
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. రైల్వేస్టేషన్‌లో రూఫ్ టాప్‌పైకి ఎక్కి కరెంట్ తీగలను పట్టుకుంటాను అంటూ అక్కడున్న వారిని బెదిరించాడు. దీంతో, ప్రయాణికులు హడిలిపోయారు. రైల్వేస్టేషన్‌లో రద్దీ ఎక్కువగా ఉండటంతో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. విశాఖ స్టేషన్‌లో ఓ వ్యక్తి హల్‌చల్ సృష్టించాడు. ప్రయాణికులతోపాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులను టెన్షన్ పెట్టాడు. రూఫ్‌టాప్ పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరింపులకు దిగాడు. అతడిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. తొలుత విద్యుత్ సరఫరా నిలిపి ఆ వ్యక్తి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా.. నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుపైకి దూకాడు.
దీంతో అతడి వెంట పరుగులు పెట్టిన పోలీసులు.. ఎట్టకేలకు ప్రయాణికుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే, సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తోంది. అనంతరం, పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment