Burglar
-
దొంగతనం కోసం వచ్చి ఆత్మహత్య..
కృష్ణరాజపురం: ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి చోరీ చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందిరానగర పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు... ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంటిలోకి చొరబడిన దిలీప్ బహదూరు ఇంటి మొత్తాన్ని గాలించి అనంతరం అదే ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేడ మీద దాడి చేసి హత్య బనశంకరి: ఓ వ్యక్తిని అతని ఇంటి మేడపైనే తీవ్రంగా కొట్టి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన యలహంక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీలో సత్యసాయి జిల్లాలోని హిందూపురం నివాసి చంద్రశేఖర్ (33) హతుడు. యలహంక కొండప్ప లేఔట్లో గత 8 ఏళ్లుగా ఇక్కడ మూడంతస్తుల భవనంలో ఒక ఇంట్లో చంద్రశేఖర్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇతను చేనేత కార్మికునిగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి 8.45 సమయంలో ఇంటి మేడపైన గుర్తుతెలియని దుండగులు చంద్రశేఖర్ తల, మర్మాంగంపై దాడిచేసి ఉడాయించారు. కుటుంబసభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందాడని ధృవీకరించారు. యలహంక పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలింపు చేపట్టారు. ఆర్థిక వివాదాలు, లేదా వివాహేతర సంబంధం హత్యకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. బంధువు, భార్యపై అనుమానాలు.. పోలీసుల ప్రాథమిక విచారణలో హతుని బావమరిది లోకేశ్‌పై అనుమానం వ్యక్తమైంది. లోకేశ్ హతుని భార్యకు బంధువు అవుతాడు. గతంలో ప్రేమించాలని ఆమె వెంటపడ్డాడు. ఇతని వేధింపులు తాళలేక హిందూపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో చంద్రశేఖర్ దంపతులు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో పోలీస్‌స్టేషన్ వద్ద లోకేశ్‌ను చంద్రశేఖర్ భార్య చెప్పుతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో హత్య లోకేశ్ చేశాడా అనే అనుమానం వ్యకమైందని ఆగ్నేయ విభాగ డీసీపీ అనూప్‌శెట్టి తెలిపారు. మరోవైపు హతుని భార్యకు ఈ హత్యతో సంబంధం ఉందా? అని కూడా అనుమానం వ్యక్తమైంది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. (చదవండి: వర్సిటీ మెస్‌ల నిర్వాకం.... చిప్పతో చట్నీ పోసెయ్) -
తాజ్‌కృష్ణాలో చోరీ.. నిందితురాలి అరెస్టు
పంజగుట్ట: నగదు ఉన్న బ్యాగును తస్కరించిన యువతిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ. 83 వేలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... గత నెల 29 నుంచి 31 వరకు బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్లో జరిగిన ఎగ్జిబిషన్లో మహారాష్ట్ర థానేకు చెందిన కె.సందీప్ అనే టెక్స్టైల్ డిజైనర్ స్టాల్ నుంచి నగదు ఉన్న బ్యాగ్ మాయమైన సంఘటన విదితమే. సీసీ ఫుటేజీల ఆధారంగా ఓ మహిళ బ్యాగును చోరీ చేసినట్లు నిర్ధారించిన పోలీసులు నిందితురాలు బెంగళూరుకు చెందిన మున్ మున్ హుస్సైనీ (48)గా గుర్తించారు. ఈమె ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను ఫాలో అయ్యి రద్దీగా ఉండే ప్రదేశాలను ఎంపిక చేసుకుని అక్కడ దొంగతనాలకు పాల్పడుతుంది. బెంగళూరులో ఈమెపై రెండు దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. సోమాజిగూడ పార్క్ హోటల్లో బస చేసిందని తెలుసుకున్న పోలీసులు శనివారం ఆమెను అరెస్టు చేసి, రూ. 83 వేలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. (చదవండి: మహిళ పట్ల అసభ్య ప్రవర్తన) -
ఘరానా దొంగ!..దోచుకుంటాడు .. దాచుకుంటాడు
అల్వాల్: ఫుట్‌పాత్‌పై జీవితం గడుపుతూ రెక్కీలు నిర్వహించి రాత్రి పూట ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన ముచ్చు అంబేడ్కర్ అలియాస్ రాజు (50) 30 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లిన అతను బెయిల్‌పై బయటికి వచ్చాడు. అనంతరం కర్నాటకకు మకాం మార్చిన అతను అక్కడ కూడా చోరీ కేసులో పాల్పడి అరెస్టయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి మళ్లీ దొంగతనాలు చేస్తున్నాడు. ఇటీవల వనస్థలిపురంలో జరిగిన చోరీ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారింగా నేరాల చిట్టా విప్పాడు. అతడి నుంచి 230 తులాల బంగారు అభరణాలు, 10.2 కిలోల వెండి, 15,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా అతను చోరీ సొత్తును విక్రయిస్తే దొరికిపోతాననే భయంతో వాటిని ఇంట్లోనే దాచుకునేవాడని, అవసరమైతే ప్రైవేట్ బ్యాంకుల్లో కుదవపెట్టి నగదు తీసుకునేవాడని సీపీ వివరించారు. (చదవండి: కుమార్తెతో సహా తండ్రి ఆత్మహత్య) -
వైరల్ : ఆ దొంగోడి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది..
మెక్సికో : సైలెంట్‌గా దొంగతనం చేసి ఉడాయిద్దామనుకున్న ఆ దొంగోడి ప్లాన్ బెడిసి కొట్టింది. దొంగతనం చేసిన డబ్బులతో జల్సా చేద్దామనుకుంటే అతడ్ని దురదృష్టం వెంటాడింది. తల రైలింగ్‌లో ఇరుక్కుపోవడంతో పోలీసులకు పట్టించింది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. ఓ ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగకు చేదు అనుభవం ఎదురైంది. రైలింగ్ నుంచి ఇంట్లోకి దూరేందుకు ప్రయత్నించగా, అనుకోకుండా అతడి తల రైలింగ్‌లో ఇరుక్కుపోయింది. అక్కడి నుంచి బయటపడేందుకు చాలానే ట్రై చేవాడు కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. కొంత సమయానికి ఇది గమనించిన స్థానికులు.. దొంగోడి గురించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఎంత ప్రయత్నించినా అతడిని రైలింగ్ నుంచి విడిపించలేకపోలేరు. దీంతో అత్యవసర విభాగాన్ని సంప్రదించగా, రెండు గంటల తర్వాత అక్కడికి చేరుకున్న సిబ్బంది...బోల్డ్ కట్టర్ల సాయంతో ఇనుప చువ్వలను కట్ చేసి అతడిని విడిపించారు. అనంతరం అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. చదవండి : వైరల్: ఆహారం అనుకుందో.. కోపమొచ్చిందో వైరల్: నడి రోడ్డు మీద తలస్నానం! -
ఓ దొంగ దేశభక్తి! ఏం చేశాడంటే..
కొచ్చి : దొంగతనానికి వచ్చిన ఓ దొంగ తను దోచుకోబోయే ఇళ్లు మిలటరీ అధికారిదని తెలిసి వెనక్కు తగ్గాడు. ఆ ఇంటికి దొంగతనానికి వచ్చినందుకు ప్రశ్చాతాపపడుతూ ఆ మిలటరీ అధికారిని క్షమాపణ కోరాడు. ఓ దొంగ దేశభక్తిని ప్రదర్శించిన ఈ విచిత్ర సంఘటన కేరళలోని తిరువంకులంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం ఓ దొంగ తిరువంకులంలోని ఓ ఇంటికి దొంగతనానికి వెళ్లాడు. మెల్లగా తన పని తాను చేసుకుపోతున్న సమయంలో అక్కడ మిలటరీ టోపీ కనిపించింది. అంతే అతడు తన పనిని విరమించాడు. అక్కడి ఏ వస్తువు జోలికిపోకుండా బయటకు వచ్చేశాడు. పోతూపోతూ ఆ ఇంటి గోడ మీద ‘‘ నాకు ఇది మిలటరీ అధికారి ఇళ్లని తెలీదు. ఇదో మిలటరీ అధికారి ఇళ్లని తెలుసుంటే దొంగతనానికి వచ్చేవాడిని కాదు. చివరిక్షణంలో మిలటరీ టోపీ చూశాను. నాకు అర్థమైపోయింది. నన్ను క్షమించండి. నేను ఏడవ నిబంధనను అతిక్రమించాను’’ అని మార్కర్‌తో రాశాడు. ఉదయం ఇంటిని శుభ్రం చేయటానికి వచ్చిన పనిమనిషి ఇంటి తలుపులు బద్ధలై ఉండటం గమనించింది. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ దొంగ అదే రోజు రాత్రి అక్కడికి దగ్గరలోని ఓ షాపులో దొంగతనం చేసినట్లు వారు గుర్తించారు. కాగా, ఆ ఇంటి యాజమాని అయిన రిటైర్డ్ కల్నల్ గత కొద్దినెలలుగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో ఉన్నారు. -
చోరీకి వెళ్లిన దొంగకు చిర్రెత్తుకొచ్చింది...
సాక్షి, చెన్నై: దొంగతనానికి వచ్చిన చోట చిల్లిగవ్వ దొరక్కపోవడంతో ఓ దొంగ చిర్రెత్తిపోయాడు. ఆ దుకాణ యజమానికి ఓ లేఖ రాసి చీవాట్లు పెట్టి వెళ్లాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కడలూరు జిల్లా మందారకుప్పంలో జయరామన్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ దుకాణంపై ఓ దొంగ కన్నేశాడు. గురువారం అర్ధరాత్రి అతి కష్టం మీద దుకాణం పై కప్పును తొలగించి లోపలికి వెళ్లాడు. ఉదయాన్నే దుకాణం తెరచిన జయరామన్ షాక్‌కు గురయ్యాడు. పైకప్పు దెబ్బతిన్నా దుకాణంలో వస్తువులు ఏమాత్రం చోరీకి గురి కాలేదు. అయితే కొన్ని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో వాటిని సరి చేస్తుండగా ఓ లేఖని గుర్తించాడు. ప్రాణాలను పణంగా పెట్టి అతి కష్టం మీద దొంగతనానికి వస్తే గల్లాలో చిల్లిగవ్వ కూడా పెట్టవా? అని అందులో యజమానిని దొంగ ప్రశ్నించాడు. దొంగతనం చేయడం అంత సులభం కాదని..ఎంతో కష్టపడాల్సి ఉందని ఇక్కడున్న పప్పుదినుసులను పట్టుకెళ్లి తానేమి చేసుకోవాలని విచారం వ్యక్తం చేశాడు. ఈ లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
భారీ గోడలే బలాదూర్.. స్పైడర్‌మేన్ దొరికేశాడు
సాక్షి, న్యూఢిల్లీ : అతడిని ఎంత పెద్ద గోడలు అడ్డుకోలేవు.. ఎలాంటి తలుపులు నిలువరించలేవు.. ఎంతపెద్ద ఇంటిపైకైనా పాకేస్తాడు.. ఎంత పెద్ద గోడనైనా ఎక్కేస్తాడు. అయితే, ఇదంతా విని అతడు రికార్డులు సృష్టించే వ్యక్తేమో అనుకుంటే పొరబడ్డట్టే . ఎందుకంటే అతడు ఓ గజదొంగ.. ఇంకా చెప్పాలంటే అక్కడ అందరు అతడిని స్పైడర్ మేన్ అని కూడా అంటారు. పోలీసులు కూడా ఆ దొంగతనం జరిగిన సమయంలో ఇది ఆ స్పైడర్ మేన్ చేసి ఉంటాడని అంటుంటారు. ఆ దొంగ ఇప్పుడు దొరికిపోయాడు. అయితే, ఇతడు విదేశాల్లో స్పైడర్‌మేన్ కాదు.. మన ఢిల్లీని దోచుకునే దొంగ స్పైడర్‌మేన్.. మరో ముగ్గురు సన్నిహితులకు కలిసి చివరకు బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జహంగిరిపురి అనే ప్రాంతానికి చెందిన జైప్రకాశ్(24) అనే వ్యక్తి వరుస దొంగతనాలకు పాల్పడుతూ పెద్ద పెద్దగోడలను, భవనాలను సైతం ఎక్కి హడలు పుట్టిస్తూ ఉండేవాడు. అతడు స్పైడర్మేన్లాగా పూర్తి ముసుగును ధరించి దొంగతనాలు చేస్తుండేవాడు. అతడితోపాటు రవికుమార్, సంజయ్గోయల్, ప్రమోద్ కుమార్ షా అనే వ్యక్తి కూడా ఈ పనులకు దిగుతుండేవారు. దీంతో వీరిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఆటకట్టించారు. వారు నలుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జైప్రకాశ్ ఇంటి నుంచి రూ.50లక్షల నగదు, ఖరీదైన గడియారాలు, అరకిలో బరువున్న 30 బంగారు వెండి నగలు, లైసెన్స్డ్ రివాల్వర్, ఐదు క్యాట్రిజ్లు స్వాధీనం చేసుకున్నారు. -
లారీ బ్యాటరీ దొంగల ముఠా అరెస్ట్
-
దోపిడీ దొంగల హల్చల్
– బెదిరించి బంగారు, వెండి ఆభరణాలు నగదు చోరీ – సాగర్ పైలాన్‌కాలనీలో ఘటన నాగార్జునసాగర్ నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో దోపిడీ దొంగలు హల్చల్ సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పైలాన్‌కాలనీకి చెందిన రాజుతో పాటు ఆయన భార్య ఆ ఇంట్లో నివసిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఇద్దరు యువకులు వచ్చి చంపుతామని బెదిరించారు. అనంతరం ఆయనభార్య మెడమీద ఉన్న రెండు వరుసల పుస్తెలతాడుతో పాటు మంగళ సూత్రం,నల్లపూసల గొలుసు,చెవిదిద్దులు, ఉంగరం, తీసుకున్నారు. ఆపై బీరువాలో ఉన్న వస్తువులను పడవేసి రూ.5వేల నగదు,వెండి ప్లేటు దోచుకెళ్లారు. తాము గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఠాకు చెందినవాళ్లమని, ఆయన మరణంతో రూ.400కోట్లు నష్టపోయామని, దొంగతనం గురించి పోలీసులకు చెప్పితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. విషయం తెలిసిన వెంటనే డాగ్‌స్క్వాడ్,క్లూస్‌టీం స్థానిక ఎస్ఐ రజనీకర్తో కలిసి ఆధారాలు సేకరించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దొంగతనానికి వెళ్లి.. బర్గర్ వండుకొని..
వాషింగ్టన్: దొంగలెవరైనా దోచుకునేందుకు తెగబడతారు. కళ్లకు కనిపించినవాటన్నింటిని సంచిలో మూటగట్టుకుంటారు. అవకాశం ఇవ్వాలేగానీ రాత్రికి రాత్రే మొత్తాన్ని ఖాళీ చేస్తారు. కానీ, అమెరికాలో ఓ దొంగ మాత్రం అలా చేయలేదు. దొంగతనం కోసం 5 గాయ్స్ అనే రెస్టారెంట్లోకి చొరబడి తన ఆకలిని తీర్చుకున్నాడు. అది కూడా తన సొంత ఇంట్లో వంట చేసుకున్నట్లుగా వండుకొని తిని. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అందులో నమోదైన ప్రకారం గత నెల (మార్చి) 18న తెల్లవారు జామున 3.10 నుంచి 5.05గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తొలుత రెస్టారెంట్లోకి ప్రవేశించిన ఆ దొంగ అటూ ఇటూ వెతికాడు. అనంతరం ఓ పెద్ద చాకు తీసుకున్నాడు. మరో చోటుకు వెళ్లి చక్కగా బర్గర్‌కు కావాల్సిన రొట్టెను.. ఇతర వస్తువులను తీసుకున్నాడు. అనంతరం హాట్ హాట్ బర్గర్ తయారు చేసుకొని కడుపునిండా భోంచేశాడు. తిరిగి ఆ రెస్టారెంటును విడిచి వెళ్లే సమయంలో ఓ నీళ్ల బాటిల్‌ను దొంగిలించుకొని వెళ్లాడు. తొలుత ఆ దొంగ రెస్టారెంటుకు సంబంధించిన డెలివరీ బాయ్‌ను అనుసరించి అతడు వెళ్లిపోయేవరకు ఎదురుచూసి ఈ దొంగతనంగా వంట చేసుకునే కార్యక్రమానికి దిగాడు. అయితే, ఇలాంటి చర్యలు కొలంబియా జిల్లాలో తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తిని పట్టించినవారికి రూ.67 వేల రూపాయలు ఇస్తామని పోలీసులు ఆఫర్ కూడా చేశారు. -
దొంగ తెలివితో అడ్డంగా బుక్కయ్యాడు
న్యూజిలాండ్: సీసీటీవీ కెమెరాలు వచ్చిన తర్వాత దొంగలకు ఊపిరాడట్లేదేమో. గతంలో దొంగతనం చేస్తే కొన్ని రోజులపాటు ఆ దొంగ సొమ్మును అనుభవించే వరకు పోలీసులకు దొరికే వారు కాదు. కానీ, ఈ రోజుల్లో మాత్రం వారి పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. అలా దొంగతనం చేశారో లేదో ఇలా పట్టుబడిపోతున్నారు. ఇదంతా సీసీటీవీ కెమెరాల పుణ్యమే. దీంతో ఇప్పుడు దొంగతనాలు చేయడానికి దొంగలు చిత్రవిచిత్రమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇంట్లో మనుషులకు భయపడకుండ సీసీటీవీ కెమెరా నుంచి బయటపడేందుకు కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. అది న్యూజిలాండ్‌లోని డాన్నేమోరాలోల ఆక్లాండ్ సుబర్బ్. అక్కడ ఓ ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఓ దొంగ ఆ ఇల్లు మొత్తాన్ని దోచుకోవాలని అనుకున్నాడు. సీసీటీవీ కెమెరాకు ఎట్టి పరిస్థితుల్లో చిక్కకూడదని నిర్ణయించుకొని ఆ ఇంట్లో చిన్న పిల్లాడికి కప్పి దుప్పటి తీసుకొని తనకు కప్పుకున్నాడు. అనంతరం అచ్చం చిన్నపిల్లాడి మాదిరిగా మొకాళ్లపైనే ఇంట్లో పాకుతూ డబ్బు, నగలు దోచుకున్నాడు. అయితే, ఏం ఆలోచన వచ్చిందో ఏమో.. ఇంతకీ నేను సీసీటీవీ కెమెరాలో కనిపిస్తున్నానా అనుకొని కొంచెం దుప్పటి జరిపి దానివైపు చూశాడు. దాంతో అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం ఆ సీసీటీవీ ఆధారంగానే అతడి ముఖాన్ని గుర్తించిన పోలీసులు ఫొటోను అన్ని చోట్ల అంటించి దయచేసి అతడి వివరాలు తెలిస్తే చెప్పండంటూ ప్రజలకు చెప్పారు. -
మీరు 'వాటిని' పోగొట్టుకున్నారా?
న్యూజిల్యాండ్: ఇళ్ళల్లోకి చొరబడి బంగారం, నగలు ఎత్తుకుపోయేవాళ్ళను చూశాం. బ్యాంకుల్లో, కార్యాలయాల్లో డబ్బు, వస్తువులు చోరీ చేసేవాళ్ళను చూశాం. అయితే ఓ దొంగ విచిత్ర వస్తువుల చోరీకి పాల్పడుతోందట. తరచుగా ఇళ్ళల్లో మిస్సవుతున్న ఆ వస్తువులు ఎవరు దొంగిలిస్తున్నారో తెలియక అంతా తలలు పట్టుకుంటుంటే చివరికి ఆ దొంగే ఓరోజు వస్తువులన్నీయజమాని ఇంటికి తెచ్చి పెట్టేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందట. ఇంతకూ ఆ టక్కరి దొంగ ఏ వస్తువులను కొట్టేసిందనేగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నది?... ఎందుకాలస్యం ఈ స్టోరీ చదివెయ్యండి.... న్యూజిల్యాండ్ హామిల్టన్ లో బర్గ్లర్ అనే ఓ పిల్లి.. తరచుగా అందరి ఇళ్ళల్లో చోరీకి పాల్పడుతోందట. అయితే పిల్లి చోరీ చేస్తోందంటే ఏ పాలో, పెరుగో అనుకునేరు. సాక్షాత్తూ ఆ ఇళ్ళల్లోని మగవాళ్ళ అండర్ వేర్లు, సాక్స్ లు తస్కరిస్తోందట. ఇళ్ళల్లో లో దుస్తులు అదృశ్యం అవుతుంటే ఇంట్లోవాళ్లకు అవి ఎలా పోతున్నాయో అర్థం కాకుండా పోయిందట. ఏ డబ్బో, బంగారమో అయితే కేసులు పెట్టడమో, ఫిర్యాదు చేయడమో చేస్తారు. ఈ చోరీ అటువంటిది కాదుకదా... పోతున్నది లో దుస్తులు కావడంతో ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డారట. రెండు నెలల్లో ఆరేళ్ళ వయసున్న ఆ టాంకినీస్ క్యాట్.. మొత్తం పదకొండు జతల అండర్ వేర్లు, ఏభై వరకూ సాక్స్ చోరీ చేసి, తిరిగి తెచ్చి యజమాని ఇంట్లో పెట్టేయడంతో చివరికి అసలు విషయం బయట పడింది. ఈ సరదా న్యూస్ ను 'మీరు అండర్ వేర్లు పోగొట్టుకున్నారా?' అన్న టైటిల్ తో ఫేస్ బుక్ వినియోగదారుడు సారా నాథన్ ఫొటోలతో సహా పోస్ట్ చేశాడు. ఆ దొంగ పిల్లిని గురించి జనాన్ని అప్రమత్తం చేసేందుకు తానా వివరాలను అందిస్తున్నట్లు చెప్పాడు. అందుకోసం వీధుల్లోని ప్రతి లెటర్ బాక్స్ లోనూ నోట్ పెట్టానని, జార్జి సెంటర్ ప్రాంతంలోని వారెవరైనా సదరు ఆస్తులు పోగొట్టుకుంటే తనకు తెలియజేయాలని ఫేస్ బుక్ లో రాశాడు. ఇంకెదుకాలస్యం మరి తమ తమ ... దుస్తులు పోగొట్టుకున్నవారు త్వర పడాల్సిందే... -
దొంగను పట్టించిన ఐఫోన్ యాప్
వాషింగ్టన్: అమెరికాలో ఒక వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి కెమెరా, యాప్‌ల సహాయంతో ఒక దొంగను పట్టించగలిగాడు. వివరాల్లోకి వెళ్తే బ్రియాన్ (25) అనే వ్యక్తి అమెరికాలోని సాల్ట్‌లేక్ సిటీలో నివాసముంటున్నాడు. తను ఇంట్లో లేకపోయినా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకనే విధంగా 'నెస్ట్కామ్' అనే ఐఫోన్ యాప్‌ని ఇంట్లో ఉన్న సీసీ కెమెరాతో అనుసంధానం చేశాడు. గురువారం రాత్రి బ్రియాన్ ఇంటికొచ్చేసరికి అతని ఇంట్లో లైట్లు వెలిగి ఉండటం గమనించాడు. అతనికి అనుమానం వచ్చి ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో అనే అనుమానంతో బయట నుంచే అతని యాప్ ద్వారా లోపల ఏం జరుగుతుందో గమనించాడు. అందులో లోపల ఎవరో గుర్తు తెలియని మహిళ ఉన్నట్టు బ్రియాన్ గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాధానం అందించాడు. పోలీసులు వచ్చి ఆమె పేరు డెన్నెట్ (38)గా నిర్ధారించి, తరచూ దొంగతనాలకు పాల్పడుతుందని తెలిపారు.