సాక్షి, కర్నూలు: జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలనే టార్గెట్‌గా చేసుకుని.. దోచుకునే కరుడుగట్టిన దోపిడీ దొంగల ముఠా గుట్టును కర్నూలు జిల్లా పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను గురువారం పోలీసులు వలపన్ని హైవేపై సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు. దోపిడీ దొంగల ముఠాను మధ్యప్రదేశ్‌కు చెందిన కంజారా ముఠాగా గుర్తించిన పోలీసులు.. వారి నుంచి 85 మొబైల్ ఫోన్లు, పట్టుచీరలు, 2 లారీలు, మరణాయుధాలతో పాటు ఔషధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైవేపై కొరియర్ వాహనాలనే లక్ష్యంగా చేసుకుని.. దాడి చేసి కొల్లగొట్టే కంజారా ముఠా ఇప్పటివరకూ కర్నూలు జిల్లాలో నాలుగు చోట్ల దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment