kanjara tribe
-
హైవేపై దోచుకునే కంజారా ముఠా అరెస్ట్
సాక్షి, కర్నూలు: జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలనే టార్గెట్‌గా చేసుకుని.. దోచుకునే కరుడుగట్టిన దోపిడీ దొంగల ముఠా గుట్టును కర్నూలు జిల్లా పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను గురువారం పోలీసులు వలపన్ని హైవేపై సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు. దోపిడీ దొంగల ముఠాను మధ్యప్రదేశ్‌కు చెందిన కంజారా ముఠాగా గుర్తించిన పోలీసులు.. వారి నుంచి 85 మొబైల్ ఫోన్లు, పట్టుచీరలు, 2 లారీలు, మరణాయుధాలతో పాటు ఔషధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైవేపై కొరియర్ వాహనాలనే లక్ష్యంగా చేసుకుని.. దాడి చేసి కొల్లగొట్టే కంజారా ముఠా ఇప్పటివరకూ కర్నూలు జిల్లాలో నాలుగు చోట్ల దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కన్న కూతుళ్లతో వ్యభిచారం
రాజస్తాన్‌లోని కంజర తెగలో దురాచారం బుండీ: రాజస్తాన్ బుండీ జిల్లాలోని సంచార కంజర తెగలో కన్న కూతుళ్లను తల్లిదండ్రులే వ్యభిచారం రొంపిలోకి దింపుతారు. ఈ దురాచారాన్ని రూపుమాపడానికి ప్రస్తుతం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కంజర తెగ వారు తమ కూతుళ్లు యుక్త వయసుకు రాకముందే వారిని అమ్మేయడం, కుదువ పెట్టడం చేస్తుంటారు. ‘చారి ప్రథ’అనే ఈ సంప్రదాయాన్ని ఎవరైనా ఎదిరిస్తే తెగ పెద్దలు బాలిక తల్లిదండ్రులపై రూ.లక్షల జరిమానాలు విధిస్తారు. చారి ప్రథను రూపుమాపే ఉద్దేశంతో బుండీ జిల్లా అధికారులు కంజర తెగ ప్రజలతో సమావేశం నిర్వహించారు. తెగ పెద్దలను శిక్షిస్తేనే ఈ దురాచారానికి ముగింపు పలకవచ్చని సమావేశానికి హాజరైన వారు పేర్కొన్నారు.