అల్వాల్: ఫుట్‌పాత్‌పై జీవితం గడుపుతూ రెక్కీలు నిర్వహించి రాత్రి పూట ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన ముచ్చు అంబేడ్కర్ అలియాస్ రాజు (50) 30 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు.
పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లిన అతను బెయిల్‌పై బయటికి వచ్చాడు. అనంతరం కర్నాటకకు మకాం మార్చిన అతను అక్కడ కూడా చోరీ కేసులో పాల్పడి అరెస్టయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి మళ్లీ దొంగతనాలు చేస్తున్నాడు. ఇటీవల వనస్థలిపురంలో జరిగిన చోరీ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారింగా నేరాల చిట్టా విప్పాడు. అతడి నుంచి 230 తులాల బంగారు అభరణాలు, 10.2 కిలోల వెండి, 15,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా అతను చోరీ సొత్తును విక్రయిస్తే దొరికిపోతాననే భయంతో వాటిని ఇంట్లోనే దాచుకునేవాడని, అవసరమైతే ప్రైవేట్ బ్యాంకుల్లో కుదవపెట్టి నగదు తీసుకునేవాడని సీపీ వివరించారు.
(చదవండి: కుమార్తెతో సహా తండ్రి ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment