West Bengal Spider Man Viral Video - Sakshi
Sakshi News home page

సంతలో స్పైడర్‌ మ్యాన్‌ మాస్‌ డ్యాన్స్‌.. మహిళల నవ్వులే నవ్వులు!

Published Thu, Aug 11 2022 5:46 PM | Last Updated on Thu, Aug 11 2022 6:02 PM

Desi Spider Man Dances Santhali Music At West Bengal - Sakshi

Desi Spider Man Dance.. హాలీవుడ్‌లో స్పెడర్‌ మ్యాన్‌ మూవీ ఎంత హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. స్పైడర్‌ మ్యాన్‌ సినిమా సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఇక, ఇండియాలో సైతం ఈ సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. కాగా, తాజాగా దేశీయ స్పెడర్‌ మ్యాన్‌.. పశ్చిమ బెంగాల్‌లో డ్యాన్స్‌ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. కోల్‌కత్తాలో శాంతినికేతన్‌లోని సోనాజురిలోని మార్కెట్‌లో స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్‌ వేసుకున్న ఓ​ వ్యక్తి కిరాక్‌ డ్యాన్స్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మిస్టర్ స్పైడర్ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో స్పైడర్‌ మ్యాన్‌ సంతాలీ సంగీతానికి అక్కడి మహిళలతో కలిసి డ్యాన్స్‌ స్టెప్పులు వేశాడు.


సంతాలీ సంగీతంలో ఉన్న ఓ జానపద పాటకు స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్‌లో ఉన్న వ్యక్తి స్టెప్పులు ఇరగదీశాడు. మహిళలతో కలిసి డ్యాన్స్‌ స్టెప్పులు వేస్తూ ముందుకు సాగాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: నైట్‌క్లబ్‌ వద్ద రచ్చ.. ఐటీ యువతులతో అసభ్యకర ప్రవర్తన..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement