దోపిడీ దొంగల హల్‌చల్‌ | Burglar exploitation Hulchul | Sakshi
Sakshi News home page

దోపిడీ దొంగల హల్‌చల్‌

Published Sat, Sep 3 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

దోపిడీ దొంగల హల్‌చల్‌

దోపిడీ దొంగల హల్‌చల్‌

– బెదిరించి బంగారు, వెండి ఆభరణాలు నగదు చోరీ
– సాగర్‌ పైలాన్‌కాలనీలో ఘటన
నాగార్జునసాగర్‌
నాగార్జునసాగర్‌ పైలాన్‌ కాలనీలో దోపిడీ దొంగలు హల్‌చల్‌ సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పైలాన్‌కాలనీకి చెందిన రాజుతో పాటు ఆయన భార్య ఆ ఇంట్లో నివసిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఇద్దరు యువకులు వచ్చి చంపుతామని బెదిరించారు. అనంతరం ఆయనభార్య మెడమీద ఉన్న రెండు వరుసల పుస్తెలతాడుతో పాటు మంగళ సూత్రం,నల్లపూసల గొలుసు,చెవిదిద్దులు, ఉంగరం, తీసుకున్నారు. ఆపై బీరువాలో ఉన్న వస్తువులను పడవేసి రూ.5వేల నగదు,వెండి ప్లేటు దోచుకెళ్లారు.  తాము గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ముఠాకు చెందినవాళ్లమని, ఆయన మరణంతో రూ.400కోట్లు నష్టపోయామని, దొంగతనం గురించి పోలీసులకు చెప్పితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు.  విషయం తెలిసిన వెంటనే డాగ్‌స్క్వాడ్,క్లూస్‌టీం స్థానిక ఎస్‌ఐ రజనీకర్‌తో కలిసి ఆధారాలు సేకరించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement