World Tribal Day 2021 : Mamatha Banerjee Spotted Dancing, Goes Viral - Sakshi
Sakshi News home page

ఆదివాసీ మహిళలతో కలిసి సీఎం మమత నృత్యం

Published Mon, Aug 9 2021 5:36 PM | Last Updated on Mon, Aug 9 2021 7:27 PM

Mamata Banerjee Spotted Dancing And Playing Drum In West Bengal Jhargram - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నృత్యం చేసి, డ్రమ్స్‌ వాయిస్తూ సందడి చేశారు. సోమవారం బెంగాల్‌లోని ఝార్గ్రామ్‌లో నిర్వహించిన ఓ వేడుకలో మహిళలతో కలిసి మమత డ్యాన్స్‌ చేశారు. సోమవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా అధికారులు ఆదివాసీలు, గిరిజనులతో ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో సీఎం మమతా పాల్గొని, ఆదివాసీ మహిళలతో కలిసి సాంప్రదాయం నృత్యం చేశారు. అదే విధంగా ఆమె డోలు వాయిస్తూ ఆదివాసీ మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రస్తుతం సీఎం మమతా చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement