంతో ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్లతో రూ.కోట్ల అక్రమార్జన యూరియా అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెట్టి మరీ యూరియాయేతర ఎరువుల అమ్మకాలు చేయిస్తున్నాయి. టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్‌లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిసార్లు విదేశీ పర్యటనలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. రూ.1.10 లక్షల విలువ చేసే 445 బస్తాల యూరియా ఇవ్వాలంటే రూ.4.40 లక్షల విలువ చేసే 400 బస్తాల 20/20/013 రకం కాంప్లెక్స్ ఎరువులు కొనాలనే నిబంధన విధిస్తున్నారు. దీంతో డీలర్లు యూరియా కోసం మార్కెట్లో రైతులకు అంతగా అవసరం లేని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలను కూడా కొంటున్నారు. ఇలా కంపెనీలు ఏడాదికి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు డీలర్లు ఇందుకు నిరాకరించడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు యూరియా సక్రమంగా లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతో పాటు ఫలానా ఎరువు, పురుగుమందు వాడితే ప్రయోజనం ఉంటుందని కంపెనీలు, డీలర్లు మభ్యపెడుతుండటంతో రైతులు అమాయకంగా వాటిని కొంటున్నారు. వాస్తవానికి యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులకు లింక్ పెట్టి విక్రయించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశం మేరకే యూరియా కేటాయింపులు జరగాలి. కానీ డీలర్లు ఈ విధంగా లింక్ పెడుతూ ఇతర ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారని తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా మండల వ్యవసాయాధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువులను, పురుగుమందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నాయి. మరోవైపు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కూడా కంపెనీలు వదలడంలేదు. యూరియాలో 20 శాతం ఈ సేవా కేంద్రాలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న కొన్ని యూరియా కంపెనీలు 20/20/013 ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు తగు చర్యలు తీసుకుని డీలర్లు ఒక ఎరువుతో మరొక ఎరువుకు లింకు పెట్టకుండా చూడాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
భారీ దోపిడికి పక్కా ప్లాన్.. ట్విస్ట్ మూములుగా లేదుగా
సాక్షి, బరంపురం( భువనేశ్వర్): జాతీయ రహదారిలో భారీ దోపిడీకి వ్యూహ రచన చేసిన దుండగుల ముఠాను పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. వీరంతా ఇప్పటికే పదుల సంఖ్యలో వివిధ నేరాల్లో శిక్ష అనుభవించి, విడుదలైన వారని తెలియడంతో స్థానికంగా సంచలనం రేపింది. ఐఐసీ అధికారి సుమిత్‌సరన్ అందించిన సమాచారం ప్రకారం... గంజాం జిల్లా గుసానినువాగం పోలీస్ స్టేషన్ పరిధి కొజిరిపడా సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న వంతెన వద్ద మంగళవారం అర్ధరాత్రి భారీ దోపిడీకి దుండగులు పథకం పన్నారు. ఇదే సమయంలో గుసానినువాగం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా.. అనుమానాస్పదంగా కొందరు తిరుగాడటంతో వెంబడించారు. దుండగులు తప్పించుకొనే ప్రయత్నంగా చేయగా.. వారందరినీ చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 32 సెల్ఫోన్లు, 3 నాటుబాంబులు, నాటు తుపాకి, 3 తూటాలు, ఇనుపరాడ్లు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో టైగర్ నొనియా, చోటుకుమార్ నొనియా, రాహుల్‌కుమార్, చందన్ నొనియా, రాజ్‌కుమార్ నొనియా, రొహన్‌కుమార్ నొనియా, బిజయ్‌దాస్, అనుక్‌కుమార్, సహిర్‌ఖాన్‌గా గుర్తించారు. పట్టుబడిన వారంతా ఝార్కండ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా.. మరో దుండగుడు భువనేశ్వర్ బాలకొటి చెందిన నేరస్థుడుగా వెల్లడించారు. అరెస్టయిన వారిపై గతంలో బరంపురం జిల్లా పరిధిలోని పెద్ద బజార్, బీఎన్‌పూర్ పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయన్నారు. వాటికి సంబంధించి శిక్ష అనుభవించి, జైలు నుంచి బయటకు వచ్చిన వారేనని వివరించారు. ఈ నేపథ్యంలో నిందుతులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఐఐసీ అధికారి తెలిపారు. -
వర్మ సినిమాకు ఎందుకు సైన్ చేశానా అనిపించింది..
నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే నటి రాధికా ఆప్టే డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసింది. రక్తచరిత్ర సినిమా సమయంలో తన సమయాన్ని బాగా వాడుకున్నారని, తన పనికి తగ్గ రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదని చెప్పింది. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన రక్తచరిత్ర సినిమాలో రాధికా ఆప్టే నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె డీ గ్లామరస్ రోల్లో కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె రక్తచరిత్ర షూటింగ్ సమయంలో తాను ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురయ్యాననే ఫీలింగ్ కలిగిందని తెలిపింది. 'నేను మూవీ ఒప్పుకునేటప్పుడు కేవలం తెలుగు వెర్షన్ అని చెప్పారు. అందుకు తగ్గట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారు. తీరా సెట్స్‌లోకి వెళ్లాకా సినిమాను తెలుగు, తమిళంలో షూట్ చేశారు. అంటే రెండు సినిమాలకు పనిచేసినట్టే. ఇందుకు తగ్గట్లు గానే నాకు రెమ్యూనరేషన్ ఇవ్వాలి కానీ అలా జరగలేదు. ఇక ఈ సినిమాలో పెద్ద స్టార్స్ నటించడంతో షూటింగ్ కూడా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో తెలిసేది కాదు. ఈ మూవీ కోసం నేను చాలా సమయాన్ని కేటాయించాను. అయితే నా టాలెంట్‌కి, నా సమయానికి విలువ లేదనిపించింది. నిజానికి వర్మ రూపొందించిన రంగీలా, సత్య చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలతో వర్మకు ఫ్యాన్ అయ్యా. అందుకే ఆయనతో పనిచేస్తే కొత్త విషయాలు నేర్చుకోవచ్చని భావించాను. కానీ ఆ తర్వాత మాత్రం రక్త చరిత్ర సినిమాకు ఎందుకు సైన్ చేశానా అనిపించింది' అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ప్రస్తుతం ఆర్జీవీపై రాధికా ఆప్టే చేసిన ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. చదవండి : అలా ఆమిర్ ఖాన్‌తో మనస్పర్థలు వచ్చాయి: ఆర్జీవీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అరియానా గ్రాండె -
ముప్పు ముంగిట వన్యప్రాణులు
వన్యప్రాణులు ముప్పు ముంగిట మనుగడ సాగిస్తున్నాయి. వాటికి సహజ ఆవాసాలైన అడవులను స్వార్థపరులైన మనుషులు ఆక్రమించుకుంటూ ఉండటంతో అవి ఆవాసాన్నే కాదు, అర్ధంతరంగా ఆయువునూ కోల్పోతున్నాయి. గడచిన యాభయ్యేళ్ల కాలంలో భూమ్మీద మనుషుల జనాభా రెట్టింపును మించి పెరిగింది. ఇదే కాలంలో వన్యప్రాణుల జనాభా మూడింట రెండు వంతులకు పైగా తగ్గిపోయింది. కొన్ని జాతుల వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇంకొన్ని అంతరించిపోయే దశలోకి చేరుకున్నాయి. ఇదే రీతిలో వన్యప్రాణులు మరింతగా కనుమరుగైతే, పర్యావరణ సమతుల్యత దారుణంగా దెబ్బతిని, ఆ పరిస్థితి మనుషుల మనుగడకే ముప్పుగా మారే ప్రమాదం లేకపోలేదు. వన్యప్రాణుల మనుగడకు సంబంధించి ఇటీవల విడుదలైన ‘లివింగ్ ప్లానెట్ ఇండెక్స్’ నివేదిక ఆందోళన కలిగించేదిగా ఉంది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇంటర్నేషనల్, జువాలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ సహకారంతో ‘లివింగ్ ప్లానెట్ ఇండెక్స్’–2020 తన నివేదికను రూపొందించింది. భూగోళంపై నివసించే సమస్త వన్యప్రాణులనూ ఇందులో లెక్కలోకి తీసుకోకపోయినా, వెన్నెముక గల 4000 వేల వన్యజంతువుల జాతులను పరిగణనలోకి తీసుకుంది. వీటి సంఖ్య 1970 నాటితో పోల్చితే 2016 నాటికి సగటున 68 శాతం మేరకు తగ్గిపోయింది. వ్యవసాయ విస్తరణ, అడవుల నరికివేత పెరగడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ‘లివింగ్ ప్లానెట్ ఇండెక్స్’ వెల్లడించింది. కోట్లాది సంవత్సరాలుగా భూమిపై మనుగడ సాగిస్తున్న వన్యజీవులు కేవలం అర్ధశతాబ్ది వ్యవధిలోనే ఈ స్థాయిలో తగ్గిపోవడమంటే, ఈ పరిణామాన్ని రెప్పపాటు కాలంలో సంభవించిన మార్పుగా పరిగణించాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్ మార్కో లాంబెర్టిని అభిప్రాయపడ్డారు. బార్బరీ లయన్, బాక్ట్రియన్ ఒంటె ఎందుకు ఈ పరిస్థితి..? గడచిన అర్ధశతాబ్ది కాలంలోనే వన్యప్రాణుల సంఖ్య ఇంత దారుణంగా తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇదే కాలంలో మనుషుల జనాభా రెట్టింపును మించి పెరిగింది. మనుషుల వినిమయం అంతకు మించి పెరిగింది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇంటర్నేషనల్ చెబుతున్న ప్రకారం– భూమికి గల తన సహజ వనరుల పునరుత్పాదక శక్తితో పోలిస్తే, 1970 సంవత్సరానికి ముందు వరకు మానవుల పర్యావరణ అడుగుజాడలు తక్కువగానే ఉండేవి. అందువల్ల మనుషులు అటవీ సంపదను వాడుకుంటూ వచ్చినా, అప్పట్లో అంతగా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడైతే మనుషులు భూమికి గల సహజ వనరుల పునరుత్పాదన సామర్థ్యానికి మించి ఒకటిన్నర రెట్లు ఎక్కువగా సహజ వనరులను ఇష్టానుసారం వాడేసుకుంటున్నారు. గడచిన యాభై ఏళ్లలో భారీగా పెరిగిన పరిశ్రమలు అడవులను, గడ్డిభూములను వ్యవసాయ క్షేత్రాలుగా మార్చేయడం గణనీయంగా పెరిగింది. దీనికి తోడు పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం, తరచుగా అడవుల్లో చెలరేగుతున్న కార్చిచ్చులు వన్యప్రాణులను వేగంగా హరించేస్తున్నాయి. ప్రస్తుతం భూమిపైనున్న స్థలభాగంలో మూడోవంతు, మంచినీటి వనరుల్లో నాలుగింట మూడువంతులు కేవలం ఆహార ఉత్పాదన కోసమే వినియోగమవుతున్నాయి. మనుషులు మనుగడ సాగిస్తున్న భూమిపై ఈ పరిస్థితి ఉంటే, సముద్రాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. సముద్రాల్లోని మత్స్యవనరులను మనుషులు వినియోగించుకోవాల్సిన దాని కంటే 75 శాతం అదనంగా వినియోగించుకుంటున్నారు. కరీబియన్ మాంక్ సీల్, టాస్మానియన్ టైగర్ కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం భూమిపైనున్న వన్యప్రాణులు కొన్ని ప్రాంతాల్లో మరింత వేగంగా కనుమరుగైపోతున్నాయి. ముఖ్యంగా మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఈ ప్రాంతాల్లో గడచిన యాభై ఏళ్లలో వన్యప్రాణుల సంఖ్య ఏకంగా 94 శాతం మేరకు తగ్గిపోయింది. ఇలాంటి పరిణామం కచ్చితంగా మన ప్రపంచంపై ప్రభావం చూపుతుందని లాంబెర్టిని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న నలభై స్వచ్ఛంద సంస్థలు, విద్యా పరిశోధన సంస్థలు వేర్వేరుగా జరిపిన అధ్యయనాల్లోని సమాచారాన్ని క్రోడీకరించుకుని, ‘లివింగ్ ప్లానెట్’ తన నివేదికలోని సమాచారాన్ని సవరించుకుని, ఇటీవలే దానిని విడుదల చేసింది. ఈ నివేదికను ‘ద నేచర్’ జర్నల్ ప్రచురించింది. ఇందులో వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలన్నీ తక్షణమే చేపట్టవలసిన చర్యలను కూడా సూచించింది. ‘‘ఈ పరిస్థితిపై మనం తక్షణమే స్పందించాలి. జీవ వైవిధ్యం నాశనమవుతున్న వేగంతో పోల్చుకుంటే, ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల వల్ల మొదలైన జీవ వైవిధ్య పునరుద్ధరణ వేగం చాలా తక్కువగా ఉంటోంది. ఇక ఏమాత్రం జాప్యం చేసినా మానవాళి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. జీవ వైవిధ్యాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురావాలంటే కొన్ని దశాబ్దాల కాలం పట్టవచ్చు’’ అని ‘లివింగ్ ప్లానెట్’ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుడు డేవిడ్ లీక్లీర్ ఆందోళన వ్యక్తం చేశారు. వేటాడి చంపేస్తున్నారు అరుదైన వన్యప్రాణులను సైతం వేటగాళ్లు వేటాడి చంపేస్తున్నారు. ఇదివరకటితో పోలిస్తే, మాంసం కోసం వన్యప్రాణుల వేట గత యాభయ్యేళ్లలో గణనీయంగా పెరిగింది. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 లక్షల టన్నుల వన్యప్రాణుల మాంసం అక్రమ మార్కెట్లకు తరలుతోంది. కేవలం బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల నుంచి 2 వేల కోట్ల డాలర్ల (రూ.1.47 లక్షల కోట్లు) విలువ చేసే వన్యప్రాణుల మాంసం ఇతర దేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతోంది. వ్యక్తిగత లగేజీల్లో దాచి ఇలా తరలిస్తుండగా పారిస్ ఎయిర్‌పోర్టులో ఏటా పట్టుబడే వన్యప్రాణుల మాంసం 260 టన్నుల వరకు ఉంటోంది. ఇక మిగిలిన అంతర్జాతీయ విమానాశ్రయాలకు, నౌకాశ్రయాలకు చేరుతున్న మాంసం ఏ పరిమాణంలో ఉంటుందో ఊహించుకోవాల్సిందే! ఇవి ఇప్పటికే అంతరించాయి అడవుల నరికివేత, కార్చిచ్చులు, కాలుష్యం, వేట తదితర కారణాల వల్ల ఇప్పటికే చాలా వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగై పోయాయి. గడచిన వందేళ్లలో దాదాపు 500 జాతులకు చెందిన జంతువులు, పక్షులు అంతరించిపోయాయి. గోల్డెన్ టోడ్ (బంగారు వన్నె కప్ప), రామచిలుకల జాతికి చెందిన కరోలినా పారాకీట్, కోడి జాతికి చెందిన హీత్ హెన్, కంగారు తరహా జాతికి చెందిన టాస్మానియన్ టైగర్, పెద్దపులుల్లో ఒక జాతి అయిన కాస్పియన్ టైగర్, కరీబియన్ మాంక్ సీల్, ఖడ్గమృగం జాతికి చెందిన వెస్టర్న్ బ్లాక్ రినో, పింటా ఐలాండ్ తాబేలు, సింహాల జాతిలో అరుదైన బార్బరీ లయన్, షోంబర్క్ జింకలు వంటివి గత వందేళ్లలోనే ఉనికిలో లేకుండా పోయాయి. క్లౌడెడ్ చిరుతపులి, పంగోలిన్ భారత్‌లో వన్యప్రాణుల పరిస్థితి గడచిన శతాబ్ద కాలంలో మన భారత్‌లో కూడా కొన్ని జంతువులు పూర్తిగా కనుమరుగైపోయాయి. వాటిలో చిరుత జాతికి చెందిన ఇండియన్ చీతా, అడవి దున్నల జాతికి చెందిన ఇండియన్ అరోక్, సుమత్రా ఖడ్గమృగాలు, శివాతెరియం (దీనిని శివుడి వాహనంగా భావించేవారు) వంటి భారీ జంతువులు సైతం అంతరించిపోయాయి. భారత్‌లో నెలకొన్న పరిస్థితులు వన్యప్రాణుల మనుగడకు నానాటికీ ప్రమాదకరంగా మారుతున్నాయి. వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రభుత్వం 1972లో వన్యప్రాణుల పరిరక్షణ చట్టాన్ని అమలులోకి తెచ్చినా, మాంసం కోసం, జంతు శరీర భాగాల కోసం వన్యప్రాణుల వేట జరుగుతూనే ఉంది. చట్ట ప్రకారం వన్యప్రాణుల వేట, తరలింపు వంటి చర్యలను శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తున్నా, వేటగాళ్లు వీటిని బేఖాతరు చేస్తూ, యధేచ్ఛగా వన్యప్రాణులకు ముప్పు తెచ్చిపెడుతున్నారు. జీవవైవిధ్యం గల దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచంలోని 6.5 శాతం వన్యప్రాణులు భారత్‌లోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గల స్తన్యజీవుల్లో 7.6 శాతం, పక్షిజాతుల్లో 12.6 శాతం భారత్‌లో కనిపిస్తాయి. భారత్‌లో ఎక్కువగా వేటగాళ్ల బారిన పడుతున్న వాటిలో పెద్దపులులు, ఖడ్గమృగాలు, ఏనుగులు, నక్షత్ర తాబేళ్లు వంటివి ఉంటున్నాయి. చర్మం కోసం, పంజా, గోర్లు, ఇతర శరీర భాగాల కోసం వేటగాళ్లు పెద్దపులులను వేటాడుతున్నారు. చైనీస్ సంప్రదాయ వైద్యంలో పెద్దపులి శరీర భాగాలకు విపరీతమైన గిరాకీ ఉంది. దంతాల కోసం ఏనుగులను, కొమ్ముల కోసం ఖడ్గమృగాలను పొట్టన పెట్టుకుంటున్నారు. వీటిని గృహాలంకరణలుగా వాడటంపై రకరకాల నమ్మకాలు ప్రచారం ఉండటంతో వీటికీ గిరాకీ ఎక్కువగానే ఉంటోంది. ఫెంగ్‌షుయి నమ్మకాల కారణంగా కొన్ని దేశాల్లో నక్షత్ర తాబేళ్లను పెంచుకుంటున్నారు. సాధారణంగా వీటిని సజీవంగానే విదేశాలకు తరలిస్తుంటారు చైనా, మలేసియా, ఇండోనేసియా వంటి దేశాల్లో పులులు, ఖడ్గమృగాల శరీర భాగాలకు విపరీతమైన గిరాకీ ఉండటంతో అక్రమ మార్గాల గుండా వీటిని తరలిస్తున్నారు. ఇదివరకటి కాలంలో అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు ఉచ్చులు, మామూలు తుపాకులు ఎక్కువగా వాడేవారు. ఇటీవలి కాలంలో భారీ జంతువులను వేటాడటానికి అధునాతనమైన తుపాకులతో పాటు కొందరు పశువైద్యులు జంతువులకు శస్త్రచికిత్సలు చేసేటప్పుడు వాడే మత్తుమందులు, విషం సైతం వినియోగించి, జంతువులను మట్టుబెడుతున్నారని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) వెల్లడించింది. భారతీయ ఖడ్గమృగాలు (ఇండియన్ రినో) ఒకప్పుడు పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ భూభాగాల్లో విరివిగా కనిపించేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 2,500 లోపే ఉండటంతో అతి అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని అడవుల్లో వేటగాళ్లు వేటాడిన జంతు శరీర భాగాల స్మగ్లింగ్ ఉత్తర భారత రాష్ట్రాలు కేంద్రంగా సాగుతోంది. ఈ రాష్ట్రాల్లోని కొనుగోలుదారులు వేటగాళ్ల నుంచి వీటిని కొనుగోలు చేసి, నేపాల్‌కు తరలించి, అక్కడి నుంచి వివిధ మార్గాల్లో చైనా, మలేసియా, ఇండోనేసియా తదితర దేశాలకు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. వన్యప్రాణుల వేటను, అక్రమ తరలింపును కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుంటే, మరిన్ని వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితులు ఉన్నాయని ఐయూసీఎన్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రమాదం అంచున ఉన్న జంతుజాతులు ‘భూమిపై నివసించే స్తన్యజీవుల్లో 301 జాతులకు చెందిన జంతువులు ప్రమాదం అంచున ఉన్నాయి. వీటి పరిరక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోకుంటే త్వరలోనే ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రమాదం అంచుల్లో ఉన్న ఈ జంతుజాతుల్లో లోలాండ్ గొరిల్లా, మాండ్రిల్ సహా 168 జాతులకు చెందిన వానరాలు, జడల బర్రె, బాక్ట్రియన్ ఒంటె సహా 73 జాతులకు చెందిన గిట్టలు గల జంతువులు, 27 జాతులకు చెందిన గబ్బిలాలు, క్లౌడెడ్ చిరుతపులి, కొన్నిరకాల ఎలుగుబంట్లు సహా 12 జాతులకు చెందిన మాంసాహార జంతువులు, ఎనిమిది జాతులకు చెందిన పంగోలిన్, కంగారూ జాతికి చెందిన 26 రకాల జంతువులు, ఆల్పైన్ వూలీ ర్యాట్ సహా ఎలుక జాతికి చెందిన 21 రకాల జంతువుల సంఖ్య గడచిన యాభై ఏళ్లలో గణనీయంగా క్షీణించింది. ప్రస్తుతం ఇవి దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్’ వెల్లడించింది. ఈ జంతువులను తన ‘రెడ్‌లిస్ట్’లో చేర్చింది. గణనీయంగా వీటి తరుగుదలకు అడవులు తరిగిపోవడమే కాకుండా, ఇష్టానుసారం సాగిస్తున్న వేట కూడా కారణమవుతోందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ మెక్‌డొనాల్డ్ చెబుతున్నారు. మాంసం కోసం, జంతువుల శరీర అవయవాల కోసం వీటిని వేటాడటం గత యాభై ఏళ్లలో బాగా ఎక్కువైందని, ఇదే పరిస్థితి కొనసాగితే ‘రెడ్‌లిస్ట్’లో ఉన్న వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగవడానికి ఎంతోకాలం పట్టదని ఆయన హెచ్చరిస్తున్నారు. -
‘కార్పొరేట్’ దందా!
దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వర్షశ్రీ చైతన్యపురిలోని ఓ కార్పొరేట్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ప్రతిరోజు ఆన్ లైన్ క్లాస్‌లకు హాజరవుతోంది. రెండ్రోజుల క్రితం ఆన్ లైన్ క్లాస్ పూర్తయ్యే సమయంలో ‘స్కూల్లో మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో పుస్తకం రూ.1,500 డబ్బులు చెల్లించి వాటిని తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి’అని క్లాస్ టీచర్ సూచించారు. దీంతో మాడ్యూల్స్ కొనుగోలు చేసేందుకు వర్షశ్రీ తల్లిని ఒత్తిడి చేసి స్కూల్‌కు వెళ్లి మాడ్యూల్స్ కొనుగోలు చేసింది. సాక్షి, హైదరాబాద్ : కరోనా వేళ ప్రైవేటు పాఠశాలలు సరికొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాయి. కోవిడ్–19 కారణంగా పాఠశాలలు మూత బడటంతో విద్యార్థులకు ఆన్ లైన్ లో బోధన సాగిస్తున్న యాజమాన్యాలు.. ఇప్పుడు అభ్యసనా కార్యక్రమాల కింద ప్రత్యేకంగా మాడ్యూల్స్ రూపొందించి విక్ర యిస్తున్నాయి. వాస్తవా నికి పాఠ్య పుస్తకాల్లో ఉన్న అంశాలనే ఇందులో ప్రస్తావించినప్ప టికీ.. ముఖ్యమైన అంశాలను వరుసగా చేర్చి పుస్తక రూపంలో మాడ్యూల్స్ పేరిట తీసుకు వస్తున్నాయి. కొన్ని పాఠశాలలు ఒక్కో సబ్జె క్టుకు ఒక్కో మాడ్యూల్‌ను రూపొందిం చగా... మరికొన్ని పాఠశాలలు లాంగ్వేజెస్ ను ఒక పుస్తకంగా, మిగతా సబ్జెక్టులను మరో పుస్త కంగా తీసుకువచ్చాయి. వీటి ధర లను రూ.1,500–3,000 వరకు నిర్ధేశించి విద్యా ర్థులకు అంటగడుతున్నాయి. హైస్కూల్ విద్యార్థులకే... ప్రస్తుతం పాఠశాలల్లో ఎక్కువగా హైస్కూల్ పిల్లలకే ఈ మాడ్యూల్స్ రూపొందించాయి. 8, 9, 10 తరగతుల విద్యార్థుల సబ్జెక్టుల ఆధారంగా ఈ స్పెషల్ బుక్స్‌ను అందు బాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాలను పాఠశాల యాజమాన్యాలే ముద్రిస్తుండటంతో వారు నిర్ధేశించిన ధరలే అచ్చు రూపంలో వస్తున్నాయి. విద్యార్థులకు పాఠ్యాంశం అభ్యసన కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్రాక్టీస్ మంచిదే అయినా.. ఇంతపెద్ద మొత్తంలో ధరలు నిర్ధేశించి దండుకోవడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. రూ.వంద కూడా వెలకట్టలేని పుస్తకాలపై వేల రూపాయలు డిమాండ్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైౖ వేటు పాఠశాలలపై విద్యాశాఖ అజమాయిషీ కోల్పోతోందని, ఫలితంగా యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అన్నింటినీ వ్యాపార కోణంలో సాగిస్తున్నాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
హైవేపై దోచుకునే కంజారా ముఠా అరెస్ట్
సాక్షి, కర్నూలు: జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలనే టార్గెట్‌గా చేసుకుని.. దోచుకునే కరుడుగట్టిన దోపిడీ దొంగల ముఠా గుట్టును కర్నూలు జిల్లా పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను గురువారం పోలీసులు వలపన్ని హైవేపై సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు. దోపిడీ దొంగల ముఠాను మధ్యప్రదేశ్‌కు చెందిన కంజారా ముఠాగా గుర్తించిన పోలీసులు.. వారి నుంచి 85 మొబైల్ ఫోన్లు, పట్టుచీరలు, 2 లారీలు, మరణాయుధాలతో పాటు ఔషధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైవేపై కొరియర్ వాహనాలనే లక్ష్యంగా చేసుకుని.. దాడి చేసి కొల్లగొట్టే కంజారా ముఠా ఇప్పటివరకూ కర్నూలు జిల్లాలో నాలుగు చోట్ల దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ముందు లిఫ్టు అడిగి.. వెనకాలే ఆటోలో వచ్చి..!
సాక్షి, జడ్చర్ల: రహదారులపై వెళ్తున్న ద్విచక్రవాహనాలను లిఫ్టు అడిగి కొంతదూరం వెళ్లాక ఆపి చోరీకి పాల్పడే దారి దోపిడీ దొంగల ముఠాను పట్టుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వీరస్వామి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. అఖిల్ కృష్ణ, అంకం భాస్కర్, పాస్టం కల్యాణ్, రాపల్లె చంద్రుడు, వడిత్యావత్ శివ, శివగళ్ల రాజ్‌కుమార్, నాయిడు దుర్గరాజ్‌కుమార్‌లు ఓ ముఠాగా ఏర్పడి ఆటోలో ప్రయాణిస్తూ దారిపై ఒంటరిగా వస్తున్న మోటార్‌బైక్‌లను ఆపుతారు. బైక్ ఆపితే వారిలో ఒకరు దానిపై ఎక్కి కొద్ది దూరం వెళ్లాక బైక్‌ను ఆపడం ఆ వెంటనే వెనకగా ఆటోలో వచ్చిన మిగతా దొంగలు అందరూ కలిసి లిఫ్టు ఇచ్చిన వ్యక్తి దగ్గర ఉన్న బైక్, నగదు, మొబైల్ ఫోన్ తదితర సొత్తును దోచుకుని పరారవుతారు. ఈ క్రమంలో ఈ నెల 10న బూర్గుపల్లికి చెందిన కుమ్మరి రాములు బైక్‌పై వస్తుండగా లిఫ్టు అడిగి నాగసాల గ్రామ శివారులో ఆపి అతని దగ్గర రూ.1,800 నగదు, సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యారు. ఈ విషయమై బాధితుడు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెళ్లడించారు. ఈ క్రమంలో మంగళవారం వాహనాలను స్థానిక నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం బయటపడిందన్నారు. అంతకు ముందు తిమ్మాజిపేట మండలంలో కూడా ఇదే విధంగా లిఫ్టు ఆపడం, కొద్ది దూరం వెళ్లాక బైక్ ఆపడం వెనువెంటనే వెనుకగా ఆటోలో వచ్చి బెదిరించి బైక్, సొమ్ము తదితర సొత్తును దోచుకెళ్లినట్లు చెప్పారు. నిందితుల నుంచి మూడు బైక్‌లు, ఆటో, మొబైల్ ఫోన్, రూ.1,200 నగదు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. ఉపాధి నిమిత్తం జడ్చర్లకు వచ్చి టిఫిన్ సెంటర్ తదితర ఉపాధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. వీరికి బాదేపల్లికి చెందిన యువకులు కూడా సహకరించి చోరీలకు పాల్పడినట్లుగా గుర్తించారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుళ్లు మహేందర్, మహమూద్, కానిస్టేబుళ్లు బేగ్, శంకర్, రఘునాథ్‌రెడ్డి, బాబియా తదితరులు పాల్గొన్నారు. -
కొత్త తరహా దోపిడీకి బిల్ కలెక్టర్ల తెర
సాక్షి, వనపర్తి: వనపర్తి పురపాలికలో కుళాయి బిల్లుల చెల్లింపులో కొత్త తరహా దోపిడీకి కొందరు మున్సిపల్ అధికారులు తెరలేపారు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా రూ.వేలకు వేలు కాజేస్తున్నారు. పుర ఆదాయానికి గండికొడుతూ తమ జేబులను నింపుకుంటున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వనపర్తి పురపాలికలో కుళాయి బిల్లుల చెల్లింపులో కొత్త తరహా దోపిడీకి కొందరు మున్సిపల్ అధికారులు తెరలేపారు. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా రూ.వేలకు వేలు కాజేస్తున్నారు. పుర ఆదాయానికి గండికొడుతూ కొందరు అధికారులు తమ జేబులను నింపుకుంటున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమాయక ప్రజలే లక్ష్యంగా ప్రతినెలా రూ.వేలల్లో పుర ఆదాయానికి గండికొడుతున్నారు. నల్లా కనెక్షన్ తీసుకున్న వారు ప్రతినెలా రూ.100 మునిసిపాలిటీకి విధిగా చెల్లించాలి. కానీ పురపాలక అధికారులు బకాయి వసూళ్లలో ఆలసత్వం ప్రదర్శించడం వల్ల ఏళ్ల తరబడి పేరుకుపోయాయి. ఈనేపథ్యంలోనే ఒకేసారి రూ.5వేలు, రూ.10వేలు, రూ.20వేలు చెల్లించేందుకు వస్తుంటారు. తప్పుడు లెక్కలతో ఈ ఆదాయాన్ని కొందరు పురపాలికకు దక్కకుండా చేస్తున్నారు. ఈ వ్యవహారం ‘సాక్షి’ నిఘాతో బయటపడింది. దోపిడీ ఇలా.. నల్లా యజమానులు 2, 5, 10, 15ఏళ్ల నల్లా బకాయి చెల్లించేందుకు మునిసిపాలిటీకి వస్తే బిల్లు స్వీకరించే అధికారులు మాయ చేస్తున్నారు. 2019మార్చి నుంచి బిల్లు ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిందని చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి 2020 మార్చివరకు బిల్లును ఆన్లైన్లోనే తీసుకుంటామని అంటున్నారు. డబ్బుచెల్లిస్తే రశీదు కూడా ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ట్విస్ట్ ఇక్కడే మొదలవుతోంది. ఈ ఏడాది కంటే ముందు మీరు నల్లా కనెక్షన్ తీసుకున్నారు కాబట్టి అంతకుముందు సంవత్సరాల బిల్లులను మ్యాన్వల్ రశీదులో రాసిస్తామంటూ డబ్బులు తీసుకుంటున్నారు. ఎంత చెల్లించారో అంత రశీదు కూడా ఇస్తున్నారు. కానీ అధికారుల వద్ద ఉన్న మ్యాన్వల్ రికార్డుల్లో రూ.వేలల్లో బిల్లు తీసుకుని రూ.వందల్లో నమోదు చేస్తున్నారు. మిగతా డబ్బులను కాజేస్తున్నారు. ఒకే నంబర్లతో ఉండే రెండు బిల్లు బుక్కులు వారివద్ద పెట్టుకుంటున్నారు. వాస్తవంగా అధికారులు ఒకేసారి కార్బన్ సాయంతో బిల్లు రాయాల్సి ఉంటుంది. కానీ అలా రాయడం లేదు. ఇలా కొత్తదందాకు తెరలేపారు. భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బందులే.. ఈ వ్యవహారం వల్ల ఇప్పటికే బిల్లులు చెల్లించిన వారికి భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవనున్నాయి. బిల్లు చెల్లించినట్లు రశీదుతో ప్రజలు పుర కార్యాలయానికి వచ్చి చూడలేరనే ధైర్యంతో ప్రజలకు ఇచ్చే రశీదులో ఒకలా, అధికారుల వద్ద ఉండే రశీదులో మరోలా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం నల్లాబిల్లుల చెల్లింపు కౌంటర్ వద్ద వసూలు చేసే అధికారులు భవిష్యత్‌లో బదిలీ అయినా లేదా మరో ఏదైనా సమస్య ఉత్పన్నం అయినా ప్రజలకే ఇబ్బందులు రానున్నాయి. నల్లా బిల్లుల కౌంటర్ వద్ద ఉండే అధికారులు కొందరు గ్రూప్‌గా ఏర్పడి ఈ తంతంగం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వనపర్తిలో మొత్తం 10వేల వరకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు 7,500 ఆన్లైన్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా వాటి వివరాలు సరిగా లేకపోవడంతో వాటి నమోదుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వెలుగులోకి వచ్చింది ఇలా వనపర్తికి చెందిన తెలుగు సుకన్య 2012 సంవత్సరం నుంచి నల్లాబిల్లు చెల్లించలేదు. నెలకు రూ.100 చొప్పున మొత్తం రూ.9,600 బిల్లు చెల్లించేందుకు ఈనెల 5న మునిసిపాలిటీకి వచ్చింది. అధికారులు 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చివరకు రూ.1,300 బిల్లు రశీదును ఆన్లైన్ ద్వారా కట్ చేశారు. మిగతా రశీదులో గత సంవత్సరాలకు సంబంధించి రూ.8,700 ముట్టినట్లు రశీదు నంబర్ 005560 రాసి ఇచ్చారు. అధికారుల వద్దఉన్న బిల్బుక్కులో అదే నంబర్ రశీదులో మాత్రం రూ.200 మాత్రమే ముట్టినట్లు రాసుకున్నారు. రికార్డులోనూ రూ.200 రాశారు. విచారిస్తాం.. నల్లా బకాయిల సేకరణలో పూర్తిగా డబ్బులు తీసుకుని, రికార్డులో తక్కువగా నమోదు చేయడం వంటివాటికి తావుండదు. ఒకవేళ పూర్తిగా డబ్బులు తీసుకుని తక్కువగా నమోదు చేస్తే తప్పకుండా విచారణ చేస్తాం. వాస్తవమని తేలితే చర్యలు తీసుకుంటాం. – రజినీకాంత్‌రెడ్డి, పుర కమిషనర్, వనపర్తి -
సాధారణ పౌరుడిగానే సవాలు విసిరా
న్యూఢిల్లీ: తన ఆధార్ వివరాలు దుర్వినియోగం చేసి చూపాలని నెటిజన్లకు సవాలు విసిరిన టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఆదివారం వెనక్కు తగ్గారు. తాను ఓ సాధారణ భారతీయుడిగానే ఈ సవాలు విసిరాననీ, ట్రాయ్ చైర్మన్‌గా కాదని వివరణ ఇచ్చారు. సమాచార గోప్యతపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో.. పౌరుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం ఆధార్ చట్టానికి సవరణలు చేయాలని ఆదేశించింది. దీంతో తన ఆధార్ నెంబర్‌ను బయటకు వెల్లడించిన శర్మ.. దమ్ముంటే దాన్ని దుర్వినియోగం చేయాలని సవాలు విసిరారు. శర్మ సవాలుకు స్పందించిన పలువురు హ్యాకర్లు.. ఆధార్‌తో లింక్ అయిన 2 ఈ–మెయిల్స్, ఫోన్ నంబర్, పాన్, వ్యక్తిగత చిరునామా, ఎయిర్ఇండియా ఆయనకు కేటాయించిన ఫ్రీక్వెంట్ ఫ్లయర్ నంబర్(103546250)ను బయటపెట్టారు. కొందరైతే ఆయన నంబర్‌తో నకిలీ ఆధార్‌ను తయారుచేసి ఫేస్బుక్, అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్‌లో రిజిస్టర్ కాగా, మరికొందరు ఆయనకు ఖరీదైన మొబైల్ ఫోన్లను క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ పెట్టి కసి తీర్చుకున్నారు. -
దోపిడీ కలకలం
పటాన్చెరు టౌన్: అమీన్పూర్ మండలం బీరంగూడలోని జై భవానీ జువెల్లరీ షాపులో మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన చోరీ కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్సీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు పరిశీలించి, దొంగల దాడిలో గాయాలపాలైన షాపు యజమాని జైరాం ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుండగులు ఆరు నెలల క్రితం ఒక సారి షాపునకు వచ్చివెళ్లారని చెప్పడంతో పక్కా ప్లాన్ ప్రకారమే దొంగతనం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. మంగళవారం రాత్రి 9. 45 సమయంలో బురఖా వేసుకున్న ఓ మహిళ, ఓ వ్యక్తి బీరంగూడలోని జై భవానీ జువెల్లరీ షాపులోకి వచ్చి నగల మోడళ్లను చూపించాలంటూ యజమానిని కోరారు. సుమారు గంటసేపు అక్కడే గడిపారు. అనంతరం షాపు యాజమాని జైరాం లోపలికి వెళ్లి సేఫ్ లాకర్లో నగలు పెడుతుండగా పిస్టల్‌తో బెదిరిం చారు. అతను పిస్టల్ గుంజుకోవడానికి యత్నించడంతో బురఖా వేసుకున్న మహిళ అతని కళ్లలో కారం చల్లింది. వెంటనే ఇద్దరు కలసి వెంట తెచ్చుకున్న రాడ్‌తో జైరాం తలపై బలంగా కొట్టడంతో కుప్పకూలాడు. అతడిని బాత్రూంలోబందించి షాపులో ఉన్న 1 కిలో బంగారు ఆభరణాలు, రూ. 4.5 లక్షల నగదు తీసుకొని పరారయ్యారు. కొద్దిసేపటి అనంతరం తేరుకున్న షాపు యజమాని బాత్రూం తలుపులు పగులగొట్టి బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందిస్తే రూ. లక్ష బహుమతి చోరికి పాల్పడిన నిందితుడి ఫోటోను బుధవారం ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి విడుదల చేశారు. ఎవరైనా నిందితుడిని గుర్తించి సమాచారం అందిస్తే రూ. లక్ష బహుమతి అందిస్తామని ప్రకటించారు. -
సాక్షి ఎక్స్‌క్లూజివ్ : పచ్చనేత – మట్టిమేత
ఆ పథకం.. అధికార పార్టీ కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు కల్పతరువు. ఆ పథకం.. ఒక పిల్ల కాలువలో కూడా ఎన్ని రకాలుగా దోచుకోవచ్చో తెలిపింది. ఆ పథకం.. పనులేవీ చేయకుండానే ప్రజాధనాన్ని ఎలా పంచుకుతినొచ్చో చూపింది. భూగర్భ జలాల పరిరక్షణ కోసమమంటూ సీఎం చంద్రబాబు ప్రారంభించిన ‘నీరు–చెట్టు’ పథకమది. ఈ పథకం మాటున మరో ‘పథకం’ ఉందని తొలి ఏడాదిలోనే తెలిసిపోయింది. నాలుగేళ్లలో రూ. 34,399 కోట్లు పచ్చచొక్కాల జేబుల్లోకి వెళ్లిపోయాయి. ఈ పథకం కింద చేసిన పనులే మళ్లీ మళ్లీ చేసినట్లు బిల్లులు చేసుకుంటున్నారు.. పైపైన పనులు చేసి పూర్తి బిల్లులు కొట్టేస్తున్నారు.. అవసరం లేని చోట కూడా అరకొరగా పనులు చేసి డబ్బు నొక్కేస్తున్నారు. చెరువుల పూడికతీసి ఇసుక, మట్టి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.. 25 శాతం పనులు చేసి 75 శాతం నిధులను స్వాహా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో.. అన్ని నియోజకవర్గాల్లో.. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ అక్రమాలన్నీ బ యటపడ్డాయి. చంద్రబాబు నాలుగేళ్లపాలన ఏ తీరున సాగిందో తెలుసుకునేందుకు నీరు – చెట్టులో సాగిన దోపిడీయే ఒక నిదర్శనం. నాలుగేళ్లలో కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులు - రూ.12,866 కోట్లు పనులు జరిగిన విలువ - రూ.3,216.5 కోట్లు (25 శాతం) కాంట్రాక్టర్లు దోచుకున్న మొత్తం - రూ.9,649.5 కోట్లు (75 శాతం) చేసిన పనుల్లో కాంట్రాక్టర్లు అమ్ముకున్న మట్టి, ఇసుక విలువ - రూ.24,750 కోట్లు రాష్ట్ర ఖజానాకు జరిగిన మొత్తం నష్టం - రూ.34,399 కోట్లు ప్రస్తుతం జరుగుతున్న పనుల విలువ - రూ.1,500 కోట్లు చినబాబు ఇలాకాలో తమ్ముళ్ల ధమాకా కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలోని నిమ్మకూరు గ్రామంలోని చెరువు ఇది. ఇది ఎన్టీఆర్ స్వగ్రామం. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ దత్తత తీసుకున్నారు కూడా. అభివృద్ధి పేరుతో ఇక్కడి చెరువుని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు అడ్డగోలుగా తవ్వేసి సొమ్ము చేసుకున్నాడు. పూడిక తీయడానికి ప్రభుత్వం రూ.8.5లక్షలు మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం చెరువులో 3–4 మీటర్ల వరకు మాత్రమే పనులు చేపట్టాల్సి ఉండగా 10–15 మీటర్ల లోతు వరకు తవ్వేసుకొని మట్టిని విచ్చలవిడిగా అమ్మేసుకున్నాడు. ఇలా సదరు నాయకుడు దాదాపు రూ.70 లక్షలకు పైగా వెనకేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఇటీవలి ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. నీరు చెట్టు పథకం కింద నాలుగేళ్లలో రూ.12,866 కోట్లు ఖర్చుచేశారు. కాంట్రాక్టర్లకు అందించిన ఈ నిధుల్లో 75శాతం మేర మింగేస్తున్నారని, 25శాతం మేర మాత్రమే పనులు చేస్తున్నారని ఈ శాఖకు సంబంధించిన అధికారులే వ్యాఖ్యానిసున్నారు. అంటే.. రూ.9,649 వేల కోట్లకు పైగా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లిపోయాయన్న మాట. ఇక మట్టిని, ఇసుకను అమ్ముకుని రూ. 24,750 కోట్లను పచ్చనేతలు, కాంట్రాక్టర్లు కైంకర్యం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని ఓ వైపు ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ మరోవైపు నీరు–చెట్టు పనులకు సంబంధించిన బిల్లులు ఎక్కడా పెండింగ్‌లో ఉండడంలేదు. ఈ పథకం కింద పనులకు టెండర్లు పిలవకుండానే నామినేషన్ పద్ధతిపై పనులు కేటాయిస్తున్నారు. ఈ విధానాన్ని గతంలో హైకోర్టు తప్పబట్టినప్పటికీ చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు సరికదా.. నిబంధనలు మార్చి కొనసాగిస్తోంది. తూతూమంత్రంగా పనులు.. ఈ పథకం కింద పనులు దక్కించుకున్న నేతలు, కాంట్రాక్టర్లు పనులు మొక్కుబడి చేశారనే విమర్శలు కోకొల్లలు. రైతులకు ఉపయోగపడే పనులు పైపైనే కానిచ్చేసి మమ అనిపించారు. కొన్నిచోట్ల నాయకుల కోసం పనులు చేసిన ఉదంతాలూ ఉన్నాయి. ఉదాహరణకు.. ♦ కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని వాడపాలెంలో కొందరు రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. ఇక్కడ అవసరం లేకపోయినా స్థానిక టీడీపీ నేత రూ.10లక్షలు మంజూరు చేయించుకుని పైపైన అడుగు లోతులో డ్రెయిన్‌ను తవ్వారు. ♦ అనంతపురం జిల్లా కణేకల్లు మండలం యర్రగుంట గ్రామంలో పర్క్యులేషన్ ట్యాంకులో మూడు విడతలుగా పూడికతీత పనులు చేపట్టారు. ఇందుకు రూ.80లక్షలు మంజూరు చేశారు. రాయదుర్గం మార్కెట్‌యార్డు వైఎస్ చైర్మన్ వన్నారెడ్డి స్వయంగా ఈ పనులు చేశారు. నామమాత్రంగా పనులు చేశారనే ఆరోపణలు స్థానికంగా గుప్పుమన్నాయి. ♦ విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో ఈ పథకం కింద చేసిన పనులు రైతులకు నష్టం చేకూర్చినట్లు ఆరోపణలున్నాయి. చెరువు గట్లు ఇంతకు ముందే బాగుండేవని.. పనుల తర్వాత పాడయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పనులను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి బంధువులకు అప్పగించినట్లు రైతులు చెబుతున్నారు. ♦ అలాగే, చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గొల్లపల్లి వద్ద ముష్టిమాకుల చెరువు పనులను అధికార పార్టీ నేత చేపట్టారు. నాసిరకం పనుల వల్ల గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు చెరువు కట్ట నుంచి నీళ్లు లీకయ్యాయి. ఫలితంగా చెరువులోని నీరు వృధాగా పోయింది. చివరికి చెరువు కట్ట అధ్వానంగా మారింది. ఇలా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. పనులు చేయకుండానే.. చేపట్టిన పనులు మొక్కుబడిగా చేసి బిల్లులు పొందిన తెలుగుదేశం నేతలు కొందరైతే అసలు పనులు చేయకుండానే పనులు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెలుస్తున్న ఘనాపాటీలు మరికొందరు. ♦ శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం దేవరవలస పంచాయతీలో 2017లో నాలుగు చెరువులకు రూ.40లక్షలు మంజూరు చేశారు. కానీ, పనులు మాత్రం కాలేదు. ఇవి జరిగినట్లు రికార్డు చేయాలని స్థానిక టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు భోగట్టా. ♦ కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలోని కాల్వ పూడుకుపోయిందని నీరు–చెట్లు కింద రూ.8.5లక్షలతో పనులు చేపట్టారు. అయితే ఒక్కసారి కూడా వర్షం రాకుండానే మళ్లీ యథాస్థితిలోనే కనిపిస్తోంది. ♦ తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని గోర్స, కొత్తపల్లి, నాగులాపల్లి, రమణక్కపేట, కొమరగిరి తదితర 15 గ్రామాల్లో పనులు చేసినట్లు చూపించి రూ.కోట్లు కొల్లగొట్టేశారు. ♦ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని తలమంచిలో కాలువ పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారు. దీనిపై స్థానిక నాయకుడు పిట్టి సూర్యనారాయణ కలెక్టర్, లోకాయుక్త, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు పనులను పరిశీలించినా చర్యలు లేవు. కలెక్టర్ మాత్రం ఇరిగేషన్ ఏఈ రవికుమార్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ♦ వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం తొండూరులో అధికార పార్టీ నాయకులు వాగులు, వంకలు, చెరువులు లేకపోయినా పొక్లెయిన్ల సహాయంతో అక్కడ సృష్టించారు. ఇలా రూ.కోట్లలో పనులు చేసినట్లు చెబుతున్నారు. ♦ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండల పరిధి గూడెం చెరువు గ్రామంలోని గూడాదేవి చెరువులో గత ఏడాది టీడీపీ నాయకులు నీరు–చెట్టు పనుల్లో భాగంగా పూడికతీత చేపట్టారు. అయితే ఇరిగేషన్ శాఖాధికారుల అనుమతి లేకుండా పొక్లెయిన్లతో మట్టిని తరలించారు. గతంలో కూడా ఇక్కడ పూడికతీత పనులు చేపట్టి డబ్బులు దండుకున్నారు. దీనివల్ల రూ.5లక్షలు దుర్వినియోగమయ్యాయి. ♦ కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో హెబ్బటం, వందవాగిలి, చిన్నహ్యాట, పెద్దహ్యాట, ఎల్లార్తి, గజ్జెహళ్లి, లింగంపల్లి, సులువాయి, విరుపాపురం గ్రామాల పరిధిలో నీరు–చెట్టు కింద మొత్తం 65పనులను గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.6కోట్లు కేటాయించింది. శేషగిరి, బసప్ప, ఈరన్న, వెంకటేశ్వర్లు, రామిరెడ్డి, ఈశ్వర్‌గౌడ్ పేర్లతో పనులు పూర్తయ్యాయి. కొందరు అధికారులతో కలిసి టీడీపీ నేతలు లెక్కల్లో పనులు పూర్తిచేసినట్లు చూపించి నాణ్యతకు తిలోదకాలిచ్చారు. 65పనుల్లో 45కూడా పూర్తికాకుండానే రూ.5కోట్లు లాగేశారు. ♦ కృష్ణాజిల్లా తిరువూరు మండలంలో మైనర్ ఇరిగేషన్ పరిధిలో 53 పనులు మంజూరు కాగా, రూ.4.58కోట్లు కేటాయించారు. వీటిలో 30 పనులు మాత్రమే పూర్తయినా అన్నింటికీ బిల్లులు మాత్రం సిద్ధం చేసేశారు. ♦ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి జంబూపట్నం బలరామయ్య చెరువు సప్లయ్ చానెల్ అభివృద్ధికి రూ.9లక్షలతో ప్రతిపాదించారు. రెండున్నర కిలోమీటర్ల కాలువలో తూతూమంత్రంగా పనులు చేసి మట్టిని అమ్ముకున్నారు. చేసిన పనుల కంటే పొందిన బిల్లులు ఎక్కువగా ఉన్నాయన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఏడాది తిరక్కుండానే ఈ చానెల్ పూడికలతో నిండిపోయింది. ♦ విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని చోడపల్లి చెరువుకు సంబంధించి 2016–17లో రూ.22లక్షల మేర పనులు చేశారు. సగం మట్టిని గట్టు చోడమాంబిక ఆలయ స్థలం కప్పుదలకు కేటాయించారు. మిగిలిన మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అనుచరుడు వేగి మహేష్ ఈ పనులు చేపట్టారు. ఈ చెరువు కింద ఎలాంటి ఆయకట్టు లేదు. కేవలం మట్టి తవ్వకాలకే పూడిక తీత అన్నట్లుగా పనులు సాగాయి. మట్టి అమ్మకాల ద్వారా రూ.30లక్షల మేర సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ♦ విజయనగరం పెద చెరువు పనులన్నీ ఎమ్మెల్యే మీసాల గీత అక్క పెనుమజ్జి విజయలక్ష్మికే అప్పగించేశారు. టెండర్ లేకుండా ఎమ్మెల్యే సిఫారసుతో పనులు దక్కించుకున్నారు. 2016–17లో నీరు–చెట్లు పనులకు రూ.1.6కోట్లు మంజూరయ్యాయి. 16 పనులను ఎమ్మెల్యే సోదరే చేపట్టారు. ఇక్కడి పనుల్లో అరకోటికి పైగా దుర్వినియోగం అయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ♦ చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలం కరసనపల్లి పంచాయతీలోని హనుమాన్ చెరువు మరమ్మతులకు 2015–16లో నీరు–చెట్టు కింద రూ.9లక్షలతో పనులు చేశారు. కాంక్రీట్ పనులు చేపట్టకుండా కట్టపై మట్టి పనులు చేసి వదిలేశారు. దీంతో కట్ట అంచులు కోతకు గురయ్యాయి. ఈ పనులను జన్మభూమి కమిటీ పేరుతో పెద్ద పంజాణి మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీరాములు చేపట్టారు. అధికార పార్టీ నేతల మధ్య కలహాలు.. నీరు చెట్టు పథకం అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. మట్టి తవ్వకాల్లో అభిప్రాయభేదాలు తలెత్తుతున్నాయి. చివరికి బదిలీలు, విధుల నుంచి తొలగించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉదా.. గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెంలోని 5 ఎకరాల ఊర చెరువులో గతేడాది మట్టి తవ్వారు. 5,600 ట్రక్కుల మట్టిని తవ్వి ట్రక్కు రూ.600 చొప్పున విక్రయించారు. అధికార పార్టీకే చెందిన సర్పంచ్ కఠెవరపు నిర్మలాకుమారి ప్రమేయం లేకుండా ఎంపీటీసీ కొత్త లక్ష్మీతులసి భర్తకు రూ.35 లక్షల ఆదాయం సమకూరింది. రూ.6 లక్షలతో చెరువు చుట్టూ కంచె వేయించారు. దీనిపై సర్పంచ్ వర్గం ఆగ్రహం చెందింది. పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేయించి.. ఫీల్డు అసిస్టెంటును విధుల నుంచి తొలగించారు. రియల్ ఎస్టేట్‌కు సంతర్పణ విశాఖ జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురంలో 600ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ సాగునీటి చెరువులో రూ.40 లక్షలు నీరు–చెట్టు నిధులు, రూ.10లక్షలు పాల సంఘాల నిధులు, రూ.15లక్షలు విశాఖ డెయిరీ నిధుల సహకారంతో పూడికలు తీశారు. టీడీపీకి చెందిన మండల వైస్ ఎంపీపీ భూతనాధుని నానికుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ పనిలో భారీ అవినీతి చోటుచేసుకుందని పెద్దఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ మట్టిని రియల్ ఎస్టేట్ భూముల ఎత్తు పెంచేందుకు అమ్మేశారు. అలాగే, పీఎస్‌పేట రోడ్డులో మరో టీడీపీ నాయకుడు సుమారు 6 ఎకరాల పంట భూమిలో ప్లాట్లు వేశాడు. ఈ భూమిని ఎత్తు చేసేందుకు లక్ష్మీపురం చెరువు, చోడవరం పాత చెరువు మట్టిని యథేచ్ఛగా తరలించారు. ఎమ్మెల్యే అనుచరుడుగా ఉన్న పంచాయతీరాజ్ కాంట్రాక్టర్‌కే చోడవరం పాత చెరువు నీరు–చెట్టు పనులు అప్పగించడంతో తవ్విన మట్టిని నేరుగా రియల్ ఎస్టేట్ ప్లాట్లకు అమ్మేశాడు. రూ.3కోట్ల మట్టి మింగేశారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఎఫ్‌కే పాలెంలోని పాపిడిదొడ్డి చెరువు 70ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సుమారు 1,500 ఎకరాల ఆయకట్టు ఉంది. గత మూడేళ్లుగా నీరు–చెట్టు పథకంలో సుమారు రూ.3కోట్లు ఖర్చుచేసి ఈ చెరువును నియోజకవర్గ ప్రజాప్రతినిధి సోదరుని ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఇందులో మట్టిని పొక్లెయిన్లతో తవ్వి భారీ లారీలతో ఇటుక బట్టీలకు సుమారు రూ.3కోట్ల విలువైన మట్టిని అమ్ముకున్నారు. దీంతో చెరువు గోతులమయంగా మారి సాగునీటి కాలువల్లోకి ప్రవహించడంలేదని రైతులు వాపోతున్నారు. ఇదే చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూడా ఏటా రూ.15లక్షలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు, వందల మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు లెక్కలు చూపిస్తూ రెండు విధాలా లాభం పొందుతున్నారు. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వుతూ వేలల్లో మాత్రమే తవ్వుతున్నట్లు సర్కార్‌కు చూపుతూ ఖజానాకు భారీ నష్టం చేకూరుస్తున్నారు. అలాగే, ఎక్కడా రైతులకు ఒక్క ట్రాక్టర్ మట్టి కూడా ఇవ్వలేదు. చెరువు గట్లు పటిష్టం చేసిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. ఎక్కడి జమ్ము అక్కడే.. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ చిత్రంలో కనిపిస్తున్న మలిదేవి డ్రెయిన్ కనిగిరి రిజర్వాయర్ నుంచి నెల్లూరు జిల్లా కొడవలూరు మీదుగా విడవలూరు మండలం వరకూ వెళ్తోంది. డ్రెయిన్‌లోని గుర్రపుడెక్క, జమ్మును తొలగించేందుకు నీరు–చెట్టు పథకం కింద 2015లో రూ.50లక్షలను కేటాయించారు. ఈ పనులను కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరుడు చెముకుల చైతన్యకు కేటాయించారు. వర్షాకాలం ముందు చేయాల్సిన పనులను జోరుగా వర్షాలు కురిసే సమయంలో ప్రారంభించారు. నామమాత్రంగా పనులు చేసి నిధులను కైంకర్యం చేశారు. ఫలితంగా గుర్రపుడెక్క, జమ్ము అలాగే ఉన్నాయి. కంపచెట్ల మాటున కొల్లగొట్టారు ఫొటోలో కనిపిస్తున్నది అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మల్కాపురం గ్రామ చెరువు. నీరు–చెట్టు కింద ఈ చెరువులో కంపచెట్లు తొలగించినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు మాయచేశారు. కంప చెట్లు తొలగించకుండానే నిధులు పిండేశారు. పనులు చేసినట్లు చూపి ఏకంగా రూ.6.41లక్షలు బిల్లులు చేసుకున్నారు. కంపచెట్లు మాత్రం చెరువు నిండా అలానే ఉన్నాయి. ఏఈ.. పనులు ఏవీ? ఇక్కడ కనిపిస్తున్నది కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం పాంపల్లి నుంచి ఇంజేడు వరకు వర్షపు నీరు పోయే కుందనవాగు. ఇప్పటివరకు ఇది ఎప్పుడూ ఉప్పొంగలేదు. ఈ వాగును అభివృద్ధి చేసేందుకు మంత్రి అండదండలతో శివరామిరెడ్డి అనే ఏఈ కాంట్రాక్టు పొందారు. ఈయన విధులకు హాజరు కాకుండా దీర్ఘకాలిక సెలవులో కొనసాగుతూ కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. కుందనవాగు అభివృద్ధి పేరుతో రూ.40లక్షలు ఖర్చు చేసినట్లు చూపారు. కానీ, పనులు ఎక్కడ చేశారో తెలీడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.. కేవలం టీడీపీ నాయకులకు నిధులు మళ్లించేందుకే ఇక్కడ పనులు చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బిట్టు బిట్టుగా దోపిడీ ఫొటోలో కనిపిస్తున్న నిర్మాణం వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం పైడికాలువ, పెద్దపుత్త గ్రామాల మధ్యనున్న వంకపై పైడికాలువ పంచాయతీ పరిధిలోని జంగంపల్లె వద్ద నీరు–చెట్టు కింద నిర్మించిన మోడల్ చెక్ డ్యామ్ ఇది. మట్టి పనులను రెండుగా, కాంక్రీట్ నిర్మాణాన్ని మరో పనిగా విభజించారు. ఒక్కో పనికి రూ.10లక్షల చొప్పున రూ.30లక్షలు కేటాయించారు. స్థానిక ఎంపీటీసీ తనయుడు, గ్రామానికి చెందిన టీడీపీ నేత వాసు పర్యవేక్షణలో నిర్మాణాలు చేపట్టారు. మట్టి కట్టలను నాసిరకంగా నిర్మించారు. అనంతరం కురిసిన వర్షాలకు ఓ వైపున మట్టి కట్ట కొట్టుకుపోయింది. దీంతో చుక్క నీరు కూడా నిలవచేసుకునే అవకాశం లేకుండాపోయింది. ఇక్కడ ఏటా ఇదే తంతు ! శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వీఎన్ పురం సమీపంలో కల్వర్టు వద్దనున్న ఈ బలిజవాని గెడ్డలో రూ.9లక్షలతో నీరు–చెట్టు పనులు చేపట్టారు. యంత్రాలతో గెడ్డను చదును చేశారు కానీ పూడికతీత తీయలేదు. గెడ్డ గర్భంలో గడ్డిని తొలగించకుండా తూతూమంత్రంగా పనులు చేపట్టి నిధులు వెనకేసుకున్నారు. దీంతో ఖరీఫ్‌లో శివారు భూములకు సాగునీరు ప్రశ్నార్ధకంగా మారింది. బలద పద్మనాభ సాగరంలో పూడికలు తొలగించేందుకు నీరు–చెట్టు పథకం కింద 2017–18లో రూ.54లక్షలు కేటాయించారు. చెరువు గర్భం నుంచి మట్టిని తొలగించి తరలించాలి. కానీ, మట్టిని గట్టుపైనే వేస్తున్నారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి మళ్లీ చెరువులోకే చేరుతోంది. ఏటా ఇలా చేస్తూనే టీడీపీ తమ్ముళ్లు లక్షలాది ప్రజాధనం స్వాహా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కూలీలు చేసిన పని చూపి లక్షలు నొక్కేశారు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని వీరేపల్లి చెరువులో 2015–16 ఆర్థిక సంవత్సరంలో మట్టి తవ్వకం పనులు చేపట్టారు. నీరు–చెట్టు పథకం కింద రూ.4.50లక్షలు ఖర్చు చేశారు. అయితే, అప్పటికే ఈ చెరువులో ఉపాధి హామీ కూలీలు మట్టి తవ్వేశారు. కూలీలు తవ్విన కుంటల చుట్టూ జేసీబీతో గాడి తవ్వి నీరు–చెట్టు కింద పనులు చేసినట్లు చూపించారు. దీనికి అధికారులు సహకారం అందించి గ్రామ టీడీపీ నాయకుడు నరేష్‌కు రూ.4.50లక్షల లబ్ది చేకూరేలా చేశారు. మట్టి అమ్ముకోవడమే అభివృద్ధా!? గుంటూరు జిల్లా యడ్లపాడు గ్రామ పరిధిలోని సీతమ్మ చెరువులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన వారు వివిధ రకాల పంటలను సాగుచేసుకుంటున్నారు. 2015–16లో నీరు–చెట్టు పథకం పేరుతో ఈ భూము ల్లో తవ్వకాలు చేపట్టారు. పేదలను తరిమేశారు. అరెకరం పొలం ఉన్న వారు కూడా భూములు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇదేనా అభివృద్ధి అంటే..!? – సయ్యద్ సుభాని, యడ్లపాడు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట అడ్డగోలుగా దోచుకుంటున్నారు నీరు–చెట్టు పనుల్లో అడ్డగోలుగా మట్టి అమ్ముకుంటున్నారు. ఇటుక బట్టీలకు, లేఅవుట్లకు వేల క్యూబిక్ మీటర్ల మట్టిని అమ్ముకున్నారు. పనులపై కనీస పర్యవేక్షణ లేదు. ఇష్టారాజ్యంగా పనులు చేసి బిల్లులు స్వాహా చేస్తున్నారు. గతంలో పనులు చేసిన చెరువుల్లోనే మళ్లీ పనులు ప్రతిపాదించి బిల్లులు పొందుతున్నారు. – కూనిరెడ్డి వెంకట్రావు, పోతనాపల్లి, శృంగవరపుకోట మండలం, విజయనగరం జిల్లా గ్రామస్తుల అవసరాలు తీర్చకుండా అమ్మేసుకున్నారు నీరు–చెట్టు పథకంలో భాగంగా గ్రామస్తుల అవసరాల మేరకు మట్టిని సరఫరా చేయాల్సి ఉంది. కానీ, ఇక్కడి టీడీపీ నాయకులు చెరువుల మట్టిని తెగనమ్ముకున్నారు. ఆయకట్టు రైతులకు గంపెడు మట్టిని కూడా ఇవ్వకుండా మొత్తం బయటకు తరలిస్తున్నారు. ప్రశ్నిస్తున్నానని పనుల ప్రారంభానికి కూడా నన్ను పిలవడంలేదు. – సాగిరాజు ఉదయకుమారి, సర్పంచ్, చెందుర్తి, గొల్లప్రోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా పచ్చ చొక్కాలకు దోచి పెట్టేందుకే... అధికార పార్టీకి చెందిన సర్పంచ్ పిటికాయగుళ్ల వాగు లో డీసిల్టింగ్ పనులు చేశారు. నీరు–చెట్టు కింద లక్షలు ఖర్చుపెట్టినట్లు వాగుకు ఇరువైపులా గట్ల వెంబడి యంత్రా లతో తూతూమంత్రంగా పనులు చేశారు. నీరు నిల్వ ఉండే గుంతలను కూడా చదును చేయడంతో కనీసం పశువులు నీరు తాగేందుకు చుక్క నీరు ఉండని పరిస్థితి ఏర్పడింది. వాగులో చేసిన పనులు ఏమాత్రం ఉపయోగకరంగా లేవు. – మల్లెల శేఖర్‌రెడ్డి, పిటికాయగుళ్ల, గిద్దలూరు, ప్రకాశం జిల్లా వారి జేబులు నింపడానికే.. నీరు–చెట్టు పనులు పూర్తిగా అవినీతిమయమయ్యాయి. అధికారులు పట్టించుకోవడంలేదు. టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మంజూరైన నిధులతో మొక్కుబడిగా పనులు చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారు. దీనిపై విచారణ చేపట్టాలి. – చెన్నకేశవులు, సీపీఐ నేత, పలమనేరు, చిత్తూరు జిల్లా -
కాలవ ఇలాకాలో.. ఇసుక దందా
రెచ్చిపోతున్న అధికార పార్టీ నాయకులు బొమ్మనహాళ్, డి.హీరేహాళ్ మండలాల నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా చూసీచూడనట్లు స్థానిక అధికారులు, పోలీసులు అప్రమత్తమైన బళ్లారి అధికారులు ‘దుర్గం’ టీడీపీ నేతలపై కేసుల నమోదు డి.హీరేహాళ్ (రాయదుర్గం) : రాష్ట్ర గ్రామీణ గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ నాయకులు నదులు, వంకలు, వాగుల నుంచి ఇసుకను తవ్వి సరిహద్దులు దాటిస్తున్నారు. కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరులో విక్రయిస్తూ భారీఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని డి.హీరేహాళ్, బొమ్మనహాళ్ మండలాల్లో నదీ పరివాహక ప్రాంతాలను గుల్ల చేస్తున్నారు. బొమ్మనహాళ్ మండలం బండూరు, ఉద్దేహాళ్ గ్రామాల పరిధిలోని వేదవతి నది నుంచి, డి.హీరేహాళ్ మండలం బాదనహాల్ గ్రామం వద్దనున్న చిన్న హగరి నుంచి ఇసుక పెద్దఎత్తున కర్ణాటకకు తరలిపోతోంది. ప్రభుత్వం ఇసుకను ఉచితం చేయడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. రాత్రికి రాత్రే తోడేస్తూ ఒకచోట డంప్ చేసుకుని.. అక్కడి నుంచి బెంగళూరు, బళ్లారికి తరలిస్తున్నారు. బళ్లారిలో ట్రాక్టర్ ఇసుక రూ.5 వేలకు అమ్ముడుపోతోంది. బెంగళూరులో లారీ ఇసుక నాణ్యతను బట్టి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్ష వరకు అమ్ముడుపోతున్నట్లు సమాచారం. డి.హీరేహాళ్, ఓబుళాపురం గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం కోసమంటూ బాదనహాళ్ వద్ద నుంచి ఇసుకను తరలిస్తున్నారు. వాస్తవానికి అక్కడ ఇళ్ల నిర్మాణాలు ఆ స్థాయిలో చేపట్టడం లేదు. అయినా అవసరానికి మించి అంటే రోజుకు 60 నుంచి 70 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. ఓబుళాపురం, డి.హీరేహాళ్ గ్రామాల సమీపాన కంపచెట్లలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రి వేళలో జేసీబీలతో లారీలలో లోడ్ చేసి కర్ణాటక పర్మిట్లతో బెంగళూరుకు రవాణా చేస్తున్నారు. అక్కడ ఖర్చులన్నీ పోను ఒక్కో లోడ్‌పై రూ.70 వేల దాకా ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. బొమ్మనహాళ్ మండలంలో అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు క్రషర్ ముసుగులో కింద ఇసుకను, పైన కంకరపొడి వేసి తరలిస్తున్నట్లు వినికిడి. రాయదుర్గం పట్టణానికి చెందిన కొంత మంది భూపసముద్రం, కెంచానపల్లి తదితర ప్రాంతాల నుంచి ఇసుకను బెంగళూరుకు తరలించడమే పనిగా పెట్టుకున్నారు. గుమ్మఘట్ట మండలంలోని కలుగోడు, రంగచేడు, బీటీపీ, గుమ్మఘట్ట, భూపసముద్రం ప్రాంతాల్లో వేదవతి హగరి నదీ పరివాహక ప్రాంతం నుంచి నిత్యం ఇసుక తరలిపోతోంది. కణేకల్లు మండలంలోనూ ఇదే పరిస్థితి. బళ్లారి అధికారుల అప్రమత్తం రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతల ఇసుక దందా శ్రుతిమించిపోవడంతో సరిహద్దున ఉన్న బళ్లారి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. స్వయాన ఆ జిల్లాధికారి రామ్ ప్రసాత్ మనోహర్ ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. ఇటీవల బళ్లారి ఎస్పీ ఆర్.చేతన్‌తో కలిసి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న పలు వాహనాలను సీజ్ చేశారు. డి.హీరేహాళ్ మండలం చెర్లోపల్లి వద్ద నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గత నెల 25న బళ్లారి పోలీసులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి ఓబుళాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చిదానందగౌడ్, నాగరాజుపై కేసు నమోదు చేశారు. సరిహద్దున ఉన్న బొమ్మనహాళ్, డి.హీరేహాళ్ మండలాల నుంచే ఇసుక బళ్లారికి తరలివస్తోందని అక్కడి అధికారులు నిర్ధారించారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి: జయచంద్రారెడ్డి, రైతు సంఘం నాయకుడు, రాయదుర్గం నియోజకవర్గం ఇసుక అక్రమ రవాణాపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే వేదావతి హగిరిలో ఇసుక అక్రమ రవాణా వల్ల భూగర్భజలాలు అడుగంటాయి. గ్రామాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి. -
మళ్లీ భూ దోపిడీకి సిద్దమవుతున్న ఏపీ సర్కార్
-
మట్టి హాంఫట్!
• నీరు–చెట్టు పనుల పేరుతో దోపిడీ • ప్రతిరోజూ 400 ట్రిప్పులు అమ్మకం • నాలుగు మాసాలుగా ఇదే తంతు • చెరువునే చెరబట్టిన తెలుగు తమ్ముళ్లు నీరు–చెట్టు పనులు అధికార పార్టీ నాయకులకు కల్పతరువుగా మారాయి. వర్క్ అలాట్మెంట్ కాకపోయినా ఈ పనుల పేరు చెప్పి చెరువులు, వంకలు, వాగుల్లోని మట్టిని కొల్ల గొడుతున్నారు. ట్రిప్పునకు రూ.400 నుంచి రూ.500 వరకు అమ్ముకుంటూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. కడప చుట్టుపక్కల 4 మాసాలుగా ఈ దందా సాగుతున్నా ఇరిగేషన్ అధికారులుగానీ, రెవెన్యూ అధికారులుగానీ అటువైపు తొంగి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడప కార్పొరేషన్: నీరు–చెట్టు పనులు కొందరికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పనులు చేపట్టే విషయంలో తెలుగు తమ్ముళ్లు ధనార్జనే ధ్యేయంగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో చివరికి మట్టిని సైతం అమ్ముకుంటున్నారు. నిబంధలనల ప్రకారం నీరు–చెట్టు కింద పూడిపోయిన వంకలు, వాగులు, చెరువుల్లో పూడిక తీత, చెరువు నుంచి పొలాల్లోకి వున్న కాలువలను బాగుచేయడం వంటి పనులు చేయాలి. కానీ అవేవీ జిల్లాలో అమలు కావడం లేదు. వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని పుట్లంపల్లి చెరువు కింద వంద ఎకరాల ఆయకట్టు ఉంది. పంటలు కోసిన తర్వాత ఈ మట్టిని పొలాల్లోకి తోలి భూసారాన్ని పెంచితే రైతులకు ఉపయోగముంటుంది. అలాకాని పక్షంలో చెరువు కట్టను బలోపేతం చేసేందుకు ఈ మట్టిని వినియోగించాలి. అంతిమంగా ఈ పనుల వల్ల రైతులకు లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ పథకం అమలు మాత్రం తమ్ముళ్లకు ఆర్జించిపెట్టడమే పరమావధిగా ముందుకు సాగుతోంది. పుట్లపల్లి చెరువులో సాగుతున్న నీరు–చెట్టు పనులే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో నాలుగు మాసాలుగా ఈ మట్టి దందా సాగుతోంది. కేవలం రూ.10 లక్షల వర్క్‌ను ఇలా నెలల తరబడి చేస్తూ మట్టిని కొల్లగొడుతున్నట్లు సమచారం. రాత్రి పగలు అనే తేడా లేకుండా రోజుకు దాదాపు 400 ట్రిప్పుల వరకూ తోలుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన 4 నెలలకు రూ.2కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు తెలుస్తోంది. వర్క్ అలాట్మెంట్ అయిన చోట కాకుండా చెరువు మధ్యలోని మట్టిని జేసీబీతో తోడుతూ ప్రయివేటు సంస్థలకు, ఇటుక బట్టీలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అసలు కంటే కొసరే ఎక్కువ అసలు కంటే కొసరే ఎక్కువన్నట్లు ఇక్కడ వర్క్ మంజూరైంది రూ.10లక్షలైతే, మట్టిని అమ్ముకోవడం ద్వారా ఇరవై రెట్లు అధికంగా ఆర్జించినట్లు సమాచారం. చెరువులో, కాలువల్లో ఉన్న నల్లమట్టిని తీయాల్సి ఉండగా, సారవంతమైన ఎర్రమట్టిని తీస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రూ.10 లక్షలతో చేపట్టిన ఈ పనులు నాలుగునెలల పాటు సుదీర్ఘ కాలం సాగుతుండటంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజు సుమారు రూ.1.60లక్షల వరకూ అక్రమంగా ఆర్జిస్తున్నారు. దీని వెనుక అధికారపార్టీ ముఖ్యనేత ఉండటం వల్లే యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్ శాఖలోని ఈఈ స్థాయి అధికారి దీనికి పూర్తి అండదండలు అందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొత్త కలెక్టరేట్‌కు ఈ చెరువు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఈ దందాను అడ్డుకోలేని స్థితిలో ఉండటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీరు–చెట్టు పేరు చెప్పి చెరువులో ఇష్టానుసారం గోతు లు తవ్వుతున్నారు. భవిష్యత్‌లో ఈ గోతు లు పెను అనర్థాలకు దారితీసే అస్కారం ఉందని పుట్లంపల్లె గ్రామస్తులు సైతం వాపోతున్నారు. గతంలో కూడా గుంతలున్నాయనే విషయం తెలియక ఈత సరదాతో పసిప్రాణాలు గాల్లో కలిసిన దాఖలాలున్నాయి. సమాజానికి ఎటుచూసినా అనర్థదాయకంగా మారనున్న ఈ వ్యవహారాన్ని తక్షణమే కట్టడి చేయాల్సి ఉంది. పరిశీలించి చర్యలు తీసుకుంటాం: నీరు–చెట్టు పనులకు వర్క్ మంజూరైంది. మొత్తం రూ.5లక్షలు విలువైన చేయాల్సి ఉంది. అయితే చెరువులోని మట్టిని అమ్ముకుంటున్న విషయం నా దృష్టికి రాలేదు. వెంటనే పరిశీలిస్తాం. మట్టి అమ్ముకున్నట్లు తేలితే కఠినచర్యలు తీసుకుంటాం. మురళీకృష్ణ, డీఈ, మైనర్ ఇరిగేషన్‌శాఖ కడప -
అన్నింటా..వీరే
ముత్తూట్...మినీ... ‘మహా’ దొంగల గుర్తింపు రామచంద్రపురం ఠాణా పరిధిలో దోపిడీ, కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో దోపిడీ యత్నం వీరి పనే దేశవ్యాప్తంగా 22 ముత్తూట్ దోపిడీ కేసుల్లో వీరిదే మెజారిటీ మహారాష్ట్ర కేంద్రంగా హవాలా డబ్బు చోరీ చేసినట్లు అనుమానం పోలీసుల అదుపులో బీరంగూడ దోపిడీ కేసు నిందితులు సిటీబ్యూరో: రామచంద్రపురం ఠాణా పరిధిలోని బీరంగూడ ముత్తూట్ మినీ ఫైనాన్స్‌లో జరిగిన భారీ దోపిడీ...అదే ఏడాది మే 29న కేపీహెచ్‌బీకాలనీలోని హైదర్‌నగర్ ముత్తూట్ మినీ ఫైనాన్స్‌లో దోపిడీకి విఫలయత్నం, గతేడాది డిసెంబర్ 28న అదే బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ దోపిడీ...సంచలనాలకు కేరాఫ్‌గా మారిన ఈ మూడు ‘ముత్తూట్’ కేసుల్లోనూ దోపిడీ దొంగల శైలి ఒకేలా ఉండటం, వారు స్కార్పియో కారులోనే రావడం ఒకటే ముఠా పనిగా సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. తొలి, రెండు కేసుల్లో నిందితుల ఊహాచిత్రాలను విడుదల చేసినా ఒక్కరినీ కూడా పట్టుకోకపోవడంతో తాజా ముత్తూట్ కేసు విచారణతో ఆ రెండు చోరీలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్ 28న ముత్తూట్‌లో దోపిడీ చేసిన ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సీబీఐ అధికారి వేషధారణలో ఉన్న వ్యక్తి లక్ష్మణ్ నారాయణ్‌తో పాటు స్కార్పియో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు గతంలో జరిగిన దోపిడీలపై కూపీ లాగుతున్నారు. దాదాపు పది మంది సభ్యులు గల ఈ ముఠా దేశవ్యాప్తంగా జరిగిన 22 ముత్తూట్ దోపిడీ కేసుల్లో మెజారిటీ దోపిడీలు ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది మేలో గుల్బర్గాలోని ముత్తూట్ కార్యాలయంలోనూ వారు దోపిడీ చేసినట్లు గుర్తించారు. దక్షిణ భారతదేశ గ్యాంగ్‌గా పేరొందిన వీరు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో బంగారం చోరీలకు పాల్పడిందని, ఈ కేసు విచారణ పూర్తయితే సంచలనాత్మకమైన కేసులు ఎన్నో వెలుగులోకి వస్తాయని సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే ముఠా సభ్యులందరిపై నిఘా ఉంచామని, సాధ్యమైనంత త్వరలో వారిని పట్టుకొని బంగారం రికవరీ చేస్తామన్నారు. సొత్తు పంచుకొని ఎవరి ప్రాంతాలకు వాళ్లు.... తాము దోపిడీ చేయాలనుకుంటున్న కార్యాలయంలో భద్రతపై ముందే రెక్కీ నిర్వహిస్తారు. అంతా ఓకే అనుకున్నాక తమ పని పూర్తి చేసుకుని స్కార్పియో కారులో చక్కేస్తారు. దోపిడీ చేసే ముందు నేరగాళ్లు వాడిన సెల్‌ఫోన్ నంబర్లన్నీ ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అవుతాయి. నేరస్థలిలో కనీస ఆధారాలు లేకుండా జాగ్రత్త పడతారు. చోరీ సొత్తును సమానంగా పంచుకొని ఎవరి ప్రాంతానికి వారు వెళ్లిపోతారు. ఒకరికి ఒకరు దాదాపు పక్షం రోజుల పాటు కాంటాక్ట్‌లో ఉండరు. దీంతో పోలీసులకు దొరకడం ఇబ్బందిగా మారింది. ఇంకో విషయమేంటంటే ఇద్దరు ముగ్గురు సభ్యులు తమ ప్రాంతంలో దోపిడీలు చేసినా చోరీ సొత్తును తమ బృందంలోని మిగతా ఏడుగురు సభ్యులకు కూడా సమానంగా పంచుతారు. హవాలా డబ్బులు కూడా... బంగారు ఆభరణాలతో పాటు వీరు ఎక్కువగా హవాలా దందా డబ్బులు కూడా చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా ఈ దందా నడిపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. హవాలా డబ్బులు బ్లాక్‌మనీ కావడంతో బాధితులు ఎక్కడా ఫిర్యాదు కాకపోవడంతో కేసులు నమోదుకాన్నట్టుగా సమాచారం. ముంబైలోని ఓ జైల్లోనే కలిసిన వీరంతా పక్కాగా బంగారు ఆభరణాల దోపిడీని అమలు చేస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. -
దళారీ రాజ్యం..
నగర మార్కెట్లలో మోసపోతున్న కూరగాయల రైతులు చిల్లర కొరత..అధిక ఉత్పత్తి సాకుగా చూపి అడ్డంగా దోపిడీ తక్కువ ధరకు కొని.. రిటైల్‌లో డబుల్ రేట్లకు విక్రయిస్తున్న దళారీలు.. lదిగుబడి ఉన్నా అన్నదాతకు నష్టాలే.. నగర మార్కెట్లలో అన్నదాత నిలువునా దోపిడీకిగురవుతున్నాడు. వానలు బాగా కురిసి..పంటలు బాగా పండి..మంచి దిగుబడి చేతికొచ్చినా అటు రైతన్నకు సరైన ఫలితం దక్కడం లేదు. ఇటు వినియోగదారులకు తక్కువ ధరలకు కూరగాయలు లభించడం లేదు. దీనికి కారణం దళారుల మాయాజాలమే. నోట్ల రద్దు..చిల్లర కొరతను సాకుగా చూపి మధ్య దళారులు రైతుల వద్ద అతి తక్కువ ధరకే కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. వీటిని రిటైల్ మార్కెట్లలో మాత్రం రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో దిగుబడి పెరిగినా ఫలితం దక్కక అన్నదాత..చిల్లర కొరతతో అధిక ధరలకు కూరగాయలు కొనలేక వినియోగదారులు అల్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: ఈ ఏడాది కూరగాయల ఉత్పత్తి భారీగా పెరగడంతో ధరలు తగ్గుతాయనుకున్న గ్రేటర్ వాసుల ఆశలపై దళారులు నీళ్లు చల్లుతున్నారు. అలాగే అధిక దిగుబడి వచ్చినందున లాభాలు బాగానే వస్తాయనుకున్న రైతులూ నిరాశ చెందుతున్నారు. నగరంలోని పలు మార్కెట్లలో మధ్య దళారులు పాగా వేసి చిల్లర కొరతను బూచీగా చూపి రైతులను దోచుకోవడంతోపాటు..వినియోగదారుల జేబులు గుల్ల చేస్తుండడం గమనార్హం. ఉత్పత్తి అనూహ్యంగా పెరగడంతో అన్నదాతల నుంచి తక్కువ ధరలకు కూరగాయలను కొనుగోలుచేసి మార్కెట్లో మాత్రం రెట్టింపు ధరలకు విక్రయిస్తుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి. రైతన్నకు కుడి, ఎడమల దగా... ఆరుగాలం శ్రమించి కూరగాయలు పండించిన రైతన్నలు మార్కెట్లలో నిలువునా దోపిడీకి గురవుతున్నారు. కనీసం గిట్టుబాట ధర కూడా రాకపోవడంతో వచ్చినకాడికి అమ్మేసుకుంటున్నారు. ఉత్పత్తి పెరిగిందన్న సాకు, నోట్ల రద్దు ప్రభావంతో ఏర్పడిన చిల్లర కొరత కారణాలు చూపుతూ దళారులు, మధ్యవర్తులు రేట్లు తగ్గించి మరీ కొనుగోలు చేస్తున్నారు. అయితే వీరు ఇవే కూరగాయలను రిటైల్ మార్కెట్లో రెండింతలు, మూడింతలకు అమ్ముతూ లాభపడుతున్నారు. కూరగాయల రేట్లు తగ్గిన ఫలాలు వినియోగదారుడికి కూడా అందలేదు. రైతన్నలు, వినియోగదారులు మోసపోతుండగా, దళారులు, మధ్యవర్తులు మాత్రం లాభాల గడించేస్తున్నారు. దీనికి కొంత మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా సహకరిస్తుండటంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. కూరగాయల ధరలపై నోట్ల రద్దు ప్రభావం... సిటీలో నిత్యవసరమయ్యే కూరగాయల ధరలపై నోట్ల రద్దు ప్రభావం భారీగానే కనిపించింది. రైతన్నలు తాము పండించిన పంటలను మార్కెట్‌కి తీసుకెళ్లేందుకు రవాణా, ఇతరత్రా ఖర్చులకు డబ్బులు లేక..వారి వద్దకే వచ్చిన మధ్యవర్తులకు ఎంతో కొంతకు విక్రయించారు. కొందరి వద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అనుకూలంగా మలుచుకున్న దళారులు, వ్యాపారులు ‘మేం రేటు ఇంతే ఇస్తాం. లేదంటే తీసుకెళ్లండి అంటూ కొర్రీలు పెట్టడం’తో చేసేదేమీ లేక ఇచ్చి వెళ్లినవారూ ఉన్నారు. గిట్టుబాటు కాక చాలా మంది ఉల్లిగడ్డ రైతులు తాము తెచ్చిన సరుకును మలక్‌పేటలోని వ్యవసాయ మార్కెట్లోని రోడ్లపై పడేసి వెళ్లిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. వాటిని నిల్వ చేసేందుకు అధికారులు కోల్డ్ స్టోరేజీలు కూడా అందుబాటులోకి తీసుకరాకపోవడంతో దళారుల పంట పండింది. ఉత్పత్తి పెరిగింది.. నగర శివారు ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల నుంచి నగరానికి టమాటా, వంకాయ, బెండకాయ, సొరకాయ, బీరకాయ ఇలా నిత్యం అవసరమయ్యే కూరగాయలన్నీ వస్తుంటాయి. ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, వరంగల్, వికారాబాద్, మెదక్, అనంతపురం, చిత్తూరు, తాండూరు జిల్లాల నుంచి కూరగాయలు, ఆగ్రా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా నుంచి ఆలుగడ్డలు బోయిన్పల్లి, గుడిమల్కాపూర్ మార్కెట్లకు తరలివస్తున్నాయి. అయితే కోటి జనాభా వున్న నగరానికి ప్రతిరోజు దాదాపు 35 లక్షల కిలోల కూరగాయలు అవసరం. అయితే హోల్‌సేల్ మార్కెట్లకు 25 లక్షల కిలోల కూరగాయలు వస్తున్నాయి. వేసవికాలంలో పది లక్షల కిలోల వరకు కూరగాయల కొరత నగరాన్ని పీడించిందని, ఇప్పుడు ఆ స్థాయి ఇబ్బంది లేదని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది నవంబర్‌తో పోల్చుకుంటే ఈ ఏడాది కూరగాయల ధరలు తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ..ఆ ఫలితం వినియోగదారులకు దక్కడంలేదని విశ్లేషిస్తున్నారు. -
జెన్కో బొగ్గు రవాణా పేరిట దోపిడీ
వరంగల్ : జెన్కో నిర్వహణలోని కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్‌కు జరుగుతున్న బొగ్గు రవాణాలో కోట్ల రూపాయాలు దోచుకుం టున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010లో కాకతీయ థర్మల్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం అయ్యిందన్నారు. బొగ్గును స్థానిక భూపాలపల్లి గనుల నుంచి తీసుకోకుండా నాణ్యత పేరుతో గోదావరిఖని నుంచి తెప్పించడం వల్ల రవాణా చార్జీలతో బొగ్గు ధర పెరిగి ఉత్పత్తి వ్యయంపై భారం పడుతోందన్నారు. ఇది కేవలం కాంట్రాక్టర్లకు దోచిపేట్టేందుకే కోల్ డైరెక్టర్, పవర్ స్టేషన్ ఎస్ఈలు ఈ పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. దీంతో పాటు ఉప్పల్ స్టేషన్లో బొగ్గును నీటితో కడగడం వల్ల ప్రతి రోజు 200 టన్నుల బరువు అదనంగా కాంట్రాక్టర్‌కు కలసి వస్తోందన్నారు. ఎక్కువ వచ్చిన బొగ్గును సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలకు అమ్ముకునేందుకు లారీల్లో తరలిస్తుం టే కరీంనగర్ జిల్లా మానకొండూరులో పోలీసులు పట్టుకొని సీజ్ చేశారని అన్నారు. ఈ బొగ్గు రవాణా కాంట్రాక్టు కాంగ్రెస్ నేత గండ్ర రమణారెడ్డి కుటుంబానిదే కావడం వల్ల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోందన్నారు. అధికార పార్టీ నేతలకు సైతం భారీ మొత్తంలో ముడుపులు చెల్లించడం వల్ల ఈ దోపిడీని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోవడం లేదన్నారు. ఇప్పటి వరకు బొగ్గు రవాణా, కొనుగోలు, తదితర విషయాల్లో సుమారు రూ.1500 కోట్ల వరకు దళారులు, కాంట్రాక్టర్లు, అధికారులు కలసి పంచుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీ సీఐడీ, సెంట్రల్ విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్‌కు, జెన్కో సీఎండీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి జరిగిందని అనేదానికి ఇటీవల ఐదుగురు ఇంజనీర్ల సస్పెన్షన్లే రుజువని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క అన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకొని తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూ రు అశోక్‌కుమార్, నాయకులు ఆక రాధాకృష్ణ, చాడా రఘునాథరెడ్డి, హన్మకొండ సాంబయ్య, రహీం, మార్గం సారం గం, తాళ్లపల్లి జయపాల్ తదితరులు పాల్గొన్నారు. l అధికార పార్టీ నాయకులకు వాటాలు l బొగ్గు అక్రమ రవాణా చేస్తున్న కాంట్రాక్టర్ l ఆరేళ్లలో రూ.1500కోట్లు లూటీ l టీyీ పీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు -
దోపిడీ దొంగల హల్చల్
– బెదిరించి బంగారు, వెండి ఆభరణాలు నగదు చోరీ – సాగర్ పైలాన్‌కాలనీలో ఘటన నాగార్జునసాగర్ నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో దోపిడీ దొంగలు హల్చల్ సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పైలాన్‌కాలనీకి చెందిన రాజుతో పాటు ఆయన భార్య ఆ ఇంట్లో నివసిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఇద్దరు యువకులు వచ్చి చంపుతామని బెదిరించారు. అనంతరం ఆయనభార్య మెడమీద ఉన్న రెండు వరుసల పుస్తెలతాడుతో పాటు మంగళ సూత్రం,నల్లపూసల గొలుసు,చెవిదిద్దులు, ఉంగరం, తీసుకున్నారు. ఆపై బీరువాలో ఉన్న వస్తువులను పడవేసి రూ.5వేల నగదు,వెండి ప్లేటు దోచుకెళ్లారు. తాము గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఠాకు చెందినవాళ్లమని, ఆయన మరణంతో రూ.400కోట్లు నష్టపోయామని, దొంగతనం గురించి పోలీసులకు చెప్పితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. విషయం తెలిసిన వెంటనే డాగ్‌స్క్వాడ్,క్లూస్‌టీం స్థానిక ఎస్ఐ రజనీకర్తో కలిసి ఆధారాలు సేకరించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హైటెక్ దోపిడీ..!
-
‘చాలెంజ్’.. ఇది దోపిడే
-
‘చాలెంజ్’.. ఇది దోపిడే
‘స్విస్ చాలెంజ్’ ముసుగులో భారీ కుంభకోణం రైతుల భూములతో రియల్ వ్యాపారం... ♦ సింగపూర్ కంపెనీలతో కలసి రూ.వేల కోట్లు కొట్టేసే వ్యూహం ♦ అంతా రహస్యం... పారదర్శకత మృగ్యం ♦ ప్రభుత్వ వాటా తగ్గించడమే పెద్ద స్కామ్ ♦ సింగపూర్ కన్సార్టియంకు 58శాతం వాటా ♦ రూ. 306 కోట్ల పెట్టుబడికి.. రూ.27,461.84 కోట్ల లాభం ♦ సర్కారు వాటా 42 శాతానికి పరిమితం ♦ రూ.5,721.9 కోట్లు ఖర్చు చేస్తే వచ్చేది రూ.19,886.16 కోట్లే.. ♦ అసెంబ్లీ, సచివాలయం లాంటివీ కట్టరు రాజధాని ప్రకటనకు ముందే లక్ష కోట్లు కొట్టేశారు... అందుకు ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ను ప్రయోగించారు. ఇపుడు మరో లక్ష కోట్లు కొట్టేయబోతున్నారు. ఇందుకు‘స్విస్ ఛాలెంజ్’ను ప్రయోగిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాజధాని ఎక్కడ వస్తుందో ప్రకటించడానికి ముందు పేద రైతుల భూములు కొట్టేసి లక్ష కోట్ల మేర లబ్దిపొందిన సర్కారు పెద్దలు ఇపుడు ‘స్విస్ చాలెంజ్’ ముసుగులో మరో ఘరానా దోపిడీకి స్కెచ్ వేశారు. రైతుల నుంచి సమీకరించిన భూములను స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసి మరో లక్ష కోట్లు కొట్టేసే పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రధాన రాజధాని కేంద్రం(సీడ్ కేపిటల్)లో అత్యంత విలువైన 1,691 ఎకరాల్లో చేపట్టిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును కట్టబెట్టడానికి సింగపూర్ సంస్థల కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన అవగాహనలోని మతలబులన్నీ ఇప్పటికే బట్టబయలయ్యాయి. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేనే లేదని సుప్రీం కోర్టు ఎప్పుడో తెగేసిచెప్పింది.. ఎలాంటి పరిస్థితుల్లోనూ స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రోత్సహించవద్దని గతంలోనే కేల్కర్ కమిటీ ప్రతిపాదించింది. మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు.. ఆర్థిక నిపుణులు వారించినా ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్ చాలెంజ్ విధానంలోనే రాజధాని మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. సింగపూర్ సంస్థలతో కలిసి దోచుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న ప్రయత్నాలన్నిటినీ ‘సాక్షి’ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. తాజాగా స్విస్ చాలెంజ్‌పై ప్రభుత్వ వ్యవహారశైలిని ఉమ్మడి హైకోర్టూ తప్పుబట్టింది. అయినా ఈ విధానంపై రాష్ర్ట ప్రభుత్వం ముందుకు పోవడం వెనుక లక్ష కోట్ల దోపిడీ ప్రణాళిక దాగి ఉంది. ఇలా... పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే... పైసా పెట్టుబడి లేకుండా రైతుల భూములతో రాష్ర్టప్రభుత్వం చేస్తున్న పక్కా రియల్ఎస్టేట్ వ్యాపారం ఇది. ప్రధాన రాజధాని కేంద్రంలో చేపట్టే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలాది కోట్లు కొట్టేయడానికి స్కెచ్ వేశారు. పేరుకు ప్రధాన రాజధాని కేంద్రమైనా అక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరు. అసెంబ్లీ, సచివాలయం వంటి ముఖ్యమైన నిర్మాణాలేవీ అక్కడ ఉండవు. కేవలం భూమిని అభివృద్ధి చేస్తారంతే. 1,691 ఎకరాల భూమిని చదును చేసి మౌలికసదుపాయాలన్నీ కల్పించి ప్లాట్లు వేసి అమ్మేస్తారు. వాటిని సింగపూర్ కంపెనీలు పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. కోర్ కేపిటల్ ప్రాంతం అభివృద్ధి చేస్తే ఆ చుట్టుపక్కల ప్రభుత్వ పెద్దల బినామీల భూములకు మంచి ధర వస్తుంది. వందల ఎకరాలను కైంకర్యం చేసిన సర్కారు పెద్దలు భారీగా లబ్ధిపొందనున్నారు... అదీ ప్లాన్. దీనిని అమలు చేయడానికి భారీ ప్రణాళికే సిద్ధం చేశారు. సింగపూర్ సర్కార్‌తో తనకు ఉన్న సంబంధాల వల్ల.. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఉచితంగా తయారు చేసి ఇవ్వడానికి ఆ దేశం అంగీకరించిందని సీఎం చెప్పుకొచ్చారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ను రూపొందించడానికి సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఈ(ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజస్)తో ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)కి డిసెంబర్ 8, 2014న ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను ప్రైవేటు సంస్థలు సుర్బానా ఇంటర్నేషనల్, జురాంగ్ ఇంటర్నేషనల్ సంస్థలకు సింగపూర్ సర్కార్ కట్టబెట్టింది. రాజధానికి భూసమీకరణ పేరుతో రైతుల నోళ్లు కొట్టి భూములు లాక్కున్న తరహాలోనే.. స్వప్రయోజనాల కోసం రాజధాని నిర్మాణ పనులను సింగపూర్ సంస్థలకు కట్టబెట్టడానికి వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు ‘స్విస్ చాలెంజ్’ విధానాన్ని తెరపైకి తెచ్చారు. మార్చి 30, 2015న రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ సంస్థలు అందించిన సమయంలోనే మాస్టర్ డెవలపర్‌ను స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ వెంటనే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్పందిస్తూ.. మాస్టర్ డెవలపర్ కోసం సింగపూర్ సంస్థలు పోటీ పడతాయని చెప్పారు. ముందసు ఒప్పందం మేరకు సింగపూర్ ప్రైవేటు సంస్థలు అసెండాస్, సిన్‌బ్రిడ్జి, సెమ్బ్‌కార్ప్ సంస్థలు విలీనమై కన్సార్టియంగా ఏర్పడ్డాయి. లక్షకోట్లు దాటిపోయే దోపిడీ ప్రణాళిక ఇదీ... ≈ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అమలుకు సింగపూర్ సంస్థల కన్సార్టియం, ప్రభుత్వానికి చెందిన కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్(సీసీడీఎంసీఎల్) కలిసి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్(ఏడీపీ)ని ఏర్పాటు చేస్తాయి. ఇందులో సీసీడీఎంసీఎల్ వాటా 50 శాతం, తమ వాటా 50 శాతం ఉండేలా అక్టోబరు 30, 2015న సింగపూర్ సంస్థల కన్సార్టియం తొలుత ప్రతిపాదించింది. ≈ కానీ సింగపూర్ కంపెనీల్లో బినామీ సంస్థలుండటంతో సింగపూర్ కంపెనీల వాటాను 58 శాతానికి పెంచాలని, ఏడీపీలో సీసీడీఎంసీఎల్ వాటా 42 శాతానికి తగ్గంచాలని స్వయంగా సీఎం సింగపూర్‌లో ఈ ఏడాది జనవరి 24, 25 తేదీల్లో చర్చల్లో సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వాటా పెంచమంటారు గానీ తగ్గించమనడం గమనార్హం. ≈ ఇంతకూ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి ఏడీపీలో సింగపూర్ సంస్థలు పెట్టే పెట్టుబడి ఎంతో తెలుసా? కేవలం రూ.306.4 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం సీసీడీఎంసీఎల్ తరఫున రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇదీ గాక మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తుంది. పైగా సింగపూర్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే రెవెన్యూ వాటా మాత్రం చెప్పకుండా సీల్డ్ కవర్లో గోప్యంగా ఉంచాలని సింగపూర్ సంస్థలు కోరగా అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ≈ ఏడీపీలో రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం.. రూ.5,721.9 కోట్లు పెట్టుబడి పెట్టే సీసీడీఎంఎల్ వాటా 42 శాతమే. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. సింగపూర్ కంపెనీలకు ఎంత మేలు చేయబోతున్నారో. ≈ రైతుల నుంచి రకరకాల మార్గాలలో సమీకరించిన భూమిలో 1,691 ఎకరాలు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు ఇస్తున్నారు. విజయవాడ బందరు రోడ్డులో గజం భూమి విలువ రూ.రెండు లక్షలకుపైగానే పలుకుతోంది. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ కేపిటల్లో గజం విలువ హీనపక్షం రూ.లక్ష పలుకుతుందని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు. ≈ ఈ లెక్కన ఎకరా భూమిలో రహదారులు, పార్కులకు కొంత పోయి.. మిగిలే 2,800 గజాల స్థలం విలువ రూ.28 కోట్లు పలుకుతుంది. అంటే.. 1,691 ఎకరాల విలువ రూ.47,348 కోట్లు. ఇందులో సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం. అంటే.. ఆ సంస్థలకు రూ.27,461.84 కోట్లు దక్కుతాయి. రాష్ట్ర ప్రభుత్వానిది 42 శాతమే కాబట్టి దక్కే సొమ్ము రూ.19,886.16 కోట్లే. ≈ అంతే కాదు.. ఈ భూమిని పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. అంటే.. పదేళ్ల తర్వాత గజం నాలుగు లక్షలు ఉంటే సింగపూర్ కంపెనీలకు వచ్చే లాభం రూ.లక్ష కోట్లను దాటిపోతుంది. ఇదంతా చూస్తోంటే.. మన భూమి ఇచ్చి మనం ఎక్కువ ఖర్చు పెట్టి సింగపూర్ కంపెనీలకు అత్యధికంగా లాభాలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సింగపూర్ కంపెనీల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆ తర్వాత ఆ కంపెనీల నుంచి కమీషన్లు పొందేందుకు ప్లాన్ వేసినట్లు అర్ధమౌతోంది. అంతా గోప్యం.. సుప్రీం మార్గదర్శకాలు బేఖాతర్ రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపికలో స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసే క్రమంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్లో గృహాల నిర్మాణానికి డెవలపర్(కాంట్రాక్టర్) ఎంపిక కేసును విచారించిన సుప్రీం కోర్టు మే 11, 2009న తీర్పు ఇచ్చింది. ఆ క్రమంలో స్విస్ చాలెంజ్ విధానం అమలుకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని నిక్చచ్చిగా అమలు చేయాలంటూ అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్ జారీ చేసిన ఉత్తర్వులను సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేయడం గమనార్హం. మార్గదర్శకం 1: స్విస్ చాలెంజ్ విధానం కింద ఏ తరహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టాలన్నది ప్రభుత్వం తొలుత గుర్తించి, వాటిపై బహిరంగ ప్రకటన చేయాలి. ఉల్లంఘన: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టే ప్రాజెక్టుల వివరాలను బహిర్గతం చేయలేదు. మార్గదర్శకం 2: ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మాస్టర్ డెవలపర్ ఎంపికకు ప్రభుత్వం ప్రతిపాదనలు ఆహ్వానించవచ్చు. లేదా ఎవరైనా స్వచ్ఛందంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించవచ్చు. మాస్టర్ డెవలపర్ ఎంపికలో సంస్థలతోగానీ.. కాంట్రాక్టర్లతోగానీ ఎలాంటి ముందస్తు సంప్రదింపులు చేయకూడదు. ఉల్లంఘన: సింగపూర్ సంస్థల కన్సార్టియంతో ముందస్తు సంప్రదింపుల కోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈలోగా జూలై 7న సీఎం చంద్రబాబు నేరుగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో చర్చలు జరిపారు. దీన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ నేతృత్వంలోని మౌలిక వసతుల కల్పన అథారిటీ నిరసించింది. మార్గదర్శకం 3: ఒరిజినల్ ప్రాజెక్టు ప్రపోజర్(ఓపీపీ) చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలి. ఈ వ్యవహారంలో ఎలాంటి గోప్యత ఉండకూడదు. ఉల్లంఘన: స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ సంస్థలు బహిర్గతం చేయలేదు. వాటిని సీల్డ్ కవర్లో ఉంచినట్లు టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇది కౌంటర్ ప్రతిపాదనలు చేసే సంస్థలకు ప్రతికూలం. మార్గదర్శకం 4: ఓపీపీ కన్నా మెరుగైన ప్రతిపాదనలతో తక్కువ ధరకు ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశాలను అన్వేషించాలి. కౌంటర్ ప్రతిపాదనల దాఖలుకు కనీసం 60 రోజుల సమయం ఇవ్వాలి. ఉల్లంఘన..: కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. మార్గదర్శకం 5: ఓపీపీతోపాటు కౌంటర్ దాఖలు చేసే సంస్థలకూ సమాన అవకాశాలు కల్పించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. ఉల్లంఘన: కేవలం విదేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టిన సంస్థలకే కౌంటర్ ప్రతిపాదనలు దాఖలు చేసే అర్హత కల్పించారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం ఏడాదికి కనిష్టంగా రూ.150 కోట్ల నుంచి గరిష్టంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తారు. టెండర్లో షెడ్యూలు దాఖలుకు ఏడాదికి కనీసం రూ.రెండు వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధన పెట్టారు. వీటిని పరిశీలిస్తే సింగపూర్ కన్సార్టియంకు లబ్ధి చేకూర్చడానికే సుప్రీం మార్గదర్శకాలను అడ్డగోలుగా ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ వాటా తగ్గించారు... ఏపీఐడీఈ-2001 చట్టం తుంగలో తొక్కారు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ)-2001 చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టాన్ని సింగపూర్ సంస్థల కోసం తానే సవరించారు. రాష్ట్రంలో ఏ సంస్థకైనా గరిష్టంగా 33 ఏళ్లకు భూములు లీజుకివ్వాలని ఏపీఐడీఈ చట్టంలోని నిబంధనను.. 99 ఏళ్లకు లీజు లేదా భూమిపై పూర్తి హక్కులు కల్పించేలా మార్పులు చేశారు. ఇక ఆ చట్టాన్ని అడ్డగోలుగా ఉల్లంఘించారు. నిబంధన 1: ఏ ప్రాజెక్టులోనైనా ప్రభుత్వానికి కనిష్టంగా 51 శాతం వాటా ఉండాలి. ఉల్లంఘన: సింగపూర్ సంస్థల కన్సార్టియం స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 50 శాతం.. తనకు 50 శాతం వాటా ఉండేలా అక్టోబరు 30, 2015న ప్రతిపాదించింది. కానీ.. గత జూలై 7న సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో సీఎం నేరుగా చర్చలు జరిపాక ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 48 శాతానికి పరిమితమైంది. సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా 52 శాతానికి పెరిగింది.ఈ మర్మమేమిటన్నది సీఎం చంద్రబాబుకే ఎరుక. నిబంధన 2: ప్రాజెక్టులపై అజమాయిషీ ప్రభుత్వానికే ఉండాలి. ఉల్లంఘన..: ఆరుగురు డెరైక్టర్లతో ఏడీపీ పాలక మండలిని ఏర్పాటు చేయాలని సింగపూర్ సంస్థలు ప్రతిపాదించాయి. ఇందులో నలుగురు సింగపూర్ సంస్థల ప్రతినిధులు.. ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. ఏడీపీ చైర్మన్‌గా తమ సంస్థలకు చెందిన డెరైక్టర్నే నియమించాలని కోరాయి. ఒక్కో డెరైక్టర్‌కు కనిష్ఠంగా 15 శాతం వాటా ఉంటుంది. ఏడాదికి నాలుగు సార్లు బోర్డు సమావేశమవుతుంది. 12 నెలలపాటూ ఒక డెరైక్టర్ బోర్డు సమావేశాలకు గైర్హాజరైతే ఆయన సభ్యత్వం రద్దవుతుంది. ఆ స్థానంలో మరొకరిని ఎంపిక చేస్తారు. ఒప్పందంలో అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఐదేళ్లపాటు ఎవరూ వాటాలను విక్రయించకూడదు. ఆ తర్వాత కూడా ప్రైవేటు సంస్థ వాటా 26 శాతానికి తగ్గకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటాలను విక్రయించాలని భావిస్తే తొలుత సింగపూర్ సంస్థలకే అవకాశం ఇవ్వాలి. సింగపూర్ సంస్థలు కొనేందుకు నిరాకరిస్తేనే ఇతరులకు విక్రయించాలి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీన్ని బట్టి చూస్తే సింగపూర్‌కు ఏ స్థాయిలో రాష్టర ప్రభుత్వం సాగిలబడిందో అర్థం చేసుకోవచ్చు. నిబంధన 3: ప్రాజెక్టుల్లో ఏవైనా వివాదాలు తలెత్తితే హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఇద్దరు నిపుణులు సభ్యులుగా నియమించిన కమిటీ వాటిని పరిష్కరిస్తుంది. ఉల్లంఘన..: సింగపూర్ కన్సార్టియం ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కార్.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో వివాదాల పరిష్కారానికి లండన్ కోర్టును వేదికగా ఎంచుకున్నారు. కేల్కర్ కమిటీ ప్రతిపాదనలూ బుట్టదాఖలే.. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు చేపట్టే విధానాలపై అధ్యయనం చేయడానికి విజయ్ కేల్కర్ అధ్యక్షతన 2011లో యూపీఏ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. బీవోటీ(బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్పర్) నుంచి స్విస్ చాలెంజ్ వరకూ అన్ని విధానాలపై సమగ్ర అధ్యయనం చేసిన కేల్కర్ కమిటీ.. దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేయవద్దంటూ నవంబర్, 2015న కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. కానీ.. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన సీఎం చంద్రబాబు మాత్రం కేల్కర్ కమిటీ ప్రతిపాదనలను తుంగలోతొక్కి స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేస్తోండటం గమనార్హం. -
దడపుట్టిస్తున్న వరుస చోరీలు
-45 రోజుల్లో 15 ఇళ్లల్లో దొంగతనాలు -ఇద్దరు పోలీసుల ఇళ్లలోనూ చోరీలకు తెగబడ్డ దుండగులు బోడుప్పల్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నది ఒక ముఠానా లేక వేర్వేరు వ్యక్తులు చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. గడిచిన 50 రోజుల్లో 15 ఇళ్లలో చోరీలు జరిగాయి. ఇళ్ల తాళాలు పగుల కొట్టి సుమారు రూ. 13 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఒక దోపిడీ సైతం జరిగింది. దాతల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి బోడుప్పల్, చెంగిచర్లలో సీసీ కెమోరాలు ఏర్పాటు కేవలం అలంకార ప్రాయంగా మారింది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలోను, దొంగలను పట్టుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 50 రోజుల్లో 15 దొంగతనాలు జరిగినా ఒక్క దొంగను కూడా పట్టుకోవడంలో పోలీసులు సఫలీకృతం కాలేకపోయారు. దీంతో ఉద్యోగస్తులు, ఊరికి వెళ్లే వారు తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఇద్దరు పోలీసుల ఇళ్లలో దొంగతనానికి తెగబడి చోరులు పోలీసులకు పరోక్షంగా సవాల్ విసిరారనే చెప్పొచ్చు. జరిగిన చోరీలు ఇవీ... బోడుప్పల్ సరస్వతి కాలనీలో బాలమణి తన చిన్న కుమారుడుతో నివాసం ఉంటుంది. జూలై 6వన తన కుమారుడు దైవ దర్శనానికి వెళ్లగా రాత్రిపూట బాలమణిని నోటికి ప్లాస్టర్ వేసి కిచెన్ బంధించి ఆగంతకులు రూ. 37,50,000 (బంగారం వస్తువుల, నగదు) దోచుకెళ్లారు. చెంగిచర్ల ఎంఎల్ఆర్ కాలనీలో నివసించే యాస శ్రీకాంత్‌రెడ్డి జూలై 1న నల్లగొండ జిల్లా తుర్కపల్లి గ్రామంలో తాతయ్యకు అనారోగ్యం ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లారు. తెల్లవారి వచ్చే సరికి ఇంట్లో ఉన్న 13 తులాలు బంగారం, 30 తులాలు వెండి కనిపించలేదు. చెంగిచర్ల క్రాంతి కాలనీలో నివసించే కృష్ణకుమార్ హైటెక్ సిటీలో సాప్ట్వేర్ ఉద్యోగి. కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లారు. మరుసటి రోజు ఇంటికి రాగా తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూసుకోగా 4 తులాల బంగారం, 30 తులాల వెండి కనిపించలేదు. సాయిభవానీనగర్లో నివసించే పోలిశెట్టి రాజేందర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఎస్ఐ. (ఆర్పీఎఫ్) ఈ నెల 13న కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్‌లో శుభకార్యానికి వెళ్లారు. 14న ఇంటికి వచ్చి చూసుకోగా 7 తులాల బంగారం, రూ. 28 వేలు కనిపించలేదు. బోడుప్పల్ పద్మావతి కాలనీలో నివసించే కొంగర శ్రీనివాస్ బ్లడ్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తారు. ఈ నెల 18న అశోక్‌నగర్‌లో రాఖీ కట్టడానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. ఇంటికి వచ్చి చూసుకోగా ఇంట్లోని బీరువాలో ఉంచిన 7 తులాల బంగారం, రూ. 28 వేలు, రెండున్నర తులాల వెండి మాయమైంది. -
పుష్కర రైళ్లలో ‘ప్రత్యేక’ దోపిడీ
* ప్రత్యేక రైళ్లలో వెళ్లేందుకు ప్రయాణికుల విముఖత * రెగ్యులర్ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్టు సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ‘స్పెషల్’ దోపిడీకి తెరలేపింది. ఆగస్టు 12 నుంచి 23 వరకు జరుగనున్న కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ సాధారణ చార్జీలపై అదనపు వసూళ్లకు దిగింది. దీంతో ఈ రైళ్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు చేసుకొనేందుకు ప్రయాణికులు వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు రెగ్యులర్ రైళ్లకు మాత్రం డిమాండ్ భారీగా పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్ రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరుకుంది. అదనపు చార్జీల కారణంగా ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల నిరాదరణకు గురవుతుండగా, రెగ్యులర్ రైళ్లకు మాత్రం రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులను ప్రకటించింది. వీటిలో ఇప్పటివరకు 100 బస్సులు బుక్ అయినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచనున్నట్లు ఆర్ఎం గంగాధర్ తెలిపారు. స్పెషల్ రైళ్లు-తత్కాల్ చార్జీలు హైదరాబాద్ నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి భక్తులు విజయవాడకు చేరుకొనేవిధంగా, పుష్కరఘాట్లకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లకు రాకపోకలు సాగించే విధంగా సుమారు 220 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. అన్ని రైళ్లలోనూ సాధారణ చార్జీల స్థానంలో తత్కాల్ చార్జీలు విధించారు. స్లీపర్ క్లాస్‌పైన సగటున రూ.100 నుంచి రూ.150 వరకు, థర్డ్ ఏసీ బెర్తులపైన రూ.250 నుంచి రూ.350 వరకు, సెకెండ్ ఏసీ పైన రూ.400 నుంచి రూ.500 వరకు అదనపు చార్జీలు విధించారు. సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగ రోజుల్లో, వేసవి సెలవుల్లో ప్రతి సంవత్సరం సాధారణ చార్జీలపైనే ప్రత్యేక రైళ్లు నడుపుతుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారి కృష్ణా పుష్కరాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అదనపు దోపిడీకి దిగింది. పుష్కరాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, శ్రీశైలం, బీచుపల్లి, నాగార్జునసాగర్‌లకు 400 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. ఆగస్టు 12 నుంచి 25 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. -
‘థర్మల్’ సాక్షిగా.. నం.1 దోపిడీ
-
‘థర్మల్’ సాక్షిగా.. నం.1 దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఇల్లు కట్టుకోవాలనుకున్నపుడు ఏం చేస్తాం? ఫలానా చోట అంత తక్కువ రేటుకు చేశారు.. అక్కడ ఇంత తక్కువకు ఈ పనిచేశారు అంటూ ఏకరువు పెట్టి మేిస్త్రీలతో బేరాలాడతాం. మనం పెట్టిన కండిషన్ల మేరకు ఎవరు తక్కువకు చేస్తానంటే వారికి కాంట్రాక్టు అప్పగిస్తాం. కానీ చంద్రబాబునాయుడు మాత్రం కాస్త డిఫరెంట్. ప్రజాధనం ఎంత వృథా అయిపోతున్నా ఆయన బేఫికర్... అస్సలు అవసరమే లేని ప్రాజెక్టులను చేపట్టడం ఆయన స్టయిల్. ప్రభుత్వరంగ సంస్థలు తక్కువకు చేస్తున్నా కాదని ప్రైవేటు కంపెనీలకు పనులు అప్పగించడం ఆయనకు మహా ఇష్టం.దేశంలో ఎక్కడా లేని ధరలను కోట్ చేసినా కళ్లు మూసుకుని ఖరారు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అవసరమైతే కాంట్రాక్టును ప్యాకేజీలుగా విడగొట్టి మరీ ప్రైవేటు కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడంలో ఆయన్ను మించినవారు లేరంటారు. పొరుగు రాష్ట్రాలలో తక్కువకే పనులు జరుగుతున్నా బాబు అస్సలు పట్టించుకోరు. రాష్ర్టంలో ఇటీవల ఖరారు చేసిన రెండు థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. రెండు ప్రాజెక్టులలో కలిపి ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతున్న ప్రజాధనం రూ. 2,392 కోట్లు. అందులో చేతులు మారిన ముడుపులు రూ. 1,150 కోట్లు పైమాటే.. ఈ వ్యవహారాన్ని కాస్త పరిశీలిస్తే నిర్ఘాంతపోయే వాస్తవాలు కళ్లకు కడుతున్నాయి. అవేమిటో చూద్దాం.... అవసరమే లేని ఆ రెండు ప్రాజెక్టులు.. రాష్ట్రంలో గడచిన రెండేళ్ళలో విద్యుత్ డిమాండ్ ఏమాత్రం పెరగలేదు. ఉన్న థర్మల్ ప్రాజెక్టుల్లోనే తరచూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కొత్తగా కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలో ఒక్కొక్కటీ 800 మెగావాట్ల సామర్థ్యంతో కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలలో రెండు థర్మల్ ప్లాంట్లు నిర్మించాలని రాష్ర్ట ప్రభుత్వం తలపెట్టింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే తరహా ప్రాజెక్టులను చేపడుతున్నాయి. అయితే అవన్నీ నిర్దిష్టమైన ప్రమాణాలతో కాంట్రాక్టులు అప్పగిస్తున్నాయి. సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌కే పనులు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ కూడా థర్మల్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. కేవలం రెండు ప్రైవేటు కంపెనీలకు కాంట్రాక్టులు అప్పగించాలని ముందే నిర్ణయించుకుంది. వాళ్ళే అర్హత పొందేలా నిబంధనలు పెట్టింది. ఈనెల 6న కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం టెండర్లు ఖరారుచేశారు. కృష్ణపట్నంలో టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఇబ్రహీంపట్నంలో బీజీఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లకు కాంట్రాక్టులు దక్కాయి. దోపిడీ కోసమే ప్యాకేజీల విభజన మిగతా రాష్ట్రాలన్నీ ఇదే తరహా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా... అవి మాత్రం ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలిచాయి. ఏపీ మాత్రం ఒకే ప్రాజెక్టును బీటీజీ (బాయిలర్, టర్బైన్, జనరేటర్), బీవోపీ (బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్)లు అంటూ రెండు ప్యాకేజీలుగా విడగొట్టింది. బీటీజీలో యంత్ర పరికరాలే ఉంటాయి. ఇవన్నీ కొనుగోలు చేసేవే. వాటికి నిర్దిష్టమైన ధరలు ఉంటాయి. దోచుకోవడానికి ఇందులో పెద్దగా అవకాశం ఉండదు. అందుకే ఈ పనులను ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్కు అప్పగించింది. ఇక బీవోపీ కాంట్రాక్టుల విషయంలో మాత్రం ఏలినవారు మనవారైతే అందినంత దోచుకునేందుకు అవకాశముంటుంది. అందుకే రాష్ర్టప్రభుత్వం ముడుపులిచ్చే వారికే కాంట్రాక్టులు అప్పగించేలా చేసిందన్న విమర్శలున్నాయి. వారికి పోటీ రాకుండా అర్హత నిబంధనలు రూపొందించడం చూస్తే అది నిజమేననిపిస్తుంది. రెండు థర్మల్ ప్రాజెక్టులు నిర్మించిన అనుభవం ఉండాలని, ఇందులో ఒకటి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించి ఉండాలంటూ ఎన్టీపీసీలో కూడా లేని రూల్స్ పెట్టింది. అలాంటి అర్హతా నిబంధనల వల్లే కృష్ణపట్నంలో టాటా, ఇబ్రహీంపట్నంలో బీజీఆర్‌లకు కాంట్రాక్టులు దక్కాయి. పోటీ లేకపోవడంతో ఈ రెండు సంస్థలు చాలా ఎక్కువ మొత్తం కోట్ చేశాయి. జెన్కో నియమించిన కన్సల్టెన్సీ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఏ రాష్ట్రంలోనూ లేనంత ఎక్కువ! టాటా, బీజీఆర్ కంపెనీలు కోట్ చేసిన ధరలు ఏ రాష్ట్రంలోనూ కన్పించడం లేదు. 2014 నుంచి ఇప్పటి వరకూ మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్రలో పలు చోట్ల థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఖరారు చేశారు. ఏపీ కాంట్రాక్టులకు, వీటికి ఎక్కడా పోలిక కన్పించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగూడెం, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులను 800 మెగావాట్ల సామర్థ్యంతో చేపడుతోంది. ఆ రాష్ట్రం ఒకే ప్యాకేజీగా (బీటీజీ, బీవోపీ కలిపే) టెండర్లు పిలిచింది. కొత్తగూడెం కాంట్రాక్టును మెగావాట్ రూ. 4.76 కోట్ల చొప్పున ఇచ్చింది. యాదాద్రిలో చేపట్టే 800 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు ప్లాంట్ల పనుల కాంట్రాక్టు మెగావాట్‌కు రూ. 4.48 కోట్లకు చేపట్టేందుకు బీహెచ్ఈఎల్ ముందుకొచ్చింది. జార్ఖండ్‌లోని ఖరాన్పుర వద్ద ఎన్టీపీసీ చేపట్టే 660 మెగావాట్ల సామర్థ్యం గల మూడు థర్మల్ ప్రాజెక్టు పనులను బీఈహెచ్ఈఎల్కు మెగావాట్ రూ. 3.97 కోట్లకే కాంట్రాక్టు ఇచ్చింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టులకు భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. కృష్ణపట్నంలో బీటీజీ ప్యాకేజీ పనులను బీహెచ్ఈఎల్కు మెగావాట్‌కు రూ. 2.88 కోట్లకు ఇచ్చారు. ఇక్కడ బీవోపీ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు రూ. 3.32 కోట్లకు ఇచ్చారు. ఈ రెండూ కలిపితే కృష్ణపట్నం ప్రాజెక్టు కాంట్రాక్టు మెగావాట్‌కు రూ. 6.20 కోట్లకు చేరింది. ఇబ్రహీంపట్నంలో బీటీజీ కాంట్రాక్టును బీహెచ్ఈఎల్కు మెగావాట్‌కు 2.88 కోట్లకు, బీవోపీ కాంట్రాక్టును బీజీఆర్ ఎనర్జీ సంస్థకు మెగావాట్‌కు 2.87 కోట్లకు ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టు మెగావాట్‌కు 5.75 కోట్లకు చేరింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువని ఈ మొత్తాలు చూస్తే అర్థమౌతుంది. ఒకే కంపెనీ... రెండు ధరలు.. ఏపీలోని ఇబ్రహీంపట్నం థర్మల్ (800 మెగావాట్ల) కాంట్రాక్టుకు బీజీఆర్ సంస్థ రూ. 2,307 కోట్లు కోట్ చేసింది. అంటే మెగావాట్‌కు రూ. 2.88 కోట్లు (బీవోపీ ప్యాకేజీ). ఇదే సంస్థ మధ్యప్రదేశ్‌లోని బరేతీలో ఎన్టీపీసీ చేపట్టిన థర్మల్ ప్రాజెక్టు (660 మెగావాట్తో నాలుగు ప్లాంట్లు = 2,640 మె.వా) బీవోపీ కాంట్రాక్టును గత ఏడాది ఆగస్టు 14న రూ. 2,196 కోట్లతో టెండర్ దక్కించుకుంది. అంటే మెగావాట్‌కు రూ. 83 లక్షలు అన్న మాట. మధ్యప్రదేశ్‌లో టెండర్ ఖరారు అయిన కేవలం ఐదు నెలల్లోనే (4-12-2015) ఒకే తరహా పనికి దాదాపు రూ. 2కోట్లు ఎక్కువ కోట్ చేసింది. (బరేతీలో మెగావాట్ రూ. 83 లక్షలు... ఏపీలోని ఇబ్రహీంపట్నంలో రూ. 2.88కోట్లు). ఇంత వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తున్నా ఏపీ సర్కారు కావాలని విస్మరించినట్లు అర్ధమౌతోంది. దీన్ని బట్టి చూస్తే ముడుపుల మహిమ ఎలా పనిచేసిందో అర్ధం చేసుకోవచ్చు. -
పుష్కర పనుల్లో దోపిడీ
పుష్కర పనులు నాసిరకంగా సాగుతున్నాయని, అధికార పార్టీ నేతల దోపిడీకి మారుపేరుగా నిలుస్తున్నాయని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో ధరణికోట, అమరావతి, సీతానగరంలో ఘాట్లను పార్టీ నాయకులు అంబటి రాంబాబు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ సమస్వయకర్తలు కావటి మనోహర్‌నాయుడు, క్రిస్టినా, బొల్లా బ్రహ్మనాయుడు, రావి వెంకటరమణ, అన్నాబత్తుని శివకుమార్‌లతో కలిసి వారు పరిశీలించారు. ఘాట్లలో జరుగుతన్న పనుల తీరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పనుల్లో సాంకేతికపరమైన అంశాలు,నాణ్యతపై ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నలవర్షం కురిపిస్తుంటే.. అధికారులు నీళ్లు నమిలారు. ధరణికోటలో 350 మీటర్ల మేర ఘాట్ పనులు దాదాపు రూ. 10 కోట్లతో జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇంతవరకు కేవలం 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. 0.4 మీటర్ల మందంతో కాంక్రీట్ వేయాల్సిఉండగా.. కనీసం 0.2 మీటర్ల మందం కూడా వేయడం లేదని, ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ జరుగుతున్న పనులేనన్నారు. కాంక్రీట్‌కు ముందు ఇసుక వేసి చదును చేసేటప్పుడు పిన్ వైబ్రేటర్ వాడాలి. కాంక్రీట్ వేసేటప్పుడు ప్యాన్ వైబ్రేటర్ ఉపయోగించాలి. అవేమీ ఇక్కడ కనిపించలేదన్నారు. బెడ్‌కు వాడే కాంక్రీట్‌కు 40 ఎంఎం కంకర బదులు అన్‌సైజు 3/4 కంకర వాడుతున్నారని పేర్కొన్నారు. అక్కడ నదిలో ఉన్న ఇసుకను వినియోగిస్తూ.. క్యూబిక్ మీటరుకు రూ. 250 వంతున దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. పనుల్లో వాడుతున్న స్టీల్‌కు టెస్టింగ్ సర్టిఫికెట్లు అడిగితే చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెస్టింగ్ క్యూబ్ గురించి అధికారులు మాట్లాడటం లేదని పేర్కొన్నారు. పుష్కరాల తేదీలు ముందుగా తెలియదా అని ప్రశ్నించారు. జూన్ 10న పనులు ప్రారంభించి హడావుడి చేయడమేమిటని వారు ప్రశ్నించారు. గడువు మేరకు ఈ నెలాఖరుకు పనులు కాకపోతే కాంట్రాక్టర్లకు రేట్లు పెంచే కుట్ర జరుగుతుందన్నారు. జేబులు నింపుకోవడానికే.. పుష్కర పనులను సైతం సీఎం చంద్రబాబునాయుడు, చినబాబు , స్థానిక అధికార పార్టీ నేతలు వదలటం లేదన్నారు. పనులు నాసిరకంగా చేసి వాటాలు పంచుకొంటున్నారని ఆరోపించారు. పనులు జరుగుతున్న తీరు చూస్తే భక్తుల కోసమా, జేబులు నింపుకోవటానికా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యత పాటించలేదనే విషయం స్పష్టమవుతుందన్నారు. ఇప్పటికే అవినీతికి సంబంధించి ఏపీ అగ్రస్థానంలో ఉందని జాతీయస్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. నంబరు 1 సీఎం అని గొప్పలు చెప్పుకొనే బాబు అవినీతి పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు. ఈ పర్యటనలో పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
తిరుపతమ్మ చెంత.. భక్తుల చింత
* భక్తులను దోచుకుంటున్న వ్యాపారులు * పట్టించుకోని అధికారులు పెనుగంచిప్రోలు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం అధిక ధరలు వసూలు చేయకూడదని ఉన్నా కాంట్రాక్టర్లు మాత్రం అవేమి పట్టించుకోవడం లేదు. భక్తుల మనోభావాలను ఆసరాగా తీసుకొని వారు సొమ్ము చేసుకుంటున్నారు. పుణ్యం కోసం దేవుని వద్దకు వస్తే జేబుకు చిల్లులు పడుతున్నాయని భక్తులు వాపోతున్నారు. వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. రెట్టింపు పార్కింగ్ ఫీజు ఆలయ పరిసరాల్లో వాహనాల పార్కింగ్ చేసుకున్నందుకు కాంట్రాక్టర్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా శుక్ర, ఆదివారాల్లో వేల సంఖ్యలో వాహనాలు వస్తాయి. ఆలయం వారు ద్విచక్ర వాహనానికి రూ.5లు వసూలు చేయాలని నిర్ణయించగా రూ. 10 , కారుకు రూ.20, ఆటోకు రూ.10 నిర్ణయించగా వాటికి మరో రూ.10 అదనంగా వేసి వసూలు చేస్తున్నారు. పొంగళ్ల షెడ్డు వద్ద అధిక వసూళ్లు.... అమ్మవారికి కుండలో పొంగళ్లు చేయడం భక్తుల ఆనవాయితీ. ఆలయానికి వచ్చిన భక్తుల్లో 90 శాతం మంది పొంగళ్లు చేస్తారు. అయితే పొంగలి వండుకునేందుకు చిన్నకుండ అయితే రూ.20లు తీసుకోవాల్సి ఉండగా రూ.30, పెద్దకుండకు రూ.30 తీసుకోవాల్సి ఉండగా రూ.50 వసూలు చేస్తున్నారు. కొబ్బరికాయ రూ.50లు.... నిబంధన ల ప్రకారం కొబ్బరికాయ రూ.20లకు విక్రయించాల్సి ఉండగా కొబ్బరికాయతో పాటు జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ కలిపి రూ.50లు వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల కొందరు భక్తులు ఫిర్యాదు చేయడంతో కొబ్బరికాయ ఒక్కటి రూ.25లు అమ్ముతున్నారు. అయినా రూ.5లు అధికంగానే తీసుకుంటున్నారు. గడ్డి కట్ట రూ.5లు.... ఆలయం ముందు గోశాలలో గోవులకు భక్తులు పచ్చి గడ్డి పెట్టేందుకు ఆలయ అధికారులు కట్టకు రూ.2లు నిర్ణయించగా రూ.5లు వసూలు చేస్తున్నారు. ఒకోసారి రూ.10లకు 3కట్టలు ఇస్తున్నారు. భక్తులు టెంకాయలు కొట్టే వద్ద కూడా కాంట్రాక్టరు ఏర్పాటు చేసుకున్న సిబ్బంది కొబ్బరికాయ కొట్టాలంటే డిమాండ్ చేసి మరీ వసూలు చేస్తున్నారు. ప్రసాదాలు పెట్టుకునేందుకు కవర్లు విక్రయం కూడా దారుణంగా ఉంది. నిబంధనల ప్రకారం కవరు రూ.2లు విక్రయించాల్సి ఉండగా రూ.5వసూలు చేస్తున్నారు. లక్షలు పలుకుతున్న వేలం పాటలు... భక్తుల నుంచి అధికంగా వసూలు చేసుకోవచ్చనే భావనతో కాంట్రాక్టర్లు లక్షలు వెచ్చించి పాటలను కైవసం చేసుకుంటున్నారు. ఆలయం వద్ద ఏడాది పాటు కొబ్బరికాయలు విక్రయించుకునేందుకు రూ.42 లక్షలు, వస్త్రాలు పోగు చేసుకునేందుకు రూ.32.30లక్షలు, పొంగళ్ల షెడ్ల నిర్వహణకు రూ.20 లక్షలు, వాహనాల పార్కింగ్‌కు రూ.13.55 లక్షలు, కొబ్బరిచిప్పలు పోగు చేసుకునేందుకు రూ.25లక్షలకు కాంట్రాక్టర్లు పాటలు సొంతం చేసుకున్నారు. -
స్విస్ ఛాలెంజ్ ఓ దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రయోజనాలకు హానికరమైన స్విస్ ఛాలెంజ్ విధానాన్ని రద్దు చేసి రాజధాని పనుల నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు పిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగపూర్ సంస్థలతో చేసుకుంటున్న ఈ ఒడంబడికలో పారదర్శకత లేదని, అది పూర్తిగా చీకటి ఒప్పందమని విమర్శించారు. వ్యక్తిగత స్వార్థం, దోపిడీ చేసే దురాలోచనతోనే ఈ విధానాన్ని సీఎం అమలు చేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణాన్ని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ సంస్థలకు కట్టబెట్టాలని భావిస్తున్నామని, ఇది కాదని ఎవరైనా ముందుకు వస్తే కూడా పరిశీలిస్తామని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పిన తరువాత మరే సంస్థలైనా ముందుకు వస్తాయా? అని బొత్స సూటిగా ప్రశ్నించారు. స్విస్ విధానం ఎంత మాత్రం సరైనది కాదని పారదర్శకత ఉండదని, అమలు చేస్తే ప్రమాదమని 2015 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పేర్కొందన్నారు. అలాగే ఏపీ మౌలిక సదుపాయాల శాక ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్ ఈ పద్ధతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేస్తూ వాటిని ఉల్లంఘించరాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విధానానికి వ్యతిరేకంగా ఉన్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చిన మాట వాస్తవం కాదా? అని ఆయన అన్నారు. కేంద్రం సహా అంతా వ్యతిరేకిస్తున్న ఆ లోపభూయిష్టమైన విధానాన్నే అమలు చేయాలని ఎందుకు బరితెగిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. దేశంలో రాజధాని నిర్మించేంతటి కంపెనీలున్నాయా అని సీఎం మాట్లాడ్డం అందరినీ అవమానించడమేనన్నారు. రేపు ఎన్నికల అనంతరం మరో ప్రభుత్వం అధికారంలోకి వ చ్చి ఈ చీకటి ఒప్పందాలను రద్దు చేస్తే భారీగా పరిహారం చెల్లించాలని సింగపూర్ సంస్థలు కోరిన కోర్కెను మంత్రివర్గం ఆమోదించారన్నారు. ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే ఇలాంటి ఒప్పందాలను వచ్చే ప్రభుత్వం రద్దు చేస్తే భారీ పరిహారం చెల్లించాలా? ఏం విడ్డూరం ఇది! రాష్ట్ర ప్రజలారా గమనించండి దీని వెనుక ఎంత దోపిడీ దాగి ఉందో... అని బొత్స అన్నారు. ప్రభుత్వం మారితే అన్న అనుమానం మంత్రివర్గ సభ్యులకు రావడం చూస్తే ఎన్నికల తరువాత ఈ ప్రభుత్వం ఉండదని వారే అంగీకరించిట్లని ఆయన అన్నారు. రాజధానిని అడ్డుకుంటున్నామని తమపై చేస్తున్న విమర్శల్లో నిజంలేదని, తాము అడ్డుకుంటున్నది రాజదాని నిర్మాణంలో సాగుతున్న అవినీతి, దోపిడీలనేనని బొత్స స్పష్టం చేశారు. -
రూ.12 లక్షలు కొట్టేసి... 24 గంటల్లో చిక్కారు..
కొలిక్కి వచ్చిన సుల్తాన్‌బజార్ దారి దోపిడీ దుకాణ యజమాని ‘పనివాడే’ సూత్రధారి ఐదుగురు నిందితుల అరెస్టు, పరారీలో ఇద్దరు సుల్తాన్‌బజార్: సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలోని బొగ్గులకుంటలో శనివారం రాత్రి చోటు చేసుకున్న భారీ దారి దోపిడీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌తో పాటు ఈస్ట్‌జోన్ అధికారులూ ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపి సూత్రధారి సహా ఐదుగురు నింది తుల్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఆదివారం సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు డాక్టర్ వి.రవీందర్, బి.లింబారెడ్డి కేసు పూర్వాపరాలు వివరించారు. అసలేం జరిగిదంటే... రాంకోఠి ప్రాంతానికి చెందిన దివేశ్ హాడియా సిద్దంబర్ బజార్లో రాజాని టైర్స్ పేరిట దుకాణం నిర్వహిస్తున్నారు. దివేష్ శనివారం రాత్రి వ్యాపారం ముగిసిన తర్వాత తన దుకాణం మూసేసి, లావాదేవీలకు సంబంధించిన రూ.12 లక్షల్ని ఓ బ్యాగ్‌లో పెట్టుకుని తన యాక్టివా వాహనంపై ఇంటికి బయలుదేరారు. 8.30 గంటల ప్రాంతంలో తిలక్‌రోడ్డు బొగ్గులకుంటలోని ఆదిత్య ఆసుపత్రి దాటగానే గుర్తుతెలియని వ్యక్తులు దివేష్ వాహనాన్ని మరో వాహనంతో ఢీ కొట్టాడు. దీంతో రెండు వాహనాలపై ఉన్న వారితో పాటు వాహనాలూ కిందపడిపోయాయి. మరో బైక్‌పై వస్తున్న కొందరు వ్యక్తులు వ్యాపారిని లేపి సపర్యలు చేస్తున్నట్లు నటిస్తూ నగదు బ్యాగ్ ఉన్న యాక్టివా వాహనాన్ని ఎత్తుకుపోయారు. ఎవరు, ఎలా ప్లాన్ చేశాడంటే... జియాగూడకు చెందిన జగదీష్ అనే వ్యక్తి దివేష్ ఎదురుగా ఉన్న జైన్ టైర్స్షాపులో పనిచేస్తున్నాడు. దివేష్ దగ్గర పని చేసే వాళ్లు రానప్పుడు జగదీష్ సహాయంగా ఉండేవాడు. దివేష్ దుకాణంలో సహాయకారిగా వచ్చినప్పుడల్లా జగదీష్ అతడి వ్యాపార లావాదేవీలు పరిశీలించేవాడు. ఎప్పుడు దుకాణం మూస్తాడు? ఏ సయమంలో, ఏ మార్గంలో ఎలా ఇంటికి వెళ్తాడు? నగదు ఏ విధంగా తరలిస్తుంటాడు? తదితర అంశాలు క్షుణ్ణంగా గమనించాడు. ఇవన్నీ సంగ్రహించిన తర్వాత దోపిడీకి స్కెచ్ వేశాడు. తాను నేరుగా దోపిడీ చేస్తే చిక్కుతాననే ఉద్దేశంతో తన స్నేహితుడైన మంగళ్‌హాట్ జాలీహనుమాన్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి అశీష్ (20) ద్వారా స్కెచ్ అమలు చేయాలనుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అశీష్ బాలాపూర్ ఇంద్రనగర్‌కు చెందిన మల్లిఖార్జున్ అలియాస్ మాలిక్ (22) అలిబండకు చెందిన బైక్ మెకానిక్ మహ్మద్ అమీర్ (22) మంగళ్‌హట్ జాలీహనుమాన్కు చెందిన రాజమిశ్రా(17), బాలాపూర్‌కు చెందిన మహ్మద్ హబీబ్ (20), జల్పల్లికి చెందిన ఆసిఫ్‌లతో ముఠా ఏర్పాటు చేశారు. స్కెచ్ ఎలా అమలైందంటే... దివేష్ వ్యాపారం శనివారం ఎక్కువగా జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజే దోపిడీ చేయాలనుకున్నారు. గత శనివారం (11వ తేదీ) అబిడ్స్‌లోని గ్రాండ్ హోటల్లో సమావేశమైన ఈ ముఠా తమ ప్లాన్‌ను అమలు చేయాలనుకుంది. అయితే ఆ రోజు దివేష్ నిత్యం వెళ్లే సమయం కంటే ముందుగా ఇంటికి వెళ్లిపోవడంతో సాధ్యం కాలేదు. దీంతో ఈ శనివారం (18వ తేదీ) ముహూర్తం ఖరారు చేసుకున్నారు. జగదీష్ మినహా మిగిలిన వారంతా దివేష్ను అబిడ్స్ నుంచి ద్విచక్ర వాహనాలపై అనుసరించారు. బొగ్గులకుంట వద్ద మల్లిఖార్జున్ తన వాహనంతో దివేశ్ వాహనాన్ని ఢీ కొట్టాడు. మరో బైక్‌పై వస్తున్న ఆశీష్ ఇతర సభ్యులు సపర్యలు చేస్తున్నట్లు నటించి డిక్కీలో ఉన్న రూ.12 లక్షల బ్యాగ్‌తో పాటు వ్యాపారి వాహనాన్నీ తస్కరించారు. ఎలా దర్యాప్తు చేశారంటే... ఉదంతం జరిగిన గంట తర్వాత బాధితుడు స్థానికుల సాయంతో సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం ఇచ్చారు. సుల్తాన్‌బజార్ ఏసీపీ రావుల గిరిధర్ నేతృత్వంలో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకట రెడ్డి, సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ పి.శివశంకర్ రాావు, అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ సి.అంజయ్య, సుల్తాన్‌బజార్ డీఐ వంశీకష్ణ తమ బృందాలతో రంగంలోకి దిగారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన నేపథ్యంలో పక్కా పథకం ప్రకారం తెలిసిన వ్యక్తులే చేసినట్లు అనుమానించారు. దివేష్ వద్ద పని చేస్తున్న, పని చేసి మానేసిన, అప్పుడప్పుడు వచ్చి పని చేసే వారి వివరాలు సేకరించారు. దీంతో జగదీష్సింగ్పై అధికారులకు అనుమానం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. నిందితులు బొగ్గులకుంట మీదుగా చాదర్ఘట్ వెళ్లి అక్కడ నుంచి బాలాపూర్‌కు చెరుకున్నారని తేలింది. హబీబ్ ఇంట్లో నగదు పంచుకున్నారని వెల్లడైంది. ఐదుగురు నిందితులను బాలాపూర్‌లోనే అరెస్ట్ చేసిన పోలీసులు 3 బైకులు, రూ. 10.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తం పరారీలో ఉన్న మల్లిఖార్జున్, ఆసిఫ్ వద్ద ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. -
దోపిడీకి ప్లానింగ్
అపరాధ రుసుం దందా రూ.20 కోట్లపైనే రెచ్చిపోతున్న అక్రమార్కులు పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ టౌన్‌ప్లానింగ్ విభాగంలో ‘ఫైన్’ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అనధికారిక కట్టడాలపై ఎక్కు పెట్టిన జరిమానా అస్త్రం గురి తప్పుతోంది. నగరపాలక సంస్థ ఖాతాలో అరకొర ఆదాయం జమ అవుతుండగా అక్రమార్కుల పంటపండుతోంది. కొన్ని సందర్భాల్లో హద్దులు దాటడంతో ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ల గడప తొక్కుతున్నాయి. విజయవాడ సెంట్రల్ : నగరంలో అక్రమ కట్టడాలు ఇబ్బడి ముబ్బడిగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గతంలో నిర్మాణం చేసిన అక్రమ కట్టడాల నుంచి మార్కెట్ విలువలో పదిశాతం మేర అపరాధ రుసుం వసూలు చేయాల్సిందిగా నాలుగు నెలల క్రితం కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. అందుకు పూర్తి విరుద్ధంగా టౌన్‌ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. తాజాగా 14వ డివిజన్ భూపేష్ గుప్తానగర్‌లో అక్రమ నిర్మాణం విషయమై బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఆషా, లక్ష రూపాయలు డిమాండ్ చేసిందని, అందులో కొంత మొత్తమే చెల్లించడంతో ఇంటిని కూల్చివేసిందని, అదేమని ప్రశ్నిస్తే తనపై దౌర్జన్యం చేసిందని లక్ష్మీరాజ్యం ఫిర్యాదు చేసింది. తన విధులకు ఆటంకం కలిగించిందంటూ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కౌంటర్ కేసు పెట్టారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. దోచేయ్.. భవానీపురం, పటమట, గవర్నర్‌పేట, సత్యనారాయణపురం, సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి టౌన్‌ప్లానింగ్ అధికారులు వసూలు చేస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం పదిశాతం ఫీజు కట్టించాలనే ప్రతిపాదన పక్కన పెట్టేశారు. నామమాత్రంగా ఫైన్ కట్టించి భారీగా ముడుపుల తీసుకుంటున్నారు. భవానీపురం, సత్యనారాయణపురం, గవర్నర్‌పేట ప్రాంతాల్లో రూ.లక్షల మొత్తంలో బేరాలు సాగుతున్నాయనేది బహిరంగ రహస్యం. సింగ్‌నగర్‌లో 62 గజాల స్థలంలో రెండో అంతస్తు కావాలంటే ఫైన్ రూ.20 వేలు, మామూళ్ల కింద రూ.30 వేల నుంచి రూ.50 వేల చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మూడు నెలలుగా అధికారులు వసూలు చేసిన అపరాధ రుసుం మొత్తం రూ.2 కోట్లు ఉంటే అవినీతి అధికారులు మాత్రం రూ.20 కోట్ల మేర వెనకేసుకున్నట్లు సమాచారం. నిఘా ఏది ? విజిలెన్స్, ఏసీబీ అధికారులు మూడు నెలలకోసారి టౌన్‌ప్లానింగ్‌పై మొక్కుబడి విజిట్లతో సరిపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. టౌన్‌ప్లానింగ్ విభాగంలో అక్రమాలు పేట్రేగిపోతున్నాయని, దీనికి ఆన్‌లైన్‌తో కళ్లెం వేస్తానని మంత్రి పి.నారాయణ ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఆన్‌లైన్‌ను ప్రవేశపెట్టారు. దీంతో అవినీతి రాయుళ్లు ఆలోచలో పడ్డారు. వ్యూహాత్మకంగా తెరపైకి వచ్చిన ఫైన్ మంత్రంతో దోచేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఫైన్ వసూలు చేసినంత మాత్రన అవి రెగ్యులర్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. భవిష్యత్‌లో బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్) స్కీం అమలైతే మళ్లీ సొమ్ములు చెల్లించి రెగ్యులరైజ్ చేయించుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా నగరపాలక సంస్థలో సాగుతున్న దోపిడీపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
బూట్లు.. బుక్స్ ఏదైనా బాదుడే!
{Oపెవేట్ స్కూళ్ల మాయాజాలం టై నుంచి పుస్తకాల వరకు అదనపు వసూళ్లు పాఠశాల ఆవరణలోనే కౌంటర్లు పెట్టి మరీ విక్రయాలు తల్లిదండ్రుల నెత్తిన మోయలేని భారం సిటీబ్యూరో: ప్రైవేటు స్కూళ్లలో దోపిడీకి ఎన్నో దారులు..ఎన్నెన్నో రూపాలు. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదలడం లేదు. శక్తిమేర పిల్లల తల్లిదండ్రులను పీల్చిపిప్పి చేస్తున్నా..పట్టించుకునే నాథుడే లేడు. పిల్లలు పెట్టుకునే ‘టై’ నుంచి యూనిఫాం వరకు...అన్నింటా బాదుడే బాదుడు. అంతేగాదు...పాఠశాలలను చివరకు సేల్స్ స్టోర్స్గానూ మార్చేశారు. నగరంలోని దాదాపు అన్ని ప్రైవేటు స్కూళ్లలో ఇదే పరిస్థితి. ఫీజులే కాకుండా బుక్స్, నోట్‌బుక్స్, షూస్, సాక్స్, పలకలు, పెన్నులు, చాక్‌పీస్‌లు, బ్యాగుల అమ్మకాల ద్వారా పాఠశాలల యాజమాన్యాలు రూ. కోట్లు వెనకేసుకుంటున్నాయి. ఇదంతా నిబంధనలకు విరుద్ధమే. తనిఖీలకు వెళ్లిన అధికారులకు ఇవన్నీ కంట పడినా.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అధికారులూ పట్టించుకోకపోవడంతో... తల్లిదండ్రులూ తప్పక భారాన్ని భరిస్తున్నారు. నిబంధనలకు పాతర పాఠశాలల పునఃప్రారంభ సమయాన్ని స్కూళ్లు బాగా వాడుకుంటున్నాయి. ఇప్పటికే ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండగా.. మరోవైపు అభ్యసనా సామగ్రి, యూనిఫాంలు, షూ, టై, డైరీ తదితర రూపాల్లో తల్లిదండ్రుల నుంచి డబ్బులు పిండుకుంటున్నాయి. వాస్తవంగా ఇవన్నీ పాఠశాలల్లో కొనుగోలు చేయాల్సిన నిబంధన ఎక్కడా లేదు. అయినా యాజమాన్యాలు స్కూళ్లలో ఏకంగా వీటికోసం కౌంటర్లు తెరిచి అమ్ముతుండడం గమనార్హం. తమ స్థాయికి తగ్గట్లుగా డబ్బులు తీసుకుంటున్నారు. రెండు జతల యూనిఫాంలకు రూ. 2000 నుంచి 3,000, టై కి రూ. 200, షూ కి రూ. 500 - 1,000, డైరీకి దాదాపు రూ.300 లాగుతున్నారు. పాఠ్య పుస్తకాలు బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తున్నా.. బలవంతంగా విద్యార్థి చదివే స్కూల్లోనే తీసుకోవాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఎల్కేజీ బుక్స్‌కి రూ. 3,500 - రూ. 4,000 వసూలు చేస్తుండడం దోపిడీకి నిదర్శనం. ఇదే బుక్స్ బయట రూ. 1,800 కే అందుబాటులో ఉన్నాయి. ఇక 150 రూపాయలకే లభించే షూస్‌ను మూడింతల అధిక ధరకు అంటగడుతున్నారు. స్కూళ్లలో సామగ్రి అమ్మడం జీఓ నం 91కి విరుద్ధం. ఒకవేళ యాజమాన్యాలు విక్రయించాలనుకుంటే.. సదరు స్కూల్‌కు సంబంధించిన అభ్యసన సామగ్రి తదితరాలు లభ్యమయ్యే రెండు షాపులను ప్రత్యామ్నాయంగా చూపాలి. ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ తల్లిదండ్రులు కొనుగోలు చేస్తారు. అయితే ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. తిండిలోనూ దండుకోవడం... స్నాక్స్, భోజనం అందించడంలోనూ ఒక్కో స్కూల్లో ఒక్కో రేటు ఉంది. గచ్చిబౌలిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి విద్యార్థికి మధ్యాహ్నం భోజనం అందిస్తున్నందుకు రూ. 20 వేలు వసూలు చేస్తున్నారు. అలాగే స్నాక్స్ సమకూర్చుతున్నందుకు రోజుకు రూ. 150 - రూ. 200 పిండుకుంటున్న స్కూళ్లూ ఉన్నాయి. మరికొన్ని బడులు స్నాక్స్కుగాను ఏడాదికి ఒకేసారి రూ. 18 వేల వరకు ధర నిర్ణయించారు. స్నాక్స్, భోజనం రెండూ కావాలంటే కనీసం ఏడాదికి రూ. 30 వేలు చెల్లించాల్సిందే. రోడ్డెక్కిన తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల పలు రకాల దోపిడీలపై తల్లిదండ్రులు కన్నెర్ర చేస్తున్నారు. ఈమేరకు నగరంలో వీరంతా పేరెంట్స్ జేఏసీగా ఏర్పడి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. శనివారం ఇందిరాపార్కు వద్ద పేరెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ మహాధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట వేస్తే మంచిది. బాదుడు ‘ఎక్స్ట్రా’... ఎక్స్ట్రా యాక్టివిటీల కింద క్రీడలు, ఆటల పేరిటా బాదుతున్నారు. వాస్తవంగా బడ్జెట్ స్కూళ్ల నుంచి మొదలుకుంటే.. ఇంటర్నేషనల్ స్కూళ్ల వరకు క్రీడా మైదానాలు ఉన్నవి చాలా తక్కువ. ముఖ్యంగా నగరంలో 90 స్కూళ్లకు క్రీడా మైదానాలే లేవు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం తరగతి గదులకే పరిమితమయ్యే ఆటలు ఆడిస్తున్నా.. వాటికీ అదనంగా వసూలు చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ముసుగులోనూ ఫీజులు తీసుకుంటున్నారు. ట్యాబ్, కంప్యూటర్, ఇంటర్నెట్ వినియోగం.. ఇలా తదితర వాటిపేర్లతో ఫీజుల బాంబు పేల్చుతున్నారు. కార్పొరేట్‌తోపాటు పేరొందిన స్కూళ్లలో ఏడాదికి రూ. 15 వేల నుంచి రూ. 25 వేలు వసూలు చేస్తున్నారు. ఈ పంథా ఇటీవలి కాలంలో బడ్జెట్ బడుల్లోనూ మొదలైంది. ఈ పాఠశాలల్లో హీనపక్షం రూ. 3 వేలు ఉంది. అలాగే వెల్కం పార్టీలు, ఫెయిర్ వెల్ పార్టీల పేరిటా విద్యార్థులకు బాదుడు తప్పడం లేదు. ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నా.. కాస్టూమ్స్ భారం విద్యార్థి మీద పడక తప్పదు. ఇదీ పార్టీ పేరిట యాజమాన్యం నిర్ణయించిన మేరకు ఒక్కో విద్యార్థి విధిగా చెల్లించాల్సిందే. మొత్తం మీద ఏ కార్యక్రమం చేపట్టినా... ఆ భారం బుడతలపైనే. -
విజిలెన్స్ అధికారినంటూ టోకరా
* సినీ ఫక్కీలో దోపిడీ * 25 కాసుల బంగారు ఆభరణాలు చోరీ తూర్పుచోడవరం (నల్లజర్ల) : విజిలెన్స్ అధికారినంటూ ఓ ఆగంతకుడు సినీ ఫక్కీలో రేషన్ డీలర్ నుంచి 25 కాసుల బంగారు ఆభరణాలు, రూ.3 వేల నగదు దోచుకుపోయాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. నల్లజర్ల మండలం తూర్పుచోడవరంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. తూర్పుచోడవరంలో పసల దశావతారమ్మకు చెందిన 18వ నంబరు రేషన్ దుకాణాన్ని ఆమె కుమార్తె ఆలపాటి స్వరాజ్యలక్ష్మి నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీస్ గుర్తు ఉన్న బైక్‌పై వచ్చిన ఓ ఆగంతకుడు తాను విజిలెన్స్ శాఖ అధికారినంటూ డిపోను తనిఖీ చేయాలని నమ్మబలికాడు. రిజిస్టర్లు పరిశీలించి 2 బస్తాలు బియ్యం ఎక్కువగా ఉన్నాయని, రూ.లక్ష వరకు జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష పడుతుందని భయపెట్టాడు. తనతో పాటు మూడు బృందాలు అనంతపల్లి, చోడవరం, గుండేపల్లిలో తనిఖీలు చేస్తున్నాయని, ముగ్గురిని అ రెస్ట్ చేశారని చెప్పాడు. దీంతో కంగారు పడిన దశావతారమ్మ, స్వరాజలక్ష్మి తమ వద్ద ఉన్న రూ.3 వేలను అతడికి ఇచ్చారు. నగదు తీసుకుని తిరిగి వెళుతున్న ఆగంతుడి కన్ను మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలపై పడింది. మభ్యపెట్టి.. కాజేసి.. తాను వెళ్లిన తర్వాతపై అధికారులు వస్తారని, వంటిపై బంగారు ఆభరణాలు ఉంటే ఫైన్ ఎక్కువ వేస్తారని మహిళలను ఆగంతకుడు భయపెట్టాడు. ఆభరణాలను తీసి దాచుకోమని సలహా కూడా ఇచ్చాడు. ఆగంతకుడి మాటలు నమ్మిన తల్లీకూతుళ్లు వారి వంటిపై ఉన్న 25 కాసుల బంగారు ఆభరణాలను తీసి బీరువాలో దాచేందుకు వెళుతుండగా.. అధికారుల వద్ద చెకింగ్ మెషిన్ ఉంటుందని, ఇంట్లో దాస్తే సులభంగా కనిపెడతారని కంగారు పెట్టాడు. పెరట్లోని నీళ్ల కుండీ పక్కన దాచుకోమని ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీంతో కంగారు పడిన తల్లీకూతుళ్లు ఆభరణాలను నీళ్ల కుండీ పక్కన పెట్టి ఆగంతకుడు కాఫీ అడగటంతో వంట గదిలోకి వెళ్లారు. ఈలోపు స్వరాజ్యలక్ష్మి భర్త సత్యనారాయణ ఇంటికి వచ్చారు. అతనికి విషయం చెప్పి కాఫీ బదులు కూల్‌డ్రింక్స్ తీసుకురమ్మని పంపాడు. సత్యనారాయణ తిరిగి వచ్చే లోపు పెరట్లో దాచిన బంగారు ఆభరణాలను తన బ్యాగ్‌లో పెట్టుకున్నాడు. అధికారులు అనంతపల్లిలో ఉన్నారు తీసుకువద్దాం అంటూ కూల్‌డ్రింక్స్‌తో వచ్చిన సత్యనారాయణను తన బైక్‌పై తీసుకువెళ్లాడు. అధికారులు రాలేదని నమ్మబలికి ఊరి చివర సత్యనారాయణను వదలి ఉడాయిం చాడు. సత్యనారాయణ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గాని మోసం విషయం తెలియలేదు. బాధితులు అనంతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై నాయక్ బాధితుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. -
పోలీసుల పేరిట ఘరానా దోపిడీ
ఫైనాన్స్ వ్యాపారి వద్ద డబ్బు దోచుకెళ్లిన దుండగులు రూ. 70 వేల నగదు అపహరణ ఖానాపురం : పోలీసులవుంటూ ఓ ఫైనాన్స్ వ్యాపారి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడిన ఘటన వుండలంలోని బుధరావుపేట శివారు రావులింగయ్యుపల్లిలో వుంగళవారం రాత్రి జరిగింది. బాధితుడి కథనం ప్రకా రం.. రావులింగయ్యుపల్లికి చెందిన కోట వెంకట్రావు చిట్టీల వ్యాపారం చేస్తుంటాడు. ప్రతి నెలా 12 నుంచి 20వ తేదీ వుధ్యలో సభ్యుల నుంచి డబ్బు వసూలు చేసి చిట్టీ తీసుకున్న వారికి ఇస్తుంటాడు. కాగా, వుంగళవారం రాత్రి 11 గంటలకు ఐదుగురు వ్యక్తులు వచ్చి ఆరుబయట నిద్రిస్తున్న వెంకట్రావును లేపారు. వా రిలో నలుగురి వద్ద ఆయుధాలు ఉన్నారుు. ‘మేము పోలీసులం, నువ్వు చిట్టీల వ్యాపారం చేస్తావా’ అని ప్రశ్నించారు. దొంగనోట్లు చలామణి చేస్తున్నావని, ఇంట్లో చెక్ చేయూలని అ న్నారు. తాను చిట్టీలు నడుపుతాను తప్ప దొం గనోట్ల విషయం తెలియదని వ్యాపారి చెప్పగా, గట్టిగా అరవ వద్దని హెచ్చరించారు. తర్వాత వెంకట్రావును ఇంట్లోకి తీసుకెళ్లి డబ్బు తెమ్మన్నారు. అతడు మొదట రూ.10 వేలు తెచ్చి ఇచ్చాడు. వాటిని పరిశీలించి, ఇవి కావు.. ఇం ట్లో దాచిన దొంగనోట్లు తీసుకురమ్మన్నారు. దీంతో వ్యాపారి వురో రూ.60 వేలు తీసుకొచ్చి ఇచ్చాడు. వాటిని తీసుకున్న దుండుగులు ‘నీ వద్ద ఉన్న వురిన్ని డబ్బులు ఇవ్వాలి’ అని వ్యా పారిని భయూందోళనకు గురిచేశారు. తన వద్ద ఇక డబ్బులు లేవని వ్యాపారి చెప్పడంతో సోదా చేయూలంటూ లోనికి తీసుకెళ్లారు. వుుగ్గురు బయుట ఉండగా ఇద్దరు ఇంట్లోకి వెళ్లి, బీరువాలను తెరిపించారు. అందులో బంగారం ఉండ గా వాటిని తీసుకోకుండా వురో గదిలోకి వ చ్చారు. ఇలా సోదాలు నిర్వహించి బెడ్‌కింద ఉన్న వురో రూ.3 లక్షలు అపహరించారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా, తెల్లవారిన తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తీసుకొమ్మని చెపుతూ వెళ్లిపోయూరు. దీంతో కంగారుపడిన వ్యాపారి బుధరావుపేటలోని వూజీసర్పంచ్ వుహలక్ష్మి వెంకటనర్సయ్యు వద్దకు వెళ్లాడు. తెల్లారాక పోలీస్‌స్టేషన్‌కు వెళ్దామని అతడు చెప్పడంతో ఇంటికి వచ్చిన వ్యాపారి తెల్లవారుజామున 3 గంటల సవుయుంలో బెడ్‌కింద చూడగా అక్కడ దాచిన రూ.3 లక్షలు లేకపోవడంతో పోలీసులకు సవూచారమిచ్చాడు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు.. సవూచారం అందుకున్న ఎస్సై దుడ్డెల గురుస్వామి బుధవారం ఉదయం 7.30 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగులు తాకిన వస్తువులను ఇతరులు ముట్టుకోకుండా చర్యలు చేపట్టారు. అనంతరం గూడూరు సీఐ రమేష్నాయుక్, ఎస్సై సతీష్ వచ్చి పరిశీలించారు. ఆ తర్వాత డీఎస్పీ దాసరి వుురళీధర్ వచ్చి వివరాలు సేకరించారు. వ్యాపారి కోట వెంకట్రావు, విద్యార్థి వులిశెట్టి విక్రంను అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వరంగల్ నుంచి వచ్చిన డాగ్‌స్క్వాడ్ వుంగళవారిపేట నుంచి కొడ్తివూటుతండాై దారి వైపు వెళ్లి ఆగడం చర్చనీయూంశంగా వూరింది. వ్యాపారి చిట్టీలు నడుపుతాడని స్థానికులకే తెలుసు. తుపాకులతో వచ్చిన వ్యక్తులకు స్థానికులెవరైనా సహకరించారా అనే అనువూనాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు కొత్త వ్యక్తుల సంచారం.. గ్రావుంలో 20 రోజులుగా ఇద్దరు కొత్త వ్యక్తులు తుపాకులతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పలువురు ‘సాక్షి’కి తెలిపారు. 10 రోజుల క్రితం ఒక ఆటో డ్రైవర్‌ను, ఆ తర్వాత రెండు రోజుల కు ఓ యువకుడిని డబ్బుకోసం బెదిరించినట్లు తెలిసింది. ఈ ఇద్దరు వ్యక్తులకు దోపిడీ ఘట నతో సంబంధం ఉందా అనే అనువూనాలు వ్యక్తమవుతున్నారుు. ఇంత జరుగుతున్నా స్థాని కులు సదరు వ్యక్తులపై పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదనేది అంతుచిక్కడం లేదు. కాగా, దుండగలు వెంకట్రావు ఇంటి నుంచి రూ. 3.70 లక్షలు తీసుకెళ ్లగా, పోలీసులకు రూ. 70 వేలు మాత్రమే తీసుకెళ్లారని చెప్పడం చర్చనీయూంశంగా మారింది. దోపిడీ దొంగలైతే బంగారం చూసి కూడా ఎందుకు వదిలేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
అంతా హైడ్రామా..!
దోపిడీలో కన్సల్టెంట్ సిబ్బంది పాత్ర * గతంలోనూ కొన్ని లక్షలు స్వాహా * కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు పులివెందుల: పులివెందుల పట్టణంలో సోమవారం సంచలనం సృష్టించిన రూ.53లక్షల దారి దోపిడీ కేసు కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దోపిడీలో క్యాష్ కన్సల్టెంట్ సంస్థ సిబ్బంది విక్రమ్, శ్రీనివాసుల పాత్ర ఉందని పోలీసు లు గుర్తించినట్లు తెలుస్తోంది. కన్సల్టెంట్ సిబ్బంది మరి కొందరితో కలిసి ఈ హైడ్రామా ఆడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. గతంలో కూడా వీరు ఏటీఎంలలో డబ్బు ఉంచేటప్పుడు మరికొన్ని లక్షలు స్వాహా చేసి ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడినట్లు పోలీసులతో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి కన్సల్టెంట్ సిబ్బందితోపాటు ఇందులో పాలు పంచుకున్న ఇతర నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ నవీన్ గులాఠి అప్పటికప్పుడు కేసు విచారణకు సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. కన్సల్టెంట్ సిబ్బందిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. వారు అసలు విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో దోపిడీతో సంబంధమున్న ఇతర నిందితులను కూడా అరెస్టు చేసి దోపిడీ సొమ్మును రికవరీ చేసి ఎస్పీ సమక్షంలో మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
ఒంటరి మహిళలే లక్ష్యంగా చోరీలు
అప్రమత్తంగా ఉండాలని సీఐ విజయకృష్ణ సూచన తడ: ఒంటరిగా ఇంట్లో ఉండే మహిళలనే లక్ష్యంగా చేసుకుని హత్యలు, దోపిడీలకు పాల్పడే వ్యక్తిని గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలని సూళ్లూరుపేట సీఐ టీ విజయకృష్ణ కోరారు. సోమవారం స్థానిక పోలీస్ ష్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ బిక్షగాడిలా అవతారం వేసుకుని ఇంట్లో ఎవరూ లేకుండా మహిళలు మాత్రమే ఉన్న సమయంలో చెల్లి పెళ్లి ఉందని చీరలు, ఇతర దుస్తులు ఇవ్వాలంటూ మభ్య పెట్టి కత్తితో చంపి అందినకాడికి నగలు, విలువైన వస్తువులు దోచుకువెళ్లే సత్తెనపల్లికి చెందిన కుంచెల నాగరాజు అనే వ్యక్తి సంచరిస్తున్నట్లు చెప్పారు. అనుమానంవస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. -
నాలుగు దూకాణాల్లో చోరీలు
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దొంగలు రెచ్చిపోయారు. స్థానిక అంబెడ్కర్ చైరస్తాలో ఉన్న నాలుగు దుకాణాల్లో దొంగలు పడి నగదు ఎత్తుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి స్థానిక ఫొటోస్టూడియో సహా మరో మూడు దుకాణాల షటర్లు పగలగొట్టి దొంగలు చోరీలకు పాల్పడ్డారు. బుధవారం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీల ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. చోరీలకు పాల్పడింది. గురుగోవింద్నగర్కు చెందిన యువకులుగా అనుమానిస్తున్న పోలీసులు గురుగోవింద్నగర్లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
ఓ చిరుద్యోగి 30 ఎకరాలు కొనగలడా?
0.25, 0.32, 0.45, 0.87, 1.5... ఏమిటీ అంకెలనుకుంటున్నారా..? ► ఓ కాలేజీలో కరెంటు మరమ్మతు పనులు చూసే మునిశంకర్ అనే చిరుద్యోగి పేరున ఉన్న పొలం బిట్లు ఇవి. బిట్లు బిట్లుగా రాజధాని గ్రామాల్లో ఈయన పేరున దాదాపు 30 ఎకరాల పొలం ఉంది. ఎకరా రూ. 3 కోట్లు చొప్పున 30 ఎకరాలంటే రూ. 90 కోట్లవుతుంది కదా... ఓ చిరుద్యోగి అన్ని కోట్లతో కొనగలడా? ► రాపూరు సాంబశివరావు అనే మరో వ్యక్తి పేరుతో కూడా రాజధానిలో బిట్లు బిట్లుగా 29 ఎకరాలకు పైగా భూములున్నాయి. పోతూరి ప్రమీల అనే మహిళ పేరుతో 15 ఎకరాలున్నాయి. ► మునిశంకర్ మంత్రి నారాయణకు వరసకు బావమరిది.. సాంబశివరావు సొంత బావమరిది... కాగా ప్రమీల మంత్రిగారి సన్నిహితురాలు.. ► వీరెవరికీ కోట్లు పోసి కొనే శక్తి లేదు. వీరంతా మంత్రిగారి బినామీలని మీకీపాటికే అర్థమైఉండాలి. ► మంత్రిగారి బినామీలు కాబట్టే వారి పేరుతో ఎకరాలకు ఎకరాలు రిజిస్టరయ్యాయి. ►రాజధాని భూ సమీకరణలో ముఖ్యభూమిక పోషించిన మంత్రి పి.నారాయణ ఇలా 29 గ్రామాల్లోనూ దాదాపు 3,129 ఎకరాల విలువైన వ్యవసాయ భూములను, నివేశన స్థలాలను కొనుగోలు చేశారు. బిట్టుబిట్టుగా భూములన్నీ తన కాలేజీల్లో పనిచేసే ఉద్యోగుల పేర్లమీద, దూరపు బంధువుల పేర్లమీద ఆయన కొనుగోలు చేశారు... ఇక రాజధాని ప్రకటనకు ముందే రైతుల వద్ద భూములు కొన్న నారాయణ వారితో ఒప్పందాలు చేసుకుని వారి పేరుతోనే సమీకరణకు భూములిప్పించారు.. పరిహారం మాత్రం ఆయన ఖాతాకు చేరబోతున్నది. అలా వచ్చే పరిహారం విలువే రూ. 400 కోట్ల వరకు ఉంటుందని అంచనా..! 425 కోట్ల రూపాయలు హాయ్‌ల్యాండ్ కొట్టేశారు.. ►ప్రభుత్వ ‘పెద్ద’ కన్నుపడిందంటే అది కైంకర్యమే... ►రూ. 425 కోట్ల విలువైన 85.13 ఎకరాల హాయ్‌ల్యాండ్‌పై ‘బాబు’లు కన్నేశారు. ►రూపాయి రూపాయి కూడబెట్టి డిపాజిట్లు కట్టిన 32 లక్షల మంది ఖాతాదారులకు రూ. 6,850 కోట్ల మేర శఠగోపం పెట్టిన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కేసుల నుంచి తప్పిస్తామని, అందుకు ప్రతిఫలంగా హాయ్‌ల్యాండ్ ఇవ్వాలని బేరంపెట్టారు. ►బేరం కుదిరింది.. హాయ్‌ల్యాండ్ ‘చినబాబు’ సొంతమైంది.. ►రాజధాని పేరుతో భారీ దోపిడీ చేసిన ప్రభుత్వ పెద్దలు అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదనడానికి హాయ్‌ల్యాండ్ భూములే ఉదాహరణ. 17.3 ఎకరాలు పీఏ పేరుతో కొన్నది ►అతను ఓ ప్రముఖుడి వ్యక్తిగత సహాయకుడు... ►పీఏకి ఎంత జీతం వస్తుంది..? మహా అయితే రూ. 15 వేలు.. ►ఆ పీఏ రాజధానిలో ఏకంగా 17.3 ఎకరాలు కొనేశాడు. ►ఎకరం రేటెంతో తెలుసా? రూ. 1.50 కోట్లు. అంటే మొత్తం రూ. 25.95 కోట్లు ►అంటే బినామీ అని అర్థం కావడం లేదూ..? చిత్రమేమంటే ఆ పీఏ పేరున ఓ సంస్థ ఉందండోయ్... ►ఆ ప్రముఖుడెవరంటే.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణ.. పీఏ పేరు నాగప్రసాద్. 210 కోట్ల రూపాయలు తప్పించుకున్న ‘వెంచర్’ ► ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే.. కొమ్మాలపాటి శ్రీధర్ ► రాజధాని ప్రకటించగానే తన రియల్ ఎస్టేట్ వెంచర్లో రిజిస్ట్రేషన్లు ఆపేశారు.. ► నెలనెలా వాయిదాలు కట్టిన దాదాపు 3వేల మంది లబోదిబోమంటున్నారు.. ► మొత్తం 42 ఎకరాల్లో ఆ వెంచర్ ఉంది. ‘చినబాబు’ చెప్పడంతో దానిని సమీకరణ నుంచి తప్పించారు.. ► ఫలితంగా ఆ వెంచర్లో ‘చినబాబు’కు వాటాలందినట్లు పక్కా సమాచారం.. ► ఆ భూమి విలువ ఇపుడు రూ.210 కోట్లు... 53 ఎకరాలు పోరంబోకు భూముల కబ్జా ► అది ఊరందరికీ తెలిసిన వాగు పోరంబోకు భూమి.. ►రాజధాని ప్రకటనతో ఎమ్మెల్యే కన్ను దానిపై పడింది.. ►బంధువు పేరుతో డాక్యుమెంట్లు సృష్టించారు. ఆయన ఇంకొకరికి అమ్మినట్లు.. వారు మరొకరికి అమ్మినట్లు పత్రాలు పుట్టుకొచ్చాయి. అలా లింక్ డాక్యుమెంట్లకు ఊపిరి పోశారు. ►చివరకు బంధువు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేశారు. ►అలా 3.89 ఎకరాల పోరంబోకు భూమి కాస్తా పక్కా రిజిస్ట్రేషన్ భూమిగా మారిపోయింది. ►ఇది ఎమ్మెల్యే ధూళిపాళ్ల ‘పోరంబోకు భూమి’ కథ. ఇది కాక ఒక్క పెదకాకాని మండలంలోనే 50 ఎకరాల వరకు పోరంబోకు భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఉప్పందిన వెంటనే నాలుగెకరాలు దొరికాయి.. ► రాజధాని తుళ్లూరు దగ్గర వస్తుందని అధికారపార్టీ ముఖ్యులకు మాత్రమే తెలుసు.. ► కానీ నాగార్జున వర్సిటీ దగ్గర అని కొన్నాళ్లు..నూజివీడు దగ్గర అని కొన్నాళ్లు... ప్రచారం చేశారు.. ► ఈలోగా తుళ్లూరు సమీపంలో భూములను కారుచౌకగా కొనేశారు.. అందినవారికి అందినంత... ► టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు తుళ్లూరు మండలం అయినవోలులో అలా 4.09 ఎకరాలు దొరికాయి. ► ఎకరా రూ.3.7 లక్షల చొప్పున 4.09 ఎకరాలను ఆయన రూ. 12 లక్షలకే కొట్టేశారు. ► ఇపుడు ఆ భూమి విలువ దాదాపు రూ. 7 కోట్లు పలుకుతోంది... పచ్చి మోసం.. దగా ఇది రైతుల మాట... భయపడి అమ్ముకున్నాం సాక్షిలో ప్రచురితమైన భూ దురాక్రమణ కథనం చదివాం. అన్నీ వాస్తవాలే. ఎందుకంటే భూ సమీకరణ తొలి రోజుల్లో సమీకరణకు ఇవ్వకుంటే, బలవంతంగా భూసేకరణ జరుపుతామని, ఎకరాకు రూ. 20 లక్షలు రావని ప్రభుత్వ పెద్దలు భయాందోళనలకు గురి చేయడంతో గత్యంతరం లేక అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పట్లో ఎకరా తక్కువ రేటుకే అమ్ముకున్నాం. ఇప్పుడు రూ. 1.40 కోట్లకు చే రింది. - కొమ్మారెడ్డి పిచ్చిరెడ్డి, నిడమర్రు, మంగళగిరి మండలం ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించింది రాజధాని ప్రకటన నాటి నుంచి ప్రభుత్వం రైతుల పట్ల మోసపూరితంగానే వ్యవహరించింది. భూములు ఇవ్వనంతకాలం బెదిరించి, భయపెట్టి రైతులను అమ్ముకునే విధంగా చేశారు. తక్కువ ధరలకే ప్రభుత్వ పెద్దలు, మంత్రులు కొనుగోలు చేసి భూ సమీకరణ పూర్తయిందని రైతులను ఆందోళనకు గురి చేసి మిగిలిన రైతులను సైతం భూములను అమ్ముకునేలా చేశారు. దీంతో రైతులు నష్టపోగా కొనుగోలు చేసిన వారు లబ్ధి పొందారు. - కొప్పోలు వెంకటేశ్వర్లు, బేతపూడి, మంగళగిరి మండలం నాటకాలాడుతున్నారు బుధవారం సాక్షిలో ప్రచురితమైన భూ దందా కథనాలు నూరుశాతం నిజం. రాజధాని నిర్ణయం జరుగకముందు ఇక్కడి ప్రాంతానికి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతులను భయబ్రాంతులకు గురి చేసి భూములను కొన్నారు. ఇప్పుడు మాత్రం మాటతప్పి నాటకాలు ఆడుతున్నారు. ఆర్థికంగా మేము చాలా నష్టపోయాం. భూములు కొనుగోలు చేసిన నేతల భాగోతాలపై విచారణ జరపాలి. - జొన్నా శివశంకర్, ఉండవల్లి, తాడేపల్లి మండలం ఇష్టం లేకపోయినా ఒప్పించారు ఏడాది పొడవునా మూడు పంటలూ పండే భూములు మావి. సమీకరణకు ఇచ్చేందుకు మాకు ఇష్టం లేకపోయినా ప్రభుత్వం, అధికారులు భయపెట్టడం కారణంగానే అమ్ముకోవాల్సి వచ్చింది. తక్కువ ధరలకే కొనుగోలు చేసిన వారు భూ సమీకరణకు ఇచ్చి మమ్మల్ని మోసగించారు. - బేతపూడి సాంబయ్య, నిడమర్రు, మంగళగిరి మండలం. అసైన్డ్‌కు పరిహారం లేదన్నారు! అసైన్డ్ భూములకు ప్యాకేజీ విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేసింది. తీరా అసైన్డు రైతులు తక్కువ ధరలకు భూములు అమ్ముకోగానే ప్యాకేజీ ప్రకటించింది. దీంతో మేము తీవ్రంగా నష్టపోయాం. 83 సెంట్ల భూమిని కేవలం రూ. 39 లక్షలకు అమ్ముకున్నా. ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారం రూ. 1.20 కోట్ల వరకు పలుకుతోంది. తలుచుకుంటే ముద్ద కూడా దిగడం లేదు. - రావూరి ప్రభుదాస్, కురగల్లు, మంగళగిరి మండలం ఆందోళనతోనే అమ్ముకున్నాం భూ సమీకరణ విధానం ద్వారా భూములు తీసుకున్న ప్రభుత్వం భవిష్యత్తులో కౌలు పరిహారం చెల్లిస్తుందో, లేదో అనే ఆందోళనతో తక్కువకే భూమి అమ్ముకోవాల్సి వచ్చింది. ఆరు నెలల క్రితం అరెకరా రూ. 18 లక్షలకు అమ్ముకున్నా. ప్రస్తుతం ఆ భూమి ధర రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు పలుకుతోంది. జరిగిన నష్టాన్ని తలచుకుంటేనే బాధ వేస్తోంది. - చెంచు రామారావు, కురగల్లు, మంగళగిరి మండలం నేతల మాటలతో మోసపోయాం రాయపూడిలో నేను ఎకరా రూ. 40లక్షలతో భూములు కొనుగోలు చేశాను. ల్యాండ్ పూలింగ్ పరిధిలో వున్న ఈ పొలం రోడ్డు విస్తరణ కింద పోవడం ఖాయమని అధికార పార్టీ నేతలు భయపెట్టారు. పైగా నేను కొనుగోలు చేసిన రూ. 40 లక్షలకే కొంటామన్నారు. రెండవ సారి రూ. 35లక్షలకే అడిగారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచరులే ఇక్కడ భూముల ధరలు నిర్ణయించారు. దీంతో నష్టపోవాల్సి వచ్చింది. - దాసరి ఆంజనేయులు, ఉండవల్లి, తాడేపల్లి మండలం రేట్లు తగ్గించి కొన్నారు రాజధాని ప్రకటనకు ముందు ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో ఎకరం రూ. 5 కోట్లుండగా రాజధాని ప్రకటించాక టీడీపీ నేతలు అపోహలు సృష్టించారు. రైతులు అవసరమై పొలం అమ్ముదామనుకుంటే ఎకరాకు కోటి కంటే ఎక్కువ పలకలేదు. బినామీ పేర్లతో ఎక్కువ భూములు కొనుగోలు చేశారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాల నుకుంటున్నాం. - మేకా ప్రభాకరరెడ్డి, పెనుమాక, తాడేపల్లి మండలం -
పెళ్లి సంబంధానికి వచ్చామని..
మహిళపై దాడి చేసి.. దోపిడీకి యత్నం కుమారుడి రాకతో పరారైన దుండగులు మలక్‌పేట: పట్టపగలు ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు యజమానురాలిపై దాడి చేసి దోపిడీకి యత్నించారు. మలక్‌పేట ఠాణా పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం... సలీంనగర్-2 పార్కు సమీపంలో రతన్‌దేవి (53), కుమారుడు యశ్ తుస్నేవాలే(16)తో కలిసి ఓ భవనం కింద అంతస్తులో ఉంటున్నారు. అదే భవనంలో మొదటి అంతస్తులో ఆమె మరిది మనోజ్ తుస్నేవాలే ఉంటున్నాడు. మరిది కుమారుడు సుశాంత్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.45 గంటలకు రతన్‌దేవి ఇంటికి ముగ్గురు యువకులు, ఒక మహిళ వచ్చి డోర్ కొట్టారు. మీరెవరని రతన్‌దేవి ప్రశ్నించగా... సుశాంత్ పెళ్లి విషయం మాట్లాడానికి వచ్చామని చెప్పారు. ఆమె తలుపు తీయగా ఇంట్లోకి వెళ్లి సోఫాలో కూర్చున్నారు. ఆమెతో సంబంధం విషయం మాట్లాడుతున్నట్లు నటిస్తూ.. ఇద్దరు కాళ్లు పట్టుకోగా..మరో ఇద్దరు రతన్‌దేవి గొంతుకు ప్లాస్లర్ బిగించి మూతిపై కొట్టారు. దీంతో నోటి నుంచి రక్తం కారి ఇంట్లో మరకలు పడ్డాయి. స్నానానికి వెళ్లిన ఆమె కుమారుడు యశ్ తుస్నేవాలే అప్పుడే బాత్రూం నుంచి బయటికి రాగా... లోపల గదిలో ఒక మహిళ, యువకుడు కనిపించాడు. అతను మీరెవరని ప్రశ్నిచడంతో వారు అక్కడి నుంచి తప్పించుకొని మెట్లమీద నుంచి గోడదూకి పరారయ్యారు. యశ్ తుస్నేవాలే ముందు గదిలోకి వచ్చేసరికి సోఫాపై కూర్చున్న రతన్‌దేవికి ప్లాస్టర్‌తో గొంతు బిగించి ఉంది. అది చూసి అతను కేకలు వేయడంతో మిగతా ఇద్దరు దుండగులు రతన్‌దేవిని విడిచిపెట్టి బయటికి పరుగు తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా మలక్‌పేట ఏసీపీ సుధాకర్, సీఐ గంగారెడ్డి, డీఎస్ఐ నరేష్ ఘటన్నా స్థలాన్ని పరిశీలించి, బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రతన్‌దేవి గొంతుకు గాయమై నోటి నుంచి రక్తం కారడంతో ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు హిందీలో మాట్లాడారని, వారి వయస్సు 25-26 ఏళ్ల మధ్య ఉంటుందని యశ్ తుస్నేవాలే పోలీసులకు తెలిపాడు. దుండగులు పారిపోయే క్రమంలో చెప్పులను ఘటనా స్థలంలో విడిచి వెళ్లారు. దుండగులు దోపిడీకి వచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, వారు సుశాంత్ పెళ్లి సంబంధం కోసమని చెప్పి రావడం బట్టి ఇందులో తెలిసిన వారి హస్తం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గొలుసు చోరీ... ఇదే ఇంటికి 2013లో ముగ్గురు వ్యక్తులు వచ్చి తలుపు తట్టారు. రతన్‌దేవి తలుపు తీయకుండా కిటికీ తెరిచి వారితో మాట్లాడుతుండగా కిటికిలోంచి చెయ్యిపెట్టి ఆమె మెడలోని 5 తులాల బంగారు గొలుసు తెంచుకుని పరాయ్యారు. దాడి నేపథ్యంలో రతన్‌దేవి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రసవ వే‘ధన’!
పండంటి బిడ్డ కోసం కలలు కంటారు. సుఖ ప్రసవం కోసం ఆస్పత్రిని ఆశ్రయిస్తారు. వైద్యులు చెప్పింది అమాయకంగా వింటారు. శస్త్రచికిత్స చేస్తే తప్ప బిడ్డ దక్కడంటే బెంబేలెత్తుతారు. అడిగినంత చేతిలో పోస్తారు. ఒళ్లు గుల్లవుతుంది. శస్త్రచికిత్స పూర్తవుతుంది. చేతి చమురు వదులుతుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ శస్త్రచికిత్సల సంఖ్య పెరిగిపోయింది. అవసరం లేకపోయినా చేస్తున్న శస్త్రచికిత్సలతో గర్భిణుల ఆరోగ్యం దిగజారుతోంది. * అవసరం లేకున్నా సిజేరియన్ శస్త్రచికిత్సలు * ప్రైవేటు ఆస్పత్రుల్లో గర్భిణుల నిలువు దోపిడీ * రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకు వసూలు * ప్రసవాల్లో సగం సిజేరియన్లే విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోనే సిజేరియన్లు అధికంగా జరుగుతున్నాయి. సిజేరియన్ నిమత్తం ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆస్పత్రికి రాగానే బిడ్డ అడ్డం తిరిగిందని, ఉమ్మి నీరు తక్కువుగా ఉందని.. ఇలా అనేక కుంటి సాకులు చెప్పి గర్భిణులను భయపెడుతున్నారు. దీంతో గత్యంతరం లేక వైద్యులు చెప్పినట్టు వారు చేయాల్సి వస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధికం ప్రభుత్వాస్పత్రుల్లో కంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు అధికంగా జరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాల్లో సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్లు సగానికి పైగా ఉండటం గమనార్హం. జిల్లాలో ప్రసవాలు జరిగే ప్రభుత్వాస్పత్రులు 57, ప్రైవేటు ఆస్పత్రులు 48 ఉన్నాయి. ఏప్రిల్ నెల నుంచి జనవరి నెలాఖరుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 13,234 ప్రసవాలు, కేవలం 4021 సిజేరియన్లు జరిగాయి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో 6908 ప్రసవాలు జరిగితే, అందులో 4526 సిజేరియన్లు జరగడం గమనార్హం. సిజేరియన్తో నష్టం ఒకసారి సిజేరియన్ చేస్తే రెండోసారి కూడా సిజేరియన్ చేయాలి. సిజేరియన్ చేయడం వల్ల మహిళలు నడుం నొప్పి, కాళ్లు నొప్పులు తదితర వ్యాధుల బారిన పడతారు. సాధారణ ప్రసవమైతే రక్తస్రావం తక్కువగా జరుగుతుంది. అదే సిజేరియన్ అయితే అధికంగా జరుగుతుంది. దీని వల్ల మహిళలు రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉంది. సాధారణ ప్రసవమైతే కేవలం రూ.5 వేల నుంచి రూ.10 వేలు వస్తుంది. సిజేరియన్ అయితే రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు కార్పొరేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. పర్యవేక్షణ కరువు జిల్లాలో ఇష్టానుసారంగా సిజేరియన్లు చేస్తున్నా పర్యవేక్షించే నాథుడే లేడు. ఇదే విషయాన్ని డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి వద్ద ప్రస్తావించగా సిజేరియన్లు అధికంగా చేస్తున్నట్టు తెలిసిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
రూ.కోట్లు స్నాచింగ్
నగరంలో భారీగా చైన్‌స్నాచర్ల చేతివాటం మూడేళ్లల్లో రూ.8.6 కోట్ల సొత్తు స్వాహా ‘దోపిడీ’కి అడ్డంకిగా మారిన ‘బాంబే’ తీర్పు సిటీబ్యూరో: సిటీలో పంజా విసురుతున్న గొలుసు దొంగలు గడిచిన మూడేళ్లల్లో లాక్కుపోయిన సొత్తు ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.8,60,54,337. అన్ని రకాలైన సొత్తు సంబంధిత నేరాల్లో ప్రజల కోల్పోయిన దాంట్లో ఇది 7.5 శాతం. ఎప్పటికప్పుడు పంథా మార్చుకుంటూ సిటీలో పంజా విసురుతున్నారు. పోలీసుల ఎత్తులకు స్నాచర్లు పై ఎత్తులు వేస్తున్నారు. మార్కెట్లో బంగారం ధరలు పైపైకి దూసుకుపోతుండడంతో పాతనేరస్తులే కాదు... కొత్తవారూ స్నాచర్ల అవతారం ఎత్తుతున్నారు. ఎలాంటి నేరచరిత్ర లేని వారు, విద్యార్థులు కూడా జల్సాల కోసం స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఏటా చిక్కుతున్న స్నాచర్లలో 40 శాతం కొత్తవారే ఉంటుండడం పోలీసులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వీరి వివరాలు, వేలిముద్రలు వంటి ఎలాంటి సమాచారం పోలీసు రికార్డుల్లో ఉండకపోవడంతో వీరిని గుర్తించడం, పట్టుకోవడం కష్టంగా మారింది. దీంతో పోలీసులకు చిక్కేవరకు నేరాలు చేసుకుంటూ పోతున్నారు. పోలీసు యాక్షన్‌కు స్నాచర్ల రియాక్షన్... స్నాచింగ్ నేరాల్ని కట్టడి చేయడానికి పోలీసులు వేస్తున్న ఎత్తులకు స్నాచర్లు పైఎత్తులు వేస్తున్నారు. తెల్లవారుజామున, సాయంత్రం వేళ నిర్మానుష్య ప్రదేశాల్లో నడిచి వెళ్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని వాహనంపై పక్క నుంచి వెళ్తూ గొలుసుకు తెంచుకుపోతున్న స్నాచర్లకు కట్టడి చేయడం కోసం పోలీసులు రెండు రకాల వ్యూహాలు పన్నారు. ఒకటి మఫ్టీలో పోలీసుల్ని మోహరించడం.. మరోటి మహిళా పోలీసులే సాధారణ దుస్తుల్లో బంగారంతో నడిచి వెళ్లే డెకాయ్ ఆపరేషన్. ఈ రెండింటినీ గమనించిన గొలుసు దొంగలు తమ పంథాను పూర్తిగా మార్చేసుకున్నారు. ఓ ప్రాం తంలో పంజా విసిరే ముందు అక్కడ తమ ముఠా సభ్యులతో రెక్కీ చేయించి పరిస్థితులను గమనించి ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. కొన్నిసా ర్లు ఇళ్ల వద్దే ఉన్న, పనులు చేసుకుంటున్న మహిళల మెడలోని గొలుసులు తెంచుకుపోతున్నారు. తగ్గిన కేసులు... పెరిగిన సంచలనాలు... నగరంలో చైన్‌స్నాచింగ్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. పదేపదే నేరాలు చేస్తున్న, మూడు కంటే ఎక్కువ కేసులు ఉన్న వారిపై నగర పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించడం ప్రారంభించారు. గతేడాది కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్లు, ఇళ్లలో చోరీలు చేసేవారు, గుడుంబా విక్రేతలు, మాదకద్రవ్యాల విక్రేతలు, మోసగాళ్లు, బందిపోటు దొంగలతో కలిపి మొత్తం 263 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించగా... ఇందులో 60 మంది చైన్ స్నాచర్లే ఉన్నారు. 2014లో 523గా ఉన్న కేసుల సంఖ్య గతేడాది 263గా ఉంది. అయితే ఒకేరోజు వరుసపెట్టి అనేక చోట్ల స్నాచింగ్స్ జరగడం, స్నాచర్ల బారిపడన పడిన వారిలో పలువురు వీఐపీ సం బంధీకులు ఉండటం, అనేక మంది క్షతగాత్రులు కావడం, కొందరైతే తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చేరడం తదితర సంచలనాత్మక ఘటనల నేపథ్యంలో ఈ నేరాలు నిత్యం వార్తల్లో ప్రముఖ స్థానంలో నిలుస్తూనే ఉన్నాయి. ‘దోపిడీ’కి రెండు నెలల్లోనే బ్రేక్... స్నాచర్స్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి నగర పోలీసులు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. స్నాచింగ్‌కు పాల్పడి చిక్కిన వారిపై ఒకప్పుడు కేవలం ఐపీసీలోని 379 (చోరీ) సెక్షన్ కింద కేసులు నమోదు చేసేవారు. అయితే ఓసారి ఇలా ఈజీ మనీకి అలవాటుపడిన వారు మళ్లీ రెచ్చిపోతుండటం, సంచనాలు నమోదు కావడంతో ఈ నేరగాళ్లకు తేలిగ్గా బెయిల్ దొరక్కుండా ఉండటానికి స్నాచింగ్ తీరుతెన్నులను బట్టి దోపిడీ కేసు (ఐపీసీ 392) నమోదు చేస్తున్నారు. దాదాపు 40 మందిపై ఈ సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవల బాంబే హైకోర్టు అక్కడి ఓ కేసులో స్నాచింగ్ నేరాన్ని దోపిడీ కింద నమోదు చేయడం తగదంటూ తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేయాల్సి వచ్చింది. -
వంతెనపై వసూల్ రాజాలు
- పోలీసుల ‘దారి’ దోపిడీ - వాహనచోదకుల నుంచి - భారీగా గుంజుడు ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రారంభించకపోయినా.. గోదావరిపై నాలుగో వంతెనపై రాకపోకలకు ప్రజలు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. అటు రోడ్ కమ్ రైలు వంతెనను మరమ్మతులకోసం మూసివేయడం.. రావులపాలెం, ధవళేశ్వరం బ్యారేజి మీదుగా రాజమండ్రి చేరుకోవడం దూరం కావడంతో.. లారీలు, కార్లు, ఇతర వాహనాలు నాలుగో వంతెన పైనుంచే అనధికారికంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇదే అదునుగా పోలీసు శాఖలోని వసూల్ రాజాలు చెలరేగిపోతున్నారు. వాహనానికింత అని రేటు నిర్ణయించి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. డ్యూటీతో సంబంధం లేకుండా వంతెనపై యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. రాజమండ్రి :గోదావరి నాలుగో వంతెనపై పోలీసుల వసూళ్లదందా పట్టపగ్గాల్లేకుండా సాగుతోంది. అనధికారికంగా వంతెనపై రాకపోకలు సాగిస్తున్న వాహనచోదకులను అడ్డుకుని భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. లారీలు, ద్విచక్ర వాహన చోదకుల నుంచి ప్రతి రోజూ వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారు. రాజమండ్రి - కొవ్వూరు మధ్య ఉన్న రోడ్డు కమ్ రైలు వంతెనపై మరమ్మతుల కోసం ఈ నెల 2 నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వంతెన పనులు 45 రోజులపాటు జరిగే అవకాశమున్నందున వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. దీంతో వాహనదారులు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీనిపై కేవలం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు బస్సులను మాత్రమే అనుమతించారు. దీంతో రావులపాలెం మీదుగా లారీలు ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల కనీసం 90 కిలోమీటర్లు చుట్టుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇదే సమయంలో రాజమండ్రి - కొవ్వూరు మధ్య దాదాపు నిర్మాణం పూర్తవుతున్న నాలుగో వంతెనపై నుంచి వాహనచోదకులు రాకపోకలు ఆరంభించారు. ఈ వంతెనను ప్రభుత్వం ఇంతవరకూ ప్రారంభించలేదు. అయినప్పటికీ దాదాపు నిర్మాణం పూర్తి కావస్తున్న ఈ వంతెన పైనుంచి లారీలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. దీనివల్ల వారికి సమయంతోపాటు ఇంధనం ఆదా అవుతోంది. ముఖ్యంగా రావులపాలెం మీదుగాకంటే నాలుగో వంతెన మీద రాకపోకలు చేసేవారికి విశాఖ - విజయవాడ మధ్య సుమారు 45 కిలోమీటర్ల దూరం కలిసివస్తోంది. దీంతో వారు కూడా ఈ వంతెన పైనుంచే రాకపోకలు సాగిస్తున్నారు. రాజమండ్రి - కొవ్వూరు మధ్య వాహనదారులకు ధవళేశ్వరం బ్యారేజికంటే ఈ వంతెన మీదుగానే రాకపోకలు సులువవుతోంది. కాతేరువద్ద అప్రోచ్ రోడ్డు నుంచి కిందకు దిగి అక్కడ నుంచి నేరుగా రాజమండ్రి నగరంలోకి వస్తున్నారు. దీంతో వందలమంది ద్విచక్ర వాహనదారులు ఈ వంతెనమీదుగా రాకపోలు సాగిస్తున్నారు. అనధికారికంగా సాగుతున్న ఈ రాకపోకలే పోలీసులకు కాసుల పంట పండిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సంబంధం లేకుండా ఎవరు పడితే వారు రోడ్డుమీద స్వతంత్రంగా బీటు వేసి అక్రమంగా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక్కడ దందా సాగిస్తున్న పోలీసులు లారీకి రూ.300 నుంచి రూ.500 వరకు, కార్లు, ఇతర చిన్నవాహనదారుల నుంచి రూ.200, ద్విచక్ర వాహనదారుల నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. రాజమండ్రి, రాజానగరం, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు స్టేషన్లకు చెందిన పోలీసులు వంతుల వారీగా ఎవరికి వారు డ్యూటీలు వేసుకున్నట్టుగా వసూళ్ల దందాకు పాల్పడుతుండడంతో వాహనచోదకులు బెంబేలెత్తుతున్నారు. వెను తిరిగే వీలు లేకుండా వంతెన మొదట్లో కాపు కాయడంతో అడిగినంతా పోలీసుల చేతిలో పెట్టాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో అయితే పోలీసుల దోపిడీకి పట్టాపగ్గాల్లేకుండా పోతోంది. నైట్‌బీట్ వేస్తే నగరంలో గస్తీ తిరగడం మాని ‘చలో నాలుగో వంతెన’ అంటూ పోలీసులు తరలిపోవడం వెనుక ఈ దందాయే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ బీటు వేస్తే చాలు రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ అయాచితంగా వచ్చి పడుతోంది. దీంతో ఇక్కడ అనధికార డ్యూటీ చేసేందుకు పోలీసులు ఎగబడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దారిదోపిడీని నిలువరించాలని వాహనచోదకులు కోరుతున్నారు. -
ఇసుక రేట్లు షాక్ కొడుతున్నాయి
ఎక్కడ చూసినా మాఫియా దోపిడీ చేస్తోంది చంద్రబాబు పాలనలో ఇసుక ధరలు షాక్ కొడుతున్నాయని, రేట్లు మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా పెరిగాయని, పది నెలల క్రితం ఒక లారీ లోడు ఇసుక వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఉంటే.. ఇపుడు రూ. 3,000 నుంచి రూ. 5,000 వరకూ ఉందని జగన్ విమర్శించారు. (అక్రమ రవాణాకు సంబంధించి ఈనాడులో ప్రచురితమైన వార్తలను జగన్ చూపిస్తూ) ‘‘ఒక రోజు ‘32 ఇసుక లారీల పట్టివేత, అన్నింటా నిబంధనల అతిక్రమణ, పశ్చిమ గోదావరిలో ఇసుక అక్రమ రవాణా’ - ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది. ఇసుక మాఫియా చేస్తున్న అక్రమాలు ప్రధానంగా మూడు రకాలుగా ఉన్నాయన్నారు. మీ సేవ ద్వారా తీసుకున్న ఒకే డీడీని మళ్లీ మళ్లీ ఉపయోగించి లాగ్‌బుక్స్‌లో ఎంట్రీలు వేస్తూ దారుణంగా మోసం చేస్తున్నారు. ఇక లారీల్లో ఓవర్లోడింగ్ చేస్తున్నారు. ఇసుక రేట్లకు సంబంధించి ఒక ఉదాహరణ చెబుతా. నేను విశాఖపట్నంలో ఒక లారీ లోడు ఇసుక ధరెంత? అని అడిగితే రూ. 39,000 అని చెప్పారు. ఒక ట్రాక్టర్లో రెండున్నర క్యూబిక్ మీటర్ల ఇసుక పడుతుంది. ఒక క్యూబిక్ మీటరు అంటే దాని బరువు 1.69 టన్నులు. ఆ ప్రకారం ఒక ట్రాక్టర్లో 4.22 టన్నుల నుంచి 5 టన్నుల ఇసుక పడుతుంది. ఇక ఒక లారీ అంటే కనీసం మూడు ట్రాక్టర్లకు సమానం. ఒక లారీలో మూడింతలు ట్రాక్లర్ల ఇసుక పడుతుందంటే దాని పరిమాణం సుమారు 13 టన్నులుగా ఉంటుంది. అంటే దాని రేటు రూ. 39,000 అవుతుంది. దానర్థం ఒక కేజీ ఇసుక ధర మూడు రూపాయలన్నమాట. సబ్సిడీ బియ్యం కేజీ ఒక రూపాయి ధరకు లభిస్తుంటే.. విశాఖలో ఇసుక ధర మాత్రం కేజీ మూడు రూపాయలు!’’ అని వివరించారు. -
వామ్మో.. చలి
= వణుకుతున్న జనం = చలికి తట్టుకోలేక వృద్ధురాలు మృతి = ప్రబలుతున్న వ్యాధులు = కిటకిటలాడుతున్న ఆస్పత్రులు = అంతంతమాత్రంగా వైద్యసేవలు = ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వాతావరణంలో భారీ మార్పులతో జనం విలవిలలాడిపోతున్నారు. చలితో వణికిపోతున్నారు. ఫలితంగా వేలాదిమంది రోగాలబారిన పడి ఆస్పత్రుల బాటపట్టారు. జిల్లాలో గత కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు రావటంతో చలితీవ్రత పెరిగింది. సాధారణంగా 32 డిగ్రీల నుంచి 28 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 24 నుంచి 22 డిగ్రీలు నమోదవుతోంది. దీంతో జిల్లా అంతటా ముసురేసుకున్నట్లు ఉదయం నుంచి చీకటి అలముకుంది. సన్నని తుంపర్లు, ఈదరుగాలులు వీయటం ప్రారంభించింది. ఫలితంగా జనం చలితీవ్రతకు అల్లాడిపోతున్నారు. పెరిగిన రోగులు ఒక్కసారిగా వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకోవటంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారు. జబ్బుల నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 74 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మూడు ఏరియా ఆస్పత్రులతో పాటు నెల్లూరులో పెద్దాసుపత్రి ఉంది. ఈ ఆస్పత్రుల్లో సాధారణ రోజుల్లో కంటే గత మూడు రోజులుగా రోగాల బారినపడిన వారు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజుకు సుమారు 3 వేలమంది వివిధ రోగాలతో వస్తుండగా.. మూడురోజులుగా రోజుకు 5 వేల నుంచి 6 వేలకుపైనే వస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులతో కలుపుకుంటే 9వేల వరకు ఉంటుందని అంచనా. గూడూరులోని ఎగువవీరారెడ్డిపల్లికి చెందిన పుండ్ల తిరుపతమ్మ(75) చలిగాలులకు తట్టుకోలేక సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. విజృంభించిన వ్యాధులు చలితీవ్రతకు చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో ఎక్కువమంది ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వాతావరణం చల్లగా ఉండటంతో దోమలు అధికమయ్యాయి. దోమకాటుతో మలేరియా జ్వరాలు కూడా విజృంభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్నిచోట్ల సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రైవేటు వైద్యులకు కాసుల వర్షం కురుస్తోంది. ఎన్నడూ లేనివిధంగా.. తడ : గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఓ వైపు పొగమంచు కొండ ప్రాం తాలను తలపిస్తుంటే, ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న జల్లులు వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. చలికి ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు. రహదారిపై వాహనాలు నడిపై డ్రైవర్లకు రోడ్డు సరిగా కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడి వాతావరణం ఉటీ, కొడె కెనాల్, మంచుతో కూడిన కొండ ప్రాంతాలను తలపిస్తున్నాయి. మంచు కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులే కాకుండా ఆరోగ్య వంతులు కూడా అనార్యోగం పాలవుతున్నారు. వృద్ధు లు, ఆస్త్మా వ్యాధిగ్రస్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎంతో అవసరమైన పనులు ఉంటే తప్ప వీరు వీరితో పాటు చిన్న పిల్లలు సరైన రక్షణ పద్ధతులు పాటించకుండా బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీడని మంచు కావలి: ఆకాశం మేఘావృతం కావడంతో పాటు మధ్యాహ్నం 11 గంటల వరకు పట్టణంలో కురుస్తున్న మంచు సోమవారం వీడలేదు. దీంతో మధ్యాహ్నం వరకు జనసంచారం తక్కువగా కనిపించింది. 10 గంటల వరకు ఆకాశం మేఘావృతం కావడంతో పట్టణంలో చిమ్మ చీకట్లు అలముకున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షసూచన ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా మంచు కురుస్తూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. అధికమైన చలి తీవ్రత అల్లూరు : బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా సోమవారం వేకువ నుంచి మండలంలో చిరుజల్లులు మొదలయ్యాయి. చలిగాలులు అధికంగా వీస్తుండటంత ప్రజలు చలికి వణికిపోతున్నారు. స్వెటర్లు, మఫ్లర్లు ముఖాలకు ధరించి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చలిగాలులు అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోయారు. దీంతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. జిల్లాలో వర్షాలు నెల్లూరు (రెవెన్యూ): బంగళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడన ప్రభావంగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రాబోవు 24 గంటల్లో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చిన్నపాటి వర్షానికే నగరంలోని రోడ్లల్లో నీరు నిలిచింది. దీంతో పాదచారులు, వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం జిల్లావ్యాప్తంగా 1.5 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. సూళ్లూరుపేట లో 7.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అల్లూరులో 4.2, విడవలూరు 3, కొడవలూరు 1.8, పొదలకూరు 1.2, నెల్లూరు 1.2, కోవూరు 3, ఇందుకూరుపేట 2, టీపీగూడూరు 4.4, మనుబోలు 1.8, గూడూరు 2.6, సైదాపురం 1.8, వెంకటగిరి 1.4, బాలాయపల్లి 1.2, ఓజిలి 1.6, చిల్లకూరు 2.6, కోట 3.2, వాకాడు 4.2, చిట్టమూరు 4.8, నాయుడుపేట 2.2, పెళ్లకూరు 2.4, డీవిసత్రం 6.2, తడ మండలంలో 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జాగ్రత్తలు తీసుకోవాలి కాలుష్యంతో పర్యావరణం దెబ్బతిని రుతువులు మారిపోయాయి. మంచు కాలంలో విపరీతంగా మంచుకురువటం.. వానాకాలంలో అధికవర్షాలు పడటం.. ఎండాకాలంలో ఎక్కువ ఎండ లు కాయటం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఎక్కువ మంచు. ఇది చాలా ప్రమాదకరమైంది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. = వాకింగ్ చేసేవారు ఉదయం 7 గంటల పైన చేయాలి. = స్వెట్టర్లు, శాలువాలు, మంకీక్యాప్, చేతిక గ్లౌజులు వాడాలి. = కోల్డ్ క్రీమ్‌లు, గ్లిజరిన్ సోపులు వాడాలి. = నీటిని వేడిచేసుకుని తాగాలి. చల్లని ఆహార పదార్థాలు తీసుకోవటం మంచిదికాదు. = రాత్రిపూట నివాసాల్లో హీటర్లు పెటుటకోవాలి. - ఈదూరు సుధాకర్, సీనియర్ పబ్లిక్‌హెల్త్ అధికారి. -
మెక్కేశారు
సాక్షి ప్రతినిధి, కడప: దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లుగా దోచుకున్నారు. విద్యార్థులకు అండదండగా నిలవాల్సిన యంత్రాంగం చేతివాటం ప్రదర్శిస్తోంది. విద్యార్థుల నుంచి చేపట్టిన వసూళ్లు, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు మెక్కేశారు. క్రీడా విద్యార్థులకు సౌకర్యాలను కాలరాస్తూ స్పెషల్ ఆఫీసర్ పాలన అవినీతి మయంగా మారింది. ఒక్కొక్కటిగా అనేక రుజువులున్నా పాలకులకు అవేవీ కన్పించడం లేదు.. విన్పించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కడప గడపలో క్రీడా పాఠశాలను వరంగా ప్రజానీకం భావించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నెలకొల్పిన క్రీడా పాఠశాల దినదినాభివృద్ధి చెందుతోంది. సదుద్ధేశంతో ఏర్పాటు చేసిన పాఠశాలలో కొందరు రాబందుల్లా చేరారు. దీంతో అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. ప్రభుత్వ నిధులను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తూ వచ్చారు. క్రీడా పాఠశాల అభివృద్ధి మాటున అక్రమాలు తెరపైకి రాలేకపోయాయి. విద్యార్థుల ఇన్సూరెన్స్ నిధులను కూడా మింగేశారు. నిత్యం సాహసాలతో వ్యవహరించే విద్యార్థులకు ప్రమాదాలు ఎలా పొంచి ఉంటాయో తెలియని పరిస్థితి. అలాంటి వారికి ప్రభుత్వమే ఇన్సూరెన్సు చేయించాల్సి ఉండగా తద్భిన్నంగా వ్యవహరించారు. ప్రభుత్వ నిధులు దేవుడెరుగు విద్యార్థుల నుంచి సుమారు రూ.2లక్షలు కాజేశారు. ట్రాక్ షూట్ సైతం.... క్రీడా విద్యార్థులకు ట్రాక్ షూట్, బూట్లు అందించాల్సి ఉంది. అయితే అక్కడి సూపర్వైజర్లు ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.1600 వసూలు చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన షూట్‌నే అందిస్తూ ఆ మొత్తం కాజేసినట్లు తెలుస్తోంది. విద్యార్థుల ఇన్సూరెన్సు కోసం మంజూరు చేసిన మొత్తం, ట్రాక్ షూ పేరిట మంజూరు అయిన మొత్తం ఓ ఉన్నతాధికారికి సమర్పించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అవినీతి ఆరోపణలపె క్లీన్చిట్ లభించినట్లు సమాచారం. ప్రస్తుతం క్రీడా పాఠశాల స్పెషల్ ఆఫీసర్‌గా డిప్యూటీ డీఈఓ ప్రసన్నాంజనేయులు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. విద్యార్థుల ఇన్సూరెన్సు కోసం మంజూరైన నిధులు కాజేసినట్లు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇన్సూరెన్స్ కోసం డబ్బులు చెల్లించాం.. ఇన్సూరెన్స్‌కు డబ్బులు చెల్లించాలని అధ్యాపకులు చెప్పడంతో గతేడాది చెల్లించాం. రూ.1200 చెల్లించాం. ఏవైనా గాయాలు తగిలితే డబ్బులు వస్తాయని చెప్పారు. అయితే ఇన్సూరెన్సు చెల్లించలేదని తెలుస్తోంది. - ప్రసాద్, (ప్రకాశంజిల్లా) 9వ తరగతి విద్యార్థి, రూ. 1200 చెల్లించాం.. మీ పేరుమీద ఇన్సూరెన్స్ చేయిస్తాం.. డబ్బులు చెల్లించాలని అధికారులు తెలిపారు. 2013లో 6వ తరగతి చదువుతున్నప్పుడు రూ.1200 కట్టాను. ఏవైనా సామాగ్రి పోగొట్టినా, ఏవైనా గాయాలు తగిలినా ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పారు. - శ్రీనివాస్, (నిజామాబాద్ జిల్లా) 7వ తరగతి గాయాలైతే.. ఇన్సూరెన్స్ వస్తుందని.. ఏవైనా దెబ్బలు తగిలినా అనుకోని సంఘటనలు జరిగితే ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని పాఠశాలలో చేరిన తొలి సంవత్సరం రూ. 1200 చెల్లించాలని చెప్పారు. 4వ తరగతిలో ప్రవేశం పొందినప్పుడు డబ్బులు చెల్లించా. - టి. సౌజన్య, (చిత్తూరు జిల్లా) 5వ తరగతి, కొందరు చెల్లించారు.. మరికొందరు చెల్లించలేదు.. అందరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని అధికారులు చెప్పారు. ఇష్టం ఉన్న వారు చేయించుకున్నారు.. లేనివారు చేయించుకోలేదు. 4వ తరగతిలో ప్రవేశం పొందన వెంటనే రూ. 1200 చెల్లించాను. - అశ్విని, (మహబూబ్‌నగర్), 5వ తరగతి, -
ఫీజు దోపిడీ
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: బీఈడీ కాలేజీలు సిండికేటుగా మారి విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు దండుకుంటున్నారు. కన్వీనర్ కోటాలో సీటు దక్కినా తాము చెప్పినంత చెల్లించాల్సిందేనంటూ భీష్మించాయి. ఈ ఫీజు చెల్లించే ఆర్థికస్తోమత లేక సగంమంది విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. ఈ విషయంపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 40 బీఈడీ కళాశాలల యాజమాన్యాలు సిండికేట్‌గా మారాయి. యూనివర్సిటీల పరిధిలో ఉన్న కళాశాలల్లో వసతులు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ట్యూషన్ ఫీజు నిర్ణయించింది. ట్యూషన్ ఫీజు *13,500, స్పషల్ ఫీజు *3000 కలిపి *16,500 వరకు మాత్రమే ఫీజు తీసుకోవాలని నిబంధనలు విధించింది. కౌన్సెలింగ్ ద్వారా కన్వీనర్ కోటాలో సీటు వచ్చిన విద్యార్థులకు స్పెషల్ ఫీజు మాత్రమే తీసుకొని జాయిన్ చేసుకోవాలని ఆదేశాలున్నాయి. అయితే, మొత్తం ఫీజు చెల్లించాలని యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్ని కళాశాలల యాజమాన్యాలు 30వేల వరకు వసూలు చేస్తున్నారు. స్పెషల్ ఫీజుతో అండర్‌టేకింగ్ తీసుకొని విద్యార్థులను అడ్మిషన్ చేసుకోవాలని కళాశాలల యాజమాన్యాలకు చెప్పినావినడం లేదు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన అలాట్మెంట్ లెటర్లో కూడా ఫాస్ట్ పథకం వర్తిస్తుందని పేర్కొన్నా కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. కన్వీనర్ కోటా కింద సాధించిన విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరిగి వేసారిన సగం మంది విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. కాలేజీల్లో చేరేందుకు బుధవారం గడువు ముగుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో తమ అడ్మిషన్ల పరిస్థితేంటని వారు ఆందోళన చెందుతున్నారు. స్పందించని పీయూ అధికారులు.. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పీయూ అధికారుల దృష్టికి సమస్యను తీసుకుపోయినా పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు కళాశాలల యాజమాన్యాలతో కుమ్మక్కు కావడం వల్లే ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. విద్యార్థుల నుంచి *16,500 ఫీజు వసూలు చేయాలని వీసీ చెప్పారంటూ ఓ కళాశాల ప్రిన్సిపాల్ చెప్పుకుంటున్నా పట్టించుకోవడం లేదు. -
కత్తితో దాడి చేసి దోపిడీకి యత్నం
స్థానికులు రావడంతో మంగళసూత్రం పడేసి పరార్ లంగర్‌హౌస్: పట్టపగలు దుండగుడు బరితెగించాడు. అపార్ట్మెంట్లోని 4వ అంతస్తులోకి వెళ్లి మహిళపై కర్రతో దాడి చేసి, కత్తితో గాయపర్చి మంగళసూత్రం దోచుకున్నాడు. స్థానికులు రావడంతో మంగళసూత్రాన్ని అక్కడే పడేసి పారిపోయాడు. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. ఎస్సై అంజయ్య కథనం ప్రకారం... లంగర్‌హౌస్ బాపూనగర్ బస్టాప్ ప్రాంతం నిత్యం నగర శివార్లతో పాటు కర్ణాటక తదితర రాష్ట్రాల ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఈ బస్టాప్ ఎదురుగా ఉన్న ఓం చైతన్య సమృద్ధి అపార్ట్మెంట్ 4వ అంతస్తులోని 303 ఫ్లాటులో ఐఐఐటీఉద్యోగి, ప్రముఖ సంగీతకారుడు దేవీప్రసాద్, సుధారాణి దంపతులు నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30కి దాదాపు 25 ఏళ్ల వయసు గల గుర్తు తెలియని యువకుడు అపార్ట్మెంట్లోకి వచ్చి దేవీప్రసాద్ ఫ్లాటు తలుపు తట్టాడు. రోజు అదే సమయంలో దేవీప్రసాద్ ఇంటికి వస్తుండటంతో ఆయనే అనుకొని భార్య సుధారాణి తలుపు తీసింది. తనతో తెచ్చుకున్న కర్రతో వెంటనే ఆ దుండగుడు ఆమె తలపై కొట్టాడు. అంతటితో ఆగకుండా పిడిగుద్దులు గుద్దుతూ గాయపరిచాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. కత్తితో చేతిని గాయపరిచి.. ‘‘అరిస్తే చంపేస్తా’నంటూ మెడపై కత్తి పెట్టాడు. తర్వాత ఆమె మెడలోని 3 తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అలికిడికి చుట్టు పక్కల ఫ్లాట్ల వారు బయటకు రావడంతో గమనించిన దొంగ మంగళసూత్రాన్ని అక్కడే పడేసి మెట్ల మీదుగా పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ సుధారాణిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఖనిజ సంపద దోపిడీ
అక్రమంగా లేటరైట్ తవ్వకాలు కాఫీ తోటలకు నష్టం అడ్డుకున్న గిరిజనులు క్వారీ వద్ద ఆందోళన చింతపల్లిరూరల్ : రాజుపాకల సమీపంలో బినామీ అనుమతులతో చేపట్టిన లేటరైట్ తవ్వకాలను వెంటనే నిలుపుదల చే సి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు పంచాయతీ ప్రజలు గురువారం క్వారీ వద్ద ఆందోళన నిర్వహించారు. పెదబరడ పంచాయతీ రాజుపాకల జంక్షన్ నుంచి క్వారీ వర కు ర్యాలీ నిర్వహించి క్వారీ ప్రాంతంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీ సర్పంచ్ బోయిన సత్యనారాయణ, ఎంపీటీసీ మర్రి సింగారమ్మ, మాజీ ఎంపీపీ ఉల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో పంచాయతీలోని రాజుపాకలు, దిగుపాకలు, సిరిపురం, రాజుబంద, చెరపల్లి, నడిగుంట గ్రామాల గిరిజనులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజన ప్రతినిధులు మాట్లాడుతూ గిరిజనుల పేరిట బినామీ కాంట్రాక్టును చేజిక్కిం చుకుని అటవీ చట్టాలను తుంగలోకి తొక్కి రూ.కోట్లు విలువ చేసే ఖనిజ సంపదను దోచుకుపోతున్నా.. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారు లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లేటరైట్ తవ్వకాల ఫలితంగా చుట్టు పక్కల ఉన్న 150 ఎకరాల్లో సాగవుతున్న కాఫీ తోటలు పాడైపోయే అవకాశం ఉందన్నారు. ఏజెన్సీలో చట్టాలను పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు ప్రకటనలకే పరిమితమవుతున్నారని వాపోయా రు. ఎన్నిమార్లు ఐటీడీఏ పీవో, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లినా ప్ర యోజనం లేకుండా పోయిందన్నారు. సబ్ కలెక్టర్ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వి.సత్యవతి, పీసా కమిటీ ఉపాధ్యక్షులు నూకరాజు, వి.ఆనంద్, జి.అబ్బాయినాయుడు పాల్గొన్నారు. -
కళ్లల్లో కారం చల్లి రూ 2.77 లక్షలు దోపిడీ
నల్లకుంట ఠాణా పరిధిలో ఘటన నల్లకుంట: బైక్‌పై వెళ్తున్న కలెక్షన్బాయ్ను గుర్తు తెలియని వ్యక్తులు తమ బైక్‌లతో ఢీకొట్టారు... కళ్లల్లో కారం చల్లి అతడి చేతిలో ఉన్న రూ. 2.77 లక్షల నగదు బ్యాగ్‌ను లాక్కొని ఉడాయించారు. నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. తూర్పు మండలం అదనపు డీసీపీ ఎల్టీ. చంద్రశేఖర్ తెలిపిన వివరాలు... సీతాఫల్మండి మైలార్‌గడ్డ నివాసి చిప్ప రాజేందర్(38) ట్రూప్ బజార్‌లోని మారుతి ఎలక్ట్రికల్స్‌లో సేల్స్‌మెన్/ కలెక్షన్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 25, 26 తేదీల్లో వసూలు చేసిన డబ్బు రూ 2.77 లక్షలను కార్యాలయంలో అప్పగించకుండా తన ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచాడు. గురువారం తన వద్ద ఉన్న డబ్బును బ్యాగ్‌లో పెట్టుకుని సుల్తాన్ బజార్‌లోని మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో జమ చేసేందుకు ఉదయం 11.30కి ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. సరిగ్గా 11.45కి అడిక్‌మెట్ ఫ్లైఓవర్ సమీపంలోని లలితానగర్ గండిమైసమ్మ ఆలయం వీధి వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో రెండు బజాజ్ పల్సర్ బైక్‌లపై వచ్చిన నలుగురు యువకులు రాజేందర్ బైక్‌ను ఢీకొట్టారు. కిందపడిపోయిన రాజేందర్ చేతిలోని క్యాష్‌బ్యాగ్‌ను ఓ వ్యక్తి లాక్కోవడానికి ప్రయత్నించగా వదలలేదు. దీంతో వారు రాజేందర్ కళ్లల్లో కారంకొట్టి బ్యాగ్ లాక్కుని పారిపోయారు. సమీపంలో ఉన్న ఓ మహిళతో పాటు అదే వీధిలో గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేస్తున్న కొందరు యువకులు అడ్డుకునేందుకు యత్నించగా వారిని కూడా దుండగులు బెదిరించి పారిపోయారు. వెంటనే బాధితుడు నల్లకుంట ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ సమాచారం తెలిసి తూర్పుమండలం అదనపు డీసీపీ చంద్రశేఖర్, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ లింబారెడ్డి, కోటిరెడ్డి, సీసీఎస్ డీసీపీ బాలరాజు నల్లకుంట స్టేషన్‌కు చేరుకున్నారు. బాధితుడు రాజేందర్‌ను తీసుకుని ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి నుంచి మైలార్గడ్డలోని అతని ఇంటికి కూడా తీసుకెళ్లి విచారించారు. కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లోని ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకొనేందుకు టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు తెలిసింది. ఘటనపై అనుమానాలు... బాధితుడు రాజేందర్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్టు, ఆ డబ్బును బ్యాంక్‌లో జమ చేసేందుకు వెళ్తున్నట్టు దొంగలకు ఎలా తెలిసిందనేది అంతుబట్టడంలేదు. ఈ దోపిడీకి పాల్పడిన ముఠాకు రాజేందర్‌కు ఏమైనా సంబంధాలున్నాయా? లేక బిగ్ బజార్లో మాదిరిగానే ఇందులో కూడా తెలిసిన వారి హస్తం ఉందా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి. ఆరు రోజుల క్రితం సుల్తాన్‌బజార్‌లో నలుగురు దుండగులు రెండు పల్సర్ బైక్‌లపై వచ్చి రూ. 50 లక్షలు దోచుకెళ్లిన సంఘటన.., ఇప్పుడు నల్లకుంటలో జరిగిన దోపిడీ ఒకే విధంగా ఉన్నాయి. దీంతో ఈ దోపిడీ కూడా అదే ముఠా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
రైతుకు రూ.2.. కొనుగోలుదారుకు రూ.20
- దోసకాయల ధరల తీరిది - రైతులను నిలువుదోపిడీ చేస్తున్న దళారులు - పెట్టుబడులు కూడా దక్కడం లేదని రైతుల గగ్గోలు నరసాపురం రూరల్ : ఆరుగాలం శ్రమించి పండించిన కూరగాయల రైతులు దళారుల చేతిలో నిలువుదోపిడీకి గురవుతున్నారు. దళారీ వ్యవస్థను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతుండడంతో ఆరుగాలం శ్రమించినా రైతులకు పెట్టుబడులు రాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సీజన్లో దోసకాయలు సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో లంక భూముల్లో కూరగాయల సాగు అత్యధికంగా సాగుతోంది. పెరవలి, నరసాపురం, ఆచంట, పెనుగొండ, కొవ్వూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో కూరగాయలను పండిస్తున్నారు. నరసాపురం మండలంలోని ఎల్బీ చర్ల, లక్ష్మణేశ్వరం, సారవ తదితర గ్రామాల్లో దాళ్వా సాగు అనంతరం కూరగాయలను పండిస్తున్నారు. దోసకాయల పాదులను పెట్టి సాగుచేసిన రైతులకు ఈ ఏడాది కన్నీళ్లే మిగిలాయి. కిలో దోసకాయలను కేవలం రూ.2 చొప్పున దళారులు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. అదే దోసకాయలు బహిరంగ మార్కెట్లో రూ.15 నుంచి రూ.20 వరకు అమ్ముతున్నారు. సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతుండగా కొనుగోలుదారులు అధిక ధరను పెట్టి కొనాల్సి వస్తోంది. ఎటువంటి పెట్టుబడి పెట్టని దళారులు మాత్రం జేబులునింపుకుంటున్నారు. ఎకరం పొలంలో దోసపాదులు సాగు చేయలంటే రూ.17 వేలు ఖర్చవుతుం దని ఆ మొత్తంలో సగం కూడా రావడం లేదని యర్రంశెట్టిపాలెంనకు చెందిన రైతు యర్రంశెట్టి పాండురంగ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంమే కాయగూరలను కొనుగోలు చేసి మార్కెట్లకు తరలించి విక్రయిస్తే ఇటు రైతులకు, అటు వినియోగదారులకు లాభదాయకంగా ఉంటుందని వారు సూచిస్తున్నారు. -
సబ్బులు తళతళ.. బతుకులు వెలవెల
కనీస వేతనాల్లేని గిరిజన కార్మికులు ఉద్యోగ భద్రత లేకున్నా ఊడిగం జీసీసీ సబ్బుల తయారీ కేంద్రంలో శ్రమ దోపిడీ అరకులోయ : శరీరాన్ని మెరిపించే సబ్బుల తయారీ కార్మికుల బతుకులు మాత్రం వెలవెలబోతున్నాయి. ఎన్నాళ్లు పనిచేసినా కనీస వేతనాలకు నోచుకోలేకపోతున్నాయి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. తమ సమస్యల్ని పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు చేస్తున్న విజ్ఞప్తులు అరణ్య రోదనలవుతున్నాయి. 2007-2008 సంవత్సరంలో అరకులోయ జీసీసీ కార్యాలయానికి ఆనుకుని అలోవెరా(రీతు) సబ్బుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. సబ్బుల తయారిలో ముందుగానే శిక్షణ పొందిన 27 మంది గిరిజన యువతకు ఇందులో ఉపాధి కల్పించారు. ఆరేళ్లయినా కనీస వేతనాల్లేవు ఈ కేంద్రాన్ని స్థాపించిన ఆరేళ్లయినా కనీస వేతనాలను అమలు చేయడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కార్మికులు 35 గ్రాముల, 75 గ్రాములు, 100 గ్రాముల సబ్బులు 9 వేల నుంచి 13 వేల వరకు తయారు చేస్తారు. వీటి విలువ సుమారు రూ.1.70 లక్షలుంటుంది. వీరికి రోజుకు దక్కేది రూ.100 నుంచి రూ.120 మాత్రమే. 35 గ్రాముల సబ్బులు తయారు చేసిన రోజు ఒక్కొక్క సబ్బుపై 35 పైసల చొప్పున చెల్లిస్తారు. దీంతో ఇక్కడ పనిచేసే 27 మంది కార్మికులు పని పంచుకుంటే రోజువారి కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. విద్యుత్ కోత, ముడి సరుకులు అందుబాటులో లేనప్పుడు నెలలో సుమారు 20 రోజులు పని ఉంటుందని, మిగిలిన రోజులు ఖాళీగా ఉండటం వల్ల అన్ని రకాలుగా నష్టపోతున్నట్లు కార్మికులు తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులకెళ్లినా, ఇంతకన్నా ఎక్కువ కూలీ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్బుల తయారీతో జీసీసీకి నెలకు సుమారు రూ.25 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతున్నా కార్మికుల సంక్షేమం శూన్యం. ఉద్యోగులుగా గుర్తించాలి ఏళ్ల తరబడి నుంచి సబ్బుల తయారీ కేంద్రం లో పని చేస్తున్న కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలి. సబ్బుల పేర్ల ముద్రణలో గాయపడినా పట్టించుకునే వారే లేరు. సేఫ్టీ మెటీరి యల్, యూనిఫాంలు అందజేయలేదు. కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదు. జీసీసీ ఎమ్డీ మాకు న్యాయం చేయాలి. - వి.సింహాచలం, కార్యదర్శి, సబ్బుల తయారీ కార్మిక సంఘం ఎంత శ్రమించినా ప్రయోజనం లేదు సబ్బుల తయారీ కేంద్రంలో ఎంత శ్రమించినా ప్రయోజనం లేదు. రోజువారి కూలీ కూడా గిట్టుబాటు కాకపోవడంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కనీస వేతనాలను అమలు చేస్తే బావుంటుంది. - వి.సింహాద్రి, అధ్యక్షుడు, సబ్బుల తయారీ కార్మికుల సంఘం -
లె మిజరాబ్
‘ఈ లోకంలో అన్యాయం, అక్రమం,పేదరికం, దోపిడీ ఉన్నంతకాలం అలకాపురులలోని కుబేరుల పక్కనే నరక కూపాలలో నరులు నివసించినంత కాలం, అజ్ఞానాంధకారంలో మనుషులు దివాంధాల్లా కొట్టుమిట్టాడినంత కాలం యిలాంటి పుస్తకాల అవసరం ఉంటుంది’ ఇదీ ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగో (1802-1885) లె మిజరాబ్‌కు రాసిన ముందుమాట. ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు చేసిన ఫలితంగా దేశబహిష్కరణకు గురై హ్యూగో ప్రవాసంలో ఉన్నప్పుడు 1862లో వెలువడిన నవల లె మిజరాబ్. ఒకేసారి ఎనిమిది నగరాల్లో ప్రచురించబడింది. పదేళ్ల పాటు ఫ్రాన్స్ రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితుల్ని, వర్గ సంబంధాలను అధ్యయనం చేసి తన పరిశోధనా ఫలితాన్ని ఒక మెలోడ్రమటిక్ కథగా మలిచాడు రచయిత. అప్పుడప్పుడే ఆవిర్భవిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావాన్ని పరిశీలించిన హ్యూగో ఈ సమాజంలోని సమస్యలన్నింటికీ మూలం డబ్బే అనే నిర్ధారణకు వచ్చాడు. ‘పేదవాళ్లకే ఎందుకిన్ని కష్టాలు? ఎందుకింత మిజరీ? ఈ మిజరబుల్ జనజీవితం బాగుపడేదెప్పుడు? పేదవాళ్లు నేరాలు చేస్తారనటం సబబు కాదు. అసలు నేరప్రవృత్తి సంపన్నుల జీవిత పద్ధతిలోనే ఉంది. ఆ సంపద ఎన్ని నేరాల ఫలితమో. ప్రభుత్వం దోచుకుంటుంది. ధనవంతులు దోచుకుంటారు. తోటిమనుషులు దోచుకుంటారు. పేదల బతుకంతా దోపిడీయే’ అంటూ ఆక్రోశిస్తాడు హ్యూగో. నూటయాభై ఏళ్ల క్రితం ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. - ముక్తవరం పార్థసారథి -
దోపిడీకి మారుపేరు కాంగ్రెస్
మహబూబాబాద్, కాంగ్రెస్ పార్టీ దోపిడీకి మారు పేరుగా మారిందని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు *లక్షల కోట్లు దండుకున్నారు.. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతోపాటు మానుకోట ఎమ్మెల్యే కవిత అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి చెప్పారు. స్థానిక ఘణపురపు అంజయ్య గార్డెన్లో మంగళవారం జరిగిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రజాప్రతినిధులు సమస్యలను అడ్డుపెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నారని ధ్వజమెత్తారు. డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్లో చేరడానికి ముందు మాజీ మంత్రి రెడ్యానాయక్, ఎమ్మెల్యే కవిత కేసీఆర్‌తో మంతనాలు జరిపారని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను పార్టీలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పడం వల్లె వారు చేరలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో పాల్గొనకుండా తెలంగాణ మేమే తెచ్చామని ప్రచారం చేసుకోవడం సిగ్గుగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులను చూస్తుంటే ‘ఏ దొడ్డిలో కట్టినా పర్వాలేదు.. మనదొడ్డిలో ఈనితే చాలు’ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణవాదుల ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని చెప్పారు. కేసీఆర్ పోరాటం.. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బలమైన రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఉండాలని అన్నారు. కేసీఆర్ చేతిలోనే తెలంగాణ భద్రంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలలో టీఆర్ఎస్ ఒంటిరిగానే బరిలో నిలుస్తుందని, ఎన్నికల్లో తాను స్వయంగా ప్రచారం చేస్తానని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు తేజావత్ రాంచంద్రు నాయక్, నాయకులు జిల్లా ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, మార్నేని వెంకన్న, సంగులాల్, నెహ్రూ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వలస పక్షుల వేదన!
అమ్మలా ఆదరించాల్సిన ఉన్న ఊరు సవతి తల్లి ప్రేమనే చూపుతున్నదన్న బాధ ఒకపక్క... అయినవాళ్లకు ఆసరాగా నిలబడలేకపోతున్నామన్న ఆవేదన మరోపక్క పీడిస్తుండగా ఎక్కడెక్కడికో వలసపోతున్న సామాన్యులకు బతుకుపోరాటంలో ఎప్పుడూ ఓటమే ఎదురవుతున్నది. ఈ దేశంలోనే పుట్టి పెరిగి, ఇక్కడి గాలే పీలుస్తున్నా, ఇక్కడే రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా, తమ శ్రమతో సంపద సృష్టిస్తున్నా వారికి అడుగడుగునా వివక్ష తప్పడంలేదు. స్థానికులందరికీ వారు కంట్లో నలుసులా కనిపిస్తారు. తమ ఉపాధిని కొల్లగొట్టడానికి వచ్చినవారిగా దర్శనమిస్తారు. స్థానికులు సరే... వలస వచ్చినవారి శ్రమను గుర్తించి, వారిని అన్నివిధాలా ఆదుకోవాల్సిన, రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వాలు కూడా అదే దృక్పథంతో వ్యవహరిస్తున్నాయి. వారి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యునెస్కో సంస్థ వెలువరించిన నివేదిక చూస్తే వలస జనం ఎంతటి దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారో అర్ధమవుతుంది. చేస్తున్నది గొడ్డు చాకిరీ అయినా... ప్రమాదకరమైన పనులకే సిద్ధపడుతున్నా... స్థానికులు తమ స్థాయికి తగనిదని కొట్టిపారేసే పనులే చేస్తున్నా వలస జనానికి నిరాదరణే మిగులుతున్నది. మహానగరాల్లో ఆకాశాన్నంటే భవంతుల నిర్మాణానికి రాళ్లెత్తే కూలీలుగా, మురికి కాల్వలను శుభ్రంచేసేవారిగా, ఇళ్లల్లో పనివారిగా, సెక్యూరిటీ గార్డులుగా వీరంతా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. నిత్యం దోపిడీకి గురవుతున్నారు. ఎండనక, వాననక పనిచేసినా వీరెవరికీ తలదాచుకోవడానికి గూడుండదు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 40 కోట్లమంది ఒకచోటి నుంచి మరోచోటుకు వలసపోతున్నారు. అంటే దేశ జనాభాలో మూడింట రెండొంతులమంది వలస జీవితాలే గడుపుతున్నారన్నమాట. మరోరకంగా చెప్పాలంటే దేశంలోని ప్రతి ముగ్గురు ఓటర్లలోనూ ఒకరు తన స్వస్థలానికి దూరంగా జీవనపోరాటం సాగిస్తున్నారు. ఇలాంటి జీవితాలవల్ల వారు అయినవాళ్ల సామీప్యాన్ని కోల్పోవడమే కాదు... తమ గుర్తింపునే పోగొట్టుకుంటున్నారు. వారికి రేషన్ కార్డుండదు. కనుక దానిద్వారా లభించాల్సిన అరకొర సదుపాయాలైనా వారికి దక్కవు. గుర్తింపు లేదు కాబట్టి సామాజిక రక్షణ పథకాలేవీ వారికి వర్తించవు. ఓటు హక్కుండదు గనుక, స్థానికులు కారు గనుక వారి కోసం పోరాడే పార్టీలుండవు. చదువు ఉండదు గనుక తమ హక్కులేమిటో, తమకు లభించగల సౌకర్యాలేమిటో తెలుసుకునే పరిజ్ఞానం ఉండదు. జ్వరమొచ్చినా, మరే ఇతర ప్రాణాంతక వ్యాధి బారినపడినా వారిని ఆదుకునే నాథుడుండడు. వారు చేస్తున్న చాకిరీ ఎంతో సంపదను సృష్టిస్తోంది. కానీ, ఆ సంపదనుంచి వారి సంక్షేమానికి ప్రభుత్వాలు ఒక్క పైసా అయినా ఖర్చుచేయడం లేదు. అసలు అలాంటివారు న్నారన్న స్పృహే పాలకుల్లో లోపిస్తున్నది. అమెరికానో, యూరప్ దేశమో, గల్ఫ్ దేశమో వలసపోతున్నవారికి ఉండే కనీస రక్షణలు కూడా ఈ అంతర్గత వలసజీవులకు లేవు. సరిహద్దులు దాటితే లభించే భద్రత సరిహద్దుల లోపల లేదన్నమాట! రెక్కలు తెగిన పక్షుల్లా మిగులుతున్న ఇలాంటి వారి జీవితాలపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని యునెస్కో తాజా నివేదిక గుర్తుచేస్తోంది. యునెస్కో నివేదిక దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెల్లడించింది. ప్రపంచంలో 74 కోట్ల మంది వలస జీవులుండగా అందులో దాదాపు సగంమంది భారత్‌లోనే ఉన్నారు. స్థూల దేశీయోత్పత్తిలో వీరి వాటా 10 శాతం. వలసదారుల్లో 30 శాతం మంది 15-29 మధ్య వయసువారు. సంపాదనలో ఏటా రూ.70,000 కోట్లనుంచి రూ.1,20,000 కోట్ల వరకూ వీరంతా తమ ఇళ్లకు పంపుతున్నారు. ఇలా పంపే ఆదాయం బీహార్ జీడీపీలో 10 శాతం, ఉత్తరప్రదేశ్ జీడీపీలో 4 శాతం ఆక్రమిస్తున్నది. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌నుంచే ఎక్కువమంది వలసపోతున్నారు. అటు తర్వాత స్థానం బీహార్‌ది. ముంబై, సూరత్, నాసిక్, లూథియానా, ఫరీదాబాద్, పూణే వంటి నగరాలు వలసదారులకు ప్రధాన ఆశ్రయాలుగా కనిపిస్తున్నాయి. ఆ మహానగర నిర్మాణాల్లో వలసజీవులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినా భాష పేరిటో, ప్రాంతం పేరిటో, ఉపాధి పేరిటో స్థానికులను వలసవచ్చినవారిపై ఉసిగొల్పే పార్టీలున్నాయి. స్థానికులు పడుతున్న బాధలకు వలస జనాన్నే కారకులుగా చూపే నేతలున్నారు. ముంబై మహా నగరంలో అనేకసార్లు వలస జనంపై దాడులు జరిగాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అయితే ఒకటికి రెండుసార్లు వలసవచ్చిన వారివల్లే ఆ మహానగరానికి తలనొప్పులు వస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ, ముంబై నగర జనాభాలో దాదాపు సగం మంది వలసదారులే. యునెస్కో నివేదిక ప్రకారం వలసజీవుల్ని ఎక్కువగా ఆదరిస్తున్నది ఫరీదాబాద్ నగరం. అక్కడ నగర జనాభాతో సమానంగా మాత్రమే కాదు... అంతకంటే 12 శాతం అదనంగా వలసదారులున్నారని ఆ నివేదిక అంటున్నది. ఇలాంటి స్థితికి నిజానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలే కారణం. పల్లె జనానికి ప్రధానంగా ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయరంగం నానాటికీ దెబ్బతింటున్నది. ఇన్పుట్ వ్యయం పెరిగిపోయి, ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధర రాక రైతులు కూలీలుగా మారిపోతున్నారు. నగరాలకూ, పట్టణాలకూ వలసపోతున్నారు. ఇక ఆ రంగాన్ని ఆశ్రయించుకుని బతికే సాధారణ కూలీల గురించి చెప్పేదేముంటుంది? పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెంచితే పట్టణీకరణ ఇంతగా పెరగదు. తమ విధానాలు ఇలాంటి స్థితికి కారణమవుతున్నా వలసవచ్చే వారిని సమస్యగా చూడటం తప్ప... తమవల్ల వారికెదురవుతున్న సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. యునెస్కో నివేదికైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. వలసజీవుల భద్రతకూ, వారి సంక్షేమానికి తోడ్పడే విధానాలను పాలకులు రూపొందించాలి. -
చెలరేగిపోతున్న ఇసుకాసురులు
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :మూడు నదీపాయలతో ఉన్న కోనసీమలో ఇసుక అక్రమార్కులు ఇసుక నుంచి సొమ్ములు పిండుకునే అదను కోసం మాటు వేసుకుని ఉంటారు. నెల రోజుల్లో వరదలు వస్తాయంటే ముందే గోదావరి లోంచి ఇసుకను తవ్వేసి పర్వతాల్లాంటి గుట్టలుగా నిల్వ చేస్తారు. వారికి ప్రభుత్వ అనుమతులతో పనిలేదు. నిబంధనలన్నీ గోదావరిలో కలిపేస్తారు. ఇసుక అక్రమ తవ్వకాల సమయాల్లో అధికారులు అడ్డు తగిలితే మామూళ్లు ముట్టజెప్పి పబ్బం గడుపుకొంటుంటారు. అలాంటి అధికారులే సమైక్య ఉద్యమంతో ఇప్పుడు విధులకు దూరంగా ఉండడంతో అక్రమార్కులు ఆడింది ఆటగా ఉంది. ఇదే అదనుగా అనుమతులు లేని రీచ్‌ల నుంచి యథేచ్ఛగా ఇసుక తవ్వేసుకుంటున్నారు. కొన్ని రీచ్‌లలో పగలు ఇసుక దోపిడీకి కొంత కట్టడి ఉంటున్నా రాత్రి సమయాల్లో అడ్డూఅదుపూ ఉండడం లేదు. కోనసీమలో లంకల గన్నవరం, ముంజవరం, పశువుల్లంక, బాడిలంక తదితర రీచ్‌ల్లో నిత్యం చీకటి పడితే చాలు ఇసుక అక్రమ తవ్వకాలకు, రవాణాకు తెరలేస్తోంది. జిల్లాలో కొన్ని రీచ్‌లకు జూన్ పదో తేదీతో, మరికొన్ని రీచ్‌లకు ఆగస్టు 21తో గడువులు ముగిశాయి. కొద్ది రీచ్‌లు మాత్రమే అధికారిక అనుమతులతో నడుస్తున్నాయి. కోనసీమలో వీరవల్లిపాలెం, మఠం తదితర రీచ్‌లు అధికారికంగా సాగుతున్నాయి. అధిక రీచ్‌లపై కోర్టులకు వెళ్లటం, స్టేలు రావటం వంటి పరిణామాలతో అనుమతులు లేవు. దీంతో ఇసుకాసురులు అనుమతులతో పని లేకుండా గోదావరి గర్భాలను తవ్వేస్తున్నారు. నదీపాయలు వారి సొంత జాగీర్లు సమైక్యాంధ్ర ఉద్యమంతో అధికార యంత్రాంగం అజమాయిషీ అణువంత కూడా లేకపోవటంతో గోదావరి పాయలను తమ సొంత జాగీరుల్లా మలచుకుంటున్నారు. లంకల గన్నవరంలో ఇసుక వ్యాపారంలో తల పండిపోయిన ఓ బడావ్యక్తి కన్నుసన్నల్లోనే అక్రమ రవాణా సాగుతోంది. లంకల గన్నవరం, ముంజవరం, పశువుల్లంక రీచ్‌ల్లో రోజూ రాత్రి సమయాల్లో పొక్లెయిన్లతో తవ్వేసి, ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నారు. ట్రాక్టరు ఇసుక ధర రూ.2500 పలుకుతోంది. కోనసీమలో వివిధ రీచ్‌ల నుంచి రోజూ రాత్రి సమయాల్లో దాదాపు 200 ట్రాక్టర్ల ఇసుక అక్రమ రవాణా అవుతున్నట్టు అంచనా. అంటే నిత్యం దాదాపు రూ.5 లక్షల విలువైన ఇసుక అక్రమార్కుల పాలవుతోంది. అధికారిక రీచ్‌ల నుంచి ఇసుక రవాణా అయితే బిల్లు ఇస్తారు. కోనసీమలో అనుమతులు లేని రీచ్‌ల నుంచి ఇసుక ఎలాంటి బిల్లులు లేకుండానే తరలిపోతోంది. జిల్లా అధికారులు యూనిట్ ఇసుక ధర రూ.1500 మించకూడదన్న ఆంక్షలు విధించారు. ఎలాంటి లెసైన్సులు లేకుండానే, ఎలాంటి వేలం పాటల లేకుండానే అనుమతులు లేని రీచ్‌ల నుంచి తవ్వేసిన ఇసుకను యూనిట్ ధర రూ.2500 వరకు వసూలు చేస్తున్నారు. ముంజవరంలో ఇసుక తవ్వకాలకు నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి అనుమతి ఇచ్చారంటూ చెప్పుకొంటూ ఓ నాయకుడు అక్రమ వ్యాపారం సాగిస్తున్నాడు. -
కేంద్ర సహకార బ్యాంకు దోపిడీ!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతుల్ని నిలువు దోపిడీ చేస్తోంది. ఇచ్చిన రుణాలకు ఆరు నెలలకు ఒకసారి వడ్డీని తిరగరాస్తోంది. రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం తీసుకున్న రుణాలను రైతులు సంవత్సరంలోపు తీర్చవచ్చు. అయితే ఆరు నెలలు పూర్తికాకుండానే రుణాలు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తీసుకువస్తోంది. ఆ విధంగా వసూలు చేయాలని సహకార సంఘాల సీఈవోలపై బ్యాంకు అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. బ్రాంచ్‌ల వారీ సమావేశాలు నిర్వహించి టార్గెట్లు పెడుతున్నారు. అనుకూలంగా వ్యవహరించకపోతే సంఘాలకు కొత్త రుణాలు ఉండవని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 167 సహకార సంఘాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. సంఘాల్లోని సభ్యులు, సాగు విస్తీర్ణం, పంటల సాగు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతీ ఖరీఫ్, రబీకి రూ.2 నుంచి రూ. 4 కోట్ల వరకు రుణాలను ఒకో సంఘానికి మంజూరుచేస్తున్నాయి. మొన్నటి రబీ నాటికి ఈ సంఘాలకు రూ.514.87 కోట్లను రుణాలుగా ఇచ్చాయి. రబీలో రుణాలు సాధారణంగా అక్టోబరు నుంచి మార్చి నెల వరకు ఇస్తారు. రుణం తీసుకున్న తేదీ నుంచి సంవత్సరంలోపు రైతులు రుణాలు చెల్లించవచ్చు. అయితే రుణాలు తీసుకుని సంవత్సరం కాకపోయినా, వాటిని వసూలు చేయాలని బ్యాంకు అధికారులు సహకార సంఘాల సీఈవోలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. రుణాలు తీసుకుని సంవత్సరం కూడా కాలేదని, ఇప్పుడు రుణాలు చెల్లించలేమని రైతులు చెబుతున్నారు. సంఘాల సీఈవోలు కూడా రైతుల బాధలకు అనుగుణంగా ఇప్పుడు రుణాల వసూలు సాధ్యం కాదని చెబుతున్నారు. బ్యాంకు అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎలాగైనా రుణాలు వసూలు చేయాల్సిందేనని బ్రాంచ్ ల వారీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాలకు సంఘాల సీఈవోలు, సిబ్బంది, రైతులను పిలిచి రుణాలు వసూలుకానిదే కొత్త రుణాలు ఉండవంటున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం నరసరావుపేట జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్‌లో సంఘాల సీఈవోల సమావేశాన్ని బ్యాంకు సీఈవో విశ్వనాథం, చైర్మన్ మమ్మునేని వెంకటసుబ్బయ్య నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో రుణాలు వసూలు చేయాలని ఆదేశించారు. టార్గెట్లు నిర్ణయించారు. రైతుల నుంచి వ్యతి వడ్డీ వ్యాపారుల వలే బ్యాంకు సిబ్బంది అనుసరిస్తున్న వైఖరికి రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు సహకార సంఘాల్లో తీసుకున్న రుణాలు రద్దయ్యాయని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొత్త ప్రభుత్వం రుణాలను రద్దు చేసే అవకాశం ఉందని, అప్పటివరకు చెల్లించేది లేదని రైతులు చెబుతున్నారు. బుక్ ఎడ్జెస్ట్‌మెంట్.. రైతులు రుణాలు చెల్లించలేకపోతే వారు చెల్లించినట్టుగా రికార్డుల్లో నమోదు చేసి బుక్ ఎడ్జెస్ట్‌మెంట్ చేయాలని సంఘాల సీఈవోలపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. రుణాల వసూలు కంటే బుక్ ఎడ్జెస్ట్మెంట్లే ఎక్కువగా జరుగుతున్న క్రమంలో రైతులు బ్యాంకు ఓచర్లపై సంతకాలు చేయడానికి విముఖత చూపుతున్నారు. బుక్ ఎడ్జెస్మెంట్ చేయకపోతే మీకు జీతాలు కూడా రావని అధికారులు సంఘాల సీఈవోలను హెచ్చరిస్తున్నారు. ఇదికేవలం బ్యాంకు మనుగడ కోసం సంఘాలను బలితీసుకోవడమేనని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. -
పట్టపగలు దోపిడీ
జీడిమెట్ల, న్యూస్‌లైన్: పట్టపగలు దొంగలు బరి తెగించారు. కేబుల్ సిబ్బందిమంటూ ఓ ఇంట్లోకి చొరబడి.. ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడ కోసి, ఆరు తులాల బంగారు గాజులను దోచుకున్నారు. స్థానికంగా సంచలం సృష్టించిన ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ శ్రీసాయి కాలనీలోని కూన కృష్ణ, మహాలక్ష్మి అపార్టుమెంట్ 3వ అంతస్తు ఫ్లాట్ నెం. 202లో తాయమ్మ(60), ఆమె కుమారుడు రాము ఉంటున్నారు. శనివారం ఉదయం రాము విధులకు వెళ్లగా... ఇంట్లో తా యమ్మ ఒక్కరే ఉన్నారు. మధ్యాహ్నం 1.30కి కేబుల్ సిబ్బందిమంటూ ఇద్దరు వ్యకు ్తలు ఇం ట్లోకి వచ్చి టీవీ బాగు చేస్తున్నట్లుగా నటించా రు. వారి వెనుకే నిలబడి చూస్తున్న తాయమ్మపై ఒక్కసారిగా చాకుతో దాడి చేసి గొం తుపై నాలుగు సార్లు పొడిచారు. ఆపై మెడ కోసి ఆమె చేతికి ఉన్న రూ.1.50 లక్షలు విలువ చేసే నాలుగు బంగారు గాజులు (ఆరు తులా లు) లాక్కొని పారిపోయారు. అక్కడి నుంచి వెళ్లే ముందు తలుపునకు బయట గడియ పెట్టారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో స్పృహలోకి వచ్చిన తాయమ్మ ఇంటి తలుపులను గట్టిగా కొట్టసాగింది. ఫ్లాట్ నెం. 201లో ఉండే పూజ అదే సమయంలో కాలేజీ నుంచి ఇంటికి వస్తూ తాయమ్మ చేస్తున్న శబ్ధాన్ని వింది. వెంటనే ఆమె గడియ తీసి చూడగా తాయమ్మ రక్తపుమడుగులో పడి ఉంది. 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అది రావడం ఆలస్యం కావడంతో ఆటోలోనే బాధితురాలని బాలానగర్‌లోని బీబీఆర్ ఆస్పత్రికి తరలించారు. తాయమ్మ మెడపై నాలుగు కత్తిపోట్లు ఉండటంతో డాక్టర్లు 48 గంటల పాటు పరిశీలన కోసం ఐసీయూలో ఉంచారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తెలిసిన వారి పనే? ఈ దోపిడీ తెలిసిన వారి పనే కావచ్చి పోలీసులు భావిస్తున్నారు. ప్రొఫెషనల్ దొంగలే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, అపార్టుమెంట్లో నివాసముండే వారిలో కొందరు.. ఇద్దరు దుండగులను చూశామని చెప్తుండగా, మరికొందరు ముగ్గురు దుండగులను చూశామంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా పని చేస్తున్న పలువురు కేబుల్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ సుదర్శన్ తెలిపారు.