కన్న కూతుళ్లతో వ్యభిచారం
రాజస్తాన్‌లోని కంజర తెగలో దురాచారం
బుండీ: రాజస్తాన్ బుండీ జిల్లాలోని సంచార కంజర తెగలో కన్న కూతుళ్లను తల్లిదండ్రులే వ్యభిచారం రొంపిలోకి దింపుతారు. ఈ దురాచారాన్ని రూపుమాపడానికి ప్రస్తుతం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కంజర తెగ వారు తమ కూతుళ్లు యుక్త వయసుకు రాకముందే వారిని అమ్మేయడం, కుదువ పెట్టడం చేస్తుంటారు. ‘చారి ప్రథ’అనే ఈ సంప్రదాయాన్ని ఎవరైనా ఎదిరిస్తే తెగ పెద్దలు బాలిక తల్లిదండ్రులపై రూ.లక్షల జరిమానాలు విధిస్తారు. చారి ప్రథను రూపుమాపే ఉద్దేశంతో బుండీ జిల్లా అధికారులు కంజర తెగ ప్రజలతో సమావేశం నిర్వహించారు. తెగ పెద్దలను శిక్షిస్తేనే ఈ దురాచారానికి ముగింపు పలకవచ్చని సమావేశానికి హాజరైన వారు పేర్కొన్నారు.