ఇల్లు కట్టుకోవాలనుకున్నపుడు ఏం చేస్తాం? ఫలానా చోట అంత తక్కువ రేటుకు చేశారు.. అక్కడ ఇంత తక్కువకు ఈ పనిచేశారు అంటూ ఏకరువు పెట్టి మేిస్త్రీలతో బేరాలాడతాం. మనం పెట్టిన కండిషన్ల మేరకు ఎవరు తక్కువకు చేస్తానంటే వారికి కాంట్రాక్టు అప్పగిస్తాం. కానీ చంద్రబాబునాయుడు మాత్రం కాస్త డిఫరెంట్. ప్రజాధనం ఎంత వృథా అయిపోతున్నా ఆయన బేఫికర్... అస్సలు అవసరమే లేని ప్రాజెక్టులను చేపట్టడం ఆయన స్టయిల్. ప్రభుత్వరంగ సంస్థలు తక్కువకు చేస్తున్నా కాదని ప్రైవేటు కంపెనీలకు పనులు అప్పగించడం ఆయనకు మహా ఇష్టం