Finance merchant
-
అప్పలరాజు కిడ్నాప్ డ్రామా బట్టబయలు
-
అప్పలరాజు కిడ్నాప్ డ్రామా బట్టబయలు
సాక్షి, విశాఖపట్నం: ఫైనాన్స్ వ్యాపారి అప్పలరాజు కిడ్నాప్ వ్యవహారంలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. అప్పలరాజే కిడ్నాప్ డ్రామా ఆడినట్లుగా పోలీసులు నిర్ధారణ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా అప్పలరాజు అడ్డంగా దొరికిపోయనట్లు పోలీసులు తెలిపారు. అప్పలరాజు తనను ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద ఆటోలో కిడ్నాప్ చేశారని తెలిపారు. ఇక తనపై హత్యాయత్నం చేయడమే కాకుండా దుండగులు రూ. 1,25,000 నగదు, బంగారం దోచుకున్నారని చెప్పాడు. అదే విధంగా తనను రుషికొండ-సాగర్ నగర్ మధ్య కొట్టి పడేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. (విభేదాలే కిడ్నాప్‌కి కారణమా..?) కుటుంబ సభ్యుల సాయంతో కేజీఎచ్‌లో చేరిన అప్పలరాజు షర్ట్‌పై ఎటువంటి రక్తపు మరకలు లేకుండా పొట్టపై రెండు కత్తిగాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు అనుమానాలు ఉన్న ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా అసలు కిడ్నాప్ డ్రామా బట్టబయలైంది. సీసీ కెమెరా ఫుటేజ్‌లోనూ ఆటోలో అప్పలరాజు ఒక్కడే ఎక్కినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక అప్పలరాజుపైనే అనుమానం రావటంలో అతని ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా బంగారం దొరికింది. దీంతో లక్ష రూపాయిల నగదుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అప్పుల బాధలు, ఈఎంఐ నుంచి తప్పించుకోవడానికే అప్పలరాజు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కేసు కొత్త మలుపు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో సంచలనం సృష్టించిన ఫైనాన్స్ వ్యాపారి అప్పలరాజు కిడ్నాప్ కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. కిడ్నాప్, దాడి వ్యవహారంలో అప్పలరాజు చెప్పిన వివరాలు ప్రకారం ముగ్గురు దుండగులు పాల్గొన్నట్లుగా పోలీసులు మొదట భావించారు. ఆ దిశగా లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు విచారణలో ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. సీసీ కెమెరాల పుటేజ్‌లు పోలీసులు పరిశీలించగా, ఒక్కడే ఆటో ఎక్కుతున్నట్టు గుర్తించారు. పొంతన లేని సమాచారంతో ఫైనాన్స్ వ్యాపారి.. పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. (ఎవరు చేస్తున్నారబ్బా..?) తనని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముగ్గురు వ్యక్తులు మంకీ క్యాంపులు ధరించి తనని ఆటోలో కిడ్నాప్ చేశారన్న అప్పలరాజు.. సాగర్ నగర్- రుషికొండ మధ్యలో తనపై హత్యాయత్నం చేసి లక్షా 25 వేల నగదు, బంగారం దోచుకుపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు బయటపడ్డాయి. అప్పలరాజు మాటలు అబద్దమని పోలీసులు తేల్చారు. షర్ట్ పై ఎటువంటి మరకలు లేకుండానే అప్పలరాజు పొట్టపై రెండు కత్తి గాట్లు ఉండటంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారంలో ఒత్తిళ్లను పక్కదారి పట్టించేందుకు కిడ్నాప్ డ్రామా ఆడారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. -
ఎవరు చేస్తున్నారబ్బా..?
దొండపర్తి (విశాఖ దక్షిణ): నగరంలో వరుస కిడ్నాప్ కేసులు పోలీసులకు సవాలు విసురుతున్నాయి. రెండూ కూడా ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో నగర నడిరోడ్డున జరగడం ఖాకీలకు తలనొప్పిగా మారింది. ఆ రెండు కేసుల విషయంలో ఇప్పటి వరకు పురోగతి లభించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా కిడ్నాప్ ప్రయత్నాలు జరిగాయా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నాలుగు రోజుల క్రితం దొండపర్తి ప్రాంతంలో ఫ్లై ఓవర్ కింద రియల్ఎస్టేట్ వ్యాపారితోపాటు న్యాయవాదిని కొంత మంది దుండగులు కారులో కిడ్నాప్ చేసేందుకు ప్రయతి్నంచిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద లతితా జ్యుయలరీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వద్ద ఒక ఫైనాన్స్ వ్యాపారిని బుధవారం కిడ్నాప్ చేసి అతని వద్ద ఉన్న నగదు, బంగారం దోచుకొని హత్యాయత్నం చేసి సాగర్‌నగర్ వద్ద పడేసిన విషయం తెలిసిందే. ఈ రెండు కిడ్నాప్ వ్యవహారాలు ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగాయి. సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో బాధితులకు ప్రాణాపాయం తప్పింది. కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా బయట పడగలిగారు. కొలిక్కిరాని కేసులు సంఘటనలు జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క కేసులోనూ పురోగతి లభించలేదు. అలాగే సంఘటనలకు సంబంధించి సమాచారం, దర్యాప్తు విషయాలపై పోలీసులు కొంత గోప్యత పాటిస్తుండడం గమనార్హం. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ వ్యవహారంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ.. అందులో వాస్తవాలను పోలీసులు బహిర్గతం చేయడం లేదు. కిడ్నాప్‌నకు గురైన ఇద్దరు కూడా పోలీసులకు పూర్తిస్థాయిలో సమాచారం అందించలేకపోవడంతో కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును ఛేదించడానికి ప్రయతి్నస్తున్నారు. అలాగే ఫైనాన్స్ వ్యాపారి అప్పలరాజు కిడ్నాప్, హత్యాయత్నం విషయంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాపర్ల దాడిలో గాయపడిన వ్యాపారి నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. అలాగే పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా కిడ్నాపర్లు ఏయే ప్రాంతాల నుంచి తీసుకెళ్లారన్న విషయాన్ని తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు కేసులకు సంబంధించి ఇప్పటి వరకు ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నిజంగా కిడ్నాప్ ప్రయత్నాలు జరిగాయా? అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ రెండు కేసుల వ్యవహారాలను ఛేదించాలని పోలీసులు గట్టి పట్టుదలతో ఉన్నారు. -
ఫైనాన్సర్ కిడ్నాప్ కేసు.. మరో కొత్త కోణం
సాక్షి, విశాఖపట్నం: ఫైనాన్స్ వ్యాపారి అప్పలరాజు కిడ్నాప్, దాడి వ్యవహారంలో ముగ్గురు దుండగులు పాల్గొన్నట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులు మంకీ క్యాంప్‌లు ధరించారని వ్యాపారి అప్పలరాజు తెలిపారు. దాడిలో ఆయన శరీరంపై రెండు చోట్ల కత్తిగాట్లు పడ్డాయి. వ్యాపార లావాదేవీలలో విభేదాలే కిడ్నాప్‌కి కారణమా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి సీపీ ఆర్కే మీనా నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కిడ్నాప్ కేసును స్వయంగా పర్యవేక్షించాలని డీసీపీ ఐశ్వర్య రస్తోగిని సీపీ ఆదేశించారు. బుధవారం కైలాష్ పురానికి చెందిన లాలం అప్పలరాజు అనే ఫైనాన్స్ వ్యాపారిని ద్వారకా నగర్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉండగా ఆటోలో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. సాగర్ నగర్ శివారులో తీవ్రంగా కొట్టిన దుండగులు.. బంగారం ఆభరణాలు, నగదు దోచుకుని అప్పలరాజును విడిచిపెట్టారు. గాయపడిన ఆయనను కుటుంబసభ్యులు కేజీహెచ్‌లో చేర్పించారు. కిడ్నాప్ కేసులు చేధిస్తాం: సీపీ ఆర్కే మీనా విశాఖలో జరిగిన రెండు కిడ్నాప్‌లపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సీపీ ఆర్కే మీనా వెల్లడించారు. రెండు కేసుల్లో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడానికి 8 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. రెండు కేసుల్లోనూ పలు అనుమానాలున్నాయని సీపీ చెప్పారు. వ్యాపార లావాదేవీల్లో ఏర్పడిన వివాదాలే ప్రధాన కారణంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఫైనాన్స్ వ్యాపారి అప్పలరాజుపై దాడిలో అనేక అనుమానాలున్నాయని, రెండు రోజుల్లో రెండు కిడ్నాప్ కేసులను చేధిస్తామని సీపీ ఆర్కే మీనా పేర్కొన్నారు. -
ప్రాణం తీసిన రూ.ఐదు వేల అప్పు
రెబ్బెన(ఆసిఫాబాద్): అవసరం నిమిత్తం తీసుకున్న రూ.5వేల అప్పే ఆ యువకుడిని తనువు చాలించేలా చేసింది. అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక యువకుడు పురుగుల ముందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకోగా శనివారం వెలుగులోకి వచ్చింది. రెబ్బెన ఎస్సై దీకొండ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన బొడ్డు కిరణ్‌బాబు(20) స్థానికంగా ఉన్న జిరాక్స్ సెంటర్లో పని చేస్తుండేవాడు. అవసరం నిమిత్తం రూ.5వేలను మండల కేంద్రానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి రవితేజ వద్ద అప్పు తీసుకున్నాడు. తీసుకున్న మొత్తం సకాలంలో చెల్లించడంలో విఫలం కావటంతో రవితేజ డబ్బుల కోసం అతడిని వేధించాడు. ఈ క్రమంలో గత నెల 30న మోటర్‌సైకిల్‌పై వస్తున్న కిరణ్‌ను అడ్డగించి బైక్‌ను లాక్కోవడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేశాడు. ఈ క్రమంలో కిరణ్ ఇంటికి వెళ్లిన రవితేజ కుటుంబ సభ్యుల ఎదుటే అసభ్య పదజాలంతో ధూషించి అతడిపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన కిరణ్ క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్కడి నుంచి మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కిరణ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారగా హైదరాబాద్‌కు తరలించగా శుక్రవారం మృతి చెందాడు. మృతుడి నానమ్మ వెంకటనర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పోలీసుల పేరిట ఘరానా దోపిడీ
ఫైనాన్స్ వ్యాపారి వద్ద డబ్బు దోచుకెళ్లిన దుండగులు రూ. 70 వేల నగదు అపహరణ ఖానాపురం : పోలీసులవుంటూ ఓ ఫైనాన్స్ వ్యాపారి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడిన ఘటన వుండలంలోని బుధరావుపేట శివారు రావులింగయ్యుపల్లిలో వుంగళవారం రాత్రి జరిగింది. బాధితుడి కథనం ప్రకా రం.. రావులింగయ్యుపల్లికి చెందిన కోట వెంకట్రావు చిట్టీల వ్యాపారం చేస్తుంటాడు. ప్రతి నెలా 12 నుంచి 20వ తేదీ వుధ్యలో సభ్యుల నుంచి డబ్బు వసూలు చేసి చిట్టీ తీసుకున్న వారికి ఇస్తుంటాడు. కాగా, వుంగళవారం రాత్రి 11 గంటలకు ఐదుగురు వ్యక్తులు వచ్చి ఆరుబయట నిద్రిస్తున్న వెంకట్రావును లేపారు. వా రిలో నలుగురి వద్ద ఆయుధాలు ఉన్నారుు. ‘మేము పోలీసులం, నువ్వు చిట్టీల వ్యాపారం చేస్తావా’ అని ప్రశ్నించారు. దొంగనోట్లు చలామణి చేస్తున్నావని, ఇంట్లో చెక్ చేయూలని అ న్నారు. తాను చిట్టీలు నడుపుతాను తప్ప దొం గనోట్ల విషయం తెలియదని వ్యాపారి చెప్పగా, గట్టిగా అరవ వద్దని హెచ్చరించారు. తర్వాత వెంకట్రావును ఇంట్లోకి తీసుకెళ్లి డబ్బు తెమ్మన్నారు. అతడు మొదట రూ.10 వేలు తెచ్చి ఇచ్చాడు. వాటిని పరిశీలించి, ఇవి కావు.. ఇం ట్లో దాచిన దొంగనోట్లు తీసుకురమ్మన్నారు. దీంతో వ్యాపారి వురో రూ.60 వేలు తీసుకొచ్చి ఇచ్చాడు. వాటిని తీసుకున్న దుండుగులు ‘నీ వద్ద ఉన్న వురిన్ని డబ్బులు ఇవ్వాలి’ అని వ్యా పారిని భయూందోళనకు గురిచేశారు. తన వద్ద ఇక డబ్బులు లేవని వ్యాపారి చెప్పడంతో సోదా చేయూలంటూ లోనికి తీసుకెళ్లారు. వుుగ్గురు బయుట ఉండగా ఇద్దరు ఇంట్లోకి వెళ్లి, బీరువాలను తెరిపించారు. అందులో బంగారం ఉండ గా వాటిని తీసుకోకుండా వురో గదిలోకి వ చ్చారు. ఇలా సోదాలు నిర్వహించి బెడ్‌కింద ఉన్న వురో రూ.3 లక్షలు అపహరించారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా, తెల్లవారిన తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తీసుకొమ్మని చెపుతూ వెళ్లిపోయూరు. దీంతో కంగారుపడిన వ్యాపారి బుధరావుపేటలోని వూజీసర్పంచ్ వుహలక్ష్మి వెంకటనర్సయ్యు వద్దకు వెళ్లాడు. తెల్లారాక పోలీస్‌స్టేషన్‌కు వెళ్దామని అతడు చెప్పడంతో ఇంటికి వచ్చిన వ్యాపారి తెల్లవారుజామున 3 గంటల సవుయుంలో బెడ్‌కింద చూడగా అక్కడ దాచిన రూ.3 లక్షలు లేకపోవడంతో పోలీసులకు సవూచారమిచ్చాడు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు.. సవూచారం అందుకున్న ఎస్సై దుడ్డెల గురుస్వామి బుధవారం ఉదయం 7.30 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగులు తాకిన వస్తువులను ఇతరులు ముట్టుకోకుండా చర్యలు చేపట్టారు. అనంతరం గూడూరు సీఐ రమేష్నాయుక్, ఎస్సై సతీష్ వచ్చి పరిశీలించారు. ఆ తర్వాత డీఎస్పీ దాసరి వుురళీధర్ వచ్చి వివరాలు సేకరించారు. వ్యాపారి కోట వెంకట్రావు, విద్యార్థి వులిశెట్టి విక్రంను అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వరంగల్ నుంచి వచ్చిన డాగ్‌స్క్వాడ్ వుంగళవారిపేట నుంచి కొడ్తివూటుతండాై దారి వైపు వెళ్లి ఆగడం చర్చనీయూంశంగా వూరింది. వ్యాపారి చిట్టీలు నడుపుతాడని స్థానికులకే తెలుసు. తుపాకులతో వచ్చిన వ్యక్తులకు స్థానికులెవరైనా సహకరించారా అనే అనువూనాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు కొత్త వ్యక్తుల సంచారం.. గ్రావుంలో 20 రోజులుగా ఇద్దరు కొత్త వ్యక్తులు తుపాకులతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పలువురు ‘సాక్షి’కి తెలిపారు. 10 రోజుల క్రితం ఒక ఆటో డ్రైవర్‌ను, ఆ తర్వాత రెండు రోజుల కు ఓ యువకుడిని డబ్బుకోసం బెదిరించినట్లు తెలిసింది. ఈ ఇద్దరు వ్యక్తులకు దోపిడీ ఘట నతో సంబంధం ఉందా అనే అనువూనాలు వ్యక్తమవుతున్నారుు. ఇంత జరుగుతున్నా స్థాని కులు సదరు వ్యక్తులపై పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదనేది అంతుచిక్కడం లేదు. కాగా, దుండగలు వెంకట్రావు ఇంటి నుంచి రూ. 3.70 లక్షలు తీసుకెళ ్లగా, పోలీసులకు రూ. 70 వేలు మాత్రమే తీసుకెళ్లారని చెప్పడం చర్చనీయూంశంగా మారింది. దోపిడీ దొంగలైతే బంగారం చూసి కూడా ఎందుకు వదిలేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
రికవరీ ఏజెంటే సూత్రధారి
ఫైనాన్సర్ ఇంట్లో దోపిడీ యత్నం కేసు... నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు పంజగుట్ట: ఫైనాన్స్ వ్యాపారి ఇంట్లో దోపిడీ యత్నం కేసును పోలీసులు ఛేదించారు. అతని వద్ద పని చేస్తున్న రికవరీ ఏజెంటే ప్రధాన సూత్రధారి అని తేల్చారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. సోమవారం పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వర రావు, అదనపు డీసీపీ నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... సోమాజిగూడలోని మార్వెల్ రెసిడెన్షీ ఫ్లాట్ నెం.302లో నివసించే సజ్జన్‌రాజ్ జైన్ పంజగుట్ట మహేశ్వరీ టవర్స్‌లో ననేష్ ఫైనాన్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. ఇతని వద్ద రికవరీ ఏజెంట్‌గా బేగంపేట ప్రకాష్‌నగర్ నివాసి మహ్మద్ మాజీద్ (28) పని చేస్తున్నాడు. నిత్యం కోట్లలో లావాదేవీలు చేసే సజ్జన్‌రాజ్ జైన్ ఇంట్లో దోపిడీ చేసి.. ఆ డబ్బుతో దుబాయ్ వెళ్లి స్థిరపడాలని మాజీద్‌కు దురాశ పుట్టింది. యూసూఫ్‌గూడ, బోరబండ ప్రాంతాల్లో నివసించే తన స్నేహితులు ఫిరోజ్‌ఖాన్ (29), మహ్మద్ సలావుద్దీన్ అలియాస్ సల్లూ (29), లతీఫ్ (36), జహీర్ అహ్మద్ (29)లకు విషయాన్ని చెప్పి ముఠా ఏర్పాటు చేశాడు. సజ్జన్‌రాజ్ తన ఆఫీసులో ఉన్న సమయంలో భార్య అనితాదేవి ఒక్కతే ఇంట్లో ఉంటుందని తెలిసిన వీరు ఆ సమయంలో దోపిడీ చేయాలని పథకం వేశారు. కారు అద్దెకు తీసుకొని... ఇందులో భాగంగా మాదాపూర్‌లోని ఓ ట్రావెల్స్‌లో ఇన్నోవా కారును అద్దెకు తీసుకొని దానిలో ఈనెల మొదటివారంలో సజ్జన్‌రాజ్ ఇంటికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. ఈనెల 6న దోపిడీ చేసేందుకు వెళ్లారు. ప్రధాన నిందితుడు మాజీద్ తన యజమాని కదలికలపై ఎప్పటికప్పుడు ఫోన్లో ముఠా సభ్యులకు సమాచారం ఇస్తుండగా... ఫిరోజ్ తన బైక్‌పై దోపిడీ చేసే ఇంటి వద్దకు వెళ్లి పరిసరాలను గమనిస్తున్నాడు. మహ్మద్ సలావుద్దీన్, లతీఫ్‌లు సజ్జన్ రాజ్ ఇంటికి వెళ్లి కాలింగ్ భెల్ కొట్టారు. ఆయన భార్య అనితాదేవి లోపలి నుంచే ఎవరు అని ప్రశ్నించగా.. సార్.. కలెక్షన్ డబ్బు ఇంట్లో ఇవ్వమని పంపారని చెప్పారు. ఆమె తలుపుతీయగానే ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె భర్తకు ఫోన్ చేసేందుకు యత్నించగా వెంటనే వారు తమ వెంటతెచ్చుకున్న క్లోరోఫామ్ చల్లిన కర్చీఫ్ ఆమె ముఖంపై అదిమిపట్టారు. స్పృహకోల్పోగానే చేతులు, కాళ్లు కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టారు. బెడ్రూలోకి వెళ్లి కబోర్డ్స్, బ్యాగులు, బీరువా తెరిచి డబ్బులు, నగదు కోసం వెతకసాగారు. మధ్యాహ్నం 1.15కి సజ్జన్‌రాజ్ భోజనానికి ఇంటికి వచ్చి కాలింగ్ భెల్ కొట్టాడు. అతను వచ్చిన విషయాన్ని తలుపు సందులోంచి గమనించిన సలావుద్దీన్ 2వ అంతస్తు బాల్కనీ నుంచిపైప్ పట్టుకొని కిందకు దిగగా... లతీఫ్ ఒక్కసారిగా కిందకు దూకేశాడు. దీంతో లతీఫ్ రెండు కాళ్లూ, చెయ్యి విరిగాయి. అప్పటికే కారుతో సిద్ధంగా ఉన్న జహీర్ అహ్మద్‌తో కలిసి సలావుద్దీన్..., బైక్‌పై ఫిరోజ్ పారిపోయారు. పోలీసులు గాయపడ్డ లతీఫ్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటి నుంచీ పరారీలో ఉన్న నిందితులు ఆదివారం సాయంత్రం యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉండగా.. పంజగుట్ట డీఐ వెంకటేశ్వర్‌రెడ్డి తన సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఇన్నోవా కారు, బైక్, కత్తి, క్లోరోఫామ్ బాటిల్, నాలుగు సెల్ఫోన్లు, గ్లౌజ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్స్ వ్యాపారి సమయానికి ఇంటికి వెళ్లకపోతే దోపిడీ జరిగి ఉండేదని పోలీసులు తెలిపారు. -
ప్రాణం తీసిన డబ్బుల గొడవ
మూడు నెలల్లో కూతురు పెళ్లి జరగనుండడంతో ఆ ఇల్లాలు ఫైనాన్స్ వ్యాపారి వద్ద చీటీ వేసింది. పెళ్లి అవసరాలకు డబ్బు కావాలని ఆ వ్యాపారి వద్దకు వెళ్తే.. తీరా లేవు పొమ్మన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తే.. చెబితే భయమా? ఫిర్యాదు చేసుకుంటే చేసుకో.. అంటూ తెగేసి చెప్పాడు. పైగా తానూ వస్తానంటూ ఆమెను తన ద్విచక్రవాహనంపైనే ఎక్కించుకుని పోలీసు స్టేషన్‌కు బయలుదేరాడు. అలా వెళ్తుండగా మళ్లీ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవలో ఏమైందో ఏమో ఆమె బండి నుంచి జారిపడిపోయింది. ‘ఆమె పోతే డబ్బులు ఇవ్వనవసరం లేద’నుకున్నాడో ఏమో.. రోడ్డుపైనే నిర్దాక్షిణ్యంగా వదిలేసి పోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రిలో చేర్చినా ఫలితంలేకపోయింది. చివరికి ప్రాణం పోయింది. పలాస: కాశీబుగ్గ మహారాణిపేటకు చెందిన బీమా రూపావతి(45) ద్విచక్రవాహనంపై నుంచి జారిపడి గురువారం మృతి చెందారు. ఫైనాన్స్ వ్యాపారి ప్రకాశరావుతో స్కూటీపై వెళ్తుండగా బండిపై నుంచి జారిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కథనం ప్రకారం... మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమార్తె సంతోషిణి(19)కి ఇటీవల వివాహం నిశ్చయమైంది. జనవరి 26న పెళ్లి జరగనుంది. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా డబ్బు అవసరం కావడం తో తనకుమార్తె సంతోషిణి, కుమారుడు సంతోష్‌తో కలిసి చినబాడాంలోని ప్రకాశరావు ఫైనాన్స్ కార్యాలయానికి ఉదయం 9.30 గంటలకు వెళ్లింది. ప్రకాశరావు వద్ద చీటీ కట్టిన సొమ్ము ఉండడంతో అందులో నుంచి రూ.50 వేలు కావాలని కోరారు ప్రస్తుతం డబ్బులు లేవని ప్రకాశరావు చెప్పడంతో రూపావతి, ప్రకాశరావుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెప్పగా, తాను కూడా వస్తాను పదా అం టూ తన స్కూటీపై తీసుకుని వెళ్లాడు. అయితే స్కూటీని కాశీబుగ్గ వైపు కాకుండా దారిమళ్లించి బెండి రైల్వేగేటు వైపు తీసుకెళ్తుండగా, ఇలా వెళ్తున్నావేంటి అంటూ బండిమీద ఆమె గొడవ చేశారు. బం డి అలా వెళ్తుండగా గరుడఖండి, సరియాపల్లి గ్రా మాల మధ్య జాతీయ రహదారికి సమీపంలో రూపావతి జారిపడిపోయారు. దీంతో ఆమె తలకు బల మైన గాయాలు తగిలాయి. ప్రాణాపాయస్థితిలో ఉన్న రూపావతిని ప్రకాశరావు పట్టించుకోకుండా అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ విషయం కుటుంబీకులకు తెలియడంతో రూపావతిని పలాస ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె మృతి చెందారు. కుమార్తె సంతోషిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ చెప్పా రు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.