దొంగతనానికి వెళ్లి.. బర్గర్ వండుకొని.. | Alleged thief caught on camera cooking burger inside closed D.C. restaurant | Sakshi
Sakshi News home page

దొంగతనానికి వెళ్లి.. బర్గర్ వండుకొని..

Published Mon, Apr 11 2016 6:56 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

దొంగతనానికి వెళ్లి.. బర్గర్ వండుకొని..

దొంగతనానికి వెళ్లి.. బర్గర్ వండుకొని..

వాషింగ్టన్: దొంగలెవరైనా దోచుకునేందుకు తెగబడతారు. కళ్లకు కనిపించినవాటన్నింటిని సంచిలో మూటగట్టుకుంటారు. అవకాశం ఇవ్వాలేగానీ రాత్రికి రాత్రే మొత్తాన్ని ఖాళీ చేస్తారు. కానీ, అమెరికాలో ఓ దొంగ మాత్రం అలా చేయలేదు. దొంగతనం కోసం 5 గాయ్స్ అనే రెస్టారెంట్లోకి చొరబడి తన ఆకలిని తీర్చుకున్నాడు. అది కూడా తన సొంత ఇంట్లో వంట చేసుకున్నట్లుగా వండుకొని తిని.

ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అందులో నమోదైన ప్రకారం గత నెల (మార్చి) 18న తెల్లవారు జామున 3.10 నుంచి 5.05గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తొలుత రెస్టారెంట్లోకి ప్రవేశించిన ఆ దొంగ అటూ ఇటూ వెతికాడు. అనంతరం ఓ పెద్ద చాకు తీసుకున్నాడు. మరో చోటుకు వెళ్లి చక్కగా బర్గర్కు కావాల్సిన రొట్టెను.. ఇతర వస్తువులను తీసుకున్నాడు. అనంతరం హాట్ హాట్ బర్గర్ తయారు చేసుకొని కడుపునిండా భోంచేశాడు.

తిరిగి ఆ రెస్టారెంటును విడిచి వెళ్లే సమయంలో ఓ నీళ్ల బాటిల్ను దొంగిలించుకొని వెళ్లాడు. తొలుత ఆ దొంగ రెస్టారెంటుకు సంబంధించిన డెలివరీ బాయ్ను అనుసరించి అతడు వెళ్లిపోయేవరకు ఎదురుచూసి ఈ దొంగతనంగా వంట చేసుకునే కార్యక్రమానికి దిగాడు. అయితే, ఇలాంటి చర్యలు కొలంబియా జిల్లాలో తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తిని పట్టించినవారికి రూ.67 వేల రూపాయలు ఇస్తామని పోలీసులు ఆఫర్ కూడా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement