పోలీసుల పేరిట ఘరానా దోపిడీ | Exploitation in the name of the police Gharana | Sakshi
Sakshi News home page

పోలీసుల పేరిట ఘరానా దోపిడీ

Published Thu, May 19 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

Exploitation in the name of the police Gharana

ఫైనాన్స్ వ్యాపారి వద్ద  డబ్బు దోచుకెళ్లిన దుండగులు
రూ. 70 వేల నగదు అపహరణ


ఖానాపురం : పోలీసులవుంటూ ఓ ఫైనాన్స్ వ్యాపారి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడిన ఘటన వుండలంలోని బుధరావుపేట శివారు రావులింగయ్యుపల్లిలో వుంగళవారం రాత్రి జరిగింది. బాధితుడి కథనం ప్రకా రం.. రావులింగయ్యుపల్లికి చెందిన కోట వెంకట్రావు చిట్టీల వ్యాపారం చేస్తుంటాడు. ప్రతి నెలా 12 నుంచి 20వ తేదీ వుధ్యలో సభ్యుల నుంచి డబ్బు వసూలు చేసి చిట్టీ తీసుకున్న వారికి ఇస్తుంటాడు. కాగా, వుంగళవారం రాత్రి 11 గంటలకు ఐదుగురు వ్యక్తులు వచ్చి ఆరుబయట నిద్రిస్తున్న వెంకట్రావును లేపారు. వా రిలో నలుగురి వద్ద ఆయుధాలు ఉన్నారుు. ‘మేము పోలీసులం, నువ్వు చిట్టీల వ్యాపారం చేస్తావా’ అని ప్రశ్నించారు. దొంగనోట్లు చలామణి చేస్తున్నావని, ఇంట్లో చెక్ చేయూలని అ న్నారు. తాను చిట్టీలు నడుపుతాను తప్ప దొం గనోట్ల విషయం తెలియదని వ్యాపారి చెప్పగా, గట్టిగా అరవ  వద్దని హెచ్చరించారు.


తర్వాత వెంకట్రావును ఇంట్లోకి తీసుకెళ్లి డబ్బు తెమ్మన్నారు. అతడు మొదట రూ.10 వేలు తెచ్చి ఇచ్చాడు. వాటిని పరిశీలించి, ఇవి కావు.. ఇం ట్లో దాచిన దొంగనోట్లు తీసుకురమ్మన్నారు. దీంతో వ్యాపారి వురో రూ.60 వేలు తీసుకొచ్చి ఇచ్చాడు. వాటిని తీసుకున్న దుండుగులు ‘నీ వద్ద ఉన్న వురిన్ని డబ్బులు ఇవ్వాలి’ అని వ్యా పారిని భయూందోళనకు గురిచేశారు. తన వద్ద ఇక డబ్బులు లేవని వ్యాపారి చెప్పడంతో సోదా చేయూలంటూ లోనికి తీసుకెళ్లారు. వుుగ్గురు బయుట ఉండగా ఇద్దరు ఇంట్లోకి వెళ్లి, బీరువాలను తెరిపించారు. అందులో బంగారం ఉండ గా వాటిని తీసుకోకుండా వురో గదిలోకి వ చ్చారు. ఇలా సోదాలు నిర్వహించి బెడ్‌కింద ఉన్న వురో రూ.3 లక్షలు అపహరించారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా, తెల్లవారిన తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తీసుకొమ్మని చెపుతూ వెళ్లిపోయూరు. దీంతో కంగారుపడిన వ్యాపారి బుధరావుపేటలోని వూజీసర్పంచ్ వుహలక్ష్మి వెంకటనర్సయ్యు వద్దకు వెళ్లాడు. తెల్లారాక పోలీస్‌స్టేషన్‌కు వెళ్దామని అతడు చెప్పడంతో ఇంటికి వచ్చిన వ్యాపారి తెల్లవారుజామున 3 గంటల సవుయుంలో బెడ్‌కింద చూడగా అక్కడ దాచిన రూ.3 లక్షలు లేకపోవడంతో పోలీసులకు సవూచారమిచ్చాడు.

 
డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు..

సవూచారం అందుకున్న ఎస్సై దుడ్డెల గురుస్వామి బుధవారం ఉదయం 7.30 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగులు తాకిన వస్తువులను ఇతరులు ముట్టుకోకుండా చర్యలు చేపట్టారు. అనంతరం గూడూరు సీఐ రమేష్‌నాయుక్, ఎస్సై సతీష్ వచ్చి పరిశీలించారు. ఆ తర్వాత డీఎస్పీ దాసరి వుురళీధర్ వచ్చి వివరాలు సేకరించారు. వ్యాపారి కోట వెంకట్రావు, విద్యార్థి వులిశెట్టి విక్రంను అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వరంగల్ నుంచి వచ్చిన డాగ్‌స్క్వాడ్ వుంగళవారిపేట నుంచి కొడ్తివూటుతండాై దారి వైపు వెళ్లి ఆగడం చర్చనీయూంశంగా వూరింది. వ్యాపారి చిట్టీలు నడుపుతాడని స్థానికులకే తెలుసు. తుపాకులతో వచ్చిన వ్యక్తులకు స్థానికులెవరైనా సహకరించారా అనే అనువూనాలు వ్యక్తమవుతున్నాయి.

 
ఇద్దరు కొత్త వ్యక్తుల సంచారం..

గ్రావుంలో 20 రోజులుగా ఇద్దరు కొత్త వ్యక్తులు తుపాకులతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు  పలువురు ‘సాక్షి’కి తెలిపారు. 10 రోజుల క్రితం ఒక ఆటో డ్రైవర్‌ను, ఆ తర్వాత రెండు రోజుల కు ఓ యువకుడిని డబ్బుకోసం బెదిరించినట్లు తెలిసింది. ఈ ఇద్దరు వ్యక్తులకు దోపిడీ ఘట నతో సంబంధం ఉందా అనే అనువూనాలు వ్యక్తమవుతున్నారుు. ఇంత జరుగుతున్నా స్థాని కులు సదరు వ్యక్తులపై పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదనేది అంతుచిక్కడం లేదు. కాగా, దుండగలు వెంకట్రావు ఇంటి నుంచి రూ. 3.70 లక్షలు తీసుకెళ ్లగా, పోలీసులకు రూ. 70 వేలు మాత్రమే తీసుకెళ్లారని చెప్పడం చర్చనీయూంశంగా మారింది. దోపిడీ దొంగలైతే బంగారం చూసి కూడా ఎందుకు వదిలేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement