
సాక్షి, న్యూఢిల్లీ : అతడిని ఎంత పెద్ద గోడలు అడ్డుకోలేవు.. ఎలాంటి తలుపులు నిలువరించలేవు.. ఎంతపెద్ద ఇంటిపైకైనా పాకేస్తాడు.. ఎంత పెద్ద గోడనైనా ఎక్కేస్తాడు. అయితే, ఇదంతా విని అతడు రికార్డులు సృష్టించే వ్యక్తేమో అనుకుంటే పొరబడ్డట్టే . ఎందుకంటే అతడు ఓ గజదొంగ.. ఇంకా చెప్పాలంటే అక్కడ అందరు అతడిని స్పైడర్ మేన్ అని కూడా అంటారు. పోలీసులు కూడా ఆ దొంగతనం జరిగిన సమయంలో ఇది ఆ స్పైడర్ మేన్ చేసి ఉంటాడని అంటుంటారు. ఆ దొంగ ఇప్పుడు దొరికిపోయాడు.
అయితే, ఇతడు విదేశాల్లో స్పైడర్‌మేన్ కాదు.. మన ఢిల్లీని దోచుకునే దొంగ స్పైడర్‌మేన్.. మరో ముగ్గురు సన్నిహితులకు కలిసి చివరకు బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జహంగిరిపురి అనే ప్రాంతానికి చెందిన జైప్రకాశ్(24) అనే వ్యక్తి వరుస దొంగతనాలకు పాల్పడుతూ పెద్ద పెద్దగోడలను, భవనాలను సైతం ఎక్కి హడలు పుట్టిస్తూ ఉండేవాడు. అతడు స్పైడర్‌మేన్‌లాగా పూర్తి ముసుగును ధరించి దొంగతనాలు చేస్తుండేవాడు. అతడితోపాటు రవికుమార్, సంజయ్‌గోయల్, ప్రమోద్ కుమార్ షా అనే వ్యక్తి కూడా ఈ పనులకు దిగుతుండేవారు. దీంతో వీరిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఆటకట్టించారు. వారు నలుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జైప్రకాశ్ ఇంటి నుంచి రూ.50లక్షల నగదు, ఖరీదైన గడియారాలు, అరకిలో బరువున్న 30 బంగారు వెండి నగలు, లైసెన్స్‌డ్ రివాల్వర్, ఐదు క్యాట్రిజ్‌లు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment